Private Member Bill Committee | ప్రైవేట్ మెంబర్ బిల్లు కమిటీ చైర్మన్ ఎవరు?
1. అశోక్ మెహతా కమిటీ అభిప్రాయం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ వైఫల్యానికి కారణం?
1) ఉద్యోగిస్వామ్యం పాత్ర
2) రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం
3) భావ స్పష్టత లేకపోవడం
4) లింగ సమానత్వం లేకపోవడం
ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4
2. కింది పదాల్లో ప్రవేశికలో లేనివి?
ఎ) సెక్యులర్, రిపబ్లిక్ బి) సామ్యవాద, గణతంత్ర
సి) సమాఖ్య, గణతంత్ర డి) ప్రజాస్వామ్య, గణతంత్ర
3. కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఆ సభ చైర్మన్‌కు అర్హుడు
2) లోక్‌సభ సభ్యుడే క్యాబినెట్ మంత్రికి అర్హుడు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
4. కింది వ్యాఖ్యల్లో సరైనది?
1) హైకోర్టు న్యాయమూర్తిని గవర్నర్ నియమిస్తాడు
2) శాసనసభ స్పీకర్‌ను ఆ రాష్ట్ర సీఎం నియమిస్తాడు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
5. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్, సభ్యులను నియమించేది?
ఎ) కేంద్ర ప్రభుత్వం బి) ప్రధానమంత్రి
సి) రాష్ట్రపతి డి) సుప్రీంకోర్టు సీజే
6. కింది వ్యాఖ్యను పరిశీలించండి.
1) ఎన్నికల సంఘం సభ్యులను, ప్రధాన ఎన్నికల
కమిషనర్ నియమిస్తారు.
2) ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు.
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
7. లౌకిక అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు?
ఎ) 44 బి) 52 సి) 42 డి) 34
8. రాజ్యసభ సభ్యులు ఎన్నేండ్లకు ఎన్నికవుతారు?
ఎ) నాలుగు బి) ఐదు
సి) ఆరు డి) మూడు
9. ప్రస్తుత లోక్‌సభ ఎన్నోది?
ఎ) 18వ లోక్‌సభ బి) 14వ లోక్‌సభ సి) 17వ లోక్‌సభ డి) 16వ లోక్‌సభ
10. స్వతంత్ర భారత ప్రథమ మంత్రి మండలి సభ్యులు వారి శాఖలను జతపర్చండి?
1) సర్దార్ వల్లభాయ్‌పటేల్ అ) హోంశాఖ
2) బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ) వ్యవసాయ, ఆహార శాఖ
3) అబుల్ కలాం ఆజాద్ ఇ) విద్యాశాఖ
4) బాబు జగ్జీవన్‌రాం ఈ) కార్మిక శాఖ
ఎ) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
11. కింది వాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
సి) సమాఖ్య
డి) పార్లమెంట్‌కు, రాజ్యాంగాన్ని సవరించే ఆధికారాన్ని ప్రశ్నించకపోవడం
12. భారత పార్లమెంట్ అంటే?
ఎ) రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ
బి) రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ
సి) లోక్‌సభ, రాజ్యసభ
డి) కేంద్రమంత్రి మండలి, లోక్‌సభ, రాజ్యసభ
13. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ద్రవ్వ బిల్లును ఎన్ని రోజుల వరకు తన వద్ద ఉంచుకోవచ్చు?
ఎ) 14 రోజులు బి) 18 రోజులు సి) 30 రోజులు డి) 11 రోజులు
14. కింది వ్యాఖ్యల్లో సరైనది?
ఎ) ఒకే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాలకు ఏక కాలంలో గవర్నర్‌గా నియమించరాదు
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించిన విధంగా, హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు
సి) రాజ్యాంగంలో గవర్నర్‌ను తొలగించే విధానాన్ని పేర్కొనలేదు
డి) కేంద్ర పాలిత ప్రాంతాలకు శాసనసభ ఉంటే ముఖ్యమంత్రిని లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారు
15. ప్రతిపాదన (A): మహాభియోగ తీర్మానం అర్ధ న్యాయ విధానంలో ఉంటుంది. రాష్ట్రపతిని రాజ్యాంగ ధిక్కారం అనే కారణంతో తొలగిస్తారు.
కారణం (R): మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటులోని ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కాని Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం R తప్పు డి) A తప్పు R నిజం
16. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వహణ శాఖ?
ఎ) శాసనశాఖ నుంచి స్వతంత్రంగా ఉంటుంది
బి) శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది
సి) న్యాయశాఖకు బాధ్యత వహిస్తుంది
డి) ప్రజలకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తుంది
17. రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
ఎ) ఎన్నికల సంఘం బి) సుప్రీంకోర్టు
సి) లోక్‌సభ డి) లా కమిషన్
18. కింది వారిలో రాష్ట్రపతిచే నియమింపబడేవారు?
1) రాజ్యసభ చైర్మన్
2) భారత ప్రధాన న్యాయమూర్తి 3) లోక్‌సభ స్పీకర్
ఎ) 1, 2 బి) 2 సి) 2, 3 డి) పైవన్నీ
19. కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవి?
1) కేంద్ర సమాచార కమిషన్ 2) ఎన్నికల సంఘం
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4)యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
ఎ) 1, 2, 3 బి) 2 సి) 3, 4 డి) 2, 3, 4
20. కింది వాటిలో ఏడో షెడ్యూల్లోని ఉమ్మడి జాబితాలోని అంశాలు?
1) పౌరసత్వం 2) ఆర్థిక, సామాజిక ప్రణాళిక
3) కార్మిక సంఘాలు, పారిశ్రామిక, కార్మిక వివాదాలు
ఎ) 1, 2 బి) 2, 3 సి) 2 డి) 3
21. రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ కింది వాటిలో వేటిపై నివేదికను సమర్పించింది?
1) పాలనలో నైతికత 2) స్థానిక ప్రభుత్వం
3) టెర్రరిజాన్ని ఎదుర్కోవడం 4) అవినీతి నిర్మూలన
ఎ) 1, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2 డి) 1, 2, 3
22. ప్రభుత్వ ఖాతాల సంఘం సభ్యుల పదవీ కాలం ఎంత?
ఎ) ఐదేండ్లు బి) ఏడాది
సి) రెండేండ్లు డి) మూడేండ్లు
23. రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ) రాజ్యసభలో ఎన్నుకోబడిన, నామినేటైన సభ్యులు ఉంటారు
బి) రాజ్యసభ రద్దు కాదు
సి) 1/3వ వంతు సభ్యులు ప్రతి ఐదేండ్లకు పదవీ విరమణ పొందుతారు
డి) ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభకు చైర్మన్‌గా ఉంటారు
24. కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ?
ఎ) నీతి ఆయోగ్ బి) కేంద్ర సమాచార కమిషన్
సి) నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్
డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
25. ప్రభుత్వ ఖాతాల సంఘంలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
ఎ) లోక్‌సభ- 15, రాజ్యసభ- 7 మంది
బి) లోక్‌సభ- 20, రాజ్యసభ- 7 మంది
సి) లోక్‌సభ- 15, రాజ్యసభ- 10 మంది
డి) లోక్‌సభ- 12, రాజ్యసభ- 10 మంది
26. ప్రతిపాదన (A): భారత స్వాతంత్య్ర చట్టం-1947,బ్రిటిష్ పరిపాలనాకాలంలో చేసిన చివరి చట్టం
కారణం (R): ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు
ఎ) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
బి) A, Rలు నిజం, కాని Aకు R సరైన వివరణ కాదు
సి) A నిజం, R తప్పు డి) A తప్పు, R నిజం
27. రాజ్యాంగంలోని ప్రకరణ 312 ప్రకారం కింది వాటిలో అఖిల భారత సర్వీసు కానిది?
ఎ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
బి) ఇండియన్ రెవెన్యూ సర్వీస్
సి) ఇండియన్ పోలీస్ సర్వీస్
డి) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
28. లోక్‌సభలో కోరం ఎంత?
ఎ) మొత్తం సభ్యుల్లో 1/3 వంతు
బి) మొత్తం సభ్యుల్లో 1/4 వంతు
సి) మొత్తం సభ్యుల్లో 1/10 వంతు
డి) మొత్తం సభ్యుల్లో 1/6 వంతు
29. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఎందుకు ఏర్పాటుచేస్తారు?
ఎ) ద్రవ్య బిల్లు బి) రాజ్యాంగ సవరణ బిల్లు
సి) సాధారణ బిల్లు డి) అప్రోప్రియేషన్ బిల్లు
30. ప్రైవేట్ మెంబర్ బిల్లు కమిటీ చైర్మన్ ఎవరు?
ఎ) లోక్‌సభ స్పీకర్ బి) లోకసభ డిప్యూటీ స్పీకర్
సి) రాజ్యసభ చైర్మన్ డి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
31. రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ) భారత పౌరుడు/పౌరురాలై ఉండాలి
బి) 30 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి
సి) ఓటర్ అయి ఉండాలి
డి) పోటీచేస్తున్న ప్రాంత నివాసి అయి ఉండాలి
32. కింది వారిలో ఎవరి పదవి తొలగింపు విధానం ఒకేవిధంగా ఉంటుంది?
1) కాగ్ 2) హైకోర్టు న్యాయమూర్తి
3) చైర్మన్, యూపీఎస్సీ 4) అటార్నీ జనరల్
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4 సి) 1, 2 డి) 1, 4
33. అంచనాల కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు
2) గరిష్ట సభ్యుల సంఖ్య 30
3) సభ్యులను స్పీకర్, చైర్మన్ నామినేట్ చేస్తారు
ఎ) 1, 2, 3 బి) 2, 3 సి) 2 డి) 1, 3
34. గవర్నర్‌కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) ఒక వ్యక్తిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు గవర్నర్‌గా నియమించవచ్చు
2) గవర్నర్‌కు క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి
3) గవర్నర్‌ని ముఖ్యమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు
ఎ) 1, 2 బి) 1, 2, 3 సి) 2, 3 డి) 1
35. మనీ బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ) రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టకూడదు
బి) ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అనేది స్పీకర్ నిర్ణయిస్తారు
సి) మనీ బిల్లు విషయంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి, ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు
డి) మనీ బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో ప్రవేశపెడతారు
36. రాజ్యసభకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి?
1) రాష్ర్ట జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించాలంటే మొదట రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి
2) నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
3) రాజ్యసభకు వివిధ రంగాలకు చెందిన 12 మంది సభ్యులు నామినేట్ అవుతారు
4) మేధావుల సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2 సి) 3, 4 డి) 2, 3, 4
37. సమానత్వపు హక్కును తెలియజేస్తున్న ప్రకరణ (1418)కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) కుల, మత, జాతి, లింగభేద లేదా జన్మస్థాన కారణాలను బట్టి వివక్ష చూపరాదు
2) ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు
3) విద్యావిషయక, సాంస్కృతిక హక్కు
4) అంటరానితనం నిషేధం
ఎ) 1, 2, 3 బి) 3, 4 సి) 1, 2, 4 డి) 1, 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?