13వ శతాబ్ది మహాకవి షడాక్షరుడు
ఎవ్వరు దేవతా విభులు, ఎవ్వరు మాయా మదాప హారులున్
ఎవ్వరు మన్మథాంతకులు, ఎవ్వరు బ్రహ శిరోహరుల్ శివుల్
ఎవ్వరు కాల మర్దనులు ఎవ్వరు మృత్యు వినాశనుల్ ఘనుల్
ఎవ్వరు నీవేకాక ప్రభులేరి కరస్థల స్వామి శంకరా!!!
ఎవ్వరు నిత్య నిర్మలులు, ఎవ్వరు నిర్గుణ నిశ్చలాత్ములున్
ఎవ్వరు జాండభాండ ధరులెవ్వరు, వాజ్ఞయ సాత్మగోచరుల్
ఎవ్వరు నిష్ట్రపంచమయులెవ్వరు సాధివర్జితుల్ పరుల్
ఎవ్వరు నీవేకాక ప్రభులేరికరస్థల స్వామి శంకరా!!!
ఎవ్వరి యందు పుట్టి-పృథ్వినెవ్వరి యందు జనించె అగ్నినీ
రెవ్వరి యందు వాయువుదయించె, సూర్యుడు నాత్మతెజ మిం
కెవ్వరి యందు చంద్రుడు జనియించె, నిజంబుగ సర్వకల్పితుల్
ఎవ్వరు నీవేకాక ప్రభులేరి కరస్థల స్వామి శంకరా!!!
అరుదైన పై పద్యాలను సృజించినది ఆనాటి ప్రాచీన మహా కవి షడాక్షరుడే అని చరిత్రకారులు నిర్ధారించారు. అయితే వీటిని తాండూరు వాస్తవ్యులైన శ్రీ శివకవి విజయశంక సిద్దరామయోగి శాస్త్రి కన్నడ భాషలో రచించి వెలుగులోకి తెచ్చారు. షడాక్షారుడు గొప్పకవి. పోతన కంటే ముందు తరంవారు. చరిత్రలో అంతగా కనిపించని షడాక్షరుడు మరో మహాభాగవతాన్ని రచించినట్లు చెబుతున్నారు. అయితే ఆనాటి రాజుల రాజాశ్రయం పొందినట్లు తెలుస్తుంది. ఈయన గురించి 1836లో ఉమాపతి బసవలింగస్వామి రాశారు.
అల్లమ ప్రభువు:
కవీశ్వరుడు కాకపోయినా, ఆధ్యాత్మిక తత్వవేత్త. ఆయన పేరుమీదుగానే అల్లా దుర్గం అనే గ్రామం మెదక్ జిల్లాలోని ఆందోలు తాలుఖాలో ఉంది. క్రీ.శ. 1120 ప్రాంతంలో అల్లమ ప్రభువు అల్లా దుర్గాదేవతగా పేరుపొందినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
భస్మము పూసి బిత్తల ఉన్ననేమి బ్రహ్మ చారియా
అశనము మెక్కి వ్యసనము దక్కిన బ్రహ్మ చారియా
భావము బిత్తలైమనుసు గంభీరమైనచో
అది సహజ నిర్మాణయా గుహేశ్వరా!!!
-చెరువు వద్ద ఉన్న బిల్లేశ్వర దేవాలయమని శాసనంలో ఉంది. ఈ బిల్లేశ్వరున్నే గుహేశ్వరుడు అని అంటారు. ఆ ప్రాంతానికి కొంతదూరంలో తపస్సు చేసిన ఆనవాళ్ల్లు ఇప్పటికీ లభిస్తాయి. అంబా, అక్క, అల్లా, ఏతే మాతృవాచకాః అజన్త స్త్రీ లింగ విశేష అని శబ్ద మంజరిలో ఉంది. అంబా అనే అల్లా పేరే అల్లాదుర్గం అని ఉన్నది.
పట్టమట్ట సోమనాథ కవి:
క్రీ.శ. 1500-1550 కాలానికి చెందిన ఈయన గొప్ప కవి. బిక్కనవోలు (బిక్కనూరు) నివాసి వేంకటామాత్య పుత్రుడు పేర్కొన్నారు. ఈయన సూత సంహార, బ్రహ్మోత్తర ఖండము అనే సంస్కృతాంధ్ర భాషా విశారదులైన గొప్ప కావ్యాలను రచించారు.
లక్ష్మీశకవి:
16వ శతాబ్దానికి చెందిన ఈయన అల్లాదుర్గం సమీపంలోని దేవనూరు నివాసి. కర్ణాటక కవి అని పేర్కొంటున్నారు. చూతవనచైత్ర అనే బిరుదాంకితుడు. అడ్లీమాంకుని పుత్రుడు. సంస్కృత జైమినీ భారతాన్ని కన్నడీకరించాడు.
లసల్ల తాగాత్రే జానకి విరాజిసి దళ్ సముల్లాసవిం పుష్పవతీ యోగివికసిత వసంత లక్ష్మీయ తెరదొళు దేప్రాచీన దేవనూరు గొప్ప గ్రామం. ఇప్పటికీ సాహిత్య సంపద దొరుకుతుంది.
మల్లినాథుడు:
సకలశాస్త్ర పారంగతులైన నాటి కోలాచలమ (కొల్చారం) పండితులకు మూల పురుషుడు. శతావధాని వీరరుద్ర పూజితుడు.
కపర్ది:
ఈయన మల్లినాథుని కుమారుడు. గొప్ప భాష్యాకారులు. 1300 సంవత్సరానికి చెందిన కపర్ది ఆపస్తంబి గృహ్య పరిశిష్టభాష్యం, భారద్వాజ గృహ్యసూత్రభాష్యము, శ్రౌత సూత్ర భాష్యము మొదలైనవాటిని రచించాడు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






