రాజ్యాంగం – విమర్శ
రాజ్యాంగ సవరణ పద్ధతి – ప్రకరణ 368
– 68 ఏండ్ల గణతంత్ర దేశంలో నేటివరకు 101 రాజ్యాంగ సవరణలు జరిగాయి.
– ప్రకరణ 368 రాజ్యాంగ సవరణకు వీలుకల్పిస్తుంది. దీని ఆధారంగా పార్లమెంటు ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసి ప్రాథమిక హక్కులను పరిమితం చేసింది.
– రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రమాదం లేకపోలేదని రాజ్యాంగ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది రాజ్యాంగానికి నూతన సవాల్‌గా మారింది.
– రాజ్యాంగ మౌలిక భావనలకు వ్యతిరేకంగా నిరంకుశ అధికారం కోసం దేశంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.
– 99వ రాజ్యాగం సవరణ చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది.
శాసన వ్యవస్థ క్షీణత
– చట్టసభల్లో భావి నేతల రాజకీయ ప్రవర్తనను నిర్దేశించకపోవడమనేది రాజ్యాంగ రచయితలు విస్మరించిన మరో అంశం.
– స్వాతంత్య్రం లభించినప్పుడు దేశంలో ప్రజాకర్షక నాయకత్వం ఉండేది, ప్రజాదరణ కలిగిన పార్టీ ఉండేది, సురక్షిత పరిపాలనాధికారుల బృందం ఉండేది.
– ఇప్పుడు ఇవి లోపించాయని విమర్శకుల అభిప్రాయం.
– గత పాతికేండ్లుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ పట్టుతప్పాయి. స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల వరకు పార్లమెంటుతోపాటు రాష్ర్టాల శాసనసభలు ఏటా సగటు 120 నుంచి 140 రోజుల వరకు సమావేశం అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గడిచిన కొన్నేళ్లుగా పార్లమెంటు ఉభయసభలు ఏడాదికి సగటున 70 రోజులు, రాష్ర్టాల శాసనసభలు 25 నుంచి 30 రోజుల వరకే సమావేశమవుతున్నాయి.
– పార్లమెంటులో ఒక నిమిషం కార్యక్రమాలు నిర్వహించేందుకు సుమారు రూ. 29,000 ఖర్చవుతున్నాయి.
– ఒకప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము నిజమైన ప్రజా సేవకులుగా భావించేవారు. ఇప్పుడు ప్రజలు భావించడం లేదు.
– 5వ దశకంలో ఎంపీల జీతాల బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు అనేకమంది సభ్యులు దాన్ని వ్యతిరేకించేవారు. ఒకవేళ సభలో బిల్లు నెగ్గినప్పటికీ తమ పెరిగిన జీతాలను స్వీకరించబోమని వారు విస్పష్టంగా తేల్చిచెప్పారు.
– సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ. 3 కోట్లుగా వెల్లడైంది.
– రెండు మూడు కోట్ల రూపాయల ఆస్తిపరులుగా చట్ట సభల్లో ప్రవేశించిన కొందరు కొన్నేళ్ల వ్యవధిలోనే వందలకోట్ల శ్రీమంతులుగా మారిపోవడం సాధారణమైపోయింది.
– స్వాతంత్య్రానంతరం తొలి దశాబ్దాల్లో జాతీయ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న నాయకులు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించేవారు.
– 30 శాతం అభ్యర్థులు నేర చరితులు. వారిలో 12 శాతం మందిపై హత్య, అత్యాచార యత్నం వంటి తీవ్ర నేరాలకుగాను నమోదైన కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి.
– స్వాతంత్య్రానంతరం తొలినాళ్లలో పార్లమెంటును ముద్గల్ కేసు కుదిపేసింది. పార్లమెంటు సభ్యుడు ముద్గల్ బాంబే స్వర్ణ వర్తకుల అంశాన్ని సభలో ప్రస్తావించేందుకు ఆ సంఘం నుంచి రూ. 2700లు తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. 11 మంది ఎంపీలు డబ్బు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి సంబంధించిన వ్యవహారం ఓ మీడియా బయటపెట్టింది.
– ప్రతినిధులపై ప్రజలకు క్రమంగా విశ్వాసం కొడిగడుతోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే తప్పుచేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవడమే మార్గమని లోక్‌సభ కమిటీ వ్యాఖ్యానించింది.
పాలనలో అవినీతి
– 68 ఏండ్ల గణతంత్ర దేశంలో పాలనలో అవినీతి సమాజానికి, రాజ్యాంగానికి సవాల్‌గా మారింది.
– పాలనలో అవినీతి సమాజానికి, రాజ్యాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. దేశంలో ఇప్పటివరకు ఎన్నో అవినీతి కుంభకోణాలు వెలుగుచూశాయి.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
– పార్టీ ఫిరాయింపుల విచారణ పేరుతో కాలయాపన చేసి సభ కాలపరిమితి ముగియడానికి కొన్ని నెలలు లేదా రోజుల ముందు ప్రజాప్రతినిధులను అనర్హునిగా ప్రకటిస్తున్నారు.
– స్పీకర్ అధికారాలపై న్యాయస్థానాలకు విచారణ పరిధి లేకపోవడంతో స్పీకర్ నిర్ణయాల స్వభావం, కాలయాపన తదితర అంశాలపై రాజకీయ ప్రయోజనాల ప్రభావం ఎక్కువై రాజ్యాంగ సమస్యగా మారింది.
– స్పీకర్ వద్ద ఉన్న అంశాలు న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు లేదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది. దానిని కాపాడేందుకు స్పీకర్ తనకు అందిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తారని విశ్వసిస్తున్నాం- హైకోర్టు
– పిటిషనర్స్ ఈ ఫిర్యాదును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు రెండు నెలల వరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో లేదో వేచిచూద్దాం అని వ్యాఖ్యానించింది.
– పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఈ చట్టం కాలపరమితి విధించలేదు.
– పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలు రాజ్యాంగ సవాల్‌గా మారాయి.
ఎన్నికల వ్యవస్థ-ప్రజాస్వామ్యం
– సాంప్రదాయిక సమాజాన్ని బద్దలు కొట్టేందుకు రాజ్యాంగ రచయితలు వయోజన ఓటు హక్కును కల్పించారు.
– వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఏర్పడే ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలను చైతన్యపరుస్తుందని, సామాన్య మానవుడి క్షేమాన్ని, జీవన ప్రమాణాన్ని, సౌకర్యాలను, స్థితిగతులను మెరుగుపరుస్తుందని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ పేర్కొన్నారు.
– ఒక చెడు ప్రభుత్వాన్ని చక్కదిద్దే బాధ్యత అక్కడి ఓటర్లకే ఉండేలా, తమ బాధ్యతను వారు గుర్తెరిగేలా చేయాలని కుంజ్రు పేర్కొన్నారు.
– ప్రజాస్వామ్యం మితిమీరడమే దేశం కొంప ముంచుతోందంటున్న విమర్శకులకు ప్రసిద్ధ చరిత్రకారుడు రామచంద్ర గుహ జవాబిస్తూ.. ఉండాల్సినంత ప్రజాస్వామ్యం, ఉండాల్సిన విధంగా లేకపోవడంవల్లే దేశానికి ఇన్ని సమస్యలని అన్నారు.
– రాజకీయ వ్యవస్థ రోజురోజుకూ దారితప్పుతుండటం ఆందోళన కలిగిస్తోందని, పరస్పరం విమర్శలు రువ్వుకోవడమే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్న తీరు నిర్వేదం మిగులుస్తోంది. స్వార్థమే పరమార్థంగా పార్టీలు ప్రదర్శిస్తున్న విన్యాసాలు ప్రజాస్వామ్య వ్యవస్థ నవనాడులను కుంగదీస్తున్నాయి.
– ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు యజమానుల్లా కాకుండా దర్మకర్తల్లా వ్యవహరించాలని గాంధీజీ సూచించారు. వారి వేతనాలు సామాన్య మానవుడి సగటు ఆదాయం కంటే మరీ ఎక్కువగా ఉండకూడదన్నారు. పురపాలక సంఘాలకు ఎన్నికైనవారు మొదలుకొని పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల వరకు ఎవ్వరూ ఆయన సలహాను పట్టించుకోవడం లేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు