కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం
మూర్త ప్రచాలక దశ
-ఇది 7-11 ఏండ్ల వరకు ఉంటుంది.
-విషయాలకు, వస్తువులకు మధ్య పరస్పర సంబంధాలు స్థాపిస్తారు.
-కంటి ముందు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే దశ.
-ఈ దశలో విశ్లేషణాశక్తి, వివరించేశక్తి, వర్గీకరణశక్తి, పదిలపర్చుకొనేశక్తి ఏర్పడుతాయి. కన్జర్వేషన్, ఏకమితిని అర్థం చేసుకుంటాడు.
-ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపగమాలు ఉపయోగిస్తాడు.
-ఉదా: పిల్లవాడు ఎక్కడి నుంచైనా ఇంటికి వెళ్లగలడు కానీ ఇంటి దారిని చెప్పలేడు.
-టీచర్ రేపు పాఠశాలకు సెలవని ప్రకటిస్తే నేను రేపు పాఠశాలకు రావాల్సిన అవసరం లేదనుకోవడం.
-ప్రపంచ పటంలో ఏవైనా 3 దేశాలను చూపించి వాటిలో పెద్ద దేశమేది అంటే చెప్పగలడు. కానీ చూడకుండా 3 దేశాల విస్తరణ చెప్పి ఏది పెద్దది అంటే చెప్పలేడు.
-మూర్త విషయాలకు, తార్కిక ఆలోచన మాత్రమే ఉంటుంది.
అమూర్త ప్రచాలక దశ
-ఇది 12-16 ఏండ్ల వరకు ఉంటుంది.
-కంటికి కనిపించని అమూర్త విషయాల గురించి మాట్లాడుతారు.
-ఉదా: నీతి, నిజాయితీ, దేశభక్తి, ప్రేమ, అనురాగం, ఈర్ష్య, ద్వేషం
-కార్యకారణ సంబంధం (Cause and Effect) గురించి ఆలోచిస్తాడు.
-క్రియేటివిటి, విభిన్న ఆలోచనలు ఉంటాయి.
-పరికల్పనలు ఏర్పరిచే దశ
-నిగమనాత్మక వివేచన పూర్తిగా కనిపిస్తుంది.
-సమస్య పరిష్కారానికి విభిన్న ఆలోచనలతో విభిన పరిష్కారాలు చూపుతాడు.
-ఈ దశతో సంజ్ఞానాత్మక వికాసం పూర్తవుతుంది.
పియాజే విద్యా ప్రాముఖ్యం
1. ప్రాథమిక పాఠశాల దశలో మూర్త విషయాలను ప్రవేశపెట్టాలి. దీనినే ఆవిష్కరణ అభ్యసనం అంటారు.
-ఆవిష్కరణ అభ్యసనంలో అన్వేషణ కాంక్షను పెంచడానికి సామగ్రి, ఫజిల్స్, పుస్తకాలు, సంగీత పరికరాలు మొదలైన కృత్యాలు చేయించాలి.
2. ఉన్నత పాఠశాల దశలో అమూర్త విషయాలు ప్రవేశపెట్టాలి.
3. అభ్యసనపై సంసిద్ధత
-పిల్లల వికాసాన్ని వేగవంతం చేయడానికి వారి ఆలోచనా స్థాయికి తగిన నైపుణ్యాలను నేర్పించాలి. ఆసక్తి సంసిద్ధత కలిగేలా చేయాలి.
4. సంజ్ఞానాత్మక వికాసం ఆధారంగా వైయక్తిక భేదాలను గుర్తించి వారి పూర్వ నిష్పాదనను ప్రస్తుత నిష్పాదనతో పోల్చి అంచనా వేయాలి.
నైతిక వికాస సిద్ధాంతం
-కోల్బర్గ్ (హార్వర్డ్ యూనివర్సిటీ-అమెరికా) ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
-శిశువును నైతిక తత్వవేత్తగా పిలిచింది- కోల్బర్గ్
-నైతికత గురించి వ్యక్తులు ఏం చేస్తారనే దానికంటే ఏం ఆలోచిస్తారనే విషయం గురించి వివరించాడు.
-నైతిక వికాసం వ్యక్తి సంజ్ఞానాత్మక వికాసం, పెంపకం, సామాజిక అనుభవంపై ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ తెలిపాడు.
-వ్యక్తుల్లో నైతిక వికాసం జీవితాంతం జరుగుతుంది.
-ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు నైతిక వికాసంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
-వ్యక్తిలోని న్యాయ భావన అనే వికాసమే నైతిక వికాసం.
-నైతిక వికాసంలో మూడు స్థాయిలు ఉంటాయి. ప్రతి స్థాయిలో రెండు దశలు ఉంటాయి.
-వయస్సుపైన ఈ దశలు ఆధారపడి ఉండవు.
-నైతిక వికాసం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1. సంజ్ఞానాత్మకత (జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం)
2. పరిసరాలు (సాంఘిక వికాసం)
3. అంతరాత్మ (ప్రాయిడ్ సిద్ధాంతం)
-నైతికతను ఆంగ్లంలో Morality అని పిలుస్తారు. Morality అనే పదం Mores అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. Mores అంటే సంప్రదాయం, అందరిదారి పద్ధతి.
1. పూర్వ సంప్రదాయక స్థాయి
-ఇది 4-10 ఏండ్ల వరకు ఉంటుంది.
-పిల్లలు మంచీ చెడు అనే అంశాలను వాటి పరిమాణం లేదా పర్యవసానాలకు అనుగుణంగా ఆలోచిస్తారు.
ఎ. శిక్ష-విధేయత
-ఈ దశలో శిశువు ఏదైతే తన అవసరం తీరుస్తుందో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాడు.
-శిశువుకు ఇబ్బంది కలిగించేది తప్పుగాను, అవసరాలు తీర్చేది ఒప్పుగాను అనిపిస్తుంది.
-బహుమతులు ఇచ్చేది మంచిగా, శిక్షించేది చెడుగా కనిపిస్తుంది.
-ఈ దశలో చెడులను పెద్దలు నిర్ణయించేవే తప్ప స్వయంగా వారు నిర్ణయించుకోలేరు.
-శిశువు తల్లిదండ్రుల నుంచి శిక్ష తప్పించుకోవడానికి వారి మాటలు గౌరవించి పాటించి వారిపై విధేయతగా ఉంటాడు.
-ఈ దశలో శిశువు తప్పులను తప్పనిసరిగా అరికడితే నైతికత అభివృద్ధి జరుగుతుంది. శిక్షణ వల్ల నైతికత నియంత్రణలో ఉంటుంది.
-ఉదా: మొక్కై వంగనిది, మానై వంగునా
-మట్టిలో ఆడితే అమ్మ కొడుతుందని ఆడకపోవడం.
బి. సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ దశ
-బహుమతులు పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తాడు. సానుభూతి, దయ, జాలి కాకుండా స్వయం సంతృప్తి కోసం ప్రవర్తిస్తాడు.
-తనకు ఏదైతే మంచి చేస్తుందో అది ఒప్పు అని మిగిలిందంతా తప్పని భావిస్తాడు.
-ఉదా: అడగ్గానే ఐస్క్రీం కొనిపెట్టిన నాన్న మంచివాడని, అమ్మ మంచిది కాదని అనడం.
-చాక్లెట్ ఇస్తాను అనగానే హోంవర్క్ చేయడం
2. సంప్రదాయక స్థాయి
-ఇది 11-13 ఏండ్ల వరకు ఉంటుంది.
-ఈ దశ పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది.
-మంచీ చెడును నిర్ణయిస్తుంది. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటుంది.
ఎ. మంచి బాలుడు, మంచి బాలిక భావన
-మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావిస్తారు.
-ఇతరులతో మంచి అమ్మాయి/అబ్మాయి అనిపించుకోవడం కోసం ప్రయత్నిస్తారు.
-మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోష పెట్టేది, ఇతరులకు సహాయపడేది.
-ఉదా: ఉపాధ్యాయుని మెప్పు కోసం బుద్ధిగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు