‘భారత్ సిరీస్’ దేనికి సంబంధించింది?
- డిపోర్ బిల్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (డి)
ఎ) భారత్‌లో గుర్తించిన కంప్యూటర్ వైరస్
బి) ఆసియా ఖండంలో అత్యంత లోతుగా ఉండే ప్రాంతం
సి) మిజోరంలో కొత్తగా గుర్తించిన జంతు జాతి
డి) అస్సాంలో మంచినీటి సరస్సు
వివరణ: డిపోర్ బిల్ అనేది అస్సాంలోని ఒక మంచినీటి సరస్సు. ఇటీవల దీనిని ‘పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతం (ఎకో-సెన్సిటివ్ జోన్)గా’ గుర్తిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో గువాహటికి నైరుతిలో ఈ సరస్సు ఉంది. రామ్సర్ ఒప్పందంలో దీనిని చిత్తడి నేలగా గుర్తించారు. ఇది పక్షి అభయారణ్యం కూడా. - నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున తొలి రెండు రాష్ర్టాలు ఏవి? (బి)
- మధ్య ప్రదేశ్ 2. గుజరాత్
- కర్నాటక 4. హర్యానా
ఎ) 2, 3 బి) 1, 3 సి) 1, 2 డి) 2, 4
వివరణ: 2020లో నూతన విద్యా విధానాన్ని కేంద్రం ప్రకటించింది. దీనిని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్నాటక కాగా.. రెండో రాష్ట్రం మధ్యప్రదేశ్. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని నూతన విద్యా విధాన లక్ష్యం. ఉన్నత విద్యాసంస్థల్లో 3.5 కోట్ల సీట్లను అందుబాటులోకి తేనున్నారు. కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల మేరకు నూతన విద్యావిధానం రూపుదాల్చింది. మాతృభాషలో విద్యకు ప్రాధాన్యం ఇస్తుంది.
- కింద పేర్కొన్న ఏ సంస్థ/సంస్థలకు భారత్ ఇటీవల ఎన్నికయ్యింది? (సి)
- యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్
- పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: అబిడ్‌జాన్‌లో నిర్వహించిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌లో భారత్ కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు అలాగే పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యింది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ బలోపేతానికి భారత్ కృషి చేస్తుంది. పోస్టల్ ఉత్పత్తులు, సేవల బలోపేతానికి ఇవి పనిచేస్తాయి. దీనిని 1874లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి పురాతన అంతర్జాతీయ వ్యవస్థల్లో ఇది రెండో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌లోని బెర్న్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 192 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు జరిగిన ఎన్నికల్లో భారత్ 134 ఓట్లు పొందింది. అలాగే పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో భారత్ 106 ఓట్లను దక్కించుకుంది.
- కేంద్రం ఇటీవల ‘ఈ-శ్రమ్’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది ఎవరికి ప్రయోజనం? (ఎ)
ఎ) అసంఘటితర రంగ కార్మికులకు
బి) భూమిలేని పేదలకు
సి) ప్రభుత్వ ఉద్యోగులకు
డి) ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు
వివరణ: అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు 38 కోట్ల మంది కార్మికులకు సంబంధించిన డేటా బేస్ ఈ-శ్రమ్ పోర్టల్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్లకు చేరవేసేందుకు ఉద్దేశించింది ఇది. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ వివరాలతో ఉచితంగా ఈ పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకోవచ్చు. వాళ్లకు ఈ-శ్రమ్ కార్డ్‌తో పాటు యూనిక్ యూనివర్సల్ అకౌంట్ నంబర్‌ను కేటాయిస్తారు. దీని ద్వారా సాంఘిక భద్రతా పతకాలను పొందవచ్చు. నమోదు పొందిన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యం పొందితే
రూ.లక్ష వరకు ఇస్తారు. - జీఎంసీపీ ప్రాజెక్ట్‌కు భారత్ గ్రాంట్, లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది. ఇది ఏ దేశానికి సంబంధించిన ప్రాజెక్ట్? (డి)
ఎ) మడగాస్కర్ బి) మయన్మార్
సి) శ్రీలంక డి) మాల్దీవులు
వివరణ: మాల్దీవుల్లో అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు భారత్ 100 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో పాటు, 400 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఇచ్చింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికే గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్‌గా పేర్కొంటారు. ఆ దేశ రాజధాని మాలేను మూడు దీవులతో అనుసంధానం చేస్తారు. 6.74 కిలోమీటర్ల పొడవైన వంతెన విల్లింగ్లి, గుల్హిఫల్హు, తిలాఫుషిలతో కలుపుతారు. - జీయూఏఆర్ఈఎక్స్ (గౌరెక్స్) దేనికి సంబంధించింది? (సి)
ఎ) గ్రామాల కోసం కొత్త పథకం
బి) ఆవులకు సంబంధించిన సూచీ
సి) వ్యవసాయ రంగ సూచీ
డి) ఏదీకాదు
వివరణ: భారత దేశపు తొలి వ్యవసాయ రంగ సూచీనే గౌరెక్స్ (జీఏయూఆర్ఈఎక్స్). దీనిని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్సేంజ్ తయారు చేసింది. ఇది ధరల ఆధారంగా తయారైన సూచీ. భవిష్యత్తు ఒప్పందాలను ఇది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. - డబ్ల్యూపీఎన్ఎక్స్టీ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. దీని ప్రధాన లక్ష్యం? (బి)
ఎ) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం
బి) మహిళల్లో వ్యవస్థాపనను పెంచడం
సి) ప్రపంచ ఆర్థిక ఫోరానికి హాజరయ్యే విధానం
డి) ఆర్థిక, శాస్త్ర పరిజ్ఞానాలకు సంబంధించింది
వివరణ: మహిళల వ్యవస్థాపనకు ప్రయోజనం కలిగించేందుకు నీతి ఆయోగ్, సిస్కో సంస్థలు సంయుక్తంగా ప్రారంభించిన కొత్త వేదికే డబ్ల్యూపీఎన్ఎక్స్టీ. నైపుణ్యాల పెంపు, మార్కెటింగ్, నెట్వర్కింగ్ తదితర అంశాల్లో ఈ వేదిక మహిళలకు తోడ్పాటునందిస్తుంది. భారత్‌లో మహిళా వ్యవస్థాపకులు కేవలం 13.76% మాత్రమే ఉన్నారు. కొత్తవారిని ప్రోత్సహించడం ద్వారా 170 మిలియన్ ఉద్యోగాలను 2030 నాటికి సృష్టించాలని లక్ష్యం. దీని ద్వారా జీడీపీ 1.5% మేర పెరుగుతుందని అంచనా. - హైదరాబాద్ విశ్వ విద్యాలయం రూపొందించిన ‘ఇన్‌క్లూజివ్ గ్రోత్ చైన్’ ఎవరికి ప్రయోజనం? (ఎ)
ఎ) రైతులకు
బి) బ్యాంకింగ్ సేవలు అందని ప్రాంతాలకు
సి) వివిధ పథకాల లబ్ధిదారులకు
డి) చిన్న వ్యాపారులకు
వివరణ: ఎరువులు, విత్తనాల కోసం రైతుల ఇబ్బందులను తీర్చేందుకు బ్లాక్ చెయిన్ సాంకేతికత పరిజ్ఞానంతో హైదరాబాద్ విశ్వ విద్యాలయ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేసిందే ఇన్‌క్లూజివ్ గ్రోత్ చైన్. రైతులు, ముడిసరుకు సరఫరాదారులు, కొనుగోలుదారులతో ఇది అనుసంధానమై ఉంటుంది. రైతు ఉత్పత్తి సంఘాల్లోని సభ్యులు తర్వాత వచ్చే సీజన్‌కు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల వంటిని యాప్‌లో తమ మాతృభాషలో నమోదు చేసుకోవచ్చు. ఈ వివరాలను నేరుగా సంస్థలకు ఆర్డర్ రూపంలో చేరవేస్తారు. ఫలితంగా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుంది. ప్రయోగాత్మకంగా తమిళనాడులో ప్రారంభించారు. సెప్టెంబర్ 2021లో తెలంగాణలోని కామారెడ్డిలో దీనిని అందుబాటులోకి తేనున్నారు. - రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థులకు ఏమైనా నేర చరిత్ర ఉంటే, ఆ వివరాలను పార్టీ వెబ్సైట్లో ఎంపిక చేసిన ఎంత సమయంలోగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్ట్ ఇటీవల తీర్పు చెప్పింది? (సి)
ఎ) 24 గంటలు బి) వారంలోగా
సి) 48 గంటలు డి) 72 గంటలు
వివరణ: అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేర చరిత్రను పార్టీలు తమ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే ఈ వివరాలన్నీ ఒకే చోట అందించేలా ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది. ఉల్లంఘనలకు పాల్పడే రాజకీయ పార్టీలపై జరిమానాలు విధించి, ఆ రూపంలో వచ్చే నగదును తీర్పు వెలువడిన నాలుగు వారాల్లోగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, అందులో జమ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
10 ‘భారత్ సిరీస్’ దేనికి సంబంధించింది? (బి)
ఎ) 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బి) వాహన రిజిస్ట్రేషన్లు
సి) అఫ్గానిస్థాన్ నుంచి భారతీయులను
రప్పించడం
డి) ఏదీకాదు
వివరణ: వాహనదారులు రాష్ర్టాలు మారినప్పుడు వాటి రిజిస్ట్రేషన్ మార్పిడిలో వస్తున్న ఇబ్బందుల పరిష్కారానికి కేంద్రం కొత్త విధానాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి భారత్ సిరీస్ పేరుతో ఒకే రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయనుంది. ఉద్యోగ రీత్యా తరచూ వివిధ రాష్ర్టాలకు బదిలీ మీద వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వాహనాల రీ రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త విధానంతో అది తీరనుంది. వాహనాలను ఉద్యోగులు ఇక ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ర్టానికి అయినా ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లవచ్చు. వెళ్లిన రాష్ట్రంలో మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. - దేశంలో తొలి ఈ-ఫ్రెండ్లీ వెహికిల్ హైవే ఏ రెండు ప్రాంతాల మధ్య ఏర్పాటు చేశారు? (డి)
ఎ) కోల్‌కతా-హల్దియా
బి) ముంబై-చెన్నై
సి) కోల్‌కతా-అమృత్సర్
డి) ఢిల్లీ-చండీఘర్
వివరణ: దేశంలో తొలి ‘ఈ-వెహికిల్ ఫ్రెండ్లీ హైవే’గా ఢిల్లీ-చండీఘర్ రహదారిని ఏర్పాటు చేశారు. ఈ దారిలో దేశపు తొలి సౌర ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్‌ను కూడా ఆగస్ట్ 19న ప్రారంభించారు. ఢిల్లీ, చండీఘర్‌కు మధ్యలో ఈ చార్జింగ్ పాయింట్ ఉంది. సౌర ఆధారిత వాహన చార్జింగ్ స్టేషన్‌ను బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్) అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేంద్రం ప్రారంభించిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్-1) పథకంలో ఇది భాగం. - కింద పేర్కొన్న ఏ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక సుస్థిరాభివృద్ధి సూచీని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది? (సి)
ఎ) దక్షిణాది రాష్ర్టాలు
బి) వెనుకబడిన నగరాలు
సి) ఈశాన్య రాష్ర్టాలు
డి) ఆకాంక్షిత జిల్లాలు
వివరణ: ప్రత్యేకించి ఈశాన్య రాష్ర్టాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతిని గణించి నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇందుకు సహకరించింది. ఈశాన్య రాష్ర్టాలు.. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. మొత్తం 103 జిల్లాలను ర్యాంకింగ్‌కు పరిగణించారు. ఇందులో 64 జిల్లాలు ‘ఫ్రంట్ రన్నర్’ విభాగంలో ఉన్నాయి, 39 జిల్లాలు ‘పర్ఫామర్’ విభాగంలో చేరాయి. అగ్రస్థానంలో తూర్పు సిక్కిం జిల్లా ఉంది. రెండో స్థానంలో గోమతి, ఉత్తర త్రిపుర జిల్లాలు
నిలిచాయి. - ఇటీవల పౌల్ట్రీ రైతులకు కేంద్రం కొత్త సూచనలు చేసింది. ప్రధాన లక్ష్యం ఏంటి? (ఎ)
ఎ) పర్యావరణ పరిరక్షణ
బి) పౌల్ట్రీ రైతుల ఆదాయం పెంపు
సి) పౌల్ట్రీ ఎగుమతుల పెంపు
డి) స్వయం స్వావలంబన సాధించడం
వివరణ: పర్యావరణ పరిరక్షణలో పౌల్ట్రీ రైతులను కూడా భాగం చేస్తూ కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటివరకు చిన్న, మధ్య పౌల్ట్రీ రైతులను కొన్ని అంశాల నుంచి మినహాయించారు. తాజాగా వారిని కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం చేశారు. కొత్త వర్గీకరణ ప్రకారం 5000 నుంచి 25,000 వరకు కోళ్లు ఉంటే చిన్న రైతుగా, 25,000 నుంచి 1,00,000 లోపు ఉంటే మధ్య తరగతి రైతుగా, 1,00,000కు మించి ఉంటే పెద్ద రైతుగా పరిగణిస్తారు. మధ్య సైజులో ఉండే పౌల్ట్రీఫామ్ నిర్వహణకు అనుమతి పత్రం అవసరం. దీనిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ నుంచి పొందాలి. - 1,02,718.. ఈ సంఖ్య వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (డి)
ఎ) భారత్ చేసిన అప్పు
బి) రికార్డ్ స్థాయిలో వసూలైన జీఎస్టీ
సి) ఒక రోజులో పెరిగిన మదుపర్ల సంపద
డి) భారత్‌లో ఉన్న జంతు జాతుల సంఖ్య
వివరణ: భారత్‌లో జంతు జాల జాబితాకు 557 కొత్తగా చేరినట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇందులో 407 పూర్తిగా కొత్త జాతులు కాగా, 150 మాత్రం కొత్తగా రికార్డులోకి చేరినవి. వీటితో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న జాతుల సంఖ్య 1,02,718. - ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ దేనికి సంబంధించింది? (సి)
ఎ) బియ్యం బి) గోధుమలు
సి) చెరకు డి) తృణధాన్యాలు
వివరణ: ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (సరసమైన, ప్రోత్సాహకార ధర) అనేది చెరకుకు సంబంధించింది. ఇది కూడా కనీస మద్దతు ధర లాంటిది. దీనిని క్వింటాలుకు రూ.5 చొప్పున పెంచి రూ.290గా కేంద్రం నిర్ణయించింది. క్వింటాలు చెరకు ఉత్పత్తి ధర రూ.155గా ఉంది. ప్రస్తుతం ధర పెంపు నిర్ణయంతో చెరకు రైతులకు ఆర్థికంగా కొంత మేర మేలు చేస్తుంది. చక్కెర ఎగుమతులు, ఇథనాల్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
- Tags
- India Series
Previous article
ఇంగ్లిష్‌లో మాట్లాడుదాం అలవోకగా
Next article
యునెస్కోలో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు