విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకుందాం ఇలా!
కలలు కను, అలాగే ఆ కలలను సార్థకం చేసుకోడానికి సరైన ప్రయత్నం చెయ్యి. 12వ తరగతి పూర్తిచేసుకుని మంచి కళాశాలలో, నచ్చిన అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడం ప్రొఫెషనల్ కెరీర్ వైపు వేసే మొదటి మెట్టు మాత్రమే. ఆ తరువాత ఏమి చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకొని, దానికోసం పని చేయాలి. మొదటి సంవత్సరం చేరిన కళాశాలకు అలవాటు పడి, ద్వితీయ సంవత్సరం నుంచి మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి సిద్ధపడాలి.
పై చదువులకు విదేశాలకు వెళ్లాలన్నదే మీ కలైతే ఆలస్యం చేయకుండా, అడ్మిషన్ ఆఫర్‌తో విమానం ఎక్కడానికి ఏమి చేయాలో తెలుసుకోండి.
ఏ దేశమో నిర్ణయించుకోండి?
ఏ దేశంలో చదవాలన్నది నిర్ణయించుకునే ముందు అక్కడ చదువుతున్న కాలేజీ సీనియర్లు, తెలిసినవారు, గురువులను అడగండి లేదా అక్కడి కాలేజీ వెబ్సైట్లు చూసి నిర్ణయం తీసుకోండి.
విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకాలనుకుంటే, ముందు దానికి తగ్గ అర్హతను కలిగి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోండి. ఆ దేశంలో సీటు పొందడానికి జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షలు ఏమి రాయాలో తెలుసుకోండి.
అలాగే ఆ ప్రదేశ వాతావరణం సరిపోతుందో లేదో చూసుకోండి.
అక్కడ చదవడానికి ఎంత ఖర్చవుతుందో అన్నది కూడా చూసుకోండి.
యూనివర్సిటీల గురించి పరిశోధన చేయండి
- ఏ యూనివర్సిటీలో చేరాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ గురించి రిసెర్చ్ చెయ్యండి. ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయానికి దాని సొంత ప్రవేశ అవసరాలుంటాయి.
- అడ్మిషన్ డెడ్‌లైన్ పట్ల అవగాహన ఉండాలి.
- అలాగే ఆ యూనివర్సిటీలో సీటు పొందాలంటే రాసే పరీక్షల్లో సుమారు ఎంత మార్కులు కావాలో తెలుసుకోవాలి.
- విదేశీ కళాశాలల పేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విశ్వవిద్యాలయాల పేర్లు దగ్గరగా ఉంటాయి. మీరు చేరాలనుకుంటున్న యూనివర్సిటీ పబ్లిక్ లేదా ప్రైవేట్ అన్నది చూడండి. ప్రతి కాలేజీ ఫీజు ఒకటే ఉండదు.
- ఆ కాలేజీలో మీకు నచ్చిన కోర్స్ ఉందో లేదో చూడండి. అలాగే రిసెర్చ్ ఫెసిలిటీస్, స్టూడెంట్ జాబ్ అవకాశాల గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
- ప్రతి కాలేజీ అప్లికేషన్ ఫీ విదేశీ కరెన్సీలో ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా కనీసం ఒక అయిదు కాలేజీలకు ఐప్లె చేయడానికి వాటి పేర్లను నిర్ణయించుకోండి.
- ఒకవేళ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మారాలనుకుంటే దానికి తగ్గ ప్రీ రిక్విసిట్స్ ఏమున్నాయన్నది తెలుసుకోండి.
పాస్‌పోర్ట్ రెడీగా పెట్టుకోండి
- విద్య, తీర్థయాత్రలు, పర్యటన, వ్యాపార ప్రయోజనాలు, వైద్య, కుటుంబ సందర్శనల కోసం విదేశాలకు వెళ్లేవారికి పాస్‌పోర్ట్ తప్పనిసరి కావలసిన ప్రయాణ పత్రం.
- పాస్‌పోర్ట్ రావడానికి అప్లికేషన్ ప్రాసెస్, అలాగే అది తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఉండటానికి పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. తత్కాల్లో పాస్‌పోర్ట్ త్వరగా వస్తుంది. కానీ ముందే అప్లికేషన్ చేసుకుంటే యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం ప్రవేశపరీక్ష రాసే సమయానికి పాస్‌పోర్ట్ ఉంటుంది.
- ముందుగా పాస్‌పోర్ట్ సేవ పోర్టల్‌లో అప్లికేషన్ పూర్తిచేసి, పాస్‌పోర్ట్ సేవ కేంద్రంలో అప్పాయింట్మెంట్ తీసుకొని, ఫీజు చెల్లించండి. ఆ తరువాత ఏ రోజైతే అపాయింట్మెంట్ దొరికిందో ఆ రోజు అన్ని ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ వంటి అవసరమైన పత్రాలతో వెళ్లండి.
- సాధారణ పద్ధతిలో పాస్‌పోర్ట్‌కి ఐప్లె చేస్తే, సుమారు 30 నుంచి 45 రోజుల మధ్యలో పాస్‌పోర్ట్ వస్తుంది. అదే తత్కాల్ పద్ధతిలో వెళితే సుమారు 15 రోజుల్లో పాస్‌పోర్ట్ వస్తుంది.
- పూర్తి వివరాలకోసం ఈ వెబ్సైట్ చూడండి. https://www.india.gov.in/spotlight/passport-seva-portal-convenient-way-get-passport#tab=tab-1
పరీక్షలకు సిద్ధమవండి
- అడ్మిషన్స్ కోసం రాసే పరీక్షలు పలుమార్లు రాయవచ్చు. కానీ మొదటి ప్రయత్నంలోనే ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు కృషి చేయండి.
- కోచింగ్ కావాలనుకుంటే కాలేజీ టైంకి అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎంచుకోండి. సుమారు 3 నెలల సమయమైనా ప్రిపరేషన్‌కి కేటాయించుకోండి.
- అలాగే ఆ మెటీరియల్‌ని బాగా ప్రిపేర్ అవండి. ప్రాక్టీస్ పరీక్షలు రాసి, వచ్చిన మార్కులను అనలైజ్ చేసుకోండి.
- ఈ ఎగ్జామ్స్‌కి ముందే డేట్ ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి మీ కాలేజీ ఎగ్జామ్స్‌కి ఆటంకం కలుగకుండా సరిగ్గా ప్లాన్ చేసుకోండి.
- మీ పాస్‌పోర్ట్ నెంబర్, వాలిడిటీ డేట్ వంటివి కొన్ని పరీక్షలకు ఐప్లె చేసేటప్పుడు అవసరం రావచ్చు.
- ప్రాథమిక ఐడీగా పేరు, ఛాయాచిత్రం, సంతకంతో చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు తప్పక పరీక్ష కేంద్రంలో చూపించాలి. అది లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు.
- ఐఈఎల్‌టీఎస్‌లో కనీసం 7 బ్యాండ్ జీఆర్ఈలో కనీసం 300 స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ పరీక్షల రుసుం సుమారు రూ.14,700 నుంచి 15,800 మధ్యలో ఉంటుంది. కాబట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించండి.
- పరీక్ష కేంద్రంలో లేదా రిజిస్ట్రేషన్ టైంలో కొన్ని కాలేజీలకు స్కోర్‌ని పంపవచ్చు. ముందే ప్రాక్టీస్ పరీక్షల స్కోర్లను బట్టి కొన్ని కాలేజీలు ఎంపిక చేసుకొని ఉంటే ఉపయోగపడుతుంది.
అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయండి
- ప్రవేశ పరీక్షలు రాయడం, స్కోర్ పంపించడంతో పని పూర్తి కాలేదు. ఇంకా ఎంతో ఉంది. ప్రతి కాలేజీకి ఇంటర్నేషనల్ విద్యార్థుల ప్రవేశానికి కావలసినవి ఏమిటో తెలుసుకొని, సిద్ధం చేసుకోండి.
- అప్లికేషన్ ప్రొసీజర్‌లో సంబంధిత విషయాలతో పాటు స్టేట్మెంట్ అఫ్ పర్పస్ (SOP), రికమండేషన్ లెటర్లు వంటివి అవసరం.
- మీ గురించి, విద్యార్హతల గురించి, ఆ కళాశాలలో ఎందుకు చదవాలనుకుంటున్నారో తెలియచేసే అవకాశం ఇది. SOPలో చేరాలనుకుంటున్న కోర్స్‌కు సంబంధించి ఇంతకముందే చేసిన పేపర్ ప్రజెంటేషన్స్, కోర్సులు లేదా అనుభవం ఏమైనా ఉంటే తెలియపర్చండి. ఆ విశ్వవిద్యాలయంలో చేరి భవిష్యత్తులో ఏం సాధించాలనేది తెలియపరిచే విధంగా ఉండాలి. ఇది ఎన్ని పదాల్లో రాయాలో ఆ వర్డ్ లిమిట్‌ని దృష్టిలో పెట్టుకొని, గ్రామర్ అండ్ స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయండి. సుమారు 500 పదాల్లో రాయాల్సి ఉంటుంది. రాసిన తరువాత తప్పులు లేకుండా, చెప్పాలనుకున్నది చెప్పారో లేదో అన్నది ఎడిట్ చేసుకొని చూడండి.
- లెటర్ ఆఫ్ రికమండేషన్ 2 లేదా 3 లెటర్స్ అవసరం ఉంటాయి. ఆ కాలేజీలో చదవడానికి ఎందుకు అర్హులో అని తెలియజేస్తూ ప్రస్తుతం చదువుతున్న కాలేజీ, ఉద్యోగం చేసే చోటు నుంచి గురువులతో రాయించుకోవాలి. ఇది మీ ప్రొఫెసర్ లేదా కాలేజీ లెటర్ హెడ్ మీద రాయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికారిక ఈ-మెయిల్ నుంచి కూడా ఇది పంపమని అడగవచ్చు. టీచర్ల దగ్గర ఉన్న మంచి పేరు ఇక్కడ వారు మీ గురించి మంచిగా రాయడానికి ఉపయోగపడుతుంది. మీ గురించి తెలియచేసే విషయాలు నిజమైనవి అయి ఉండాలి. అలాగే అవి ఆ విశ్వవిద్యాలయంలో చేరడానికి అర్హులనేలాగా ఉండాలి.
- మీ లెటర్ అఫ్ రికమండేషన్, చదివిన సబ్జెక్టులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించే తెలియచేసే విధంగా ఉండేలా చూసుకోండి. అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన మార్కుల ట్రాన్స్స్క్రిప్ట్స్ని కూడా జతచేయవలసిన అవసరం ఉంటుంది.
- అప్లికేషన్‌కి సంబంధించిన అన్ని పత్రాలు కళాశాలకు సమయం లోపే పంపించండి. అప్పుడే మీ ఫైల్ సాఫీగా ముందుకు సాగుతుంది.
- మీరు ఉన్నత విద్యలు చదవాలనుకుంటే ముందునుంచే ఒక అవగాహనతో ప్రయత్నించండి. అలా చేయడంవల్ల ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్‌లో ఇచ్చే అడ్మిషన్స్లో ముందు ఉండవచ్చు. మంచి కోర్స్‌లో చేరవచ్చు. ఒక ప్రణాళికతో ముందుకు నడవండి, కలలను నిజం చేసుకోండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు