సీఏఏటీఎస్ఏ ఏ దేశానికి సంబంధించింది?
- దేశంలోనే తొలి ఆహార మ్యూజియాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? (డి)
ఎ) పంజాబ్ బి) కేరళ
సి) పశ్చిమబెంగాల్ డి) తమిళనాడు
l వివరణ: దేశంలోనే తొలి ఆహార మ్యూజియాన్ని తమిళనాడులోని తంజావూర్లో ఏర్పాటు చేశారు. దీనిని సుమారు 1860 అడుగుల విస్తీర్ణంలో భారత ఆహార సంస్థ, బెంగళూర్‌లోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం సంయుక్తంగా రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు రకాల ధాన్యాల సేకరణ విధానం, సవాళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తిని వివరించేలా ఆధునిక సాంకేతికతతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. పంట పొలాల నుంచి ప్రజల పళ్లేల వరకు ఆహార ప్రస్తావనను డిజిటల్ విధానంలో ప్రదర్శించే ఏర్పాటు చేశారు. - ఎస్-400 ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (ఎ)
ఎ) రష్యా నుంచి భారత్‌కు
వస్తున్న రక్షణ వ్యవస్థ
బి) ఇజ్రాయెల్ నుంచి
భారత్ కొనుగోలు చేసిన కొత్త క్షిపణులు
సి) అంతరిక్ష పరిశోధనకు కుదిరిన ఒప్పందం
డి) పర్యావరణ పరిరక్షణకు అన్ని దేశాలు
తీసుకోవాల్సిన చర్యల ముసాయిదా
l వివరణ: ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలు భారత్‌కు వస్తున్నాయి. వీటిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. వీటి కొనుగోలుకు ఇరు దేశాల మధ్య 2018 అక్టోబర్‌లో ఒప్పందం కుదిరింది. ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. అమెరికాకు చెందిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ (టీహెచ్ఏఏడీ) కంటే ఎస్-400 ఉన్నతమైంది. భారత గగనతలంలోకి వచ్చే ఎయిర్‌క్రాఫ్ట్, క్షిపణులు, మానవ రహిత వాహనాలు ఏవైనా వాటిని తటస్థం చేస్తుంది. - సీఏఏటీఎస్ఏ ఏ దేశానికి సంబంధించింది? (సి)
ఎ) రష్యా బి) ఫ్రాన్స్
సి) అమెరికా డి) ఆస్ట్రేలియా
l వివరణ: సీఏఏటీఎస్ఏ (కాట్సా) అనేది సంక్షిప్త రూపం. దీనిని విస్తరిస్తే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రో శాంక్షన్స్ యాక్ట్. 2017లో ఈ చట్టాన్ని అమెరికా చేసింది. ఈ చట్టం ఇరాన్, రష్యా, ఉత్తరకొరియా దేశాలతో రక్షణ సంబంధాలు పెట్టుకొనే దేశాలపై అమెరికా విధించే ఆంక్షలకు సంబంధించింది. తాజాగా రష్యా నుంచి భారత్ ఎస్-400 కొంటున్నది. ఈ నేపథ్యంలో భారత్‌పై కూడా కాట్సాను ప్రయోగించే అవకాశం ఉంది. ఈ ఏడాది భారత్, అమెరికాల మధ్య జరగబోయే 2+2 చర్చల్లో ఈ విషయం ప్రస్తావనకు రానుంది. ఇరు దేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల సమావేశాన్నే 2+2 అంటారు. - కింద పేర్కొన్న క్రీడలు, అవి జరగబోయే వేదికలను జతపరచండి? (బి)
- ట్వంటీ-20 ప్రపంచకప్-2024
ఎ. వెస్టిండీస్, అమెరికా - ట్వంటీ-20 ప్రపంచకప్-2028
బి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ - చాంపియన్స్ ట్రోఫీ-2029 సి. భారత్
- చాంపియన్స్ ట్రోఫీ-2025 డి. పాకిస్థాన్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
l వివరణ: వివిధ క్రీడా పోటీలకు సంబంధించి ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2022లో ట్వంటీ-20 టోర్నీ ఆస్ట్రేలియాలో జరుగనుంది. అదేవిధంగా 2024లో జరిగే ఈ ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2028 ట్వంటీ-20 టోర్నీని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025, 2029 వరుసగా పాకిస్థాన్, భారత్‌లలో నిర్వహించనున్నారు. వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పోటీలు 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో నిర్వహిస్తారు. 2031లో భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
- ట్వంటీ-20 ప్రపంచకప్-2024
- యూరప్‌లోని ఏ దేశ సరిహద్దు వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? (డి)
ఎ) ఫ్రాన్స్ బి) జర్మనీ
సి) ఇటలీ డి) బెలారస్
l వివరణ: పశ్చిమ యూరప్‌లోకి ప్రవేశించేందుకు బెలారస్‌లోని ఎందరో వలసదారులు ఆ దేశంతో సరిహద్దును పంచుకుంటున్న పోలాండ్, లిథువేనియా, లాటివా దేశాల సరిహద్దులకు వస్తున్నారు. బెలారస్లో ఆగస్ట్ 2020 నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ దేశంలో 2020లో జరిగిన ఎన్నికల్లో లుకాషెంకో విజయం సాధించారు. ఇది ఆయన ఆరో విజయం. యూరప్‌లో సుదీర్ఘకాలంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది ఆయనే. ఈ ఎన్నికల ఫలితాలను ఇతర యూరప్ దేశాలతో పాటు బెలారస్ ప్రతిపక్షాలు తిరస్కరించాయి. దీనికితోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వాళ్లపై ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక పాత్రికేయుడిని అదుపులోకి తీసుకొనేందుకు ఏకంగా ఒక విమానాన్నే దారి మళ్లించడంతో అమెరికా, యూరప్ దేశాలు బెలారస్‌పై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇరాక్, సిరియాల నుంచి బెలారస్‌లోకి వలస వస్తున్న వాళ్లు, అక్కడ ఉండలేక పొరుగు దేశాలకు వెళుతున్నారు. ఆ దేశాలు వీరిని రానివ్వడం లేదు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. - కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి (సి)
- పోచంపల్లి ఇక్కత్ చీరలు 2004లో
జీఐ ట్యాగ్‌ను పొందాయి - భూదానోద్యమం పోచంపల్లిలో
ప్రారంభమయ్యింది - ఇటీవల పోచంపల్లి ప్రపంచ పర్యాటక సంస్థ ఇచ్చే ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును పొందింది
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1, 2, 3 డి) 2, 3
l వివరణ: ప్రపంచ పర్యాటక సంస్థ ఇచ్చే ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి గెలుచుకుంది. 1951లో భూదానోద్యమానికి ఆచార్య వినోబాభావే శ్రీకారం చుట్టింది ఇక్కడే. 2004లో ఇక్కడి ఇక్కత్ చీరలకు భౌగోళిక గుర్తింపు లభించింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇటీవల భూదాన్‌పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డుకు ఎంపిక చేసింది.
- పోచంపల్లి ఇక్కత్ చీరలు 2004లో
- కర్తార్‌పూర్ ఏ నది ఒడ్డున ఉంది? (ఎ)
ఎ) రావి బి) గంగా సి) యమున డి) నర్మద
l వివరణ: పాకిస్థాన్‌లో రావి నది ఒడ్డున ఉండే కర్తార్‌పూర్ సిక్కు మతస్తులకు పవిత్ర స్థలం. ఇక్కడ ఉండే గురుద్వారా దర్బార్ సాహిబ్ సందర్శనకు వెళ్లే యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన కర్తార్‌పూర్ కారిడార్ నవంబర్ 17న తెరిచారు. భారత్‌లోని పంజాబ్‌లో గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ మందిరం నుంచి పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ ఈ కారిడార్‌ను నిర్మించారు. కరోనా వల్ల మార్చి 2020న ఇక్కడ భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఈ నగరాన్ని సిక్కు మతస్తుల తొలి గురువు గురునానక్ 1504న నిర్మించారు. ప్రస్తుతం ఇది పాకిస్థాన్‌లోని నరోవర్ జిల్లాలో ఉంది. - దేశంలో తొలి ‘గ్రాస్ కన్జర్వేటరీ’ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? (డి)
ఎ) పంజాబ్ బి) హర్యానా
సి) గుజరాత్ డి) ఉత్తరాఖండ్
l వివరణ: దేశంలో తొలి గ్రాస్ కన్జర్వేటరీ ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో రాణిఖేట్‌లో నవంబర్ 14న ప్రారంభించారు. ఆ రాష్ట్ర అటవీశాఖలోని పరిశోధన విభాగం దీనిని దాదాపు రెండు ఎకరాల్లో అభివృద్ధి చేసింది. ఇందుకు సీఏఎంపీఏ నిధులు వినియోగించారు. సీఏఎంపీఏ అంటే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ స్కీం. ఇక్కడ దాదాపు 90 విభిన్న జాతుల గడ్డి రకాలను పెంచారు. అలాగే వాటి శాస్త్రీయ, పర్యావరణ, ఔషధ, సాంస్కృతిక సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచారు. - దేశంలో తొలి మత్స్య వ్యాపార ఇంక్యుబేటర్ (ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్)ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (సి)
ఎ) గుజరాత్ బి) కర్ణాటక
సి) హర్యానా డి) మహారాష్ట్ర
l వివరణ: దేశంలో తొలి ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను హర్యానాలోని గురుగ్రామ్‌లో అందుబాటులోకి తెచ్చారు. దీనికి ఎల్ఐఎన్ఏసీ-ఎన్సీడీసీ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ అని పేరు పెట్టారు. దీనిని ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా రూ.3.23 కోట్ల వ్యయంతో కేంద్రం ఏర్పాటు చేసింది. దీని నిర్వహణ బాధ్యతను నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారు. - వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ‘ఉయ్పవర్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపు
బి) శక్తి రంగంలో మహిళా
వర్క్‌ఫోర్స్‌ను పెంచడం
సి) పునరుత్పాదక శక్తిని పెంచడం
డి) ఏదీకాదు
l వివరణ: శక్తి రంగంలో మహిళా వర్క్‌ఫోర్స్‌ను పెంచేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌లు సంయుక్తంగా wepower India అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీనికి సంబంధించి భారత్‌లోని ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం ఆధ్వర్యంలో నవంబర్ 9న ఒక సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. - ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? (డి)
ఎ) అనిల్ కుంబ్లే బి) రాహుల్ ద్రావిడ్
సి) వీవీఎస్ లక్ష్మణ్ డి) సౌరవ్ గంగూలీ
l వివరణ: ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ నియమితులయ్యాడు. నవంబర్ 16న నిర్వహించిన ఐసీసీ బోర్డ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతను అనిల్ కుంబ్లే నిర్వహించారు. 2012లో ఆయన ఈ పదవికి ఎంపికయ్యాడు. భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకమయ్యాడు. బెంగళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వం వహించనున్నాడు. - నవంబర్ రెండో వారంలో నిర్వహించిన ఎస్ఐటీఎంఈఎక్స్ (సిట్మెక్స్621) నౌకాదళ విన్యాసంలో కింది వాటిలో పాల్గొనని దేశం? (సి)
ఎ) భారత్ బి) సింగపూర్
సి) ఇండోనేషియా డి) థాయ్‌లాండ్
l వివరణ: భారత్, సింగపూర్, థాయ్‌లాండ్ నావికా దళాలు సంయుక్తంగా తమ మూడో ఎస్ఐటీఎంఈఎక్స్ను నవంబర్ 15, 16 తేదీల్లో అండమాన్ సముద్రంలో నిర్వహించాయి. భారత్ తరఫున ఐఎన్ఎస్ కార్ముక్ పాల్గొంది. దీనిని రాయల్ థాయ్ నేవీ నిర్వహించింది. సముద్ర తీర రక్షణకు గాను మూడు దేశాలు ఈ విన్యాసాలను సంయుక్తంగా నిర్వహించాయి. - కింది వాటిలో అంటార్కిటికాలో భారత్‌కు శాశ్వత పరిశోధన కేంద్రాలు? (డి)
ఎ) దక్షిణ గంగోత్రి బి) మైత్రి
సి) భారతి డి) పైవన్నీ
l వివరణ: అంటార్కిటికాలో భారత్‌కు ప్రస్తుతం మూడు శాశ్వత పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అవి దక్షిణ గంగోత్రి. దీనిని 1983లో ప్రారంభించారు. మైత్రి. దీనిని 1988లో ప్రారంభించారు. కాగటా భారతి. ఇది 2012లో అందుబాటులోకి వచ్చింది. అంటార్కిటికాలో పరిశోధనకుగాను ఈ ఏడాది నవంబర్ 15న భారత్ తరఫున శాస్త్రవేత్తల బృందం మరోసారి అంటార్కిటికాకు వెళ్లింది. భారత్ తరఫున ఇది 41వ శాస్త్ర పరిశోధన యాత్ర. దీనికి శైలేంద్ర సైని నేతృత్వం వహిస్తున్నారు. - ఏ రోజున జన్ జాతీయ గౌరవ్ దివస్ జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది? (డి)
ఎ) నవంబర్ 12 బి) నవంబర్ 13
సి) నవంబర్ 14 డి) నవంబర్ 15
l వివరణ: ప్రతి సంవత్సరం నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దీనిని కూడా నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న గిరిజన యోధులకు నివాళిగా దీనిని ప్రకటించారు. ఇది ప్రముఖ గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి. 1875, నవంబర్ 15న ఆయన జన్మించారు. దేశంలో పలు గిరిజన తిరుగుబాట్లకు ఆయన ప్రేరణగా నిలిచారు. మద్యపానాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఉద్యమించారు. - నవంబర్ 16ను ఏ రోజుగా నిర్వహిస్తారు? (సి)
1. ఆడిట్ దివస్
2. జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
l వివరణ: ఏటా నవంబర్ 16న ఆడిట్ దివస్, జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా నిర్వహిస్తారు. రాజ్యాంగంలోని 148వ ప్రకరణం ప్రకారం ఏర్పాటయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చారిత్రాత్మకంగా ఆవిర్భవించిన రోజు నవంబర్ 16. 1966లో నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ రోజున జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుతారు. అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం మే 3.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- CAATSA
- Education News
Previous article
వాస్తవ తలసరి ఆదాయం అంటే?
Next article
దక్కన్ టైమ్స్ ఎప్పుడు ప్రారంభమైంది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు