ఇంగ్లిష్‌లో మాట్లాడుదాం అలవోకగా
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మండలాలున్నాయి. మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎకువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. తెలుగు అధికారిక భాష అయిన తెలుగు రాష్ట్రాల్లో అనేక మాండలికాలు ఉన్నాయి. తెలుగు పాఠ్యపుస్తకంలో ప్రకృతి, వికృతి పదాలు కూడా నేర్చుకున్నాం. తెలుగులో ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న పదాలున్నాయి. సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అరువు వెళ్లిన పదాలున్నాయి. పదాల ఉచ్ఛారణలో కొన్ని సందర్భాల్లో వైవిధ్యం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా మాట్లాడే తెలుగు వలే ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే ఆంగ్ల భాష కూడా వైవిధ్యభరితమైనది.
ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మాట్లాడే భాష ఇంగ్లిష్. ఈ భాషను ప్రథమ భాషగా మాట్లాడేవారిని నేటివ్ స్పీకర్స్ అని అంటాం. కానీ ఆంగ్లం చాలా దేశాల్లో వాడుకలో ఉండటం వల్ల నాన్ నేటివ్ స్పీకర్లు కూడా ఎకువే. ఇంగ్లిష్‌ని మొదటి భాషలాగా వాడేవారికంటే ద్వితీయ భాషగా మాట్లాడేవారు ఎకువ. ఇంగ్లిష్ ప్రపంచ దేశాల్లో ఎకువగా నేర్చుకొనే ఫారిన్ లాంగ్వేజ్ కూడా. సుమారు 1.5 బిలియన్ లెర్నర్స్ ఉన్నారు. ఇంట్లో ఎకువగా మాతృభాష మాట్లాడటం వల్ల అది నేర్చుకోవడం సులభం. కానీ ఆంగ్లం పట్ల కొంచెం ఎకువ శ్రద్ధ వహించాలి.
భయం వీడండి
- ఇంగ్లిష్ మీడియంలో చదివినా ఆంగ్లంలో మాట్లాడమని అడిగితే ఎందుకో కొన్ని సందర్భాల్లో వెనుకంజ వేస్తూ ఉంటారు. ఆంగ్ల భాషలో మాట్లాడటం నేర్చుకోవాలంటే ముందు వామ్మో ఇంగ్లిషా అనే భయం వీడాలి. మాట్లాడితేనే పదాల ఉచ్ఛారణ గమనించుకోగలం. పదాలు కరెక్టుగా పలికిన తరువాతే వాక్యాలు అనర్గళంగా పలుకగలం.
- కరెక్టుగా మాట్లాడగలమో లేదో అని, తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని, గ్రామర్ తప్పులుంటాయేమోనని భయాలుంటే ఆందోళన చెందడంలో ఆశ్చర్యం లేదు. ఆందోళన చెందినప్పుడు తప్పులు దొర్లుతాయి. అందువల్ల భయాన్ని అధిగమించండి.
- సాధన అవసరం: మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలనే దాని గురించి అలోచించి సాధన చేయండి. సహజంగా ప్రతిభావంతులైన వ్యక్తులు కూడా తమను తాము సిద్ధం చేసుకుంటారు. చాలా ప్రాక్టీస్ చేయండి. దాన్ని సాధించడానికి సమయం, శక్తిని పెట్టుబడిగా పెట్టాలి.
- ఒకరితో మొదలు పెట్టండి: గుంపులో మాట్లాడుతున్నప్పుడు అన్ని డైరెక్షన్లలో ఆ మాటలు వెళ్లొచ్చు. దానివల్ల కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి మొదట ఒకరితో మాట్లాడటం ప్రారంభించండి. అప్పుడు వారి స్పీడ్, స్పీకింగ్ ైస్టెల్ సులభంగా అర్థమవుతుంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తప్పులుంటాయన్న భయం వీడి ప్రశాంతంగా మాట్లాడండి.
- ప్రశ్నలు అడగటం నేర్చుకోండి: సంభాషణలో మనం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మాట్లాడటం కొంత కష్టమే. కానీ సంభాషణలో పాల్గొనాలంటే మాట్లాడాలి. ఆంగ్లంలో సంభాషించడానికి ధైర్యం చేయలేకపోతే కనీసం సరైన ప్రశ్నలు వేసి ఎదురుగా ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇచ్చి వారిని మాట్లాడేలా చేస్తే అప్పుడు మెళ్లిగా సంభాషణలో పాల్గొనవచ్చు. అలాగే భయాన్ని వీడొచ్చు.
- స్పీడ్ గమనించుకోండి: ఆందోళన చెందినప్పుడు కొన్ని సందర్భాల్లో త్వర త్వరగా మాట్లాడుతుంటారు. అలా కాకుండా స్పీడ్ గమించండి. మనం మాట్లాడేది ఎదుటివారికి అర్థమవడం ముఖ్యం. ఎంత గొప్ప పదజాలం ఉపయోగించాం, ఎంత పర్ఫెక్ట్గా గ్రామర్ ఉపయోగించాం అన్నది తరువాత.
- సాధారణ సంభాషణలు: టెక్నికల్ స్పీకింగ్, కాలేజీ ప్రజంటేషన్, ఎలక్షన్ క్యాంపెయిన్ లాంటి వాటికి ముందుగా ప్రిపేరవ్వాలి. అలాగే మనచుట్టూ తరచూ జరిగే సంభాషణలు ఏంటో గమనించాలి. వాటితో రిహార్సల్స్ చేయాలి. ఉదాహరణకి పరిచయం లేని వ్యక్తిని ఒక సెమినార్లో కలిసినప్పుడు సాధారణంగా అడిగే ప్రశ్నలేంటో ఆలోచించండి. మీ గురించి చెప్పడం, వారి గురించి, వారి పని, వారి అభిరుచులు, వారి ఆసక్తుల గురించి తెలుసుకుంటాం. సెమినార్ ఎలా జరిగిందో చర్చించుకుంటాం. అలాంటిది ముందే రిహార్సల్ చేసుకుంటే కొంచెం సులువుగా, ధైర్యంగా ఉంటుంది.
- చిరునవ్వు: స్పీకింగ్‌లో పదాలతో పాటు ముఖ కవళికలు కూడా ముఖ్యమే. అవి ఎన్నో మాటలు చెబుతాయి. భయం, బిడియం వీడి చిరునవ్వుతో సందర్భానుచితంగా మాట్లాడండి.
నమ్మకం పెంచుకోండి
- మాట్లాడగలను అనే నమ్మకం మీకు రావాలి. అది రావాలంటే ముందు ధైర్యం కావాలి. మొదట ఇంగ్లిష్‌లో మీతో మీరే మాట్లాడుకోండి. రాత పూర్వకంగా ఉన్నప్పుడు భాషలో తప్పులుంటే అర్థమవడం కష్టం. కానీ స్పీకింగ్‌లో మరీ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. మీ టోన్ వల్ల కొంచెం ఎదుటివారు సులువుగా అర్థం చేసుకోవచ్చు.
- బయటికి చదవండి: మాట్లాడాలంటే ఏదో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఆ విషయం ఏమిటని ఆలోచించుకొని, వాక్యాలు ఫ్రేమ్ చేసుకొని, ఆ తర్వాత అందులో వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. కాబట్టి మొదట ఏదైనా పుస్తకం లేదా న్యూస్‌పేపర్ చదవడం నేర్చుకోండి. నవలలో చాలా పాత్రలుంటే స్నేహితులతో కలిసి రోల్ ప్లే చేయవచ్చు. బిగ్గరగా చదవండి. పదాలు స్పష్టంగా పలకండి. స్పీడ్ గమనించండి. అందులోని ఎమోషన్స్ మీ మాటల్లో పలకాలి. బయటకు చదివితే అర్థమయ్యేలా చదవాలి. వాక్యాలు చదివేటప్పుడు పంక్చువేషన్ మార్స్‌ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఎకడ స్ట్రెస్ చేయాలో కూడా చూసుకోవాలి. సులువుగా అర్థమయ్యే రైటింగ్ ైస్టెల్స్లో ఉన్న పుస్తకాలను చదవడం మొదలుపెట్టండి.
- రికార్డింగ్: మాట్లాడిన విషయాన్ని రికార్డు చేసుకొని ఆ తర్వాత వినండి. ఎక్కడ బాగా చేయగలమో చూసుకోండి. ఉచ్ఛారణ స్పీడ్ గమనించుకోవచ్చు. వీలైతే వీడియో రికార్డింగ్ చేసుకొని చూడండి. మాట్లాడేటప్పుడు స్ట్రెస్‌ఫుల్‌గా ఉండకూడదు. ముఖ కవళికలు ఆ మాటలకు అనుగుణంగా పలికితే బాగుంటుంది.
- ఫీడ్ బ్యాక్ తీసుకోండి: మొక్కయి వంగనిది మానై వంగునా అని ఊరికే అనలేదు. చిన్నతనంలో తప్పులు చేస్తామన్న భయంలేదు. ఎవరైనా చెబితే తెలుసుకోవడంలో అభ్యంతరం ఉండదు. కానీ పెరుగుతున్న కొద్దీ ఎవరైనా తప్పును చూపిస్తే అంత సులభంగా కొందరు అంగీకరించలేరు. ఇంగ్లిష్ టీచర్ లేదా ట్రైనర్ సలహాలు పాటించండి.
- ప్రాక్టీస్ విత్ మిర్రర్: పదిమందిలో మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు మిర్రర్ ముందు నిల్చొని రిహార్సల్స్ చేయాలి. అలా మాట్లాడటం వల్ల చేతిలో ఉన్న నోట్స్‌పై దృష్టి ఉండదు. అలాగే బాడీ లాంగ్వేజ్‌ని గమనించవచ్చు. అద్దం ముందు సాధన అనేది కొత్త విషయమేం కాదు. చాలామంది గ్రేట్ స్పీకర్స్ ఇలాగే చేస్తూ ఉంటారు. దీనివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
- గ్రామర్ రూల్స్: వాక్యం రాయాలంటే కొన్ని పదాలు కావాలి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా పదాల అమరిక వల్ల అర్థాలు మారుతుంటాయి. అందుకే గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి.
- ఇంగ్లిష్ తప్పులు: ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రయత్నం చేసేవారు మొదట టెన్సెస్ వంటి గ్రామర్ కాన్సెప్ట్స్‌ని నేర్చుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది.
- ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మనం చేసే ప్రతి ప్రయత్నం ఆ కారణం దగ్గరకి తీసుకెళ్తుంది. అధైర్యపడినా ఆ కారణమే ప్రోత్సాహాన్నిస్తుంది.
ఇంగ్లిష్ వినండి
- ఆంగ్ల భాష పలు దేశాల్లో వాడుకలో ఉంది. ఆ దేశాల్లో ఉచ్ఛారణ కూడా మారుతుంటుంది. మొదట భారతీయులు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవాలంటే ఇంగ్లిష్ వార్తలు వినండి. ట్రావెల్ ఛానల్, హిస్టరీ ఛానల్, సైన్స్ షోస్ వంటి వాటిలో విభిన్నమైన పదాలను ఉపయోగిస్తూ మాట్లాడుతారు. వారి ఉచ్ఛారణ గమనించండి. మొదట టీవీలో చూస్తూ నేర్చుకున్నా ఆ తర్వాత ఇంగ్లిష్ ఉండే పాడ్ కాస్ట్స్ వినండి. రిసెర్చ్ ద్వారా తెలిసిందేమంటే పాడ్ కాస్ట్స్ విన్నప్పుడు టీవీ చూస్తున్నప్పటి కంటే మెదడు ఎకువ షార్ప్‌గా పనిచేస్తుంది. అలాగే ఆడిబుల్ వంటి యాప్స్‌లో బుక్స్ వినండి.
- స్థానికులు మాట్లాడేటప్పుడు వారు ఎలా మాట్లాడుతున్నారు, ఏ వాక్యాలకు ఎకువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది గమనించండి. నేటివ్ స్పీకర్స్ మాట్లాడినట్టు ఆ పదాలను స్ట్రెస్ చేసే ప్రయత్నం చేయండి.
- ఇంగ్లిష్‌లో ఒకే స్పెల్లింగ్ ఉన్న పదాలకు పలు అర్థాలుంటాయి. వాటిలో ఉచ్ఛారణలో తేడా ఉండే అవకాశం ఉంది. పదంలో ఉన్న అక్షరాల్లో ఏ అక్షరంపై స్ట్రెస్ చేశారో దాన్నిబట్టి అర్థం మారవచ్చు. ఉదాహరణకు ఇంగ్లిష్‌లో కంటెంట్ అనే పదానికి ఉచ్ఛారణ బట్టి పలు అర్థాలున్నాయి. కంటెంట్ అంటే పుస్తకంలో ఉండేది, ప్రశాంతత అని కూడా అర్థం వస్తుంది.
- ఇంగ్లిష్‌లో ఆలోచించగలరో చూడండి: చాలా సందర్భాల్లో మనం మనతోనే మాట్లాడుకుంటాం లేదా ఆలోచిస్తుంటాం. అవి చాలావరకు మాతృభాషలోనే ఉంటాయి. ఖాళీ సమయాల్లో ఇంగ్లిష్‌లో ఆలోచించే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల ఇంకా త్వరగా నేర్చుకోగలరు.
- ఇంగ్లిష్‌లో మాట్లాడాలని ఎలా అనుకుంటున్నారో, అలాగే ఎంతో పట్టుదలతో నమ్మకం ఉంచుకొని, ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా నేర్చుకోండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు