నాన్ మ్యాథ్స్‌లో గరిష్ఠ మార్కులు సాధించడం ఎట్లా?
ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో తొలి అంకం టెట్ అర్హత సాధించడం. ఈ పరీక్షలో అర్హతే కాకుండా దీనిలో వచ్చిన మార్కులకు డీఎస్సీ/టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. టెట్‌లో వచ్చిన ప్రతి మార్కు ఉద్యోగ ఎంపికలో చాలా కీలకం. ఈ పరీక్షలో కేవలం అర్హత సాధించడమే కాకుండా అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేయాలి. ఎక్కువమంది విద్యార్థులు మ్యాథ్స్ విషయంలో ఆందోళన పడుతుంటారు. నిజానికి మ్యాథ్స్ సిలబస్‌లో ఉన్న ప్రతి అంశం చదివినదే అనే విషయాన్ని మరిచిపోతున్నారు. పాఠశాల సమయంలో చదివిన సబ్జెక్టే. అంతేకాదు వయస్సు రీత్యా అభ్యర్థులకు వచ్చే మెచ్యూరిటీతో ఆలోచిస్తే చాలా వరకు గణిత సమస్యలను సులభంగా చేయవచ్చు. వాటి కోసం కొంచెం శ్రమిస్తే చాలు. 30 మార్కుల మ్యాథ్స్‌లో కష్టపడితే సులభంగా 20 మార్కులకు పైగా సాధించవచ్చు. టెట్ సిలబస్ ఆధారంగా ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం..
- టెట్ పరీక్షల్లో మ్యాథ్స్ సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు, 30 మార్కులు. దీనిలో కంటెంట్‌కు 24 మార్కులు, పెడగాగీకి 6 మార్కులు ఉంటాయి. పేపర్-1లో 24 మార్కుల ప్రశ్నలు కింది అంశాల నుంచి ఇస్తారు. అవి..
1. సంఖ్యా వ్యవస్థ
2. భిన్నాలు
3. అంకగణితం
4. రేఖాగణితం
5. కొలతలు (క్షేత్ర గణితం)
6. దత్తాంశ విశ్లేషణ
7. బీజ గణితం - పైన పేర్కొన్న ప్రతి అధ్యాయం నుంచి సుమారుగా 4 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కష్టంగా భావించే ఈ మ్యాథ్స్ సబ్జెక్టుపై కొద్దిపాటి ప్రత్యేక శ్రద్ధతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
- ప్రిపేరయ్యే ప్రతి విద్యార్థి దగ్గర సిలబస్ పేపర్, ప్రీవియస్ బిట్స్ కచ్చితంగా ఉండాలి. గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో పరిశీలించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
- టెట్‌కు సంబంధించిన ప్రశ్నలన్నీ 3 నుంచి 8వ తరగతి వరకు గల పాఠ్య పుస్తకాల నుంచే అడుగుతారు. కాబట్టి ఆ పాఠ్యపుస్తకాలను సేకరించుకుని చదవాలి. పదోతరగతి వరకు చదివితే ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంది.
టెట్ పేపర్-2
- ఈ పేపర్లో మ్యాథ్స్‌కు 24 మార్కులు. పెడగాగీకి 6 మార్కులు.
- పేపర్-2లో నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, సెట్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురెషన్ (క్షేత్రమితి), త్రికోణమితి.
- పెడగాగీ సిలబస్ పరిశీలిస్తే 11 టాపిక్స్ ఉన్నా యి. ఇవన్నీ మిగిలిన పెడగాగీకి దగ్గరగా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
- టెట్ పేపర్-1, పేపర్-2లో దాదాపు 1, 2 అంశాలు తప్ప మిగతావన్నీ ఒకేవిధంగా ఉన్నాయి. కానీ పేపర్-2 వాళ్లకు ప్రశ్నలు పదవ తరగతి స్థాయిలో, కొన్ని అంశాలు ఇంటర్ స్థాయిలో ఉంటాయి.
- పైన పేర్కొన్న ఒక్కో పాఠ్యాంశానికి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించే ముందు ఆయా పాఠ్యాంశాల ప్రాథమిక భావనలపై పూర్తి పట్టు సాధించాలి. అంటే 1 నుంచి 20 వరకు ఎక్కాలు, 1 నుంచి 30 వరకు సంఖ్యల వర్గాలు, 1 నుంచి 30 వరకు సంఖ్యల ఘనాలు కంఠస్తం చేయాలి.
- వర్గాలు, వర్గ మూలాలు, ఘనాలు, ఘన మూలాలకు సంబంధించిన కాన్సెప్ట్లన్నీ అన్ని చాప్టర్లలో ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన కిటుకులు, ప్రాసెస్‌పై పట్టు సాధించాలి.
- క్షేత్రగణితం లాంటి అంశాల్లో కొన్ని సందర్భాల్లో ఫార్ములాలు తప్పనిసరి కాబట్టి వాటిని ఒక చాప్టర్ రూపంలో రాసి గుర్తుపెట్టుకోవాలి.
- నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మొదటగా వారికి సులువుగా అనిపించిన టాపిక్స్‌ను ప్రాక్టీస్ చేయడం వల్ల లెక్కలంటే భయం పోయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
- ప్రతి లెక్కను బట్టీ పద్ధతిలో కాకుండా కాన్సెప్ట్‌తో ప్రాక్టీస్ చేయాలి.
- 3 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలను సేకరించుకుని బేసిక్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
- ఉదా: సంఖ్యలు అనే అంశాన్ని తీసుకుంటే.. 3 నుంచి 8వ తరగతి వరకు సంఖ్యలు అనే టాపిక్కు సంబంధించిన అన్ని కాన్సెప్ట్‌లను నోట్స్ రూపంలో రాసుకోవాలి. అదేవిధంగా గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి.
- ప్రీవియస్ పేపర్స్‌ను ఒక్కసారి పరిశీలించి ఏ రకమైన ప్రశ్నలు ఇస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
- మ్యాథ్స్ కష్టపడితే ఫుల్ మార్కులు సాధించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.
- నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ప్రతిరోజూ మూ డు నుంచి నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మ్యాథ్స్ ఫోబియా పోవడమే కాకుండా మంచి మార్కులు సాధించవచ్చు.
- పరీక్షకు రెండు నెలల వ్యవధి ఉన్నది. దీనికి అనుగుణంగా నెలన్నరలో సిలబస్ చదవడం పూర్తిచేసి మిగిలిన సమయం అంతా ప్రాక్టీస్ చేయాలి.
- ఎలాంటి నెగెటివ్ ఒపీనియన్ లేకుండా ప్రిపేరవండి. అవసరం అనుకున్న వారు దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్ లేదా మ్యాథ్స్ వచ్చిన వారి దగ్గర ఆయా అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలను చెప్పించుకోవాలి. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా సులభంగా అర్థమవుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు