త్రివిధ దళాల్లో చేరాలని ఉందా?
దేశాన్ని రక్షించే రక్షణ దళాల్లో చేరడం ఎంతో గౌరవమైనది, ప్రతిష్ఠాత్మకమైనది. ఉత్సాహవంతులు, సాహసవంతులు, సవాళ్లు ఎదుర్కోవడంలో వెనుకంజవేయని వారికి ఇది ఎంతో మెరుగైన అవకాశం.
భారతదేశ సైనిక దళాల్లో నాలుగు ప్రొఫెషనల్ యూనిఫాం సేవలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. వివిధ పారామిలిటరీ, ఇంటర్-సర్వీస్ సంస్థలు కూడా భారత సాయుధ దళాలకు సహాయపడతాయి. సాయుధ దళాల్లో చేరడానికి అవకాశాలు. 12వ తరగతి తరువాత గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత కూడా ఉన్నాయి.
12వ తరగతి తరువాత అవకాశాలు
ఎన్డీఏ
‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో ప్రవేశించడానికి యూపీఎస్సీ సంవత్సరానికి (https://www.upsc.gov.in/) రెండుసార్లు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. 10+2 పరీక్ష పూర్తిచేసిన వారు లేదా 12వ తరగతి చదువుతున్నవారు అర్హులు. సుమారు 320 పోస్ట్‌లు (సంవత్సరానికి 2 సార్లు)ల కోసం పరీక్ష ఉంటుంది. ఆర్మీ (208), ఎయిర్‌ఫోర్స్(70), నేవీ (42). జూన్, డిసెంబర్ నెలలో సాధారణంగా నోటిఫికేషన్ విడుదలవుతుంది. కోర్స్ ప్రారంభమైన మొదటి నెల, మొదటి రోజుకి వయసు పరిమితి 16 నుంచి 19.5 సంవత్సరాలు ఉండాలి.
‘ఎన్డీఏ సెలక్షన్ ప్రాసెస్‌లో రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆర్మీకి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. నావికా దళం, వాయు దళాల్లో చేరాలంటే 12వ తరగతిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవసరం. https://www.upsc.gov.in/sites/default/files/Notif-NDA-NA-I-2021-Engl-301220.pdf. రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ 2.5 గంటలు, జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2.5 గంటల సమయం ఉంటుంది. ఎన్డీఏ పేపర్-1లో మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, క్యాలికులస్, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ వంటి ప్రశ్నలుంటాయి. పేపర్-2 లో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఎస్ఎస్బీ రెండు రౌండ్లలో ఉంటుంది. స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో సెలక్ట్ అయినవారు తర్వాత స్టేజ్‌కి వెళతారు.
జ్-2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్, సైకాలజీ టెస్ట్ వంటివి ఉంటాయి.
‘ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అనే మూడు సేవలకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్-సర్వీస్ ఇన్స్టిట్యూషన్ అయిన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 సంవత్సరాల కాలానికి ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు B.Sc./B.Sc (Computer)/BA ప్రదానం చేస్తారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఇస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో శిక్షణ పూర్తయిన తర్వాత, ఆర్మీ క్యాడెట్లు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ క్యాడెట్స్ ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమల, ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్స్ హైదరాబాద్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి పంపిస్తారు.
నావికా దళంలో డైరెక్ట్ ఎంట్రీ
పర్మనెంట్ కమిషన్‌కి డైరెక్ట్ ఎంట్రీ 12వ తరగతి తరువాత ఉంటుంది. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 70% ఉత్తీర్ణత కలిగి, ఇంగ్లిష్‌లో 50% 10 లేదా 12వ తరగతిలో ఉన్నవారు ఇండియన్ నేవీ ఆఫీసర్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎస్ఎస్బీకి పిలుస్తారు. ఎస్ఎస్బీ తర్వాత ఫైనల్ అలాట్మెంట్ ఉంటుంది.
ఇతర అవకాశాలు
‘ఆర్మీలో సోల్జర్, సోల్జర్ జనరల్ డ్యూటీ, క్లర్క్ లేదా నర్సింగ్ వంటి అవకాశాలు 12వ తరగతి చదివిన వారికి ఉన్నాయి. http://www.joinindianarmy.nic.in/how-to-join.htm.
‘ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో చేరాలనుకునేవారికి 12వ తరగతి తరువాత సెయిలర్ లెవల్లో అవకాశాలు ఉన్నాయి.
‘ఏసీసీ: 12వ తరగతి పూర్తయి 2 సంవత్సరాలు సర్వీస్‌లో ఉన్నవారు ఏసీసీ రిటన్ టెస్ట్ ద్వారా ఆఫీసర్ హోదా పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ క్యాడెట్ కాలేజ్ వింగ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కి చెందిన సోల్జర్స్‌ని ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్‌గా కమిషన్ చేయడం కోసం ట్రైనింగ్ ఇస్తుంది.
గ్రాడ్యుయేషన్ తర్వాత అవకాశాలు
సంయుక్త రక్షణ సేవా పరీక్ష
‘సీడీఎస్‌ఈని యూపీఎస్సీ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్లు లేదా గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఉన్నవారు పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.
‘విజయవంతమైన అభ్యర్థులు ఇండియన్ మిలిటరీ అకాడమీ/ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఫర్ పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో చేరవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఎంట్రీ
షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఎంట్రీ స్కీమ్ టెక్నికల్ ఆరమ్స్లో నియామకానికి అర్హతగల సాంకేతిక గ్రాడ్యుయేట్లు/ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు మార్గాలను అందిస్తుంది. ఎస్ఎస్బీ, మెడికల్ బోర్డ్ తరువాత ఎంపికైన అభ్యర్థులు చెన్నైలోని ఓటీఏలో సుమారు 49 వారాల ప్రీ-కమిషన్ శిక్షణ పొందాలి.
జాయిన్ ది ఆర్మీ
‘యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఇంజినీరింగ్ ప్రీ ఫైనల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
‘ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్ని బట్టి అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు.
‘షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్లో కూడా ఇంజినీరింగ్ చదివినవారికి అవకాశాలు ఉన్నాయి. www.joinindianarmy.nic.inలో అవకాశాల గురించి ప్రకటనలు వచ్చినప్పుడు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
‘ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్లో అవకాశానికి ఎంఏ, ఎమ్మెస్సీ డిగ్రీ ఉన్నవారు ప్రయత్నించవచ్చు.
‘ఎల్ఎల్బీలో 55%తో ఉత్తీర్ణులై, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొన్నవారు జడ్జి అడ్వకేట్ జనరల్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు.
‘గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలవారు, టెరిటోరియల్ ఆర్మీలో అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. http://www.joinindianarmy.nic.in/officers-misc-entries.htm.
‘1992లో ఇండియన్ మిలిటరీలో స్త్రీలను ఆఫీసర్ క్యాడర్లో తీసుకుని ట్రైనింగ్ ఆరంభించారు. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ షార్ట్ సర్వీస్ కమిషన్‌లో అవకాశాలు ఉన్నాయి.
వాయుసేనలో కెరీర్
‘నాన్-యూపీఎస్సీ (ఎంట్రీల ద్వారా అధికారుల నియామకం: సాంకేతిక శాఖల కోసం, ఉమెన్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) స్పెషల్ ఎంట్రీ స్కీమ్, సర్వీస్ ఎంట్రీలు, రిక్రూట్మెంట్ నేరుగా భారత వైమానిక దళానికి రిక్రూటింగ్ డైరెక్టరేట్ (http://careerairforce.nic.in/) ద్వారా జరుగుతుంది. అర్హతలను బట్టి IAFలోని వివిధ శాఖల్లో ఒకదానిలో చేరవచ్చు.
‘విస్తృతంగా వైమానిక దళానికి మూడు ఉప శాఖలు ఉన్నాయి. ఫ్లయింగ్ బ్రాంచ్, సాంకేతిక శాఖ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్.
‘గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఏఎఫ్సీఏటీ (AFCAT) ద్వారా ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరవచ్చు.
నావికా దళం
‘నావికా దళంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలనుకునేవారికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫీసర్లు ఓడలు, ఎయిర్ క్రాఫ్ట్, జలాంతర్గాముల పై క్షిపణి, నావిగేషన్, కమ్యూనికేషన్, డ్రైవింగ్, పైలట్, యుద్ధ నివారణ వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి.
‘గ్రాడ్యుయేట్స్ కూడా వారికి సంబంధించిన డైరెక్ట్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.
‘ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ సెలక్షన్స్ జరుగుతాయి. https://
www.joinindiannavy. gov.in/en/page/
selection-procedure.html
‘ఎన్సీసీ ‘సి’ సర్టిఫికెట్ కలవారికి కూడా ఇతర అవకాశాలు ఉంటాయి.
ఇతర అవకాశాలు
‘ఇండియన్ కోస్ట్ గార్డ్ (https://joinindiancoastguard.gov.in/allotment_officer.html) లో చేరాలనుకు నే వారికి ఆఫీస్ ఎంట్రీ లెవల్లో గ్రాడ్యుయేషన్ తర్వాత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
‘సెంట్రల్ ఆర్మ్‌డ్‌ఫోర్స్ కింద సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్ర సీమాబల్ ఇవి మినిస్ట్రీ అఫ్ హోమ్ అఫైర్స్ కిందకు వస్తాయి. అసోం రైఫిల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లో కూడా అవకాశాలు ఉన్నాయి.
Sirisha Reddy
Director – Academics
Gyanville Academy
+91 76759 62248
www.gyanville.in
IITJEE | CLAT | IIM IPM
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు