అంతరిక్ష కోర్సుల రారాజు.. ఐఐఎస్టీ
విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకునేది ఎవర్ గ్రీన్ కెరీర్. అటువంటి వాటిలో అంతరిక్ష రంగం ఒకటి. ఇప్పటి వరకు మానవ ప్రపంచం సాధించింది ఆవగింజంత. సాధించాల్సింది అవని అంత. ఒకప్పుడు అంతరిక్షం అంటే అందని ద్రాక్ష కానీ నేడు సామాన్యులు సైతం అంతరిక్ష యాత్ర చేసే రోజులు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన అంతరిక్ష యాత్రలే దీనికి తార్కాణం. ముఖ్యంగా అంతరిక్షం, రిమోట్ సెన్సింగ్, ఏవియానిక్స్ వంటి విలక్షణమైన కోర్సులు మీ గమ్యం అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీ (ఐఐఎస్టీ) మీ డెస్టినేషన్. కేవలం ఇంటర్ ఉత్తీర్ణత. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌లో తగిన స్కోర్ సాధించినవారికి ఇదొక సువర్ణావకాశం. ఇంజినీరింగ్ కోర్సు అనంతరం ఇస్రో/డీఎస్టీ సంస్థల్లో ఉద్యోగం.. ప్రస్తుతం ఈ సంస్థలో బీటెక్ ప్రవేశాల ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా
ఐఐఎస్టీ గురించి..
ఐఐఎస్టీ
సైన్స్, ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన విద్యాసంస్థల్లో ఐఐఎస్టీ ఒకటి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ బాడీ కలిగిన విద్యా సంస్థ. కేరళలోని తిరువనంతపురం దగ్గర వలిమలలో 100 ఎకరాల్లో క్యాంపస్‌ను 2007లో ప్రారంభించారు. ఈ సంస్థ బీటెక్, ఎంటెక్/ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌ను అఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఏరోస్పేస్, ఏవియానిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ సిస్టం సైన్సెస్, హ్యుమానిటీస్, మ్యాథ్స్, ఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్ విభాగాల్లో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్ కోర్సులను అందిస్తుంది.
మొత్తం సీట్ల సంఖ్య- 162 బీటెక్ ప్రోగ్రామ్19
ఏరోస్పేస్ ఇంజినీరింగ్- ఇది నాలుగేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య – 70
ఈసీఈ (ఏవియానిక్స్)- ఇది నాలుగేండ్ల కోర్సు. సీట్ల సంఖ్య- 70
డ్యూయల్ డిగ్రీ (బీటెక్‌తోపాటు ఎంటెక్/ఎంఎస్)- ఇది ఐదేండ్ల కోర్సు.
సీట్ల సంఖ్య- 20
డ్యూయల్ డిగ్రీ చేసినవారికి బీటెక్ ఇంజినీరింగ్ ఫిజిక్స్‌తోపాటు ఎంఎస్/ఎంటెక్ డిగ్రీలను ప్రదానం చేస్తారు.
ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీలో బీటెక్ (ఇంజినీరింగ్ ఫిజిక్స్) తర్వాత పీజీలో ఎంఎస్ ఇన్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎంఎస్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఎస్ ఇన్ ఎర్త్ సిస్టం సైన్స్, ఎంటెక్ ఇన్ ఆప్టికల్ ఇంజినీరింగ్.
ఎంపిక ఎలా?
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ 2021 స్కోర్ ద్వారా
నోట్: ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా కేటగిరీల వారీగా తుది ఎంపికచేస్తారు.
ఎవరు అర్హులు ?
ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐఎస్టీ నిర్దేశించిన మార్కులు సాధించాలి.
ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకొన్నవారు మాత్రమే అర్హులు.
స్కాలర్షిప్స్
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1000లోపు ర్యాంకులు సాధించి యూజీ/డీడీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న వారికి కోర్సు మొదటి సంవత్సరం పూర్తి ఫీజు మినహాయింపు ఇస్తారు. అదేవిధంగా మిగిలిన మూడేండ్లు కూడా సీజీపీఏ 9 కంటే ఎక్కువ తెచ్చుకుంటే వారు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సెమిస్టర్లో 10 సీజీపీఏకు 9 సీజీపీఏ సాధిస్తే వారికి రెండో సెమిస్టర్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది.
ఇంటర్న్‌షిప్: అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇస్రో సెంటర్లు, దేశ, విదేశాల్లోని ఇతర ప్రధాన/ప్రఖ్యాత సంస్థల్లో క్రెడిటెడ్ ఇంటర్న్‌షిప్‌లు చేయవచ్చు.
ప్లేస్‌మెంట్స్
నిర్దేశిత సీజీపీఏ సాధిస్తే ఖాళీల సంఖ్యను బట్టి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇస్రో లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కేంద్రాల్లో ఉద్యోగావకాశం కల్పించే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు అడోబ్ సిస్టమ్స్, అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్, Acsia Technologies, అగుసెన్స్ ల్యాబ్స్, అమృత్ కాలేజీ, అనలాగ్ డివైజెస్, ఎయిర్‌బస్, ఏరోల్యాబ్ ఆప్టికల్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఆక్సాన్, సీడాక్, కొలిన్స్, సెల్ ప్రొపల్షన్, ఫైబర్ ఆప్టిక్స్, జీఈఎస్ గ్లోబల్ సొల్యూషన్స్, జీఈ, ఇన్ఫోసిస్, ఐఐటీఎం, ఐఐటీకే, ఇంటెల్, ఇండియన్ నేవీ, విప్రో, టాటా అడ్వాన్స్ సిస్టమ్, టెక్స్ట్రాన్ తదితర 100 సంస్థలు ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో అక్టోబర్ 8 నుంచి ప్రారంభం
చివరితేదీ: అక్టోబర్ 20
ర్యాంకుల ప్రకటన: అక్టోబర్ 21
వెబ్సైట్: https://iist.ac.in/admissions/undergraduate
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు