పొన్నెగంటి తెలగనాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
హిస్టరీ
1. కింది వాఖ్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ) కుతుబ్షాహీల తర్వాత తెలంగాణ మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్షపాలనలో ఉండింది.
బి) మొఘల్ నిరంకుశత్వం, ఆగ్రకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ సర్వాయి పాపన్నగౌడ్ తిరుగుబాటు చేశాడు.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకావు
2. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ) నిజాం ఉల్ ముల్క్ సుప్రసిద్ధుడైన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ ఔరంగజేబు గోల్కొండ ముట్టడిలో పాల్గొన్నాడు.
బి) నిజాం ఉల్-ముల్క్ దక్కన్ సుభాకు రెండు సార్లు సుభేదార్గా పనిచేశారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకావు
3. కుతుబ్షాహీల కాలంనాటి సామాజిక పరిస్థితుల గురించి సరైనవి గుర్తించండి?
ఎ) సమాజంలో బాల్యవివాహాలు,
పరదా పద్ధతి ఉండేవి
బి) వ్యభిచారం ఒక వృత్తిగా కొనసాగేది.
సి) సతీ సహగమనం గురించి ఎలాంటి
ప్రస్తావన లేదు
డి) మహిళలకు పూర్తి స్వాతంత్య్రం ఉండేది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) పైవన్నీ
4. యయాతి చరిత్రను రాసిన పొన్నెగంటి తెలగనాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) అబుల్ హసన్ తానీషా
3) ఇబ్రహీం కుతుబ్షా
4) సుల్తాన్ కులీ కుతుబ్షా
5. అబ్దుల్లా కుతుబ్షా గొప్ప న్యాయ నిర్ణేత అని కీర్తించిన విదేశీయుడెవరు?
1) బెర్నియర్ 2) మెథోల్డ్
3) టావెర్నియర్ 4) థెవనాట్
6. కింది వాఖ్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ) ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కొల్లూరు గనుల్లో లభ్యమైంది.
బి) కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుమతిగా ఇచ్చింది అబ్లుల్లా కుతుబ్షా
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకావు
7. అక్కన్న, మాదన్నల హత్యకు కారకులైనవారిని గుర్తించండి?
1) జంషీద్ 2) సిద్ధిమఖ్త
3) షేక్ మన్హాజ్ 4. పైవారందరు
8. మువ్వ గోపాల పదాల సృష్టికర్త ఎవరు?
1) భక్త రామదాసు 2) అన్నమయ్య
3) క్షేత్రయ్య 4) వేమన
9. హైదరాబాద్లోని పురాతన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతికి సంబంధించినవి?
1) ఇండో-ఆర్యన్
2) ఇండో-పర్షియన్
3) ఇండో-గ్రీక్
4) ఇండో యూరోపియన్
10. కుతుబ్షాహీల కాలంనాటి పండితులు, వారి రచనలను జతపరచండి?
ఎ) ఫిరోజ్ 1) లైలా మజ్ను
బి) మీర్జా
మహమ్మద్ అమీన్ 2) తూతెనామా
సి) గవ్వాసి 3) జంగ్నామ
డి) గులాం అలీ 4) తెసల్నామా
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-1, బి-4, సి-2, డి-3
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-1, బి-4, సి-3, డి-2
11. కుతుబ్షాహీల కాలంలో పార్శీభాషలో రచనలు చేసినవారు, వారి రచనలను జతపరచండి?
ఎ) మీర్ మోమిన్
అస్ట్రాబాదీ 1) ఇఖియానత్
కుతుబ్షాహీ
బి) హకీం తకీవుద్దీన్ 2) మిజనతుల్
తబాయ్ కుతుబ్షాహీ
సి) మీర్
మోమిన్ యాజ్ద 3) రిసాల మిక్డరియా
డి) హుస్సేన్
బిన్ ఆల్ పుర్సీ 4) నసబ్నామా
కుతుబ్షాహీ
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
12. కుతుబ్షాహీల కాలంనాటి ప్రముఖ నిర్మాణాలు వాటి నిర్మాతలను జతపరచండి?
ఎ) తారామతి బారాదరి
1. అబ్దుల్లా కుతుబ్షా
బి) జామా మసీదు
2) మహమ్మద్ కులీ కుతుబ్షా
సి) పురానాపూల్ వంతెన
3) ఇబ్రహీం కుతుబ్షా
డి) గోషామహల్
4) అబుల్ హసన్ తానీషా
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-2, బి-4, సి-1, డి-3
13. కుతుబ్షాహీల పరిపాలన విభాగాలు సరైన క్రమంలో ఉన్నదాన్ని గుర్తించండి?
1) తరఫ్లు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలు
2) సర్కార్లు, తరఫ్లు, పరగణాలు, గ్రామాలు
3) పరగణాలు, తరఫ్లు, సర్కార్లు, గ్రామాలు
4) తరఫ్లు, పరగణాలు, సర్కార్లు, గ్రామాలు
14. కుతుబ్షాహీల పాలనకు సంబంధించి కిందివాటిలో సరికాని జతను గుర్తించండి?
1) షాబందర్ – రేవు పట్టణాల అధికారి
2) దబీర్ – శాంతిభద్రతల అధికారి
3) సర్ఖేల్- రెవిన్యూ అధికారి
4) ఐనుల్ ముల్క్-సైనిక శాఖమంత్రి
15. కుతుబ్షాహీల పాలనకు సంబంధించి కింది అధికార్లను వారి హోదాలను జతపరచండి?
ఎ. ముఖద్దం 1) తరఫ్పాలకుడు
బి. కులకరి 2) సర్కార్ పాలకుడు
సి. ఫౌజ్దార్ 3) గ్రామాధికారి
డి) సర్సిమ్ 4) గ్రామ అకౌంటెంట్
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
16. 1591లో అక్బర్ చక్రవర్తి తన సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని దూతలను పంపగా, అక్బర్ నిర్ణయాన్ని తిరస్కరించిన దక్కన్ రాజ్యాలను గుర్తించండి?
ఎ) ఖాందేష్ బి) అహమ్మద్ నగర్
సి) బీజాపూర్ డి) గోల్కొండ
1) ఎ మాత్రమే 2) బి, సి
3) బి, సి, డి 4) ఎ, డి
17. కుతుబ్షాహీల పరిపాలనకు సంబంధించి మంత్రులు వారి శాఖలను జతపరచండి?
ఎ) మీర్ జుమ్ల 1) నగర పోలీస్ అధికారి
బి) సర్ లష్కర్ 2) సేనాధిపతి
సి) మజుందార్ 3) ఆడిటర్
4) కొత్వాల్ 4) ఆర్థిక మంత్రి
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-1, డి-3
18. కింది వాఖ్యల్లో సరైనవి గుర్తించండి?
ఎ) 1512లో సుల్తాన్ కులీ ఖమ్మంమెట్ను పాలిస్తున్న షితాబ్ఖాన్ను ఓడించారు.
బి) 1518లో కులీ కుతుబ్ ఉల్ముల్క్ తన రాజధానిని కొడంగల్ నుంచి గోల్కొండకు మార్చారు.
1) ఎ 2) బి 3) ఎ, బి
4) పైవేవీకాదు
19. కింది వాఖ్యల్లో సరైనది గుర్తించండి?
ఎ) కుతుబ్షాహీల బంగారు నాణెం పేరు హొన్ను
బి) కుతుబ్షాహీ రాజుల్లో అబ్దుల్లా కుతుబ్షా మాత్రమే రాగి నాణేములను ముద్రించాడు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీకావు
20. కుతుబ్షాహీల పాలనకు సంబంధించి
మిరాసీదార్లు అంటే ఎవరు?
1) విదేశీ వ్యాపారులు
2) వడ్డీ వ్యాపారులు
3) 12 మంది గ్రామాధికారులు
4) రాజు ఆస్థానంలో ఉండే పండితులు
21. విజయనగర పాలకులకు వ్యతిరేకంగా ఇబ్రహీం కుతుబ్షా ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమిలో లేనివారిని గుర్తించండి లేదా
తల్లికోట యుద్ధంలో పాల్గొనని వారిని
గుర్తించండి?
1) హుస్సేన్ నిజాంషా
2) ఆలీబరీద్ షా 3) ఆలీఆదిల్హా
4) బుర్హాన్ ఇమాద్షా
22. కింది కుతుబ్షాహీ పాలకులు, వారి కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలను జతపరచండి?
ఎ) అబ్దుల్లా కుతుబ్షా
1) మొఘల్సామ్రాజ్యంలో
గోల్కొండ విలీనం
బి) మహమ్మద్ కులీ
కుతుబ్షా 2) డచ్, ఆంగ్లేయుల స్థావరాల ఏర్పాటు
సి) అబుల్ హసన్
తానీషా 3) ఆంగ్లేయులకు
బంగారు ఫర్మానా జారీ
డి) మహమ్మద్
కుతుబ్షా 4) ఇరాన్ చక్రవర్తి షా
అబ్బాస్తో దౌత్య
సంబంధాలు
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
23. కింద పేర్కొన్న విదేశీ యాత్రికుల రచనలు అవి కుతుబ్షాహీల గురించి ప్రధానంగా
అందిస్తున్న సమాచారాన్ని జతపరచండి?
ఎ) Six Travels in India
1) గోల్కొండ దర్బారు,
చిత్రలేఖనం
బి) A relaxation of golconda
2) పంటల, వివాహాలు,
వేషధారణ
సి)Storia do Mogor 3) వజ్రాల
గనుల, వ్యాపారం
డి) travels of venot 4) సామాజిక
into the levant దురాచారాలు
ఉత్సవాలు
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
24. కుతుబ్షాహీల కాలంలో గోల్కొండను
సందర్శించిన విదేశీ యాత్రికుల నేపథ్యాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి?
1) జీన్బాప్టిస్ట్ టావెర్నియర్ ఇంగ్లండ్ దేశ వజ్రాల వ్యాపారి
2) జీన్ డి. థెవనాట్ – ఫ్రెంచ్యాత్రికుడు
3) ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఫ్రెంచ్ వైద్యుడు
4) నికొలావ్ మనుషి ఇటలీ వైద్యుడు
25. కిందివాటిలోలో కుతుబ్షాహీల వంశ మూలపురుషుడు కులీ బిరుదులేవి?
ఎ) ఖవాస్ ఖాన్
బి) మీర్ ఉల్-ఉమ్ర
బి) కుతుబ్-ఉల్-ముల్క్ డి) బడేమాలిక్
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
26. కింద పేర్కొన్న విదేశీ యాత్రికులు, వారి రచనలను జతపరచండి?
ఎ) జాన్ ఫ్రెయర్
1) Storia do Mogor
బి) జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్
2) Travels in Mughal India
సి) ఫ్రాంకోయిస్ బెర్నియర్
3) Six Travels in India
డి) నికొలావ్ మనుషి 4) A New Account of
East India
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
27. విజయనగర సైన్యానికి ఇబ్రహీం కుతుబ్షా ఆధ్వర్యంలో ఏర్పాటైన బహమనీ రాజుల కూటమికి 1565లో జరిగిన యుద్ధానికి వివిధ చరిత్రకారులు పిలిచిన పేర్లను
జతపరచండి?
ఎ) ఆచార్య షేర్వాణి 1) తల్లికోట యుద్ధం
బి) రాబర్ట్ సీవెల్ 2) బన్నిహట్టి యుద్ధం
సి) ఫాదర్ హీరాస్
3) రాక్షసి తంగడి యుద్ధం
1) ఎ-1, బి-3, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-1, సి-2
28. కుతుబ్షాహీల కాలంనాటి ప్రముఖ వ్యక్తి మీర్ హషీం ఏ రంగంలో నిష్ణాతుడు?
1) సంగీతం 2) నాట్యం
3) కట్టడాల నిర్మాణం 4) చిత్రలేఖనం
29. కుతుబ్షాహీల చరిత్రకు సంబంధించి విలువైన సమాచారం అందిస్తున్న కింది గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి?
ఎ) బుర్హాన్ ఎ-మాథీర్ 1) పెరిస్తా
బి) గుల్షన్ ఇ-ఇబ్రహీం 2) మీర్జా
ఇబ్రహీం, జుబేరి
సి) బసాతిన్-ఉన్- సలాతిన్ 3) బుర్హాన్
డి)తారిఖ్-ఎ-నిజాంషాహి 4) సయ్యద్ అలీ బిన్ తబతబ
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
30.కింది వారిలో ఏ వంశం వారిని పురాణాలు ఆంధ్రభృత్యులు అని వ్యవహరిస్తున్నాయి?
ఎ) శాతవాహనులు బి) ఇక్షాకులు
సి) విష్ణుకుండినులు డి) శాలంకాయనులు
1) బి 2) ఎ
3) ఎ, బి 4) పై వారందరిని
31. ఇక్షాకుల సామంతులకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) పుగియ వంశస్థులు నల్లగొండ ప్రాంతం
2) ఛూటు వంశస్థులు బనవాసి ప్రాంతం
3) హిరణ్యక, చెలికి వంశస్థులు రాయల సీమ ప్రాంతం
4) దండనాయకులు ధాన్యాకటకం ప్రాంతం
32. కిందివాటిలో సరైనది గుర్తించండి?
ఎ. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం లేదా
విజయపురి
బి) ఉజ్జయిని గుర్తు, ఏనుగు బొమ్మ గుర్తు ఉన్న ఇక్ష్వాకుల నాణేలు సీసం, రాగిలతో చేసినవి.
సి) జగ్గయ్యపేట శాసనం మాఠరీపుత్ర
శ్రీవీర పురుషదత్తుడిని రాజరాజా
అని సంభోధిస్తుంది
డి) రాజులు శైవ మతాన్ని ఆదరిస్తే,
అంతఃపుర స్త్రీలు మాత్రం జైన మతాన్ని
అవలంబించారు.
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
33. ఇక్ష్వాకుల జన్మస్థలాలకు సంబంధించి వివిధ పండితుల అభిప్రాయాలను జతపరచండి.
ఎ) వొగెల్ 1. నల్లమల ప్రాంతం
బి) గోపాలాచారి 2) తమిళప్రాంతం
సి) కాల్డ్వెల్ 3) ఆంధ్రప్రాంతం
డి) డా. భండార్కర్ 4) కన్నడ ప్రాంతం
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు