Educational perspectives | విద్యా దృక్పథాలు
భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతున్న కొఠారి కమిషన్ ప్రకారం భావిభారతపౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించే విభాగం విద్యా దృక్పథాలు. గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే అన్ని పాఠ్యాంశాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించినట్లు అర్థమవుతుంది. విద్యాదృక్పథాలకు 10 మార్కులు 20 ప్రశ్నలు.
విద్యా దృక్పథాలు – 5 పాఠ్యాంశాలు
-భారతదేశ విద్యాచరిత్ర, లక్ష్యాలు, కమిటీలు
-ఉపాధ్యాయ సాధికారత – వృత్తిపరమైన అభివృద్ధి
-భారతదేశంలో సమకాలీన విద్యాదృక్పథాలు
-బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009, బాలల, మానవ హక్కులు
-జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005
గత డీఎస్సీ-2012 ప్రశ్నలను పాఠ్యాంశాల క్రమంలో పరిశీలిస్తే భారతదేశ విద్యాచరిత్ర, లక్ష్యాలు, కమిటీలు
1. జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి 1964లో భారత ప్రభుత్వం నియమిమించిన విద్యా కమిషన్ అధ్యక్షులు (డీఎస్సీఎస్ఏ- 2012)
1) జాకీర్ హుస్సేన్ 2) కొఠారి డీఎస్
3) బుచ్ ఎంబీ 4) మౌలానా అబుల్ కలామ్
2. పాఠశాల విద్యా ప్రణాళికలో ఎస్‌యూపీడబ్ల్యూ కింది వారి ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడింది(డీఎస్సీ ఎస్జీటీ -2012)
1) ఈశ్వరీబాయి పటేల్ 2) సెకండరీ కమిషన్
3) కొఠారి కమిషన్ 4) యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్
3. బ్రిటిష్ కాలంలో భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్థాపించాలని ప్రతిపాదించింది?
1) హంటర్ కమిషన్ -1882 2) ఉడ్స్ డిస్పాచ్-1854 3) లార్డ్ రిప్పన్ 4) విలియం బెంటింక్ -1835
సమాధానాలు : 1-2, 2-1, 3-2
పై ప్రశ్నలను పరిశీలిస్తే విద్యా కమిషన్స్ ఏర్పడిన సంవత్సరాలు, వాటి అధ్యక్షులను గుర్తుంచుకుంటే సులభంగా సమాధానాలు రాయవచ్చు. కాబట్టి జ్ఞాపకశక్తితో ముడిపడిన అంశాలపై శ్రద్ధ వహిస్తే విజయం మీ సొంతవుతుంది.
కమిటీ/ కమిషన్ పేరు/కాలం /అధ్యక్షులు
-లార్డ్ మెకాలే ప్రతిపాదనలు- 1835 -లార్డ్ మెకాలే
-ఉడ్స్ డిస్పాచ్ -1854-చార్లెస్ ఉడ్
-హంటర్ కమిషన్ -1882 -సర్ విలియం హంటర్ (భారతీయ విద్యా కమిషన్)
-విశ్వవిద్యాలయ కమిషన్ -1902 -(స్వాతంత్య్రానికి పూర్వం) లార్డ్ కర్జన్
-విశ్వవిద్యాలయ కమిషన్ -1904 –
-శాండ్లర్ కమిషన్ -1917 -సర్ మైఖేల్ శాండ్లర్ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్
-హార్టాగ్ కమిటీ -1919 -సర్ ఫిలిప్ హార్టాగ్
-బేసిక్ విద్య -1937 -మహాత్మా గాంధీ
-ఎబట్ -ఉడ్ నివేదిక -1937 -ఎబట్- ఉడ్
-సార్టంట్ నివేదిక -1944 -సర్ జాన్ సార్జంట్
-విశ్వవిద్యాలయ కమిషన్ -1948 -సర్వేపల్లి రాధాకష్ణన్ (రాధాకృష్ణ కమిషన్)
-మాధ్యమిక కమిషన్ -1952-53 -లక్ష్మణస్వామి మొదలియార్
-కొఠారి కమిషన్ -1964-66 -దౌలత్సింగ్ కొఠారి (భారతీయ విద్యా కమిషన్)
-మొదటి జాతీయ విద్యావిధానం -1968 –
-ఈశ్వరీబాయి పటేల్ కమిటీ -1977 -ఈశ్వరీబాయి పటేల్
-మాల్కం ఆదిశేషయ్య కమిటీ -1978 -మాల్క ఆదిశేషయ్య
-నూతన జాతీయ విద్యావిధానం -1986 –
-ఆచార్య రామమూర్తి కమిటీ -1990 -ఆచార్య రామమూర్తి
-ఎన్ జానర్దన్‌రెడ్డి కమిటీ -1991-92 -ఎన్ జనార్దన్‌రెడ్డి
-కార్యాచరణ పథకం -1992 — (పీవోఏ-1992)
-పోయగోపాల్ కమిటీ -1992-93 -డాక్టర్ యశ్పాల్
-గోఖలే ప్రతిపాదనలు -1911 -గోపాలకష్ణగోఖలే
-పై పట్టికను గుర్తుంచుకోవడం వల్ల సులభంగా మార్కులు పొందవచ్చు.
4.ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపుదిద్దుకుంటుందో, మానసిక బలం పెరుగుతుందో, బుద్ధి కుశలత విస్తరిస్తుందో, తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారో అలాంటి విద్య మనకు కావాలని ప్రబోధించిన వారు? (డీఎస్సీ టీపీ-2012)
1) మహాత్మాగాంధీ 2) అరవిందుడు
3) రవీంద్రనాథ్ ఠాగూర్ 4) స్వామి వివేకానంద
5. మన విద్యారంగంలో సెకండరీ విద్య చాలా బలహీనంగా ఉన్నది. దానిని వెంటనే సంస్కరించాలని తెలిపిన వారు? (డీఎస్సీ ఎస్ఏ-2012)
1) రాధాకృష్ణ కమిషన్ 2) మొదలియార్ కమిషన్
3) తారాచంద్ కమిషన్ 4) కొఠారి కమిషన్
సమాధానాలు : 4-4, 5-2
-పై ప్రశ్నలను పరిశీలిస్తే విద్యా నిర్వచనాలు- ప్రవచనాలను అవగాహన చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు.
6. విహారాలు దేనికి చెందిన విద్యాసంస్థలు?
1) జైనమతం 2) వేద అభ్యసనం
3) హిందూ మతం 4) బౌద్ధ అభ్యసనం
7. మధ్యయుగం నాటి మక్తాబులు అనే విద్యాసంస్థలు దేనికి సంబంధించినవి?
1) ముస్లిం పిల్లలకు ప్రాథమిక విద్య
2) అందరికోసం ప్రాథమిక విద్య
3) ఉన్నత స్థాయిలో మత విద్య
4) వృత్తికి సంబంధించిన విద్య
సమాధానాలు : 6-4, 7-1
-డీఎస్సీ అభ్యర్థులు ప్రాచీన కాలం నాటి విద్యాసంస్థల పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరమున్నదని తెలుస్తున్నది.
ఉపాధ్యాయ సాధికారత – వృత్తిపరమైన అభివృద్ది
-రెండో పాఠ్యాంశం నుంచి వచ్చిన ప్రశ్నలను పరిశీలించండి.
1. సూక్ష్మస్థాయి ప్రణాళిక అనేది ఏ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం ( డీఎస్సీ ఎస్ఏ-2012)
1) ఓబీబీ 2) ఏపీపీఈపీ
3) డీపీఈపీ 4) ఎన్పీఈజీఈఎల్
2. కింది వాటిలో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యాసంస్థ కానిది? (డీఎస్సీ ఎస్ఏ-2012)
1) సీటీఈ 2) డీఐఈటీ 3) ఎన్సీఈఆర్టీ 4) ఐఏఎస్ఈ
3. కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధి కానిది? డీఎస్సీ ( తెలుగు పండిట్ -2012)
1) సమ్మిళిత విద్యకు సంబంధించిన కార్యశాలకు హాజరుకావడం
2) సెమినార్లకు హాజరుకావటం, పత్రాలు సమర్పించడం
3) పదోన్నతి ద్వారా ఉన్నతస్థాయికి ఎదుగడం
4) డీఐఈటీ, ఎన్సీఈఆర్టీ వారి వృత్యంతర కార్యక్రమాలకు హాజరు కావడం
4. పాఠశాల లాగ్ బుక్‌ను ఏ అంశాలను నమోద చేయడానికి నిర్వహించాలి? డీఎస్సీ (ఎస్జీటీ-2012)
1) కాలక్రమానుగతిలో సంఘటనల నమోదు
2) విద్యార్థుల వ్యక్తి అధ్యయనాలు
3) ఆదాయం, వ్యయం
4) తనిఖీ, పర్యవేక్షణ నివేదికలు
5. ఉపాధ్యాయ వృత్తిపరత్వం అంటే? డీఎస్సీ (ఎస్జీటీ -2012)
1) అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయడం
2) వేతనాలు పొందడానికి బోధించడం
3) ఉపాధ్యాయ నియామకానికి పూర్వం వృత్తిపర కోర్సు చేయడం
4) వృత్తిపరత్వ నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకోవడం
6. పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే ప్రధాన సంస్థ ? డీఎస్సీ (ఎస్ఏ-2012)
1) రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ
2) పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం
3) వయోజన విద్యా సంచాలకుల కార్యాలయం
4) రాష్ట్ర విద్య సాంకేతిక విజ్ఞాన సంస్థ
7. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం-2005ను రూపొందించినది?
1) ఎన్సీఈఆర్టీ 2) ఎన్సీటీఈ
3) సీఏబీఈ 4) సీబీఎస్ఈ
సమాధానాలు: 1-3, 2-3, 3-3, 4-4, 5-4, 6-1, 7-1
-పై ప్రశ్నలను పరిశీలిస్తే ఉపాధ్యాయ వృత్తిపరమైన అంశాలు, వృత్తి నైపుణ్యాలు పెంపొందించే సంస్థలపై పట్టు సాధిస్తే సమాధానాలివ్వడం సులభమవుతుంది.
భారతదేశంలో సమకాలీన విద్యా దృక్పథాలు
1. ఆండ్రగోజి అనే అభ్యసన విధానం ఏ దశ వారికి సంబంధించినది? (డీఎస్సీ ఎస్జీటీ-2012)
1) నవజాత శిశువు 2) ఉత్తర బాల్యదశ
3) పూర్వ బాల్యదశ 4) వయోజనదశ
2. కిశోరిశక్తి యోజన అనేది? ( డీఎస్సీ ఎస్జీటీ-2012)
1) దారిద్య్రరేఖకు దిగువనున్న బాలికలకు ఉద్దేశించిన ప్రత్యేక సౌకర్యం
2) కౌమారదశలోని బాలురు, బాలికల వృత్తి విద్యకు సంబంధించినది
3) కౌమారదశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకం
4) కౌమారదశలోని బాలురు, బాలికల కౌమార విద్య కోసం ఉద్దేశించినది
3. కింది వాటిలో అందరికీ విద్యకు సంబంధం లేనిది? (డీఎస్సీ ఎస్ఏ-2012)
1) వయోజన విద్య 2) విద్య ప్రపంచీకరణ
3) విద్య సార్వత్రీకరణ 4) నిరంతర విద్య
4. గ్రీన్ హౌస్ ప్రభావం దేనికి సంబంధించినది? (డీఎస్సీ ఎస్ఏ-2012)
1) న్యూక్లియర్ రేడియేషన్ 2) థర్మల్ రేడియేషన్
3) అయొనైజింగ్ రేడియేషన్ 4) రసాయన రేడియేషన్
5. సంస్కృతికి సంబంధించి విద్య పాత్ర ? (డీఎస్సీ తెలుగు పండిట్-2012)
1) వృద్ధిపర్చడం 2) పరిరక్షించడం
3) ఆధునికీకరణ 4) పరిరక్షించడం, వృద్ధిపర్చడం
6. కుర్జువీల్ రీడింగ్ మిషన్ (డీఎస్సీ ఎస్జీటీ-2012)
1) చిత్రాలను చదవడానికి ఉపయోగపడుతుంది
2. ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి, వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది.
3. వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది.
4. ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది.
జవాబులు : 1 – 4, 2- 3, 3 – 2, 4 – 4, 5 – 4, 6 – 2
-పై ప్రశ్నలను పరిశీలిస్తే విద్యాదృక్పథంలోని భాషా పదాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి.
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం
– 2009, బాలల మానవ హక్కులు
1. విద్యాహక్కు చట్టం – 2009 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (డీఎస్సీ SGT-2012)
1) మార్చి 10, 2009 2) ఏప్రిల్ 1, 2010
3) ఏప్రిల్ 2, 2009 4) మార్చి 1, 2010
2. విద్యాహక్కు చట్టం – 2009, దాని నియమాల పరిధిలో ప్రభుత్వ విధి కానిది? (డీఎస్సీ SA-2012)
1) చట్టం నిర్దేశించిన విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి అంచనావేయడం
2) స్థానిక అధికారులను ప్రకటించడం
3) పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ
4) సముచితమైన ఉపాధ్యాయ విద్యా సదుపాయాలను అంచనా వేయడం
3. RTE-2009 ఏ వయసుగల సమూహపిల్లలకు వర్తిస్తుంది? (డీఎస్సీ TP-2012)
1) 0 – 14 ఏండ్లు 2) 6 – 14 ఏండ్లు
3) 5 – 16 ఏండ్లు 4) 1 – 16 ఏండ్లు
జవాబులు : 1 – 2, 2 – 2, 3 – 2.
-RTE – 2009 విద్యాహక్కు చట్టం నుంచి తప్పనిసరిగా 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సృజనాత్మకతతో చదవండి.
జాతీయ విద్యాప్రణాళిక చట్రం – 2005 (NCF-2005)
1. NCF- 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇవ్వడానికి.. కింది వాటిలో ఒకటి అభిలషణీయమైన ఏర్పాటు? ( డీఎస్సీ TPT-2012)
1) కామన్ సిలబస్ (సాధారణ విషయ ప్రణాళిక)
2) సాధారణ పాఠశాల వ్యవస్థ
3) అన్ని రాష్ర్టాల్లో హిందీని ఒక విషయంగా చేయడం
4) ఆంగ్లభాష బోధనకు ప్రాధాన్యత
2. NCF-2005 లో తెలిపిన బోధనాభ్యసన విధానానికి ఆధారం? (డీఎస్సీ SA-2012)
1) నిర్మాణాత్మక అభ్యసన నియమం
2) ప్రవర్తనాపరమైన అభ్యసన నియమం
3) జ్ఞానాత్మక అభ్యసన నియమం
4) గెస్టాల్ట్ అభ్యసన నియమం
3. జాతీయ విద్యాప్రణాళిక చట్రం-2005 ప్రకారం విద్యాప్రణాళిలో కొత్త పాఠ్యవిషయాలను ఎలా చేర్చవచ్చు? (డీఎస్సీ SGT-2012)
1) ముందటి విషయ ప్రణాళికను విద్యార్థులు పూర్తి చేసినట్లయితే
2) ప్రస్తుతం ఉన్న విషయాల్లో కాని లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని ప్రత్యేక విషయంగా కానీ
3) ప్రస్తుతం ఉన్న విషయాలు, నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా
4) ఒక ప్రత్యేక విషయంగా
జవాబులు : 1 – 1, 2 – 1, 3 – 2.
-ఉపాధ్యాయ పరీక్ష రాయబోయే అభ్యర్థులంతా విద్యాదృక్పథాల్లోని అంశాలను అనేక కోణాల నుంచి సృజనాత్మకతతో అలోచించి అవగాహన చేసుకోగలిగితే ప్రతిప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగి విజయం సాధిస్తాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?