జనరల్ అవేర్‌నెస్‌కు సిద్ధమవుదాం ఇలా!
బ్యాంక్ పరీక్షల్లో జనరల్ అవేర్నెస్/బ్యాకింగ్/ఫైనాన్షియల్ అవేర్నెస్ను అధిక స్కోరింగ్ విభాగంగా పరిగణిస్తారు. ఇది అభ్యర్థి బ్యాంకింగ్ నాలెడ్జ్, ఆర్థిక, వాణిజ్య అంశాలపై అవగాహన పరీక్షించే విభాగం. మెయిన్స్‌లో మాత్రమే వచ్చే ఈ సెక్షన్ వివిధ బ్యాంకింగ్ పరీక్షల్లో సాధారణంగా కనిపిస్తుంది. ప్రస్తుతం 2021 ఐబీపీఎస్/ఎస్బీఐ/గ్రామీణ, క్లర్క్, పీవో పరీక్షలు రెండో దశకు చేరుకున్నాయి. దీనిలో జనరల్ అవేర్నెస్ సెక్షన్ చాలా కీలకం. గత 6 నెలల ఫైనాన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలను బాగా చదవాలి. లేకపోతే ఈ విభాగంలో మార్కులు పెంచుకోవడం చాలా కష్టం.
సాధారణంగా బ్యాంక్ పరీక్షలు రాసేవారు ఈ సెక్షన్‌ను ప్రిలిమ్స్ పూర్తయిన తరువాత ప్రిపరేషన్ మొదలుపెడతారు. కానీ ఉద్యోగం పొందాలనుకునే పట్టుదల ఉన్నవారు ఈ సెక్షన్‌ను మొదటి నుంచే చదవడం మొదలుపెడతారు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సమానంగా జనరల్/బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ కావాలి. టాపిక్వైజ్గా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది.
ఇతర పోటీ పరీక్షలకు బ్యాంక్ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంది. దీనిలో ప్రతి టాపిక్‌పై పూర్తిగా కఠినస్థాయి ప్రశ్నలే వస్తాయి. అలాగే జనరల్/బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్లో కూడా ఆర్థిక, వాణిజ్య అంశాలే అధికం. ఆర్బీఐ, ద్రవ్యనిధి, బ్యాంక్ కార్యకలాపాలు వంటి వాటిపై ఫోకస్ పెట్టాలి. ఇతర నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం జాతీయ, అంతర్జాతీయ అంశాలు జోడించి చదవాలి.
సంబంధిత బ్యాంక్ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆన్లైన్ వనరులు ఉపయోగించుకోవాలి. మెరుగైన ప్రిపరేషన్ కోసం కరెంట్ అఫైర్స్ మాక్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. పోటీ పరీక్షల కోసం గత 6 నెలల్లో జరిగిన సంఘటనలు బ్యాంక్ మెయిన్స్ పరీక్షల ముందు అప్డేట్ చేసుకోవాలి. కంటెంట్‌తో పాటు మాదిరి ప్రశ్నలు సాధన చేయడం వల్ల మంచి ప్రతిఫలం ఉంటుంది.
జనరల్/బ్యాంకింగ్ అవేర్నెస్ కంటెంట్ కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దీనిలో బ్యాంకింగ్ ప్రధానాంశాలు, ఆర్బీఐ, కీ పాలసీ రేట్లు, బ్యాంకింగ్ నిర్వహణ అంశాలు, భారత ఆర్థిక, వాణిజ్య అంశాలు, కరెన్సీ, క్రెడిట్ వ్యవస్థ నిర్వహణ, ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్, విదేశీ మారకపు విశ్లేషణ, ఆర్థిక స్థిరత్వం, చెల్లింపులు, సెటిల్మెంట్ సిస్టమ్స్, బాహ్య పెట్టుబడులు, కార్యకలాపాలు, బ్యాకింగ్ పదకోశం వంటి వాటిపై శ్రద్ధ వహించి బాగా ప్రిపేర్ కావాలి.
తాజాగా బ్యాంకింగ్ పరీక్షలకు ప్రిపేరయ్యే వారు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అంశాలతో పాటు బ్యాకింగ్ అవేర్నెస్ టాపిక్స్‌పై సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
బ్యాంకింగ్-నిర్వచనం బ్యాంకింగ్-చరిత్ర, ఈవెంట్లుబ్యాంకింగ్, ఇతర ఫైనాన్షియల్ సంస్థలువినియోగదారులు-డిపాజిట్ రకాలు, రేట్లురుణాలు-రకాలు-రేట్లు కేవైసీ, బ్యాంకింగ్ కియోస్క్ ఆర్బీఐ విధి విధానాలు బ్యాంకులు నిర్వహించే ఇతర ఆర్థిక కార్యకలాపాలు ఇన్సూరెన్స్, స్టాక్ ట్రేడింగ్ బ్యాంకింగ్ లాకర్ల నిర్వహణ ముఖ్యమైన బ్యాంకింగ్-ఆర్థిక అంశాలపై కమిటీలుబ్యాంక్ విలీనాలు-ప్రైవేటీకరణ
పై అంశాల కోసం ఏదేని స్టడీ మెటీరియల్ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ పుస్తకాలు చదవడం, ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవడం చేయాలి.
ఫైనాన్షియల్ అంశాలు.. ద్రవ్యనిధి, పన్నులు-విధానాలు, జీఎస్టీ, క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్-నియంత్రణ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్టుబడులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, కేంద్ర ఆర్థిక సర్వే-2020-21, కేంద్ర బడ్జెట్, ఆర్థిక మంత్రిత్వ సర్క్యులర్లు, సంప్రదింపులు, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు.
సమకాలీన అంశాలు.. అవార్డులు, అవార్డు గ్రహీతలు, క్రీడలు-టోక్యో ఒలింపిక్స్-2020, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, జాతీయ క్రీడాకార్యక్రమాలు, వేదికలు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు, భారత్-ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ సదస్సులు-సమావేశాలు, ప్రధాని విదేశీ పర్యటనలు, రక్షణ శాఖ- సైనిక విన్యాసాలు, రక్షణ రంగంలో నూతన పెట్టుబడులు ఆవిష్కరణలు, యుద్ధ విమానాలు, క్షిపణి-లక్ష్యాలు, వ్యవసాయ రంగం, భౌగోళిక సూచనలు-2020-21, రచయితలు-పుస్తకాలు, పార్లమెంట్ సమావేశాలు- బిల్లులు, సవరణలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు.
కరోనా మహమ్మారి, డెల్టా వేరియంట్-ఒమిక్రాన్, కొవిడ్ టీకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, ఇతర అంతర్జాతీయ రిపోర్టులు, మయన్మార్, అఫ్గానిస్థాన్, ఈక్వెడార్, శ్రీలంక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు, యునెస్కో వారసత్వం గుర్తింపులు ఇలా గత 6 నెలల సమాచారాన్ని సేకరించి చదవాలి.
ప్రిపరేషన్ ప్లాన్
సామర్థ్యాలు, సమయ పాలనను బట్టి సొంత ప్రిపరేషన్ ప్లాన్‌ను అనుసరించాలి. దీనిలో ముఖ్యమైన జనరల్ అవేర్నెస్ టాపిక్స్, మోడల్ పేపర్స్, గత ప్రశ్నపత్రాలను చదవడం చేయాలి.
తాజాగా ప్రిపరేషన్ మొదలుపెట్టేవారు ఈ సెక్షన్‌పై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవడానికి వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
కంటెంట్ ఆధారంగా ప్రతి టాపిక్‌ను నోట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ బేసిక్స్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి.
ఐబీపీఎస్/ఎస్బీఐ/పీబీఐ పీవోల ప్రిపేరయ్యేవారు జనరల్ అవేర్నెస్ అంశాల్లో డిస్క్రిప్టివ్ అంశాలు జోడించి చదవాలి.
సమకాలీన అంశాల కోసం దిన, మాస పత్రికలు, ఇంగ్లిష్ న్యూస్ చానళ్లు చూడాలి.
ఏదేని స్టడీ మెటీరియల్స్‌ను పూర్తిగా చదివి, సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల రివిజన్ సమయంలో గుర్తుంచుకోవడం సులభం అవుతుంది.
దాదాపు 1000 కరెంట్ అఫైర్స్ మాదిరి ప్రశ్నలు సాల్వ్ చేయాలి. దీనికోసం ఆన్‌లైన్‌ను వినియోగించుకోవాలి.
నిపుణలో వచ్చే కరెంట్ అఫైర్స్‌ను చదువుతూ వాటిపై ప్రశ్నలను సాల్వ్ చేయడం చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది.
స్మార్ట్ స్టడీ విధానాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
మార్కులు: మెయిన్స్‌లో బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగానికి మొత్తం 40 మార్కులు కేటాయించారు. బ్యాంక్ పీవో పరీక్షలకు వ్యాస రచన కూడా ఉంటుంది. దీంతో పీవో పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. రెండు విభాగాలకు అంశాలు/ఫైనాన్షియల్/కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఈ రెండు విభాగాల కోసం ఉమ్మడిగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. డిస్క్రిప్టివ్ టాపిక్స్‌ను సమకాలీన అంశాలతో జోడించి చదవాలి.
ముఖ్యమైన డిస్క్రిప్టివ్ టాపిక్స్
భారత్ ఆర్థిక వ్యవస్థ-సవాళ్లు
ఆన్లైన్ విద్య-స్కూళ్లు
రియల్ ఎస్టేట్-పర్యాటక రంగాలపై కొవిడ్-19 ప్రభావం
లాక్డౌన్-ఉపాధి, ఆహారం, ఆరోగ్య సవాళ్లు
బ్యాంకుల విలీనాలు- ప్రైవేటీకరణ, వాటి ప్రభావం
బ్యాంక్ ఖాతాలు, రుణాలు, మొండి బకాయిలు-వాటివల్ల బ్యాంకులు ఎదుర్కొనే సవాళ్లు
పీఎస్‌యూల పెట్టుబడుల ఉపసంహరణ
వ్యవసాయ చట్టాలు
భారత్-చైనా ద్వైపాక్షిక అంశాలు
సోషియల్ మీడియా- వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్ ఖాతాల డాటా ప్రైవసీ పాలసీ
జాతీయ విద్యావిధానం
యువత సాధికారిత- దేశ సమగ్రతలో బాధ్యతలు
మద్యనిషేధం, డ్రగ్ వినియోగదారులను అరికట్టడం
విదేశీ పెట్టుబడులు-భారత్ ఆర్థిక పరిణామాలు
ఎన్నికలు-ప్రజాస్వామ్య పరిరక్షణ
రిఫరెన్స్ బుక్స్
బ్యాంకింగ్ అవేర్నెస్- అరిహంత్ పబ్లికేషన్స్, ఆర్ గుప్తా
బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్- దిశ
జనరల్ అవేర్నెస్-టాపిక్‌వైజ్- దిశ
కరెంట్ అఫైర్స్- జీకే టుడే
ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ స్టాండర్డ్ ఇంగ్లిష్ దినపత్రికలు
వెబ్సైట్లు- www.rbi.org.in,
www.finmin.nic.in,
www.sebi.gov.in, www.ntnews.com
ఎస్. మధుకిరణ్ డైరెక్టర్, ఫోకస్ అకాడమీ హైదరాబాద్
9030496929
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు