కరెంట్ అఫైర్స్ 09-03-2022
జాతీయం
సైన్స్ డే
నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ‘సస్టెయినబుల్ ఫ్యూచర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్’.
పుస్తకావిష్కరణ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆత్మకథ ‘ఉంగలిల్ ఒరువన్ (ఒన్ ఎమాంగ్ యూ-మీలో ఒకరు)’ పుస్తకాన్ని రాహుల్ గాంధీ ఫిబ్రవరి 28న ఆవిష్కరించారు. ఈ పుస్తకం 1976లో అరెస్టయ్యేవరకు స్టాలిన్ జీవితంలోని మొదటి 23 సంవత్సరాలకు సంబంధించింది.
భారత్-జపాన్
భారత్-జపాన్ల మధ్య ద్వైపాక్షిక స్వాప్ అరెంజ్మెంట్ ఒప్పందాన్ని మార్చి 1న పునరుద్ధరించారు. ఇది 75 బిలియన్ల వరకు ఉంటుంది. ఈ ఒప్పందం 2018లో తొలిసారిగా అమల్లోకి వచ్చింది.
క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ లింక్
దేశంలో తొలిసారిగా డీఆర్డీవో సంస్థ, ఐఐటీ ఢిల్లీ సైంటిస్టులు క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ లింక్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు మార్చి 1న వెల్లడించారు. దీనిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వింధ్యాచల్ ప్రాంతాల మధ్య పరీక్షించారు. దీని పరిధి 100 కి.మీ. క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ అనే క్రిప్టోగ్రఫిక్ ప్రొటోకాల్‌ను రూపొందించడానికి క్వాంటం ఫిజిక్స్‌ను ఉపయోగించే సురక్షిత కమ్యూనికేషన్ టెక్నాలజీ.
ఆపరేషన్ గంగ
కేంద్ర పౌర విమాన శాఖ ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని మార్చి 3న చేపట్టింది. దీనిలో భాగంగా 17 వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇందుకు ఎయిర్ ఇండియా విమానాలు, సీ-17 యుద్ధ విమానాలను వినియోగించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్ మరణించాడు.
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్
దేశంలో అత్యంత ధనికులు ఉన్న నగరాల జాబితా నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌ను మార్చి 2న విడుదల చేశారు. ఈ జాబితాలో 1596 బిలియనీర్లతో ముంబై మొదటి స్థానంలో నిలువగా.. 467 బిలియనీర్స్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. తరువాతి స్థానల్లో వరుసగా పుణె (360), బెంగళూరు (352), కోల్‌కతా (257), ఢిల్లీ (210), చెన్నై (160), అహ్మదాబాద్ (121) ఉన్నాయి.
జార్ఖండ్ పర్యటనలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చి 4న జార్ఖండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా 2020, జూన్ 15న గాల్వాన్ లోయ ఘటనలో మరణించిన అమరవీరుల సైనిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేశారు.
క్రీడలు
ప్రొ కబడ్డీ
8వ ప్రొ కబడ్డీ టైటిల్‌ను ఢిల్లీ దబాంగ్ జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 25న బెంగళూరులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ టీంను ఓడించింది. విజేత జట్టుకు రూ.3 కోట్లు, ఓడిన జట్టుకు రూ.కోటిన్నర నగదు బహుమతి అందజేశారు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు మోహిత్ గోయత్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును నవీన్ కుమార్, డిపెండర్ ప్లేయర్ అవార్డును మహ్మద్ రాజా గెలుచుకున్నారు. 2014లో నిర్వహించిన తొలి ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను జైపూర్ పింక్ జట్టు గెలుచుకుంది. 2015లో యుముంబా, 2016లో పట్నా పైరేట్స్, 2017లో పట్నా పైరేట్స్, 2018లో బెంగళూర్ బుల్స్, 2019లో బెంగాల్ వారియర్స్ విజేతలుగా నిలిచాయి.
31వ సౌత్ఈస్ట్ ఏషియన్ గేమ్స్
31వ సౌత్ఈస్ట్ ఏషియన్ గేమ్స్-2021ను మార్చి 12 నుంచి మే 23 వరకు దక్షిణ వియత్నాంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఫిబ్రవరి 28న వెల్లడించారు. కరోనా కారణంగా 2021 నవంబర్‌లో జరగాల్సిన ఈ క్రీడలు వచ్చే నెలలో నిర్వహించనున్నారు. దక్షిణ వియత్నాం రాజధాని హనోయి ప్రధాన వేదికగా నిర్వహించనున్న ఈ పోటీల్లో 40 క్రీడాంశాల్లో సుమారు 10వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ క్రీడల మోటో ‘ఫర్ ఏ స్ట్రాంగర్ సౌత్ఈస్ట్ ఏషియా (బలమైన ఆగ్నేయాసియా కోసం)’. ఈ క్రీడల మస్కట్ ‘సావో లా’.
సౌరభ్ చౌధరి
ఈజిప్ట్‌లోని కైరోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్)-2022లో సౌరభ్ చౌధరి స్వర్ణ పతకం సాధించాడు. మార్చి 1న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌధరి 16-6 తేడాతో జర్మనీకి చెందిన మైఖేల్ షాల్డ్ను ఓడించాడు. రష్యాకు చెందిన అర్టెమ్ చెన్నౌసోవ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.
చెస్
47వ జాతీయ మహిళా చెస్ టోర్నమెంట్‌ను మార్చి 3న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో విజయవాడకు చెందిన ప్రియాంక విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది. పురుషుల విభాగంలో అర్జున్ ఇరగాసి విజేతగా నిలిచాడు.
రఫెల్ నాదల్ ఆత్మకథ
స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఆత్మకథ ‘రఫా: మై స్టోరీ’ పుస్తకాన్ని మార్చి 3న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రఫెల్ నాదల్, జాన్ కార్లింగ్ రచించారు. రఫెల్ తన జీవితంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును ఈ పుస్తకంలో వివరించాడు.
షేన్ వార్న్
ఆస్ట్రేలియన్ స్పిన్ బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ మార్చి 4న థాయిలాండ్‌లో గుండెపోటుతో మరణించాడు. ఇతడు 1969, సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని అప్పర్ ఫెర్న్ట్రీ గల్లీలో జన్మించాడు. వార్న్ 1992లో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2007లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన వార్న్ 145 టెస్టుల్లో 708, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయం
వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే
వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే (ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం)ని మార్చి 1న నిర్వహించారు. దీనిని ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ (ఐసీడీవో) స్థాపించింది. ఈ ఐసీడీవోను 1931లో సర్జన్ జనరల్ జార్జ్ సెయింట్ పాల్ సృష్టించారు. ఈ సంవత్సర థీమ్ ‘సివిల్ డిఫెన్స్ అండ్ ది ఫస్ట్ ఎయిడర్ ఇన్ ఎవ్రీ హోం (పౌర రక్షణ, ప్రతి ఇంటిలో ప్రథమ సహాయకుడు)’. విపత్తులు, సంక్షోభాల నేపథ్యంలో అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని ఈ థీమ్ పునరుద్ఘాటిస్తుంది.
ఈయూలో ఉక్రెయిన్
ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో 28వ దేశంగా మార్చి 2న సభ్యత్వాన్ని స్వీకరించింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా 600 మిలియన్ డాలర్లు, జర్మనీ 113 మిలియన్ డాలర్లు, ఐక్యరాజ్య సమితి 20 మిలియన్ డాలర్లు, ప్రపంచ బ్యాంక్ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుకోవిట్స్కీ మరణించాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.
వరల్డ్ హియరింగ్ డే
‘వరల్డ్ హియరింగ్ డే (ప్రపంచ వినికిడి రోజు)’ని మార్చి 3న నిర్వహించారు. చెవిటితనం గురించి అవగాహన కల్పించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. మొదట దీనిని ఇంటర్నేషనల్ ఇయర్ (చెవి) దినోత్సవంగా పిలిచారు. 2016 నుంచి దీనిని వరల్డ్ హియరింగ్ డేగా మార్చారు. ఈ సంవత్సరం థీమ్ ‘టు హియర్ ఫర్ లైఫ్, లిజన్ విత్ కేర్ (జీవితం కోసం వినడానికి, జాగ్రత్తగా వినండి)’.
వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే)ను మార్చి 3న నిర్వహించారు. ప్రపంచంలోని అడవి జంతుజాలం, వృక్షజాలం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2013, డిసెంబర్ 20న యునైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) మార్చి 3ని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా నిర్వహించాలని గుర్తించింది. 1973లో అంతరించిపోతున్న జంతుజాలం, వృక్షజాతుల్లో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ సంతకం చేసిన రోజుగా మార్చి 3ని ఎంచుకున్నారు. ఈ సంవత్సర థీమ్ ‘రికవరింగ్ కీ స్పీసీస్ ఫర్ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ (పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించడం కోసం కీలక జాతులను మళ్లీ పొందడం)’.
వార్తల్లో వ్యక్తులు
భూషణ్ పట్వర్ధన్బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా భూషణ్ పట్వర్ధన్ మార్చి 1న నియమితులయ్యారు. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆయన సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మాధవి పురి బచ్సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నూతన చైర్‌పర్సన్‌గా మాధవి పురి బచ్ మార్చి 2న బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆమె సెబీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. అజయ్ త్యాగి ఐదేండ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియడంతో ఆమెను నియమించారు.
సుధీర్ సక్సేనా
మధ్యప్రదేశ్ నూతన డీజీపీగా సుధీర్ సక్సేనా మార్చి 2న నియమితులయ్యారు. ఆయన 1987 ఐపీఎస్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
అక్షయ్ విధాని
చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్ (వైఆర్ఎఫ్)చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా అక్షయ్ విధాని మార్చి 2న నియమితులయ్యారు. ఇతను మొదట వైఆర్ఎఫ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్, బిజినెస్ అఫైర్స్, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్‌గా పనిచేశారు.
వేముల సైదులు జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు