తెలంగాణ భూ స్వరూపం ఎలాంటిది?
భూ స్వరూపాలు
-ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటిమధ్య ఎత్తులో అంతరాన్ని భూ నైసర్గిక స్వరూపం అంటారు.
-భూ స్వరూపాలు ప్రధానంగా మూడు రకాలు
పర్వతాలు
-అత్యధిక ఎత్తులు, వాలులను కలిగి వాటిపై తక్కువ సమ ఉపరితలం కలిగి ఉన్న భూభాగమే పర్వతం.
ఉదా: హిమాలయాలు, ఆరావళి, వింధ్య, సాత్పురా పర్వతాలు.
పీఠభూములు
-స్వల్ప అసమాన ఎత్తు, పల్లాలను కలిగి విశాలమైన ఉపరితలంతో వాలు కలిగిన ఎత్తయిన ఆకృతులనే పీఠభూములు అంటారు.
ఉదా: దక్కన్ పీఠభూమి (దేశంలోనే పెద్ద పీఠభూమి)
మాళ్వా పీఠభూమి (మధ్యప్రదేశ్)
చోటానాగపూర్ పీఠభూమి (జార్ఖండ్)
లడఖ్ పీఠభూమి (జమ్ముకశ్మీర్)
మైదానాలు
-సున్నితమైన వాలుకలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు.
ఉదా: తూర్పుతీరమైదానాలు, పశ్చిమతీరమైదానాలు
పీఠభూముల లక్షణాలు
-ఇవి ఎత్తయిన ప్రదేశాలు, విశాల ఉపరితలం కలిగి వాటి మధ్య అక్కడక్కడ కొండలు ఉంటాయి.
-తెలంగాణ పీఠభూమి: రాష్ట్రంలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. దక్కన్ పీఠభూమి దేశంలోనే అతిపెద్దది.
తెలంగాణ పీఠభూమిపై విస్తరించి ఉన్న కొండలు
-సాత్మల కొండలు (ఆదిలాబాద్ జిల్లా)
-నిర్మల్ కొండలు (నిర్మల్ జిల్లా)
-బాలఘాట్ కొండలు (మహబూబ్నగర్)
-రాఖీ కొండలు (కరీంనగర్)
-కందికల్ కొండలు (కరీంనగర్)
-అనంతగిరి కొండలు (వికారాబాద్)
-దేవరకొండ కొండలు (నల్లగొండ)
-సిర్నాపల్లి కొండలు (నిజామాబాద్ జిల్లా)
తెలంగాణ పీఠభూమి-వివరణ
-రాష్ర్టానికి పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. దీనిగుండా గోదావరి, కృష్ణా నదులు ఉత్తర, దక్షిణ తెలంగాణ సరిహద్దుల గుండా తూర్పువైపునకు ప్రవహిస్తున్నాయి.
-ఈ రెండింటి మధ్య మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పువైపునకు వాలి ఉంది.
-హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ పట్టణాలు, భువనగరి, సిద్దిపేట, షాద్నగర్, సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్లు ఎగువ తెంగాణ పీఠభూమిలో ఉన్నాయి.
-వరంగల్, కరీంగనర్, మంథని, మంచిర్యాల, చెన్నూరు, భద్రాచలం పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి.
-ఇక్కడ ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణా ప్రధానమైనవి. ఈ రెండు నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
-ఈ నదులు పీఠభూమిలోని అనేక చిన్న నదులను కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరుస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
-కృష్ణా ఉపనదులు: తుంగభద్ర, డిండి, పాలేరు, కోయనా, పంచగంగా, భీమా, ఘటప్రభ, మున్నేరు, మూసీ
-గోదావరి ఉపనదులు: మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు, కడెం, వార్దా
-దేశంలో గోదావరి, కృష్ణా డెల్టాలే కాకుండా మహానది డెల్టా, కావేరి డెల్టాలు కూడా ప్రధానమైనవి.
-డెల్టా అంటే సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ ప్రాంతాల మధ్యభాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా త్రిభుజాకారంలో ఉంటాయి. ఇవి చాలా సారవంతమైనవి.
దక్కన్ పీఠభూమి సరిహద్దులు
-ఉత్తరాన- సాత్పురా పర్వతాలు
-దక్షిణాన- నీలగిరి పర్వతాలు
-పశ్చిమాన- పశ్చిమ కనుమలు
-తూర్పున- తూర్పు కనుమలు
-పశ్చిమ కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి.
-తూర్పు కనుమలు పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి.
-భారతదేశ దక్షిణ కొసన ఉన్న ప్రాంతం కన్యాకుమారి. ఇది తమిళనాడులో ఉంది.
-దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం కేరళలోని అన్నామలై పర్వతాల్లో ఉన్న అనైముడి (2695 మీ.), రెండో ఎత్తయి శిఖరం తమిళనాడులోని నీలగిరి పర్వాతాల్లో ఉన్న దొడబెట్ట (2637 మీ.).
భూ ఉపరితలం
-గ్లోబు భూమికి ఒక త్రిమితీయ నమూనా (Three Dimensional) గ్లోబు వల్ల ఉపయోగాలు
1. గ్లోబు భూమికి ఒక నమూనా
2. భూమి ఆకారాన్ని చక్కగా చూపుతుంది.
3. నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలను చూపుతుంది.
4. ప్రపంచంలోని దేశాలను చూపుతుంది.
5. దిక్కులను, దూరాలను చక్కగా చూపుతుంది.
భూ ఉపరితలం రెండు భాగాలుగా ఉంటుంది.
1. భూభాగం – 29శాతం భూ ఉపరితలాన్ని ఆక్రమించింది.
-దీనిలో ఏడు ఖండాలు.. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా (విస్తీర్ణం ప్రకారం వరుసక్రమంలో) ఉన్నాయి.
2. జలభాగం 71శాతం భూ ఉపరితలాన్ని ఆక్రమించింది. ఇది నాలుగు మహాసముద్రాలుగా ఉంది.
-పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం అంటార్కిటికా మహాసముద్రం (పరిమాణంలో వరుసక్రమంలో)
-దక్షిణ ధృవం చుట్టూ విస్తరించిన మంచు ఖండమే అంటార్కిటికా ఖండం.
-అక్షాంశాలు- పడమర నుంచి తూర్పునకు భూగోళంపై గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు.
-అక్షాంశాలు అన్ని ఒకే పొడవును కలిగి ఉండవు.
-ఇవి వృత్తాకారంలో భూమి చుట్టూ గీసి ఉన్నాయి.
-భూ ఉపరితలంపై రెండు స్థిరబిందువులు ఉత్తర ధృవం, దక్షిణ ధృవం.
-భూమధ్యరేఖ సరిగ్గా భూ ధృవాలకు మధ్యలో భూమి చుట్టూ గీసి ఉంది.
-భూమధ్యరేఖతో భూ ఉపరితలాన్ని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా విభజించారు.
-ఉత్తరార్ధగోళాన్ని 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళం 90 అక్షాంశాలుగా విభజించారు.
-మొత్తం అక్షాంశాలు = ఉ.అ.+ ద.అ.+భూమధ్య రేఖ = 90+90+1= 181
-అక్షాంశాల ద్వారా ప్రాంతాల శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు.
-రేఖాంశాలు: ఒక ధ్రువం నుంచి మరో ధృవాన్ని నిట్టనిలువుగా కలుపుతూ అర్ధవృత్తాకారంలో ఉండే ఊహారేఖలను రేఖాంశాలు అంటారు.
-రేఖాంశాలు అన్ని ఒకే పొడవు ఉంటాయి.
-ఇవి భూమధ్యరేఖకు లంబంగా గీసి ఉన్నాయి.
-0 డిగ్రీ రేఖాంశంతో భూగోళాన్ని పశ్చిమ, తూర్పు అర్ధగోళాలుగా విభజించారు.
-0 డిగ్రీ రేఖాంశాన్నే గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. అదేవిధంగా దీనిని అంతర్జాతీయ ప్రామాణిక కాలరేఖ అని కూడా అంటారు. ఈ కాల రేఖ లండన్లోని గ్రీనివిచ్ ప్రాంతం మీదుగా వెళ్లడం వల్ల దీనిని గ్రీన్విచ్ రేఖాంశం అంటారు.
-పశ్చిమార్ధగోళాన్ని 180 రేఖాంశాలు, తూర్పు అర్ధగోళాన్ని (పూర్వార్ధగోళం) 180 రేఖాంశాలుగా విభజించారు. మొత్తం రేఖాంశాలు 180+180= 360
-రేఖాంశాలను ఉపయోగించి వివిధ ప్రాంతాల మధ్య కాలాల్లోని తేడాలు గమనించవచ్చు.
-భూమి తన చుట్టూ తాను తిరుగుతూ పడమర నుంచి తూర్పునకు తిరగడం వల్ల సూర్యుడు, తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాడు.
-అధిక భాగం మహాసముద్రాలు ఆవరించి ఉండటం వల్ల భూమి నీలం రంగులో కనిపిస్తుంది.
-గ్లోబ్పై గీసిన ప్రధాన అక్షాంశాలు
1. 0 డిగ్రీ అక్షాంశం – భూమధ్యరేఖ
2. 231/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం- కర్కాటక రేఖ
3. 231/2 డిగ్రీల దక్షిణ అక్షాంశం- మకర రేఖ
4. 661/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం- ఆర్కిటిక్ వలయం
5. 661/2 డిగ్రీల దక్షిణ అక్షాంశం- అంటార్కిక్ వలయం
6. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం – ఉత్తర ధృవం
7. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం- దక్షిణ ధృవం
ప్రాక్టీస్ బిట్స్
1. గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట? (1)
1) ధవళేశ్వరం 2) నాగార్జునసాగర్
3) నిజాంసాగర్ 4) శ్రీశైలం
2. కిందివాటిలో పడమటి కనుమల్లో పుట్టని నది? (3)
1) కృష్ణ 2) గోదావరి
3) మహానది 4) కావేరి
3. దక్కన్ పీఠభూమిలో ఉన్న నగరం? (4)
1) పుణె 2) పాట్నా
3) భోపాల్ 4) సికింద్రాబాద్
4. మన రాష్ర్టానికి ఎగువన తెలంగాణ పీఠభూమి
ఏ దిక్కున ఉంది? (2)
1) తూర్పు 2) పశ్చిమం 3) దక్షిణం 4) ఉత్తరం
5. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తయిన వాలుతో కూడిన ప్రాంతం? (3)
1) సాత్పురా పర్వతాలు 2) వింధ్య పర్వతాలు
3) పశ్చిమకనుమలు 4) తూర్పు కనుమలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు