Growth in agriculture | వ్యవసాయరంగం వృద్ధి
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జంతువులు, మొక్కలను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.
-భారతదేశంలో కొత్త రాతియుగం (6000-1000 నవీనయుగం)లో మానవులు ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. వ్యవసాయం, పశుపోషణ చేపట్టారు.
-సింధు నాగరికత కాలంలో బన్వాలిలో టెర్రకోటతో తయారుచేసిన నాగలిబొమ్మ, కాళిబంగన్లో నాగలితో దున్నిన చాళ్లు, లోథాల్లో వరి గింజలు, రంగాపూర్‌లో వరిపొట్టు వ్యవసాయం చేశారనడానికి నిదర్శనం.
-నదులకు వచ్చే వరదల వల్ల కొట్టుకు వచ్చే ఒండ్రుమట్టి ఉన్న భూముల్లో తృణధాన్యాలు, గోధుమలు, బార్లీ, బీన్స్ నూనె గింజలు, అవిసెలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి, ఆవాలు సింధు నాగరికత ప్రజలు ఆనాడు పండించిన ముఖ్య పంటలు.
-హరప్పా ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా వరి, పత్తి పంటలను పండించారు.
-ప్రపంచంలోని శ్రామికుల్లో 42 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అందువల్ల వ్యవసాయం ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5 శాతం మాత్రమే.
-వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది.
-వ్యవసాయదారుడు సాగు చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. రాష్ట్రంలో సగటు భూకమతం 1.11 హెక్టార్లు. జాతీయ స్థాయిలో సగటు భూకమతం 1.15 హెక్టార్లు.
-ఐక్యరాజ్య సమితి 2014ను అంతర్జాతీయ కుటుంబ సేద్య సంవత్సరంగా ప్రకటించినది.
-డిసెంబర్ 23 రైతు దినోత్సవం
వ్యవసాయ రంగం – ప్రాధాన్యం
-2014-15 జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 17.01 శాతం
-2013-14 వ్యవసాయం, అనుబంధ రంగాల జీడీపీలో వృద్ధి శాతం 3.7 శాతం
-మూలధన కల్పన (జీసీఎఫ్)లో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 2011-12లో 8.6 శాతం, 2013-14లో 7.9 శాతం నమోదైంది.
-వ్యవసాయం అనుబంధ రంగాల స్థూలదేశీయ ఆదాయం (జీడీపీ)లో స్థూల మూలధన కల్పనవాటా 2011-12లో 18.3 శాతం, 2013-14లో 14.8 శాతంగా ఉన్నది.
-దేశ ఎగుమతుల్లో పది శాతం వ్యవసాయ ఉత్పత్తులే
-ఆ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులు 267.57 మిలియన్ల టన్నులు
-ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో భారతదేశ వాటా 7.68 శాతం
-2013-14లో వ్యవసాయ రంగంలో 54.6 శాతం మందికి ఉపాధి అవకాశం లభించింది.
-12వ ప్రణాళికలో (2012-17) వ్యవసాయ రంగవృద్ధి రేటు 4 శాతంగా నిర్ణయించారు.
-ప్రపంచంలో అత్యధిక పశుసంపద గల దేశం భారతదేశం
-2014-15లో ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ది ప్రథమస్థానం. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 18.5 శాతం. మన దేశంలో పాల ఉత్పత్తి 146.3 టన్నులు. ప్రస్తుతం తలసరి పాల లభ్యత 322 గ్రాములు.
-2014-15లో మనదేశంలో గుడ్ల ఉత్పత్తి 78.48 బిలియన్లు, పౌల్ట్రీ మాంసం ఉత్పత్తి 3.04 మిలియన్ టన్నులు
-స్థూల దేశీయోత్పత్తిలో మత్స్య సంపద వాటా 1 శాతం. వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూలదేశీయ ఉత్పత్తిలో మత్స్య సంపద వాటా 5.08 శాతం.
-1950-51లో సముద్ర చేపలు 5,34,000 టన్నులు, దేశీయ జలాల్లో 2,18,000 టన్నులు మొత్తం 7,52,000 టన్నుల చేపలు దొరికాయి.
-2012-13లో సముద్ర చేపలు 33,21,000 టన్నులు, దేశీయ జలాల్లో 57,20,000 టన్నులు మొత్తం 90,40,000 టన్నుల చేపలు దొరికాయి.
-1990-91లో 1205.86 కోట్ల మొత్తం దిగుమతులు జరిగాయి. భారతదేశం దిగుమతి చేసుకున్న దిగుమతుల్లో వ్యవసాయ దిగుమతుల శాతం 2.79 శాత్రం మాత్రమే
-1990-91లో 6012.76 కోట్లు మొత్తం ఎగుమతులు జరిగాయి. భారతదేశం చేసిన ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల శాతం 18.49 శాతం.
-2013-14 (p)లో 105149.00 కోట్లు మొత్తం దిగుమతులు జరిగాయి. భారతదేశం చేసుకొన్న దిగుమతుల్లో వ్యవసాయ దిగుమతుల శాతం 3.87 శాతం మాత్రమే.
-2013-14 (p)లో 2,68,469.05 కోట్ల మొత్తం ఎగుమతులు జరిగాయి. భారతదేశం ఎగుమతి చేసిన ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల శాతం 14.17 శాతం.
-ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌లో వ్యవసాయ భూమి 1,06,75,100 హెక్టార్లు . మొత్తం భూమిలో శాతం 68.6 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు
-ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న రెండో దేశం ఉక్రెయిన్. మొత్తం భూమిలో 55.3 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
-ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న మూడో దేశం భారతదేశం. ఇక్కడ వ్యవసాయ భూమి 15,83,20,000 హెక్టార్లు. మొత్తం భూమిలో వ్యవసాయ భూమి శాతం 48.15 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
వ్యవసాయ కమతం
-వ్యవసాయదారుడు సేద్యం చేసే భూమిని కమతం అంటారు. జాతీయ స్థాయిలో సగటు కమతం 1.15 హెక్టార్లు (2011 వ్యవసాయ లెక్కల ప్రకారం)
-దేశంలో హెక్టార్ కన్నా తక్కువ భూమి వున్న వారు 67.1 శాతంగా ఉన్నారు
-1971-72లో వ్యవసాయ భూమి 119.636 మిలియన్ల హెక్టార్లు ఉంటే, 2013 నాటికి 92.359 హెక్టార్లుగా మిగిలినది. నాలుగు దశాబ్దల కాలంలో వ్యవసాయ భూమి 22.7 శాతం తగ్గినది.
-దేశంలో భూమి లేని కుటుంబాల జాతీయ సగటు 7.41 శాతం. తెలంగాణలో భూమిలేని కుటుంబాల శాతం 6.19
-తెలంగాణలో 16.45 శాతం కుటుంబాలు కౌలు సేద్యం చేస్తున్నాయి.
-2001లో సేద్యం చేసే వారి సంఖ్య 10 కోట్ల 30 లక్షలు ఉంటే, 2011 నాటికి తొమ్మిదిన్నర కోట్లకు తగ్గింది. రోజుకు రెండు వేలకు పైగా సేద్యానికి దూరమై పోతున్నారు.
నీటి పారుదల
-నీటి పారుదల విస్తీర్ణాన్ని బట్టి నీటి పారుదల ప్రాజెక్టును మూడు రకాలుగా విభజించారు. 1950-51లో వ్యయాన్ని అనుసరించి మూడు రకాలుగా 1978లో నీటిపారుదల అనుసరించి ప్రాజెక్టుల వర్గీకరణ చేశారు.
-భారీ నీటి పారుదల ప్రాజెక్టు : 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాజెక్టును భారీ నీటి పారుదల ప్రాజెక్టు అంటారు. ఐదు కోట్ల వ్యయానికి పైగా ఖర్చు అవుతుంది.
-మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు : 2,000 నుంచి 10,000 హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాజెక్టును మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు అంటారు. 10 లక్షల నుంచి 5 కోట్లకుపైగా వ్యయమవుతాయి.
-చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టు : 2,000 హెక్టార్లలోపు నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాజెక్టును చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టు అంటారు. 10 లక్షల వ్యయంలోపు ఉన్న ప్రాజెక్టులు
నీటి పారుదల సౌకర్యాలు (2011-12 హెక్టార్లు)
బావులు 40,187 (44 శాతం)
కాలువలు 16,017 (36 శాతం)
చెరువులు 1,937 (16 శాతం)
ఇతర నీటి పారుదల సౌకర్యాలు 7,123 (4 శాతం)
-బావుల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు.
-బావులు రెండు రకాలు. గొట్టపు బావులు, మామూలు బావులు. గొట్టపు బావుల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో, మామూలు బావుల ద్వారా పంజాబ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు .
-కాలువల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు. కాలువలు రెండు రకాలు. వరద కాలువలు, జీవ, లేదా నది కాలువలు, వరద కాలువల ద్వారా పంజాబ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు.
-చెరువుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో (ఉమ్మడి రాష్ట్రంలో) అత్యధికంగా సేద్యం చేస్తున్నారు.
-భారతదేశంలో నీటి పారుదల సాంద్రత అత్యధికంగా పంజాబ్‌లో, అత్యల్పంగా మిజోరాంలో ఉంది.
-దేశంలో సాగు నీటి సదుపాయం ఉన్న వ్యవసాయ భూమి 42 శాతం. మొత్తం పంట ఉత్పత్తిలో, 56 శాతం ఇక్కడి నుంచే వస్తున్నది.
-వర్షాధార పంట భూమి 58 శాతం. దీన్ని నుంచి వచ్చే పంట ఉత్పత్తి 44 శాతం.
-పంటల సాంద్రత : పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగించగా వచ్చినది పంటల సాంద్రత
భూ వినియోగం(మిలియన్ హెక్టార్లలో) 1950-51 2011-12
మొత్తం భూవిస్తీర్ణం 328.73 328.73
అటవీ భూమి, 40.48 70.02
మొత్తం భూవిస్తీర్ణంలో
అటవీ భూమి శాతం 14.24 % 22.89%
వ్యవసాయ యోగ్యం కాని భూమి 47.52 43.52
బీడు భూములు 28.12 25.38
నికర పంట విస్తీర్ణం 140.64 140.80
మొత్తం స్థూల పంట విస్తీర్ణం 191.10 195.25
పంటల సాంద్రత 135.88 138.67
మొత్తం నికర సాగు విస్తీర్ణం 59.23 65.26
మొత్తం స్థూల సాగు భూమి 81.08 91.53
సాగు భూమి పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు
దేశం వ్యవసాయ భూమి మొత్తం భూమిలో
హెక్టార్లు శాతం
అమెరికా 16,69,30,200 18.22
భారత్ 15,83,20,000 48.15
చైనా 15,04,35,000 16.13
రష్యా 11,92,30,000 7.28
బ్రెజిల్ 6,61,29,900 7.82
వ్యవసాయ కుటుంబాలకున్న సగటు భూమి (హెక్టార్లలో)
1992 2003 2013
తెలంగాణ – – 0.705
జాతీయ సగటు 1.01 0.725 0.592
భూమిలేని వారి శాతం
1992 2003 2013
తెలంగాణ – – 6.19
జాతీయ సగటు 11.3 10.04 7.41
ప్రతి వేయి కుటుంబాలు ఇలా జీవిస్తున్నాయి
తెలంగాణ జాతీయ స్థాయిలో
వ్యవసాయం 483 429
పశు సంపద 13 18
సేద్యేతర 36 35
వ్యవసాయేతర 86 116
ఉద్యోగాలు 322 324
ఇతర 61 79
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?