హెర్క్యులస్ మహా బలవంతుడు
ఇటలీ రాజకీయవేత్త Nicolo Machiavelli (1469-1527) అధికారం (power), విజయం (success) కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కవచ్చని తన గ్రంథం Princeలో ప్రతిపాదించాడు. అందుకే Machiavellian Policy అంటే cunning (జిత్తులమారి), unscrupulous (without moral values-నైతిక విలువలేని) పద్ధతి అని నిందార్థం.
-Prince should delegate to others the enhancement of unpopular measures. Machiavelli రాజనీతికి ఒక మచ్చుతునక ఈ quotation. ప్రజలకు ఆమోదయోగ్యం కాని చట్టాలను రాజు ఇతరులతో చేయించాలి.
Hobsons Choice
-17వ శతాబద్దంలో Thomas Hobsonకు ఒక గుర్రపుశాల (stable) ఉండేది. అతడు తన గుర్రాలను ఒకదాని తర్వాత ఒకటి వంతుల వారీగా ఒక క్రమపద్ధతిలో అద్దె (hire)కు ఇచ్చేవాడు. ఎవరైనా customerకు తన వంతుకు వచ్చిన గుర్రం ఒకవేళ నచ్చకపోయినా ఎలాగోలా సర్దుకుపోవాలి, లేదంటే ఆ రోజు స్వారీని వదులుకోవాలి. అంతే తప్ప హబ్సన్ మాత్రం ఆ గుర్రం బదులు మరో గుర్రం అద్దెకు ఇచ్చే ప్రసక్తే లేదు.
-కాబట్టి Hobsons choice అంటే ఇచ్చింది పుచ్చుకోవాలే తప్ప, ఇంకే choice (ఎంపిక) ఉండదు. వద్దనుకుంటే ఆ మాత్రం కూడా దొరకదని అర్థం. (a situation in which some body has no choice because if they do not accept what is offered, they will get nothing).
Herculean (హెర్యూలియన్)
-గ్రీకు పురాణాల ప్రకారం Hercules మహా బలవంతుడు. అతడు 12 అతి కష్టమైన పనులను (labours of Hercules) పూర్తి చేశాడు. అందుకే అత్యంత కఠినమైన పనులను Herculean Tasks అంటారు. (requiring tremendous effort strength etc.)
Achilles Heel
-ఎకిలెస్ (Achilles) ఒక గ్రీకు హీరో. అతని శరీరాన్ని అన్నిరకాల గాయాల నుంచి కాపాడటానికి, వాళ్ల అమ్మ, అతను పిల్లవాడిగా ఉన్నప్పుడు Styx నదిలో ముంచి పైకి తీస్తుంది. అతని పాదాలను పట్టుకుని నీళ్లలో ముంచడం వల్ల పాదాలు మాంత్రం తడవలేదు. చివరకు Achilles పాదానికి తగిలిన బాణం దెబ్బవల్ల మరణిస్తాడు.
-ఎంత గొప్ప మనిషికైనా ఏదో ఒక బలహీనత (weakness) ఉంటుంది. ఎదుటివాడు ఆ బలహీనతను వాడుకుని దెబ్బతీస్తారు. అటువంటి బలహీనతనే Achilles heel అంటారు (a weak point of fault is some bodys character which can be attacked by other people).
-మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా పాదానికి బాణం తగిలి మరణిస్తాడు. దుర్యోధనున్ని ఉరుభంగం కూడా Achilles heel వంటిదే.
Pandora Box
-గ్రీకు పురాణాల (Mythology) ప్రకారం Pandora మొదటి మానవ స్త్రీ. Zeus దేవత ఆమెను సృష్టించింది. దేవతలు వారి కానుక (gifts)లన్నీ Pandoraకు అందిస్తారు (pan all, dora gifts). Milton మహాకవి Paradise Lost ఇలా అంటాడు..
Pandora, whom the gods
Endowed with all their gifts
-Zeus దేవతకు మానవులపై కోపం వచ్చి Pandoraను భూమిపైకి వారికి శాపంగా పంపింది. పండోరా చేతిలో ఒక పెట్టె(box)ను పెట్టి ఎట్టిపరిస్థితుల్లో తెరవొద్దని హెచ్చరిస్తుంది. ఉత్సుకత (Curiosity)ను ఆపుకోలేక పండోరా ఆ పెట్టె (box)ను తెరచింది. అందులోని దుష్టశక్తులు (evils) భూమిపై ప్రవేశించడంతో మానవజాతికి కష్టాలు మొదలయ్యాయి.
-ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఒకదాని వెనుక మరొకటి పరిష్కారం (solution) లేని సమస్యలు (problems) తలెత్తితే, ఆ పని మొదలుపెట్టడాన్ని Opening Pandora Box అంటారు. దీనికి కాస్త దగ్గరలో ఉండే తెలుగు పదబంధం తేనె తుట్టె కదల్చడం.
Frankenstein (ఫ్రాంకెన్‌స్టీన్)
-శంకరుడు భక్తవశంకరుడు. భస్మాసురుడు అనే రాక్షసునికి, అతను ఎవరి నెత్తిమీద చేయి (హస్తం) పెడితే వారు భస్మమై పోయేటట్లు వరం అనుగ్రహిస్తాడు. చివరికి భస్మాసురుడు వరం ఇచ్చిన శివుని నెత్తిపై చేయి పెట్టాలని చూస్తాడు. మోహినీ రూపంలో విష్ణుమూర్తి వచ్చి శివున్ని కాపాడుతాడు. అనుగ్రహించిన వారినే అంతమొందించాలని చూసేది భస్మాసుర హస్తం.
-Mary Shelley నవలలో Frankenstein అనే పాత్ర (character) ఒక శాస్త్రవేత్త (Scientist). శ్మశానం నుంచి శవాల శరీర భాగాలను తీసుకువచ్చి జీవం పోసి ఒక భూతాన్ని (Monster) సృష్టిస్తాడు. చివరికి ఆ భూతం తన సృష్టికర్త (creator) అయిన Frankensteinను చంపేస్తుంది.
-Frankenstein అనే పదం పాత్ర (character)కు కాకుండా భూతాని (Monster)కి అన్వయించబడింది. Frankenstein అంటే భస్మాసుర హస్తం అనుకోవచ్చు. A creation or invention that goes out of control and becomes dangerous, often destroying the person who created. సృష్టించిన వారి చేయి దాటిపోయి ప్రమాదకరంగా మారి, తరచూ సృష్టించినవారినే నాశనం చేసే ఆవిష్కరణలను Frankenstein అంటారు. రజనీకాంత్ రోబో లాగ అన్నమాట.
Laconic (లాకొనిక్)
-కొందరు మాట్లాడితే ముత్యాలు రాలుతాయా! అనే విధంగా చాలా పొదుపుగా మాట్లాడుతారు. మనం పది మాటలు మాట్లాడితే ఒక్క మాటతో జవాబు ఇస్తారు.
-Greeceలో Laconia ప్రాంత వాసులు అటువంటివారే. వారిది Sparta నగరం. ఒకసారి Macedon రాజైన Philip-II తన రాయబారి (herald)తో Sparta వాసులకు యుద్ధ సందేశం పంపిస్తాడు.. If we come to your city, we will raze it to the ground and you will never rise again. (ఒక వేళ మేం మీ నగరానికి వస్తే తిరిగి కోలుకోలేని విధంగా విధ్వంసం చేసి నేలమట్టం చేస్తాం).
-దానికి Laconians ఇచ్చిన సమాధానం… If (వస్తే కదా!). Laconic అంటే using only few words to say some thing. Succinct (టూకీగా), concise (సంక్షిప్తం), Brief, short (క్లుప్తంగా) అని అర్థం.
-Laconic expression is in- అలతి పదాలతో చెప్పడం.
Laconic man- person of few words.
-Malapropism (మలాప్రొపిజం) (French mal a propos inappropriate-అసంబద్ధమైన)
-ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్లాం సినిమాలో తెలుగు సరిగారాని ఉషా సన్యాల్ అనే మున్సిపల్ కమిషనర్ పాత్రలో వై విజయ నటించింది. ఆ పాత్ర మాట్లాడే అసంబద్ధమైన మాటలు ప్రేక్షకులకు (viewers) నవ్వు పుట్టిస్తాయి. ఈ కుక్కను ఉంచుకున్నాను (పెంచుకున్నాను అని ఆమె భావం), మిమ్మల్ని చూస్తే నాకు గర్భం వస్తుంది (గర్వంగా ఉంది అని ఆమె భావం) అంటూ ఒక పదానికి బదులు, అలాగే ధ్వనించే అనుచితమైన (inappropriate) వేరే పదాన్ని వాడి వినోదాన్ని పంచుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు