Do’s and Don’ts | రాయాల్సినవి, రాయకూడనివి
చక్కటి పాశుపతాస్త్రం లాంటి రెజ్యూమేకు ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకొంటున్నాం.
అనేక ఆన్లైన్ జాబ్ పోర్టల్స్, ఈ రెజ్యూమే బిల్డింగ్‌ను చక్కని వ్యాపారంగా చేసుకొన్నాయి. అంటే రెజ్యూమే రాసిపెట్టడానికి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
మనం ఈ 25 సూచనలను పాటిస్తూ రెజ్యూమే తయారు చేసుకొంటే మనకు ఖర్చు లేకుండా చక్కని రెజ్యూమే తయారవుతుంది.
ముందుగా మనం అన్ని పాయింట్లు రాసుకొందాం.
ఇవి వద్దు…
హాబీలు
వైవాహిక స్థితి
బలహీనతలు
సొంత ఊరు
రెజ్యూమే అనగానే చాలామంది మొక్కుబడిగా విషయాలన్నీ పొందుపరుస్తూ ఉంటారు. వీటివల్ల ప్రయోజనం లేకపోగా ఒక్కోసారి అనవసరంగా అభ్యర్థిపై కొన్ని అపోహలు ఏర్పడే అవకాశాలున్నాయి.
అదేవిధంగా మీకున్న రాజకీయ పార్టీలతో సంబంధాలు, వివిధ సంఘాల్లో సభ్యత్వ వివరాలు ఇక్కడ అనవసరం.
చేయబోయే ఉద్యోగానికి ఆ వివరాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటే తప్ప వాటి జోలికి పోకపోవడం మంచిది.
సొంత డబ్బా కొట్టుకోవాలి
అతి వినయం వద్దు. మీ విజయాల్ని ప్రత్చేక అటాచ్మెంట్ జతచేస్తూ పూర్తి వివరాలతో పేర్కొనవచ్చు.
సాఫ్ట్ కాపీ రెడీ – ఎల్లప్పుడూ పెన్‌డ్రైవ్‌లో సాఫ్ట్‌కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. స్టాండర్ట్ కాపీ, ఆయా కంపెనీలకు పంపిన సాఫ్ట్ కాపీలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
మాట్లాడే రెజ్యూమే
రెజ్యూమే మీ కన్నా ముందుకెళుతుంది. అది వెళ్లి మీ గురించి మాట్లాడాలి.
అంటే మీ భాష, భావాలు, పొందిక అంత స్పష్టంగా ఉండాలి.
చేయకూడనివి (Donts)
ఎట్టి పరిస్థితుల్లో రెజ్యూమే ఫొటోకాపి పంపించకండి. ప్రతిసారి మంచి A4 సైజు పేపర్లో తాజా లేజర్ ప్రింట్‌పై ప్రింటవుట్ తీసి పంపండి.
ఫొటోకాపి పంపడం మీ నిర్లక్ష్య వైఖరిని సూచించడమే కాకుండా మీరు ఈ ఒక్కటే కాకుండా చాలా కంపెనీలకు దరఖాస్తు చేసుకొంటున్నారు అనని అర్థం వస్తుంది.
మీ రెజ్యూమే మీరే తయారు చేసుకోవాలి. వెబ్సైట్ల నిపుణులపై, ఏజెంట్లపై ఆధారపడకూడదు. ఒకవేళ ఎవరితో అయినా టైప్ చేయించినా భావం మీదే ఉండాలి.
అందులో ప్రతి అక్షరం, ప్రతి వివరం మీ నాలుక చివర ఉండాలి. లేదంటే తీరా ఇంటర్వ్యూ గదిలో తెల్లమొహం వేయాల్సి వస్తుంది.
రకరకాల ఫాంట్లు వాడకూడదు. చక్కగా ఒకటో రెండో ఫాంట్లు చాలు.
New Time Roman
Arival
Verdana- Helvetica వంటి ఫాంట్లు హుందాగా ఉండి చూడటానికి ఇంపుగా ఉంటాయి.
నాణ్యమైన A4 పేపర్‌పై నల్లరంగు ఇంక్‌తో లేజర్ ప్రింట్ తీయించాలి.
మరీ అవసరమైతే తప్ప రాయల్ బాండ్ పేపర్‌పై తీయనవసరం లేదు. వృథా ఖర్చు.
మీరు సింపుల్‌గా ఉంటేనే మన్ననలు పొందుతారు.
సాఫ్ట్ కాపీలోనే సవరణలు చేయాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్నుతో హార్డ్కాపీలో సవరణలు చేయకూడదు.
ఒక్కపేజీ ముద్దు-రెండే పేజీలు హద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ పేజీలు వాడకండి.
పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఇవ్వడం మర్చిపోకండి.
రెజ్యూమే ప్రింటవుట్‌పై ఫొటో వద్దు. అమెరికన్ కంపెనీల విధానం ప్రకారం అటువంటి రెజ్యూమే తిరిస్కరించబడుతుంది. ఫ్యాషన్ మోడలింగ్‌కు మాత్రమే మినహాయింపు. జర్మనీ కంపెనీలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
నైపుణ్యాల ఆధారంగా ఎన్నుకోబడాలి అనే సూత్రం ఆధారంగా ఈ నియమం విధించబడింది బహుశా.
మీ గోల్, నైపుణ్యాలతో పొంతన లేని ఉద్యోగ ప్రకటనకు స్పందించకండి.
ఈ సూచనలు పాటిస్తే విజయం ఖాయం.
గోల్డెన్ రూల్స్ (పట్టిక రూపంలో…..)
1. మీ రెజ్యూమే మీ గురించిన అడ్వర్టయిజ్మెంట్
2. ఉద్యోగ ప్రకటలనకు అనుగుణంగా ప్రతిసారీ రెజ్యూమే తయారు చేసుకోవాలి.
3. మీ నైపుణ్యాలను ప్రకటించాలి.
4. ఒకటి లేదా రెండు A4 సైజు పేపర్లు మాత్రమే వాడాలి.
5. కంటికి ఇంపుగా ఉండే ఫాంట్ వాడాలి.
6. చక్కటి మార్జిన్లు పాటించాలి.
7. ప్రొఫైల్/ఆబ్జెక్టివ్‌తో ప్రారంభించాలి.
8. కచ్చితత్వం ఉట్టిపడేలా ఉండాలి.
9. హోదా ముఖ్యం కాదు.
10. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు.
11. ఒకే రెజ్యూమే అన్ని కంపెనీలకు వద్దు
12. చిన్న వాక్యాలే అందం.
13. హాబీలు లాంటి అనవసర విషయాలు వద్దు.
14. గొప్పలు చెప్పుకోవాలి.
15. ఎల్లప్పుడూ సాఫ్ట్‌కాపీ రెడీగా ఉంచుకోవాలి.
16. మీ రెజ్యూమే మాట్లాడాలి.
17. జిరాక్స్ తీసి పంపొద్దు
18. ఇతరులపై ఆధారపడకూడదు.
19. ఒకటో, రెండో ఫాంట్లు వాడాలి.
20. పెన్నుతో సవరణలు చేయొద్దు.
21. ఎక్కువ పేజీలు వద్దు
22. సరైన చిరునామా, ఫోన్ నంబర్లు ఇవ్వాలి.
23. ప్రింటవుట్‌లో
ఫొటోలు వద్దు.
24. వ్యక్తిగత వివరాలు
అనవసరం.
25. పొంతనలేని ఉద్యోగాలకు దరఖాస్తు చేయకండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?