Vishnu Kundinu | విష్ణుకుండినుల పరిపాలన
రెండో విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 555-569)
-ఇతడు చిన్న వయస్సులోనే (16) సింహాసనాన్ని అధిష్టించాడు.
-ఇతని బిరుదు సకల భువన రక్షాభరణైకాశ్రయ. ఇది ఇతని రాజ్య విస్తృతి చాలా విశాలమైందని సూచిస్తుంది.
-ఇతను తన 11వ పాలనా సంవత్సరంలో పల్లవ రాజైన సింహవర్మ దండయాత్రను ఎదుర్కొని, తన కింది స్థానిక రాజులు అందించిన సహాయంతో సింహావర్మన్ను తరిమికొట్టినట్లు తుమ్మలగూడెంలో లభ్యమైన శాసనాలలో పేర్కొని ఉంది.
-దాదాపు అన్ని శాసనాల్లో విక్రమేంద్రవర్మను నీతిమంతుడైన రాజుగా (ఉత్తమాశ్రయ) చిత్రీకరించారు.
-ఇతను పల్లవ రాజు సింహవర్మపై విజయానికి గుర్తుగా ఇంద్రపాలనగరంలో గోవిందవర్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానం చేశాడు.
-రెండో విక్రమేంద్రవర్మ పల్లవులతో పోరాడుతున్న సమయంలోనే ఇతని సామంతరాజు రణదుర్జయ వంశానికి చెందిన పృథ్వీమహారాజు పిష్టపురంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు.
-అయితే పృథ్వీమహారాజును ఓడించడానికి పిష్టపురంపై దండెత్తిన రెండో విక్రమేంద్రవర్మ అక్కడ జరిగిన యుద్ధంలో మరణించాడు. (30 ఏండ్ల వయసులో)
మాధవవర్మ-IV (576-623)
-విక్రమేంద్రవర్మ-II చనిపోయే సమయానికి అతనికి సంతానం లేదు.
-అతని తర్వాత విష్ణుకుండినుల్లో సమాంతర శాఖకు చెందిన మాధవవర్మ-IV రాజ పదవిని స్వీకరించాడు.
-రాజ పదవిని అధిరోహించిన వెంటనే మాధవర్మ తన శత్రువులను ఓడించి, విష్ణుకుండినుల రాజ్యానికి పూర్వ వైభవాన్ని పునరుజ్జీవింపజేశాడు.
-అంతేకాకుండా ఈ వంశం, రాజ్యం, కీర్తి ప్రతిష్టలను అధికం చేయడానికి ఇతడు అశ్వమేథ, ఇతర వైదిక యజ్ఞాలను నిర్వహించాడు.
-ఇతను మహావిజ్ఞాని, పండితుడు, న్యాయపాలనలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
-హిరణ్యగర్భ దానం చేసి సువర్ణ గర్భ ప్రసూతుడు అని పేరొందాడు.
-ఇతనికి జనాశ్రయ అనే ప్రత్యేకమైన బిరుదు కూడా ఉంది. జనాశ్రయ ఛందోవిచ్ఛితి అనే ఛందశాస్ర్తాన్ని రాశాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.
-612లో మాధవవర్మ-IV కళింగను జయించిన తర్వాత జైపూర్ వరకు వెళ్లాడు.
-ఇతను పొలమూరు, ఈపూరు శాసనాలు వేయించాడు. ఈ శాసనాల ప్రకారం ఇతని బిరుదులు..
-జనాశ్రయ, అవసిత వివిధ దివ్య – పొలమూరు శాసనం
-న్యాయశాస్త్ర విశారదుడు, సూక్ష్మగ్రాహి – ఈపూరు శాసనం
మంచన భట్టారకవర్మ (623-624)
-ఇతను మాధవవర్మ-IV కుమారుడు
-విష్ణుకుండినుల్లో చివరివాడు. బీఎన్ శాస్త్రి ప్రకారం మంచన భట్టారకవర్మ ఒక సంవత్సరం పాలించాడు.
-ఇతడిని పృథ్వీమూల మహారాజు ఓడించినట్లు తాండివాడ శాసనం ద్వారా తెలుస్తుంది.
పరిపాలనా విధానం
-విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి పాదాలను పూజించడం వల్ల ప్రజాపాలనాధికారం పొందామని చెప్పడంతో పాటు, వారి నాణేలపై కూడా శ్రీపర్వత అనే అక్షరాలు చెక్కించారు. విష్ణుకుండిన రాజ్యంలో రాజే సర్వాధికారి, నిరంకుశుడు. అయితే మంత్రిమండలి అభిప్రాయాలకు కూడా రాజాస్థానంలో సముచిత స్థానం ఉండేది. వీరు తమ రాజ్యాన్ని రాష్ర్టాలుగా, రాష్ర్టాన్ని విషయాలుగా, విషయాన్ని గ్రామాలుగా విభజించారు. రాష్ర్టానికి పాలకుడు రాష్ట్రికుడు, విష్ణుకుండినుల రాజ్యంలో పఱకి రాష్ట్రం, ప్లక్కి రాష్ట్రం, కర్మరాష్ట్రం, కళింగ రాష్ట్రం మొదలైన రాష్ర్టాలు ఉండేవి. విషయానికి పాలకుడు విషయాధిపతి. వీరి రాజ్యంలో శృతనవాడి విషయం, నేత్రపాటి విషయం మొదలైన విషయాలు ఉండేవి.
-ఈ పాలనా విభాగాలు గాక రాజ్యంలో కొంత భాగానికి రాజు కొడుకును యువరాజుగా నియమించేవారు. ఇంకాకొన్ని సామంతరాజ్యాలు విష్ణుకుండినుల రాజ్యానికి లోబడి పాలించేవి. కొందరు సామంతులతో విష్ణుకుండినులు వైవాహిక సంబంధాలను ఏర్పర్చుకున్నారు. ఈ వైవాహిక సంబంధాలు విష్ణుకుండినుల రాజ్యరక్షణకు, విస్తృతికి దోహదం చేశాయి. రాజుకు రాజ్యాన్ని పరిపాలించడంలో యువరాజు, మహామాత్య, ఆమాత్య, రహస్యాధికారి, ఆంతరంగికుడు మొదలైన అధికారులు తోడ్పడేవారు.
వీరికాలంలో కొందరు ఉద్యోగులు
-హస్తికోశ- గజ దళాధిపతి
-వీరకోశ- పదాతి దళాధిపతి
-రజ్జకులు – భూములను కొలిచి ఆయకట్టు నిర్ణయించేవారు
-ఫలదారుడు – పండిన పంటలో రాజ్య భాగాన్ని నిర్ణయించే అధికారి
-శెట్టి – ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడు
-అక్షపటలాధీకృత – ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి శాసన ఆజ్ఞపుడు
-లేఖకులు – రాజు ఆజ్ఞను లిఖించే అధికారులు
-గుల్మికుడు – గ్రామాధికారి
-ఆర్థిక పరిస్థితులు : విష్ణుకుండినుల నాటి గ్రామాల్లో స్వయంసమృద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉండేది. అంటే వ్యవసాయదారులు, వివిధ వృత్తుల ప్రజలు ఒకరిపై ఆధారపడి బతికేవారు. రాజులు వ్యవసాయాభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నారు. విష్ణుకుండినులు అనేక వ్యవసాయ బావులు, చెరువులను తవ్వించారని శాసనాలు తెలుపుతున్నాయి.
-వర్తక వ్యాపారాలు: విష్ణుకుండినుల రాజ్యంలో స్వదేశీ, విదేశీ వర్తక వాణిజ్యాలు కూడా కొనసాగాయి. వీరి నాణేలు తెలంగాణలోని ఏలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్‌లో, ఆంధ్రలోని బొజ్జన్నకొండ, యలమంచిలి, మహారాష్ట్రలోని నాసిక్, ఖానాపూర్, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మగిరి తదితర ప్రదేశాల్లో దొరికాయి. వీరి నాణేలపై శంఖం, సింహం గుర్తులను ముద్రించారు. రెండో మాధవవర్మకు త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఉండటం వారి విదేశీ వాణిజ్య ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. మోటుపల్లి, కోడూరు మొదలైన తూర్పు తీర పట్టణాల నుంచి బర్మా, సయాం, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్, సుమత్రా, జావా, బోర్నియా, మలయ, అరకాన్, ఈజిప్ట్, రోమ్, గ్రీస్ దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. విష్ణుకుండినుల రాజ్యంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని, శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ రాశాడు. అవి దొరకలేదు కానీ ఒకటి నుంచి ఐదు అంగుళాలు ఎత్తున్న రాగి బుద్ధ విగ్రహాలు దొరికాయి. వీటిని బట్టి ఆనాడు కంసాలి వృత్తిపనివారు మంచి నైపుణ్యం గలవారని తెలుస్తున్నది. కీసరగుట్టపై దొరికిన ఒక నశండబ్బి (పోత ఇనుములో మామిడి పిందె ఆకారంలో చేసింది-7 సెం.మీ) ఇందుకు మరో నిదర్శనం. మొత్తం మీద విష్ణుకుండినుల కాలంలో భిక్షువులు, బ్రాహ్మణులు, అనాథలు, యాచకులు, దీనులు అందరూ కూడా అనుభవించేంతగా, న్యాయంగా సంపాదించిన ధనసమృద్ధి ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆనాటి ఆర్థిక వ్యవస్థ పటిష్టమైనదని చెప్పవచ్చు.
-సామాజిక పరిస్థితులు: విష్ణుకుండినులు దానమానాదులచే అనురక్తమగు వర్ణాశ్రమ స్వజన పరిజనులైనవారు అని వారి శాసనాల్లో ఉంది. ఇలా వారు చతుర్వర్ణాలవారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) తమ తమ వృత్తి ధర్మాలను పాటించేటట్లుగా చేసే ప్రయత్నం చేశారు. అయితే మొదటి రెండు కులాలకు ఎక్కువ గౌరవం ఉండేది. విష్ణుకుండినుల రాజుల్లో కొందరు పరమబ్రాహ్మణ్య, బ్రహ్మక్షత్ర తేజస్సు బిరుదులు ధరించడం, హిరణ్యగర్భ యాగం చేయడం వల్ల వీరు మొదట శూద్రులై ఉండి అనేక యాగాలు చేసి క్షత్రియులుగా మారారని తెలుస్తుంది. బ్రాహ్మణులకు అగ్రహారాలతో పాటు, ఆ గ్రామంలో సాగు చేస్తున్న రైతులు, వేల సంఖ్యలో దాసీదాస జనాలను దానం చేసేవారు. వీరి వల్ల వ్యవసాయాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి జరిగిందేమో కాని, వారి మానవ హక్కులను కాలరాసినట్లు అర్థమవుతుంది. వైశ్యులు వ్యాపారాల్లో నిమగ్నమయ్యేవారు. శూద్రుల్లో కంసాలివారు, శిల్పులు, చేనేత పనివారు మొదలైనవారికి సముచిత స్థానం ఉండేది. రైతులు దేశానికి వెన్నెముక కాబట్టి కొందరు రైతులకు కూడా అగ్రహారాలను మాన్యాలతో పాటు దానం చేశారు.
పుస్తక సమీక్ష విజేత డైట్‌సెట్ బుక్స్
రాష్ట్ర ప్రభుత్వం డైట్‌సెట్ (టీఎస్డీఈఈసెట్) -2017 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో విజయం సాధించినవారికి ప్రభుత్వ ప్రాథమిక ఉపాధ్యాయులుగా అర్హత ఉంటుంది. డీఈడీ చేసిన వారికే ఎస్జీటీ నిబంధనతో డైట్‌సెట్ క్రేజీ పెరిగింది. ఈ పరీక్షకు పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిర్దేశిత సిలబస్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను చదవాలి. దీనికోసం విజేతకాంపిటీషన్స్ డీఈఈసెట్బుక్ను రిలీజ్ చేసింది. దీనిలో పార్ట్ -1, 2,3పై సమగ్రంగా మెటీరియల్‌ను దీనిలో ఇచ్చారు. దీంతోపాటు 51 మోడల్‌పేపర్స్ బుక్ కూడా విడుదలచేశారు. ఈ రెండు బుక్స్ డైట్‌సెట్‌లో విజయం సాధించడానికి ఉపయోగకరంగా ఉన్నాయి. అదేవిధంగా పోటీపరీక్షల కోసం భారత ఆర్థికసర్వే 2016-17ను విడుదల చేశారు. దీనిలో 14 చాప్టర్లను, ప్రాక్టీస్ బిట్స్‌ను ఇచ్చారు. ఈ పుస్తకం గ్రూప్స్ రాసేవారికి ఉపయుక్తంగా ఉంది. పుస్తకాలు అన్ని బుక్సెంటర్స్లో లభిస్తాయి.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






