భారతీయులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులను తెలిపే ఆర్టికల్స్? (పాలిటీ)
1. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్-I తొలిసారిగా తనదేశ ప్రజలకు ప్రాథమిక హక్కులను ప్రసాదించారు.
2) క్రీ.శ. 1215లో ఇంగ్లండ్ లో వెలువడిన హక్కుల ప్రకటనను చరిత్రలో ‘మాగ్నా కార్టా’ గా పేర్కొంటారు.
3) ప్రాథమిక హక్కులను ఫ్రెంచ్ రాజ్యాంగంలో ‘బిల్ ఆఫ్ రైట్స్’గా పేర్కొన్నారు.
4) మానవులు సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి కావలసిన కనీస హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు.
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3, 4
2. కింది పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఫ్రెంచి వివ్లవ ఆదర్శాలు ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’’
2) ఫ్రెంచి విప్లవానికి బైబిల్ గా సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనే గ్రంథాన్ని పేర్కొంటారు.
3) సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రూసో రచించారు
4) ఫ్రెంచ్ జాతీయసభ 1787లో మానవ హక్కుల ప్రకటనను వెలువరించింది.
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3
3. ఐక్యరాజ్యసమితి(యూఎన్ ఓ) ‘విశ్వమానవ హక్కుల ప్రకటనను’ ఎప్పుడు జారీ చేసింది?
ఎ) 1948 డిసెంబర్ 10
బి) 1949 డిసెంబర్ 16
సి) 1948 డిసెంబర్ 23
డి) 1948 డిసెంబర్ 31
4. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) సెప్టెంబర్ -3 బి) డిసెంబర్ -10
సి) నవంబర్ -11 డి) జనవరి -16
5. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే
2) చట్టబద్దమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులే
3) ప్రాథమిక హక్కులు రాజ్యాంగంచే హామీ ఇవ్వబడ్డాయి
4) చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 3, 4
6. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన 1776లో వెలువడింది
2) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన తర్వాత ఫిలడెల్ఫియా కన్వెన్షన్ ద్వారా ఏర్పడిన రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కుల సంఖ్య -8
3) అమెరికా రాజ్యాంగంలో 1791, డిసెంబర్ 15న ’Bill of Rights’ పేరుతో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు.
4) Bill of Rights లో అమెరికా పౌరులకు ఉండే వివిధ రకాల హక్కులు, స్వేచ్ఛలను పేర్కొన్నారు.
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
7. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన (1776) సందర్భంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో జన్మించిన మానవులు జీవితాంతం వాటితోనే కొనసాగుతారని ఎవరు పేర్కొన్నారు?
ఎ) థామస్ జఫర్ సన్
బి) థియోడర్ రూజ్ వెల్ట్
సి) విలియం జాన్సన్
డి) జార్జి వాషింగ్టన్
8. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక హక్కులు వేరు సాధారణ హక్కులు వేరు
2) సాధారణ హక్కులకు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాల ద్వారా హామీ ఇస్తారు
3) కేవలం ప్రజాస్వామ్య దేశాల్లో గల ప్రజలకు మాత్రమే ప్రాథమిక హక్కులుంటాయి.
4) కమ్యూనిస్టు, నియంతృత్వ రాజరికం అమలులో గల ప్రజలకు హక్కులుండవు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
9. సమాజం చేత కోరబడి రాజ్యంచేత గుర్తింపబడిన అంశాలే హక్కులు అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) హెచ్ .జె.లాస్కి బి) గార్నర్
సి) జీన్ బోడిన్ డి) థామస్ హాబ్స్
10. మనదేశంలో ప్రాథమిక హక్కుల భావనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్ ’ అనే బిల్లు ద్వారా భారతీయులకు వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదించాలని ఆంగ్లేయులను డిమాండ్ చేశారు.
2) ‘స్వరాజ్ ’ అనే బిల్లును 1875లో బాలగంగాధర్ తిలక్ ప్రతిపాదించారు
3) మహాత్మగాంధీ యంగ్ ఇండియా పత్రికలో భారతీయుల హక్కుల గురించి పేర్కొన్నారు.
4) జవహర్ లాల్ నెహ్రూ 1931లో కామన్ వెల్త్ అనే పత్రికలో భారతీయుల హక్కుల గురించి వివరించారు.
ఎ) 1, 2, 3 బి) 1, 2 ,3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
11. స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదని అది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) మహాత్మాగాంధీ
బి) దాదాభాయ్ నౌరోజీ
సి) గోపాల కృష్ణ గోఖలే
డి) లాలాలజపతిరాయ్
12. భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాదిరాళ్లు అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) లాలాలజపతిరాయ్
సి) నానీ పాల్కీవాలా
డి) బిపిన్ చంద్రపాల్
13. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి?
1) 1925లో అనిబిసెంట్ కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించారు.
2) మోతీలాల్ నెహ్రూ నివేదిక ప్రాథమిక హక్కుల ఆవశ్యకతను గుర్తించింది.
3) కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లు ద్వారా ఐర్లాండ్ ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల వంటివే భారత ప్రజలకు కూడా కల్పించాలని డిమాండ్ చేయడమైనది.
4) భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం (1929)లో ప్రాథమిక హక్కులపై తీర్మానాన్ని ఆమోదించింది.
ఎ) 1, 2 ,3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 4
14. నెహ్రూ రిపోర్టుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) 1928 మే నెలలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన INC ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
2) మోతీలాల్ నెహ్రూ కమిటీ తన రిపోర్టును 1928, ఆగస్టు 10న సమర్పించినది.
3) మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్టుకు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినది.
4) మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్ట్ అమల్లోకి రాకపోయినప్పటికీ చరిత్రలో ‘నెహ్రూరిపోర్టు-1928’గా నిలిచిపోయింది.
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
15. భారత జాతీయ కాంగ్రెస్ ‘కరాచీ’లో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) 1931లో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది.
2) ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు
3) ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని సుభాష్ చంద్రబోస్ ప్రవేశ పెట్టారు.
4) ఈ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు.
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
16. 1931లో కరాచీ నందు జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు, ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఎవరు రూపొందించారు?
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) బిపిన్ చంద్రపాల్
డి) అనిబిసెంట్
17. కింద పేర్కొన్న అంశాలలో సరికాని దాన్ని గుర్తించండి?
ఎ) ప్రాథమిక హక్కులు గురించి రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్నారు
బి) ప్రాథమిక హక్కుల వివరణ ఆర్టికల్ 14 నుంచి 35 మధ్య గలదు
సి) ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్‌ను జారీచేస్తుంది.
డి) ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ను జారీ చేస్తాయి.
18. కింద పేర్కొన్న వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక హక్కుల ఉపసంఘం
a) సర్ తేజ్ బదూర్ సఫ్రూ
2) ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం b) సర్దార్ వల్లభాయ్ పటేల్
3) ప్రాథమిక హక్కుల సలహా సంఘం c) జె.బి. కృపాలాని
ఎ) 1-b, 2-c, 3-a
బి) 1-c, 2-a, 3-b
సి) 1-c, 2-b, 3-a
డి) 1-a, 2-b, 3-c
19. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం a) 1947 జనవరి 24
2) ప్రాథమిక హక్కుల ఉపసంఘం
b)1947, ఫిబ్రవరి 12
3) ప్రాథమిక హక్కుల సలహా సంఘం
c) 1944-1955
ఎ) 1-c, 2-b, 3-a
బి) 1-c, 2-a, 3-b
సి) 1-a, 2-b, 3-c
డి) 1-b, 2-c, 3-a
20. జె.బి.కృపాలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యుల కానిది ఎవరు?
ఎ) హరనాం సింగ్ , జైరాందాస్ దౌలత్ రాం, కె.ఎం. మున్షీ
బి) కె.టి.షా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సి) రాజకుమారి అమృతకౌర్ , ఎం.ఆర్ . మసాని
డి) ప్రొమథ్ రంజన్ ఠాగూర్ , దామోదర్ స్వరూప్ సేథ్
21. జె.బి. కృపాలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులను గుర్తించండి?
ఎ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ,
డా. బి.ఆర్ . అంబేద్కర్
బి) కె.ఎం. మున్షీ, సయ్యద్ మహ్మద్ సాదుల్లా
సి) అనంతశయనం అయ్యంగార్ , డి.పి. ఖైతాన్
డి) పైవన్నీ సరైనవే.
22 ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి ఆత్మ, అంతరంగం వంటివి అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) డా.బి.ఆర్ . అంబేద్కర్
సి) మహాత్మాగాంధీ
డి) సర్దార్ వల్లభాయ్ పటేల్
23. భారతీయ పౌరులతోపాటు విదేశీయులకు కూడా మనదేశంలో లభించే ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 14, 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు
2) ఆర్టికల్ 22, 23, 24 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు
3) ఆర్టికల్ 15, 16 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు
4) ఆర్టికల్ 25, 26 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 2, 3, 4
24. కేవలం భారతీయులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్‌లో పేర్కొన్నారు?
ఎ) ఆర్టికల్ 15, 16, 19, 29
బి) ఆర్టికల్ 16, 19, 20, 21
సి) ఆర్టికల్ 29, 22, 23, 24
డి) ఆర్టికల్ 19, 25, 26, 27
25. ‘రాజ్యం’(state) నిర్వచనం గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరణ ఉంది?
ఎ) ఆర్టికల్ 12 బి) ఆర్టికల్ 13 సి) ఆర్టికల్ 18 డి) ఆర్టికల్ 22
26. ‘రాజ్యం’ వివరణకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాజ్యం అనగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు
బి) రాజ్యం అనగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు
సి) భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని స్థానిక ఇతర అధికార సంస్థలను ‘రాజ్యం’గా పేర్కొంటారు.
ఎ) 1, 3 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 2
27. సుప్రీం కోర్టు ఏ కేసు సందర్భంగా ‘రాజ్యం’ వివరణను స్పష్టంగా పేర్కొన్నది?
ఎ) అజయ్ హాసియా Vs ఖలీద్ ముజీబ్ కేసు
బి) డి.పి. వాద్వా Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు
సి) సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
డి) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
28. 1981లో జస్టిస్ భగవతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అజయ్ హాసియా కేసులో రాజ్యం/రాజ్య సంస్థకు ఇచ్చిన వివరణకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
ఎ) ఒక సంస్థ చేస్తున్న మొత్తం ఖర్చును రాజ్యం ఇస్తున్నపుడు దానిని రాజ్య సంస్థగా పేర్కొనవచ్చు.
బి) ఒక సంస్థపై రాజ్యం పూర్తి నియంత్రణను కలిగి ఉన్నట్లయితే దానిని రాజ్య సంస్థగా పేర్కొనవచ్చును.
సి) ఒక సంస్థ పూర్తి మూలధనం వాటా ప్రభుత్వం కలిగి ఉంటే దానిని రాజ్యం ఏజెన్సీగా పేర్కొనవచ్చు.
ఎ) 1, 2, 3 బి) 1, 3
సి) 1, 3 డి) 2, 3
29. ఒక సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు ప్రజాప్రాముఖ్యత కలిగి ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం ఉన్నపుడు దానిని కూడా రాజ్యసంస్థగా పేర్కొనవచ్చునని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) ఈశ్వరీభాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
బి) ఎస్.ఆర్ .బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా
సి) ప్రకాష్ కదం Vs స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్
డి) అజయ్ హాసియా Vs ఖలీద్ ముజీబ్ కేసు
సమాధానాలు
1-బి 2-డి 3-ఎ 4-బి 5-డి 6-బి 7-ఎ 8-సి 9-బి 10-ఎ 11-ఎ 12-సి 13-బి 14-ఎ 15-డి 16-బి 17-బి 18-బి 19-ఎ 20-డి
21-ఎ 22-ఎ 23-సి 24-ఎ 25-ఎ 26-సి 27-ఎ 28-ఎ 29-డి
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీసర్కిల్ , వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
Website publishing check 1cf3602aa119
MyStake casino: bezpečnost účtu a kontrola identity
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions






