Singh-Jung conversations | సింగ్-జంగ్ సంభాషణలు అంటే…?
1. ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరఫున పోటీచేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి దళితుడు?
1) బీఎస్ వెంకట్రావు 2) అరిగె రామస్వామి
3) వీ శ్యాంసుందర్ 4) ఎంఎల్ యాదన్న
2. రాజ్యాంగ సంస్కరణలు చేపట్టాలని, మాతృభాషలో విద్యా బోధన కోసం అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగిన హైదరాబాద్ రాజకీయ సభలు, వాటి అధ్యక్షులను జతపర్చండి.
ఎ. కాకినాడ -1923 1) ఎస్సీ కాలేల్కర్
బి. బొంబాయి – 1926 2) రామచంద్రనాయక్
సి. పుణా – 1928 3) మాధవరావు అనై
డి. అకోలా -1921 4) వైఎం కాలే
1) ఎ3, బి4, సి1, డి2 2) ఎ2, బి1, సి4, డి3
3) ఎ4, బి3, సి1, డి2 4) ఎ3, బి2, సి1, డి4
3. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం తొలగించిన సంవత్సరం?
1) 1947, మే 2) 1946, జూలై
3) 1940, సెప్టెంబర్ 4) 1938, అక్టోబర్
4. సింగ్-జంగ్ సంభాషణలు అంటే…
1) మందుముల రామచంద్రరావు, బహదూర్ యార్జంగ్ మధ్య జరిగిన విభేద సంభాషణలు
2) బహదూర్ యార్జంగ్, గోవిండ్సింగ్ మధ్య జరిగిన ఐక్యతా సంభాషణలు
3) గోవింద్‌సింగ్, నజీర్ యార్జంగ్ మధ్య జరిగిన విభేద సంభాషణలు
4) మందుముల నర్సింగరావు, బహదూర్ యార్జంగ్ మధ్య జరిగిన ఐక్యతా సంభాషణలు
5. తెలంగాణ రైతాంగ పోరాటం ఎవరి నాయకత్వంలో ప్రారంభమైంది?
1) స్వామి రామానందతీర్థ 2) కుమ్రం భీం
3) మగ్దూమ్ మొయినుద్దీన్ 4) రావి నారాయణరెడ్డి
6. నిజాం రాజ్యంలోని ప్రజలు అనుభవించిన బాధలను వివరిస్తూ రాసిన కాశీయాత్ర గ్రంథ రచయిత ఎవరు?
1) చిలుకూరి వీరభద్రరావు
2) ఏనుగుల వీరాస్వామి
3) స్వామి రామానందతీర్థ 4) పోకూరి కాశీపతి
7. హైదరాబాద్ సంస్థానంలో మొదటిసారిగా సత్యాగ్రహం ఎవరు చేశారు?
1) కాశీనాథరావు వైద్య 2) గోవిందరావు నానల్
3) స్వామి రామానందతీర్థ 4) రావి నారాయణరెడ్డి
8. తెలంగాణలో వామపక్ష ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) 1937 2) 1938 3) 1921 4 )1930
9. నాటకాలు, బుర్రకథలు, భజనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించిన తెలంగాణలో మొదటి దళిత సంస్థ?
1) ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్
2) సునీత బాల సమాజం
3) జగన్ మిత్రమండలి 4) ఆది ద్రవిడ సంఘం
10. యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించిన వారు?
1) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
2) కొమర్రాజు లక్ష్మణరావు
3) రాజా మురళీమోహన్ 4) పైవారందరూ
11. దళిత భీష్ముడు అని ఎవరిని పిలుస్తారు?
1) భాగ్యరెడ్డివర్మ 2) బీఎస్ వెంకట్రావు
3) అరిగె రామస్వామి 4) ఎంఎల్ ఆదయ్య
12. హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం – నా అనుభవాలు, జ్ఞాపకాలు అనే పేరుతో స్వీయచరిత్రను రచించిన వారు?
1) రావి నారాయణరెడ్డి
2) దేవులపల్లి వెంకటేశ్వరరావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) స్వామి రామానందతీర్థ
13. ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను బహిష్కరించగా, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం ఆ విద్యార్థులను చేర్చుకున్నది. అయితే, అప్పటి నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఎవరు?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) కేదార్ పాత్రి
3) కట్టమంచి రామలింగారెడ్డి
4) నవాబ్ మెహిదీ యార్ జంగ్ బహదూర్
14. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఎవరు?
1) అక్విల్ అలీఖాన్ 2) షిబే హసన్
3) ఓంకార్ ప్రసాద్ 4) రఫీ అహ్మద్
15. రజాకర్ల దళం స్థాయి- వాటి అధికారాలను జతపర్చండి.
ఎ. కేంద్రస్థాయి దళాధిపతి 1. సాలార్ -ఈ-ఖబర్
బి. జిల్లాస్థాయి దళాధిపతి 2. సాలార్
సి. తాలూకాస్థాయి దళాధిపతి 3. అఫ్సర్- ఈ – అలాగ్
డి. దిగువస్థాయి దళాధిపతి 4. సాలార్ – ఈ – సాంఘిర్
1) ఎ3, బి4, సి1, డి2 2) ఎ4, బి3, సి2, డి1
3) ఎ2, బి1, సి4, డి3 4) ఎ3, బి1, సి4, డి2
16. కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తివేయాలని నిజాంకు సూచించిన అప్పటి రాజకీయల సలహాదారుడు?
1) ఛటారి నవాబ్ 2) మీర్ లాయక అలీ
3) ఖాసీం రజ్వీ 4) అక్బర్ హైదరీ
17. రాజాకార్లకు సైనిక శిక్షణ ఎవరు ఇచ్చారు?
1) ఖాసీం రజ్వీ
2) దీన్ యార్జంగ్
3) నవాబ్ బహదూర్ యార్జంగ్
4) నవాబ్ సదర్ యార్జంగ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?