సర్కారు బడుల్లో డిజిటల్ వెలుగులు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో డిజిటల్ తరగతి గదులను ప్రారంభించింది. నూతన టెక్నాలజీని వాడుకుంటూ డిజిటల్ విద్యాబోధనవైపు అడుగులు వేస్తున్నాయి సర్కారు బడులు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ తరగతులు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ తరగతులు దోహదపడుతున్నాయి.
ఇవీ ప్రయోజనాలు
-విద్యార్థులకు సులువుగా అర్థమవడం
-దృశ్యరూపంలో పాఠాలు బోధించడం వల్ల త్వరగా మరిచిపోరు
-డిజిటల్ తరగతులు ఆసక్తికరంగా ఉండటంతో పెరుగుతున్న హాజరుశాతం
-వీడియోల ద్వారా బోధిస్తుండటంతో ఆయా సబ్జెక్టులపై సమగ్ర అవగాహన
-అప్పటికప్పుడు డౌట్స్‌ను క్లారిఫై చేసుకునే అవకాశం
-అన్ని సబ్జెక్టులపై విస్తృత అవగాహన
పాఠం.. స్పష్టంగా
చాలామంది విద్యార్థులకు చదువంటే ఇష్టమే. కానీ అప్పుడప్పుడు కొద్దిమంది స్కూల్‌కు డుమ్మా కొడుతుంటారు. కారణం ఏమిటని తోటి విద్యార్థులు అడిగితే టీచర్లు చెప్పే పాఠాలు బోర్ కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటివాటిని అధిగమించేందుకు బ్లాక్ బోర్డు చదువులకు భిన్నంగా డిజిటల్ పాఠాలు రన్ అవుతున్నాయి. ఈ పాఠాలు బోర్ కొట్టవు. వినడానికి సులువుగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. పాఠం ఎప్పటికీ గుర్తుంటుంది. వీడియో క్లిప్పింగ్‌ల రూపంలో బోధన ఉండటంతో ఇంకొంచెం సేపు క్లాసు కొనసాగితే బాగుండుననే భావన విద్యార్థుల్లో ఉంటుంది. డిజిటల్ క్లాస్‌లో ఉంటే సినిమా హాల్లో ఉన్నట్టుగా ఉంటుందంటున్నారు విద్యార్థులు. 45 నిమిషాలపాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించిన అనంతరం విద్యార్థులతో నేరుగా డిస్కస్ చేసి డౌట్స్‌ను క్లారిఫై చేస్తారు. ఇదివరకు పాఠాలు పది నిమిషాలు వినగానే బోర్ కొట్టేవని, ఇప్పుడు ఇష్టంగా నేర్చుకుంటున్నామని చెబుతున్నారు విద్యార్థులు.
బొమ్మల ద్వారా బోధన
కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల్లో థియరీ అర్థమవుతున్నా డయాగ్రమ్స్‌పై క్లారిటీ ఉండటం లేదని విద్యార్థులు వాపోతుంటారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ పద్ధతిలో బోధన ఉండేది. జీవ, రసాయన, భౌతికశాస్త్రాల వంటి సబ్జెక్టులను చిత్రపటాల ద్వారా విద్యార్థులకు వివరించాల్సి ఉంటుంది. అయితే కొందరు ఉపాధ్యాయులు ఆయా చిత్రపటాలను బోర్డుపై గీసి వివరిస్తుంటారు. మరికొందరు పుస్తకాల్లో ఉన్న చిత్రపటాల ఆధారంగా ఆయా పాఠ్యాంశాలను బోధిస్తుంటారు. ఇలాంటి పద్ధతుల్లో చేసే బోధన.. తరగతిలో కాస్త బాగా చదివే విద్యార్థులకు అర్థమవుతున్నా కొందరు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం డిజిటల్ తరగతులను అందుబాటులోకి తేవడంవల్ల కష్టమైన పాఠాలు సైతం విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించే అవకాశం ఉంటుంది. పాఠం దృశ్యరూపంలో ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పెరుగుతున్న హాజరుశాతం
డిజిటల్ తరగతులకు ముందు విద్యార్థులు నెలలో కొన్ని రోజులయినా డుమ్మాలు కొడుతుండేవారని కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ డిజిటల్ తరగతుల ప్రారంభంతో ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దృశ్యరూపకంగా, ఆసక్తికరంగా పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ ఆసక్తిగా వింటున్నారంటున్నారు.
అన్ని అంశాల్లో..
అంతరిక్షం మొదలుకొని అడవిలోని మొక్కల వరకు, మానవుడి శరీర భాగాల నుంచి వివిధ పరికరాల పనితీరు వరకు ప్రత్యక్షంగా చూసి నేర్చుకొనే అవకాశం ఉంది. అన్ని సబ్జెక్టుల్లో ముఖ్యాంశాలను దృశ్యరూపంలో ప్రదర్శిస్తుండటంతో పాఠాలపై విద్యార్థులకు క్లారిటీ వస్తుంది. గణితం, విజ్ఞానశాస్ర్తాలు, భౌతిక, జీవ శాస్ర్తాలతో పాటు ఇంగ్లిష్‌లో వర్బ్స్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, తెలుగు గ్రామర్, చారిత్రాత్మక అంశాలను డిజిటల్ విధానంలో బోధిస్తుండటం వల్ల అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ముందుంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మళ్లీ మళ్లీ చూడవచ్చు
వీడియో, ప్రొజెక్టర్ వంటి పరికరాలతో విద్యార్థులకు స్క్రీన్‌పై పాఠాలు బోధించడమే డిజిటల్ తరగతులు. కేయాన్ ప్రొజెక్టర్ ఇందులో కీలకం. శాటిలైట్ (ఆర్వోటీ), కేయాన్ ప్రొజెక్టర్ తదితర మూడు విధానాల ద్వారా బోధన ఉంటుంది. అయితే ఈ విధానం వల్ల పాఠాలను రివ్యూ చేసుకొనే అవకాశం కూడా ఉంది. అయితే చాలా పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో పాఠాలను డౌన్లోడ్ చేసుకొని బోధించవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే పాఠాలను మళ్లీ మళ్లీ వినే అవకాశం ఉండటంతో విద్యార్థులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
వీడియోలతో త్వరగా అర్థమవుతుంది
teacherసాధారణ పద్ధతిలో టీచర్లు చెప్పే పాఠాలను తరగతి గదిలో కేవలం వినడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ డిజిటల్ తరగతుల ద్వారా వింటూనే పాఠ్యాంశాలను దృశ్యరూపంలో కూడా గుర్తుంచుకోవచ్చు. మన టీవీ కార్యక్రమాలు కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ ప్రసారాల టైమింగ్స్ పాఠశాల వేళల్లో కాకుండా ఉదయం లేదా సాయంత్రం ఉంటే విద్యార్థులు చూసేందుకు వీలు కలుగుతుంది. – శైలజారెడ్డి, స్కూల్ అసిస్టెంట్, బంజారాహిల్స్
పాఠాన్ని మరిచిపోలేం
డిజిటల్లో త్రీడీ విజువలైజేషన్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి వింటే ఈజీగా గుర్తుంటుంది. అసలు పాఠం మర్చిపోయే అవకాశమే ఉండదు. వీడియోల ద్వారా పాఠాలు త్వరగా అర్థమవుతున్నాయి. డిజిటల్ తరగతులు పదో తరగతి విద్యార్థులకు వరంలాంటివి. ఈ తరగతులు బోర్డు ఎగ్జామ్‌లో మంచి రిజల్ట్స్ సాధించడానికి బాగా ఉపయోగపడతాయి. – భానుప్రియ, పదో తరగతి, గతి గవర్నమెంట్ పాఠశాల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు