Singaraya Jatara | సింగరాయ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ( తెలంగాణ సమాజం-సంస్కృతి)
1. ఏడు పాయల జాతరకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? (1)
ఎ. ఈ జాతర జరిగే ప్రదేశం మెదక్ జిల్లా నాగసాని పల్లె గ్రామం
బి. ఇక్కడ ప్రధాన దేవత కనకదుర్గమ్మ/వనదుర్గా భవాని
సి. ఈ ఆలయానికి గరుడ గంగ అనే పేరు కూడా ఉంది
డి. ఈ జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
2. కొండగట్టు జాతరకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? (4)
ఎ. ఈ ఆలయం జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామ సమీపంలో ఉంది
బి. ఈ ఆలయాన్ని నిర్మించినది కృష్ణారావు దేశ్ముఖ్
సి. ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజిస్తారు
డి. ఈ కొండపైన కొండల రాయ, బొజ్జ పోతన గుహలు ఉన్నాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
3. కురుమూర్తి జాతరకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? (4)
ఎ. ఈ జాతర జరిగే ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా అమ్మాపూర్ గ్రామం
బి. ఈ జాతర 19 రోజులపాటు జరుగుతుంది
సి. జాతర 8వ రోజున ఉద్దాల ఉత్సవం జరుగుతుంది
డి. ఇక్కడ స్వామి వారికి సమర్పించే నైవేద్యాన్ని దాసంగం అంటారు. దీన్ని అన్నం, పచ్చిపులుసుతో చేస్తారు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
4. కొమురవెల్లి జాతరకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? (1)
ఎ. ఈ ఆలయం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలో ఉంది
బి. ఇక్కడ మల్లన్న స్వామి, బలి మేడలమ్మ, కేతమ్మను పూజిస్తారు
సి. ఈ ఆలయంలో లింగ బలిజలు అర్చన, యాదవులు, ఒగ్గువారు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు
డి. మల్లన్న స్వామి కొలువై ఉన్న గుట్ట పేరు ఇంద్రకీలాద్రి పర్వతం
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
5. కింది జాతరలు అక్కడ పూజించే దేవుళ్లను జతపర్చండి? (3)
ఎ. మన్నెంకొండ జాతర
1. వేంకటేశ్వర స్వామి
బి. కురవి జాతర 2. వీరభద్ర స్వామి
సి, బెజ్జంకి జాతర
3. లక్ష్మీనర్సింహస్వామి
డి. వేలాల జాతర 4. శివుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-5
2) ఎ-1, బి-3, సి-4, డి-5
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-5
6. ఏ జాతరలో కొండపైన ఉమామహేశ్వర దేవాలయం, కొండ కింద హజ్రత్ నిరంజన్ షావలీ దర్గా ఉన్నాయి? (2)
1) సలేశ్వరం జాతర
2) రంగాపూర్ జాతర
3) మల్దకల్ జాతర
4) నల్లకొండ జాతర
7. మైలార్ దేవుడిగా పిలిచే మల్లికార్జున స్వామిని పూజించే జాతర? (1)
1) ఐనవోలు మల్లన్న జాతర
2) కొమురవెల్లి మల్లన్న జాతర
3) కొత్తకొండ జాతర
4) ఏదీకాదు
8. కింది జాతరలు, అవి జరిగే జిల్లాలను జతపర్చండి? (2)
ఎ. తుల్జా భవాని జాతర 1. జగిత్యాల
బి. నల్లకొండ జాతర 2. నల్లగొండ
సి. సిద్దులగుట్ట జాతర 3. నిజామాబాద్
డి. కొత్తకొండ జాతర 4. వరంగల్ అర్బన్ 1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
9. సింగరాయ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? (3)
1) నాగర్ కర్నూల్ 2) నల్లగొండ
3) సిద్దిపేట 4) సంగారెడ్డి
10. కింది వాటిలో నల్లగొండ జిల్లాలో జరిగే జాతరలు ఏవి? (1)
ఎ. చెరువుగట్టు జాతర
బి. కోదండాపురం జాతర
సి. అడవిదేవులపల్లి జాతర
డి. కూడవెల్లి జాతర
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
11. కింది జాతరలు, అవి జరిగే రోజుల సంఖ్య ను జతపర్చండి? (2)
ఎ. ఏడుపాయల జాతర
1. మూడు రోజులు
బి. కురుమూర్తి జాతర
2. 19 రోజులు
సి. తుల్జాభవాని జాతర
3. 9 రోజులు
డి. సమ్మక్క-సారలమ్మ జాతర
4. నాలుగు రోజులు
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
12. సుంకు కొలవడం అనే ఆచారం గల జాతర ఏది? (2)
1) రంగాపూర్ జాతర 2) తేగడ జాతర
3) సింగరాయ జాతర 4) ఏదీకాదు
13. మల్లూర్ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? (3)
1) వరంగల్
2) భద్రాద్రి కొత్తగూడెం
3) ములుగు
4) ఏదీకాదు
14. వేంకటేశ్వర స్వామిని పూజించే, పేదల తిరుపతిగా పిలిచే ఆలయంలో జరిగే జాతర ఏది? (3)
1) కురుమూర్తి జాతర
2) బెజ్జంకి జాతర
3) మన్నెంకొండ జాతర
4) ఏదీకాదు
15. కింది జాతరలు, అక్కడ పూజించే దేవుళ్లను జతపర్చండి? (1)
ఎ. పుల్లూరుబండ జాతర 1. లక్ష్మీనరసింహ స్వామి
బి. అడవిదేవులపల్లి జాతర 2. కనకదుర్గమ్మ
సి. రంగాపూర్ జాతర 3. ఉమామహేశ్వర స్వామి
డి. తీర్థాల జాతర 4. సంగమేశ్వర స్వామి
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1 4) ఎ-1, బి-3, సి-2, డి-4
16. కింది జాతరలు, వాటికి సంబంధం ఉన్న పదాలను జతపర్చండి. (2)
ఎ. కొమురవెల్లి మల్లన్న జాతర 1. నొల్లుబండ
బి. తేగడ జాతర 2. సుంకు కొలవడం
సి. మన్యంకొండ జాతర 3. జమ్మి ఆకులతో పూజ
డి. గొల్లగట్టు జాతర 4. దిష్టి పోయడం
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-1, బి-2, సి-4, డి-3
17. ఏ జాతరకు సంబంధించిన దేవాలయంలోని అమృత కుండంలో స్నానమాచరిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం? (2)
1) కొత్తకొండ జాతర
2) కేతకి సంగమేశ్వర జాతర
3) కార్నేపల్లి జాతర
4) ఏదీకాదు
18. జెండా బాలాజీ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? (1)
1) నిజామాబాద్ 2) కామారెడ్డి
3) ఆదిలాబాద్ 4) సంగారెడ్డి
19. కింది వాటిలో నాగర్ కర్నూల్ జిల్లాలో జరగని జాతర ఏది? (4)
1) సలేశ్వరం జాతర
2) రంగాపూర్ జాతర
3) సింగోటం జాతర
4) లింబాద్రిగుట్ట జాతర
20. వేంకటేశ్వర స్వామిని తిమ్మప్పగా కొలిచే జాతర ఏది? (3)
1) వేలాల జాతర
2) కొడవటంచ జాతర
3) మల్దకల్ జాతర
4) ఏదీకాదు
వివిధ జిల్లాల్లో జరిగే జాతరలు, పూజించే దేవతలు
సిద్దిపేట జిల్లా
1. బెజ్జంకి జాతర – లక్ష్మీనరసింహ స్వామి
2. కూడవెల్లి జాతర – రామలింగేశ్వర స్వామి
3. పుల్లూరుబండ జాతర – లక్ష్మీనరసింహస్వామి
4. కొమురవెల్లి జాతర – మల్లన్న స్వామి
5. దుద్దెడ జాతర – శంభుదేవుడు
6. సింగరాయ జాతర – లక్ష్మీనరసింహ స్వామి
నాగర్కర్నూల్ జిల్లా
1. సలేశ్వరం జాతర – శివుడు
2. సిరిసినగండ్ల జాతర – సీతారాములు
3. రంగాపూర్ జాతర – ఉమామహేశ్వర స్వామి
4. సింగోటం జాతర – లక్ష్మీనరసింహ స్వామి
నల్లగొండ జిల్లా
1. శంభులింగేశ్వర స్వామి జాతర – శంభులింగేశ్వర స్వామి
2. చెరువుగట్టు జాతర – జడల రామలింగేశ్వర స్వామి
3. కోదండాపురం జాతర – వేంకటేశ్వర స్వామి
4. అడవిదేవులపల్లి జాతర – కనకదుర్గమ్మ
5. తుల్జాభవాని జాతర – తుల్జాభవాని
సూర్యాపేట జిల్లా
1. గొల్లగట్టు జాతర – లింగమంతుల స్వామి
2. అర్వపల్లి జాతర – లక్ష్మీనరసింహ స్వామి
3. మేళ్లచెరువు జాతర – శంభులింగేశ్వర స్వామి
4. గంగమ్మ జాతర – గంగమ్మ తల్లి
నిజామాబాద్ జిల్లా
1. సిద్దులగుట్ట జాతర – సిద్దేశ్వర స్వామి
2. లింబాద్రిగుట్ట జాతర – లక్ష్మీనరసింహస్వామి
3. జెండా బాలాజీ జాతర – బాలాజీ (వేంకటేశ్వర స్వామి)
ములుగు జిల్లా
1. సమ్మక్క-సారలమ్మ జాతర – సమ్మక్క-సారలమ్మ
2. భూపతిపురం జాతర – కొండ సారలమ్మ
3. కార్నేపల్లి జాతర – సారలమ్మ (పులిరూపం)
4. మల్లూర్ జాతర – నరసింహ స్వామి
మెదక్ జిల్లా
1. ఏడుపాయల జాతర – వనదుర్గ భవాని
2. బేతాళస్వామి జాతర – బేతాళుడు
సంగారెడ్డి జిల్లా
1. జోగినాథుని జాతర – శివుడు (జోడు లింగాలు)
2. కేతకి సంగమేశ్వర స్వామి జాతర – సంగమేశ్వర స్వామి (శివుడు)
జగిత్యాల జిల్లా
1. కొండగట్టు జాతర – ఆంజనేయస్వామి
2. నల్లకొండ జాతర – నరసింహ స్వామి
జోగులాంబ గద్వాల జిల్లా
1. మల్దగల్ జాతర – వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప)
2. గద్వాల్ జాతర – చెన్నకేశవస్వామి
మహబూబ్నగర్ జిల్లా
1. కురుమూర్తి జాతర – వేంకటేశ్వర స్వామి
2. మన్నెంకొండ జాతర – వేంకటేశ్వర స్వామి
వరంగల్ అర్బన్ జిల్లా
1. కొత్తకొండ జాతర – కోరమీసాల వీరభద్ర స్వామి
2. ఐనవోలు జాతర – మల్లన్న స్వామి
మంచిర్యాల జిల్లా
1. కత్తెరసాల జాతర – శివుడు
2. వేలాల జాతర – మల్లన్న స్వామి
నిర్మల్ జిల్లా
1. ఆదెల్లి పోచమ్మ జాతర – పోచమ్మ తల్లి
మహబూబాబాద్ జిల్లా
1. కొరవి జాతర – వీరభద్రస్వామి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
1. కోటంచ జాతర – లక్ష్మీనరసింహ స్వామి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
1. తేగడ జాతర – భద్రకాళి, వీరభద్రస్వామి
ఖమ్మం జిల్లా
1. తీర్థాల జాతర – సంగమేశ్వర స్వామి
ఆదిలాబాద్ జిల్లా
1. నాగోబా జాతర – నాగదేవత
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?