అండర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రవేశాలు
డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (యూగ్యాట్) నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విడుదల చేసింది.
ప్రవేశాలు కల్పించే కోర్సులు
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఐఎంబీఏ), బీబీఏ, బీసీఏ, బీహెచ్ఎం, బీకాం తదితరాలు
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత లేదా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు/రాసిన వారు అర్హులు.
పరీక్ష విధానం
పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ)
ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ (ఐబీటీ)
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీబీఏ, బీసీఏ పరీక్షల వ్యవధి రెండు గంటలు. బీహెచ్ఎం పరీక్ష కాలవ్యవధి మూడుగంటలు.
పరీక్షలో మొత్తం 130 ప్రశ్నలు, 130 మార్కులు
పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు, న్యూమరికల్ అండ్ డేటా అనాలసిస్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి 30, జనరల్ నాలెడ్జ్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కింగ్ లేదు.
నోట్: బీహెచ్ఎం పరీక్ష విధానంలో కొంత మార్పు ఉంటుంది.
ముఖ్యతేదీలు
పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ)
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూన్ 27
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: జూన్ 28
పరీక్ష తేదీ: జూలై 4
ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ (ఐబీటీ) తేదీలు
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ:
ఐబీటీ-1కు జూలై 1, ఐబీటీ-2కు జూలై 8
పరీక్షతేదీలు: ఐబీటీ-1: జూలై 4, ఐబీటీ-2: జూలై 11
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://apps.aima.in/UGAT2021
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు