గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
- ‘ఆకస్ (ఏయూకేయూఎస్)’ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (డి)
ఎ) కరోనా కొత్త వేరియంట్
బి) వివిధ దేశాల ఉమ్మడి సైనిక విన్యాసం
సి) అత్యంత వేగవంతమైన కంప్యూటర్
డి) మూడు దేశాల కూటమి
వివరణ: భారత్-పసిఫిక్ ప్రాంతంలో తమ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏయూకేయూఎస్ (ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) పేరుతో కొత్త త్రైపాక్షిక కూటమికి ఏర్పాటు చేశాయి. రక్షణ సామర్థ్యాన్ని పంచుకోవడం, చైనా సైనిక ప్రాబల్యాన్ని ఎదుర్కోడానికి వీలుగా అణు శక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చుకునేలా ఆస్ట్రేలియాకు కూటమి తోడ్పాటు ఇస్తుంది. - గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (బి)
ఎ) 45 బి) 46 సి) 47 డి) 48
వివరణ: వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రకటించిన సృజనాత్మక సూచీలో భారత్ 46వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అయిదు దేశాలు- స్విట్జర్లాండ్, స్వీడన్, యూకే, యూఎస్, దక్షిణ కొరియా. ఆసియాలో మంచి ర్యాంకును పొందిన దేశాలు- సింగపూర్ (8), చైనా (12), జపాన్ (13), హాంకాంగ్ (14). గతేడాదితో పోలిస్తే భారత్ రెండు స్థానాలను ఎగబాకింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్, ఆరు సంవత్సరాల్లో 46వ స్థానానికి చేరుకోగలిగింది. 80 సృజనాత్మక అంశాల ఆధారంగా ఈ సూచిని రూపొందించారు - హతే మిరప, తమేగ్లాంగ్ కమలా పళ్లకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఇవి ఏ రాష్ర్టానికి చెందినవి? (సి)
ఎ) మిజోరం బి) రాజస్థాన్
సి) మణిపూర్ డి) మేఘాలయా
వివరణ: మణిపూర్‌లో పండే మిరప, తమేగ్లాంగ్ కమలా (ఆరెంజ్)లకు జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) లభించింది. హతే మిరపను సిరార్ఖాంగ్ మిరప అని కూడా అంటారు. ఒక ప్రదేశంలో పండే పంట లేదా తయారయ్యే వస్తువుకు ప్రత్యేకత లేదా విశిష్ట లక్షణాలు ఉంటే దానికి జీఐ ట్యాగ్ (జాగ్రఫికల్ ఇండెక్స్) ఇస్తారు. దీంతో ఆయా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. మార్కెట్ పరిధి కూడా పెరుగుతుంది. - కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి? (ఎ)
ఎ) టెలికం సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ మార్గంలో 100% అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు
బి) టెలికం సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతి మార్గంలో 100% అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు
సి) టెలికం సంస్థల్లో ఆటోమేటిక్ మార్గంలో 74% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తారు
డి) టెలికం సంస్థల్లో అనుమతి మార్గంలో 74% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తారు
వివరణ: టెలికం రంగంలో పలు సంస్కరణలు తెస్తూ కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ రంగంలోని సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ మార్గంలో 100% అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ రంగంలో పెట్టుబడి పరిమితి 49% వరకు మాత్రమే ఉంది. అలాగే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిల చెల్లింపుపై నాలుగేండ్ల మారటోరియం విధించింది కేంద్రం. టెలికమేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించారు. కొరత ఉన్న స్పెక్ట్రమ్‌ను పంచుకోడానికి అనుమతి ఇవ్వడం, సుంకాలు చెల్లించే ఆదాయ నిర్వచనంలో మార్పులను కూడా ఆమోదించారు. - ‘రూ.25,938’ కోట్లు దేనికి సంబంధించిది? (బి)
ఎ) కొవిడ్ మృతులకు ఇచ్చే పరిహారం మొత్తం
బి) ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం
సి) రాష్ర్టాలకు ఇచ్చిన జీఎస్టీ నష్ట పరిహారం
డి) ఏదీకాదు
వివరణ: దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో వాహన, వాహన విడిభాగాలు డ్రోన్ పరిశ్రమలకు రూ.25,938 కోట్ల విలువ అయిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాహన పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ పథకంలో రూ.42,500 కోట్లకు పైగా తాజా పెట్టుబడులు వస్తాయని, రూ.2.3 లక్షల కోట్లకు పైగా ఉత్పత్తి పెరుగుతుందని అదనంగా 7.5 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి జరిగే వీలుందని భావిస్తున్నారు. 2021-22 కేంద్ర బడ్జెట్లో 13 రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపుల్లో ప్రకటించిన ప్రోత్సాహకాల్లో భాగంగా తాజా పథకాన్ని తీసుకొచ్చారు. దేశీయంగా అధునాతన సాంకేతికతతో వాహన ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలు కలుగుతుంది. - జాతీయ నమూనా సర్వే ప్రకారం కింది వాటిలో సరైనవి ఏవి? (సి)
- రైతు ఆదాయం రోజు కూలి కంటే తక్కువగా ఉంది
- రైతులకు మద్దతు ధర దక్కడం లేదు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: రైతు ఆదాయం రోజు కూలి కంటే తక్కువగా ఉందని జాతీయ నమూనా సర్వేలో వెల్లడయ్యింది. అలాగే తమకు మద్దతు ధర దక్కడం లేదని మెజార్టీ రైతులు చెప్పినట్లు ఇదే సర్వేలో తేలింది. హెక్టార్ భూమి (2.50 ఎకరాల్లోపు) ఉన్న రైతు కుటుంబానికి రోజుకు సగటున రూ.24 మాత్రమే ఆదాయం వస్తుంది. రోజు కూలీ వారికి గ్రామాల్లో రూ.300-500, నగరాల్లో రూ.600-700 వరకు వస్తుంది. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు ఎకరం నుంచి 2.50 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం రూ.6951 చొప్పున లభించింది. దేశం మొత్తం 10.18 కోట్ల భూమి కమతాలుంటే అందులో 2.50 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులే 72.6% మంది ఉన్నారు.
- జాతీయ నేర నమోదు విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అధికంగా బాల్య వివాహాలు 2019లో ఏ రాష్ట్రంలో జరిగాయి? (డి)
ఎ) రాజస్థాన్ బి) హర్యానా
సి) మధ్యప్రదేశ్ డి) కర్నాటక
వివరణ: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో బాల్య వివాహాలు అధికమవుతున్నాయి. 2019లో దేశంలో బాల్య వివాహాలపై 523 ఫిర్యాదులు నమోదు కాగా, 2020 నాటికి 785కు చేరింది. అత్యధికంగా కర్నాటకలో 184, అస్సాంలో 138, పశ్చిమబెంగాల్లో 98, తమిళనాడులో 77 నమోదయ్యాయి. యువతులకు 18, యువకులకు 21 ఏండ్ల వయస్సు రాకముందే జరిగే వివాహాలను బాల్య వివాహాలుగా పరిగణిస్తున్నారు. - ‘ఏక్ పహల్’ దేనికి సంబంధించింది? (బి)
ఎ) పర్యావరణ పరిరక్షణ
బి) సత్వర న్యాయం
సి) కరోనా కట్టడి
డి) ఆరోగ్య పరిరక్షణ
వివరణ: టెలీ-లా అంశానికి విశేష ప్రాచుర్యం కల్పించేందుకు సాంఘిక-న్యాయ మంత్రిత్వ శాఖ ‘ఏక్ పహల్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. న్యాయ సమాచారం, సలహాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వేగంగా, సత్వరంగా న్యాయం చెప్పడమే టెలీ లా ముఖ్య ఉద్దేశం. ఇందుకుగాను నల్సా, సీఎస్సీ-ఈ-గవర్నెన్స్‌తో మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 2న ముగుస్తుంది. - పథకాల అమలు పర్యవేక్షణకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు? (సి)
ఎ) అమిత్ షా
బి) నిర్మలా సీతారామన్
సి) రాజ్‌నాథ్ సింగ్ డి) నితిన్ గడ్కరీ
వివరణ: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్దేశించిన పథకాల అమలుకు మంత్రులతో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు ఇతర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, అర్జున్ ముండా, కిరెన్ రిజిజు, వీరేంద్ర కుమార్‌లకు చోటు కల్పించారు. - విలాస, హానికర ఉత్పత్తులపై సెస్ విధించడానికి కారణం? (బి)
ఋఎ) మారకం విలువను స్థీరికరించేందుకు
బి) జీఎస్టీ అమలు వల్ల రాష్టాలకు వస్తున్న నస్టాన్ని భర్తీ చేసేందుకు
సి) పెరిగిన పెట్రోల్ ధరల మూలంగా
డి) ఏదీకాదు
వివరణ: జీఎస్టీ అమలువల్ల రాష్ర్టాలకు ఏర్పడుతున్న ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు విలాస, హానికర ఉత్పత్తులపై సెస్ విధిస్తున్నారు. ముందుగా నిర్ణయించినట్లు 2017 జూలై నుంచి అయిదేండ్ల పాటు అంటే 2022 జూన్ వరకు ఈ పరిహారం చెల్లిస్తారు. సెస్ వసూలు మాత్రం 2026 మార్చి వరకు కొనసాగిస్తారు. 2020-21 నుంచి కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్న రాష్ర్టాలు, వాటిని తీర్చేందుకు ఈ సెస్ మొత్తాన్ని అందిస్తారు. 2022 జూలై తర్వాత నుంచి 2026 మార్చి వరకు పరిహార సెస్ నుంచే ఈ అప్పులను రాష్ర్టాలు చెల్లించాలి. - యూపీఐ, పే నౌ అనే చెల్లింపు వ్యవస్థలను అనుసంధానం చేశారు. పే నౌ అనేది ఏ దేశానికి చెందింది? (డి)
ఎ) శ్రీలంక బి) రష్యా
సి) మలేషియా డి) సింగపూర్
వివరణ: ఆర్బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్ ద్రవ్య నియంత్రణ ప్రాధికార సంస్థ)లు తమ చెల్లింపుల విధానంలో అనుసంధానతను ప్రకటించాయి. భారత్‌కు చెందిన యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, సింగపూర్‌కు చెందిన పే నౌ అనుసంధానం కానున్నాయి. జూలై 2022 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మరింత వేగంగా చెల్లింపులు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. యూపీఐ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2016లో ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. - ‘ట్రాన్స్‌మెంబ్రేన్ అమినో పెప్టిడేస్ క్యూ’ అనే జన్యువు వార్తల్లో నిలవడానికి కారణం? (సి)
ఎ) కరోనా ఉత్పరివర్తన జన్యువుగా గుర్తింపు
బి) కరోనా వ్యాప్తికి కారణం
సి) ఒడిశాలోని నల్లపులుల్లో కనిపించే జన్యువు
డి) ఊసరవెల్లి రంగులు మార్చడానికి కారణం అయిన జన్యువు
వివరణ: ప్రపంచంలోనే నల్లపులులు కనిపించే ఒకే ఒక ప్రదేశం ఒడిశాలోని సిమ్లిపాల్. అక్కడి పులులు రాయల్ బెంగాల్ పులుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. వీటి శరీరంపై నల్లటి చారలు దట్టంగా పరుచుకొని ఉంటాయి. ఈ పులుల నలుపు వర్ణానికి కారణాన్ని బెంగళూర్ శాస్త్రజ్ఞులు గుర్తించారు. ‘ట్రాన్స్‌మెంబ్రేన్ అమినో పెప్టిడేస్ క్యూ’ అనే జన్యువు ఉత్పరివర్తనమే ఈ పులుల నలుపు రంగుకు కారణం అని తేల్చారు. - తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐటీ విధానంలో ఉన్న అంశాల్లో సరైనవి? (డి)
- ఉద్యోగాల కల్పన
- ఐటీ పెట్టుబడుల ఆకర్షణ
- ఐటీ ఎగుమతుల పెంపు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
వివరణ: ఐటీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ, భవిష్యత్ టెక్నాలజీలతో మెరుగైన పౌర సేవలు తదితర అంశాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తన ఐటీ విధానాన్ని ప్రకటించింది. రానున్న అయిదేండ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పనతో పాటు, ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కార్యకలాపాలను విస్తరించనున్నారు. టీ-ఫైబర్ ద్వారా వంద శాతం ప్రభుత్వ సంస్థలు, గ్రామీణ పట్టణ గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. వచ్చే అయిదేండ్లలో ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లు పెంచాలన్నది కూడా లక్ష్యంగా నిర్ణయించారు. ఐటీలో 3.5 లక్షలు, ఎలక్ట్రానిక్స్‌లో 3 లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు రూ.85 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ కూడా ఐటీ విధానంలో భాగంగా ఉన్నాయి.
- పాలనలో ‘క్లౌడ్ కంప్యూటింగ్’ను వినియోగించుకోవాలని నిర్ణయించిన తొలి రాష్ట్రం? (ఎ)
ఎ) తెలంగాణ బి) కర్నాటక
సి) కేరళ డి) ఆంధ్రప్రదేశ్
వివరణ: ప్రభుత్వ రంగంలో తొలిసారిగా క్లౌడ్ కంప్యూటింగ్ విధానం తెలంగాణలో అందుబాటులోకి రానుంది. సాఫ్ట్వేర్లు, ఫైళ్లను ఇంటర్నెట్లో నిల్వ చేసే స్థలంగా క్లౌడ్ కంప్యూటింగ్ గుర్తింపు పొందింది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఇలా అన్ని రకాల పరికరాల్లో పరిమితులు లేకుండా సురక్షితంగా సమాచారాన్ని భద్రపరచడం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్, సర్వర్లు అవసరం లేకుండా వినియోగించడం దీని ప్రత్యేకత. పాలన సేవల్లో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయ స్థాయిలో పాలన, ప్రజావసరాలకు ఈ సాంకేతికతను వినియోగిచుకొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సర్వర్లు, స్టోరేజ్, డేటాబేస్లు, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్ సేవలను ఇంటర్నెట్ ద్వారా అత్యంత వేగంగా అందించేందుకు ఈ సాంకేతికత దోహద పడుతుంది. - రాష్ట్రంలో కింద పేర్కొన్న ఏ జిల్లాలో జనపనార పరిశ్రమ ఏర్పాటు కావడం లేదు? (సి)
ఎ) వరంగల్ బి) సిరిసిల్ల
సి) సిద్దిపేట డి) కామారెడ్డి
వివరణ: రాష్ట్రంలో మూడు జనపనార పరిశ్రమలు వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. గ్లోస్టర్డ్ లిమిటెడ్, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్, ఎంబీజీ కమోడిటీస్ లిమిటెడ్‌లు వీటిని ఏర్పాటు చేస్తాయి. పెట్టుబడి రూ.887 కోట్లు. ఆయా సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాదాపు 10,400 మందికి ఉపాధి లభించనుంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జనపనార మిల్లులు లేవన్న కొరత తీరనుంది. ఒకేసారి మూడు ఏర్పాటు కానున్న నేపథ్యంలోరాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
- Tags
Previous article
యూకే.. ఉన్నత ప్రమాణాల చదువుకు ఓకే
Next article
Democratic teaching is..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు