ఆగస్టు 19ని ఏ రోజుగా నిర్వహిస్తారు?
- కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (సి)
ఎ) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్‌కు చెందిన ప్రదేశాలు 46 ఉన్నాయి. రామ్సర్ జాబితాలో 40 చిత్తడి నేలలు ఉన్నాయి
బి) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్‌కు చెందిన ప్రదేశాలు 40 ఉన్నాయి. అలాగే రామ్సర్ జాబితాలో కూడా 40 చిత్తడి నేలలు ఉన్నాయి
సి) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్‌కు చెందిన ప్రదేశాలు 40 ఉన్నాయి. రామ్సర్ జాబితాలో భారత్ నుంచి 46 చిత్తడి నేలలు ఉన్నాయి
డి) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్‌కు చెందిన ప్రదేశాలు 46 ఉన్నాయి. అలాగే రామ్సర్ జాబితాలో కూడా 46 చిత్తడి నేలలు ఉన్నాయి
వివరణ: తెలంగాణలోని రామప్ప దేవాలయం, గుజరాత్‌లోని ధోలవీర యునెస్కో వారసత్వ సంపదలో చేరడంతో భారత్ తరఫున ఆ జాబితాలో ఉన్న వాటి సంఖ్య 40కి చేరింది. తాజాగా రామ్సర్ సైట్లలో నాలుగింటిని చేర్చారు. దీంతో ఆ జాబితాలో భారత్‌లో ఉన్న చిత్తడి నేలల సంఖ్య 46కు చేరింది. కొత్తగా చేరినవి- హర్యానాలోని సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ (గురుగ్రామ్), భిందవాస్ వైల్డ్‌లైఫ్ శాంక్చువరీ (ఝజ్జర్), అలాగే గుజరాత్‌లోని థోల్ సరస్సు, వన్యమృగ సంరక్షణ కేంద్రం, వాధ్వానా చిత్తడి నేలకు కూడా గుర్తింపు లభించింది. చిత్తడి నేలల పరిరక్షణకు కుదిరిన ఒప్పందమే రామ్సర్. ఇది ఇరాన్లో ఒక నగరం, అక్కడ ఒప్పందం కుదరడంతో దాని పేరు మీదుగా పిలుస్తున్నారు. - వాహనాల తుక్కు విధానాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటి? (డి)
- పర్యావరణానికి మేలు చేయడం
- సంపద పునఃసృష్టి చేయడం
ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
వివరణ: వృథాగా ఉన్న అసంఖ్యాక పాత వాహనాల తుక్కును పునర్వినియోగంలోకి తేవడం ద్వారా సంపద పునఃసృష్టి చేయడంతో పాటు పర్యావరణానికి మేలు చేయాలన్న సంకల్పంతో భారత్‌లో తుక్కు విధానాన్ని ఆగస్టు 14న ఆవిష్కరించారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో రాబట్టి వేల ఉద్యోగాలను సృష్టించాలని నిర్ణయించారు. 20 సంవత్సరాలు పైబడిన 51 లక్షల లైట్ మోటార్ వాహనాలను ఈ విధానం పరిధిలోకి తేవచ్చని, అలాగే 15 సంవత్సరాల పైబడిన దాదాపు మరో 34 లక్షల వాహనాలను తేవచ్చని భావిస్తున్నారు.
- క్యూయూఈఎస్టీ (క్వెస్ట్)ను ఇటీవల ఇస్రో ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం? (సి)
ఎ) అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేయడం
బి) అంతరిక్ష ప్రయోగాల వైఫల్యాన్ని కనుగొనడం
సి) వైద్య రంగాన్ని ఆధునీకరించడం
డి) వ్యవసాయ భూముల నాణ్యతను నిర్ణయించడం
వివరణ: వైద్య రంగంలో అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇస్రో చైర్మన్ కే శివన్ ఇటీవల హెల్త్ క్వెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని పూర్తి రూపం- హెల్త్ క్వాలిటీ అప్‌గ్రెడేషన్ ఎనేబుల్డ్ బై స్పేస్ టెక్నాలజీ. అంటే అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైద్య రంగాన్ని ఆధునీకరించడం. ఆస్పత్రుల్లో సహజంగా జరిగే తప్పులను తగ్గించి అత్యుత్తమ సేవలను రోగులకు అందిస్తారు. ఇస్రో పాటించే అత్యుత్తమ విధానాలను దేశ వ్యాప్తంగా 20 ప్రైవేట్ ఆస్పత్రులతో ఇస్రో పంచుకుంటుంది. - ‘టీఏపీఏఎస్ (తపస్)’ను ఇటీవల ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) విద్య బి) సాంఘిక రక్షణ
సి) యోగాతో ఆరోగ్యం పెంపు
డి) ఎగుమతుల వృద్ధి
వివరణ: సాంఘిక న్యాయం-సాధికారత మంత్రి త్వ శాఖ టీఏపీఏఎస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీఏపీఏఎస్ అంటే ‘ట్రెయినింగ్ ఫర్ ఆగ్మెంటింగ్ ప్రొడక్టివిటీ అండ్ సర్వీసెస్. తెలుగులో ‘ఉత్పాదకత, సేవల పెంపునకు శిక్షణ’గా భావించవచ్చు. సాంఘిక రక్షణ లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. వీడియో తరగతులతో పాటు ఈ-స్టడీ మెటీరియల్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి అయిదు కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. అవి 1. డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ (మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం) 2. జెరియాట్రిక్ (వృద్ధుల సంరక్షణ) 3. మానసిక వికలాంగుల పరిరక్షణ, నిర్వహణ 4. ట్రాన్స్‌జెండర్ సమస్యలు 5. సాంఘిక భద్రతకు సంబంధించి సమగ్ర కోర్స్. - సోన్ చిరయా అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎవరి ఉత్పత్తుల పెంపునకు ఇది ఉద్దేశించింది? (డి)
ఎ) నగల వ్యాపారుల
బి) ఎంఎస్ఎంఈ సంస్థల
సి) వస్త్రవ్యాపారుల
డి) స్వయం సహాయక సంఘాల
వివరణ: స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు సోన్ చిరయా అనే పేరుతో ఒక బ్రాండ్, లోగోను పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వారి ఉత్పత్తులకు ప్రాచు ర్యం కల్పిస్తారు. ఇందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల 2000 ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. సుమారుగా 5000 మంది స్వయం సహాయక సభ్యులు లబ్ధి పొందనున్నారు. - డిజిటల్ ప్రయాస్ దేనికి సంబంధించింది? (సి)
ఎ) డిజిటల్ పరిజ్ఞానం పెంపు
బి) డిజిటల్ పద్ధతిలో యోగా
సి) యాప్ ఆధారిత రుణాలు
డి) యాప్ ఆధారితంగా విద్య
వివరణ: యాప్ ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ప్రయాస్‌ను తీసుకొచ్చింది. యాప్‌లో వివరాలు సమర్పించిన రోజునే రుణం లభిస్తుంది. తక్కువ ఆదాయం ఉండే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ రుణాలు ఇస్తారు. దీనికి సంబంధించి బిగ్ బాస్కెట్‌తో ఎస్ఐడీబీఐ ఒప్పందం కుదుర్చుకుంది. వస్తువులను ఇళ్లకు అందించేందుకు ఈ-బైక్‌లు, ఈ-వ్యాన్లను కొనేందుకు రుణాలను కూడా ఇవ్వనుంది. - కింది వాటిలో సరైనది? (డి)
- దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది ఇండోర్
- దేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీ ఇండోర్
ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
వివరణ: దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచిన ఇండోర్ తాజాగా మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. దేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీ అనే పేరును సంపాదించింది. మొత్తం 11 అంశాల ప్రాతిపదికన కేంద్రం మదింపు చేపట్టింది. 200 ప్రాంతాలను పరిశీలించింది. చెత్త, వ్యర్థ జలాలు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలు ఇందులో ప్రాతిపదికలుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.300 కోట్ల వ్యయంతో రెండు నదులు, 27 మురుగునీటి పారుదల వ్యవస్థలలో వ్యర్థాలను పారబోతను అరికట్టింది. ఇందుకుగాను మున్సిపల్ కార్పొరేషన్ మూడేళ్లుగా సమర్థ చర్యలు తీసుకుంది.
- దేశంలో తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభించనున్నారు? (డి)
ఎ) గుజరాత్ బి) మహారాష్ట్ర
సి) జమ్ముకశ్మీర్ డి) కేరళ
వివరణ: డ్రోన్ల నుంచి భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో దేశంలో తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, పరిశోధన కేంద్రాన్ని కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ తరహా లోహ విహంగాల నుంచి వచ్చే ముప్పులను విశ్లేషించడంతో పాటు వీటిని ఎక్కడెక్కడ వినియోగించుకోవచ్చో పరిశోధనలు జరుగుతాయి. - దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఫోన్లను ఏ జాతీయ పార్క్‌లో వినియోగించాలని
నిర్ణయించారు? (సి)
ఎ) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
బి) నాగార్జునసాగర్-శ్రీశైలం జాతీయ పార్క్
సి) కజిరంగా జాతీయ పార్క్
డి) కాంచనజంగ జాతీయ పార్క్
వివరణ: వేటగాళ్ల బారి నుంచి పక్షులను రక్షించేందుకు, అలాగే వరద సమయాల్లో జంతువులను కాపాడేందుకు శాటిలైట్ ఫోన్లను వినియోగించాలని కజిరంగా జాతీయ పార్క్ అధికారులు నిర్ణయించారు. ఈ తరహా సౌకర్యం భారత్‌లో అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. శాటిలైట్ ఫోన్లను పౌరులు వినియోగించడానికి అనుమతించరు. వీటికి సిగ్నల్స్ నేరుగా ఉపగ్రహం నుంచి అందుతాయి. అవి టవర్ల ద్వారా వచ్చే సిగ్నళ్లపై ఆధారపడవు. కజిరంగా జాతీయ పార్క్ అస్సాంలో ఉంది. జాతీయ పార్క్‌గా 1974లో, పులుల రిజర్వ్‌గా 2007లో ప్రకటించారు. ఇక్కడ రిజర్వ్ 1030 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. 1985లో యునెస్కో వారసత్వ సంపద జాబితాలో కూడా ఈ పార్క్ చోటు సంపాదించింది. - ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ నిషేధం ఎప్పటి నుంచి భారత్‌లో అమలులోకి రానుంది? (బి)
ఎ) అక్టోబర్ 2, 2021
బి) జూలై 1, 2022
సి) డిసెంబర్ 25, 2021
డి) అక్టోబర్ 31, 2021
వివరణ: ప్లాస్టిక్ వృథా నిర్వహణ సవరణ నిబంధనలు-2021ను ఇటీవల పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ను 2022, జూలై 1 నుంచి తయారు చేయడం, దిగుమతి, నిల్వ, సరఫరా, అమ్మకం, ఉపయోగించడం నిషేధిస్తారు. కంపోస్టబుల్ ప్లాస్టిక్‌పై ఎలాంటి నిషేధం ఉండదు. పెట్రో రసాయనాలు, శిలాజ ఇంధనాలతో కాకుండా, పిండిపదార్థాల నుంచి తయారు చేస్తే దానినే కంపోస్టబుల్ ప్లాస్టిక్ అంటారు. ఈ తరహా ప్లాస్టిక్ నశిస్తుంది. పర్యావరణానికి హాని కలగదు. అలాగే ప్రస్తుతం 50 మైక్రాన్ల మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను అనుమతిస్తున్నారు. ఇవి రద్దవుతాయి. సెప్టెంబర్ 30, 2021 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్ సంచులనే వినియోగించాలి. 2022 డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్ల మందం ఉండే ప్లాస్టిక్‌నే ఉపయోగించాలి. - ఆగస్టు 19ని ఏ రోజుగా నిర్వహిస్తారు? (డి)
- ప్రపంచ మానవత దినోత్సవం
- ప్రపంచ ఫొటోగ్రఫీ డే
ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
వివరణ: ప్రపంచ మానవత దినోత్సవాన్ని ఏటా ఆగస్ట్ 19న నిర్వహిస్తారు. మానవ సాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా దీనిని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా 2009లో నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తరఫున వెళ్లిన ప్రత్యేక ప్రతినిధి సెర్జియో వియెరా డి మెలోతో పాటు 21 మంది బాగ్దాద్‌లో జరిగిన దాడిలో మరణించారు. వారు సేవ చేసేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. అలాగే ఏటా ఆగస్ట్ 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా 2010 నుంచి నిర్వహిస్తున్నారు.
- కింది వాక్యాల్లో సరైనవి? (సి)
- ఆస్పత్రి ప్రాంగణం లోపలే తొలిసారిగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఫైర్ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు
- ప్రపంచంలో రెండో అతిపెద్ద జీన్ బ్యాంకును ఢిల్లీలో ప్రారంభించారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో ఒక ఫైర్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులను ఎయిమ్స్ అందిస్తుంది. అలాగే ప్రపంచంలో రెండో అతిపెద్ద జీన్ బ్యాంకును ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ప్రాంగణంలో ప్రారంభించారు. జన్యు పదార్థాలను నిల్వచేసే బ్యాంకులనే జీన్ బ్యాంక్‌లు అంటారు. విత్తనాలు, కణజాల వర్ధనం తదితరాలు ఇక్కడ ఉంటాయి.
- తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన హెరిటేజ్ అథారిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? (డి)
ఎ) ముఖ్యమంత్రి
బి) కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
సి) తెలంగాణ శాఖ హెరిటేజ్ డైరెక్టర్
డి) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
వివరణ: రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణ, గుర్తింపు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో తెలంగాణ హెరిటేజ్ అథారిటీ ఏర్పాటయ్యింది. ఇందులో సభ్యులుగా పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురపాలక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శి, హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్లు ఉంటారు. జీహెచ్ఎంసీ మినహా జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. - ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి గతిశక్తి పథకం’ దేనికి సంబంధించింది? (ఎ)
ఎ) మౌలిక సదుపాయాల కల్పన
బి) శాస్త్ర-సాంకేతిక రంగం
బి) జీవ ఇంధన రంగం డి) ఏదీకాదు
వివరణ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇచ్చిన ఉపన్యాసంలో భాగంగా ప్రధాన మంత్రి గతిశక్తి పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉద్యోగాలను సృష్టిస్తుంది. దీనికి రూ.100 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలో ఒక మాస్టర్ ప్రణాళికను తెలియచేస్తారు. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకొనేలా చేయనున్నారు. - ఎస్ఈఏ సీఏటీ (సీ క్యాట్) అనేది ఒక? (సి)
ఎ) నీటిపై తేలియాడే క్షిపణి
బి) నీటిపై తేలియాడే సౌర ప్రాజెక్ట్
సి) సముద్రంలో మిలిటరీ విన్యాసాలు
డి) ఏదీకాదు
వివరణ: ఎస్ఈఏసీఏటీ అంటే పూర్తి రూపం సౌత్ ఈస్ట్ ఏషియా కో ఆపరేషన్ అండ్ ట్రెయినింగ్. దీనిని ఆగస్ట్ 10, 2021న సింగపూర్‌లో నిర్వహించారు. అమెరికా నేతృత్వంలో కొనసాగిన మిలిటరీ విన్యాసం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు పాల్గొన్నాయి. సముద్ర భద్రత, అంతర్జాతీయ నియమాలు తదితర అంశాలే లక్ష్యంగా ఇది కొనసాగింది.
-వి. రాజేంద్ర శర్మ ,ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- Education News
Previous article
15వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నితిశ్
Next article
పండుగ సాయన్న గాథను గానం చేసేవారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు