సాల్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1. భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టింది. అయితే అడవుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది?
1) 1981 2) 1980 3) 1988 4) 1987
2.సముద్రప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూముల్లో పెరిగే అడవులను ఏమంటారు?
1) టండ్రా అడవులు 2) సమశీతోష్ణ అడవులు
3) ఉష్ణమండల అడవులు 4) టైడల్ అడవులు
3. కింది అటవీపరిశోధన కేంద్రాలు, వాటి ప్రదేశాలను జతపర్చండి.
ఎ. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ 1. డెహ్రాడూన్
బి. ట్రాపికల్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2. జబల్పూర్
సి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆరిడ్జోన్ ఫారెస్ట్ రిసెర్చ్ 3. జోధ్‌పూర్
డి. టెంపరేట్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 4. సిమ్లా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-3, సి-4, డి-1
4. పులులను కాపాడేందుకు భారతప్రభుత్వం ప్రాజెక్టు టైగర్‌ను 1973లో ప్రవేశపెట్టింది. అయితే వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది?
1) 1970 2) 1973 3) 1972 4) 1977
5.చెట్లు, వాటి వినియోగాలను జతపర్చండి.
ఎ. చిర్ 1. తేయాకు నిల్వచేసే పెట్టెలు, రెసిన్, టర్పంటైన్ల తయారీకి
బి. సిల్వర్ఫర్ 2. అగ్గిపెట్టెలు, ప్యాకింగ్ కాగితం తయారీకి
సి. బ్లూపైన్ 3. భవన నిర్మాణాల్లో ఉపయోగానికి
డి. దేవదారు 4. రైల్వే పరిశ్రమలో అవసరాలకు
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
6. నీలగిరి, అన్నామలై పర్వతాల్లో పెరిగే తేమతో కూడిన సమశీతోష్ణ అరణ్యాలను ఏమంటారు?
1) టైడల్ 2) షోలాస్ 3) ముండ్లజాతి 4) ఏదీకాదు
7. దేశంలో ఆకర్షణీయ పూలు పూచే రెడోడెండ్రాన్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి?
1) టెరాయి మైదానం 2) వింధ్యపర్వతాలు
3) 1, 2 4) సిక్కిం హిమాలయాలు
8. అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని దేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షిస్తున్నారు?
1) డచిగావ్ 2) కన్హా 3) నందన్‌కానన్ 4) ఏదీకాదు
9. దేశంలో మొదటి బయోస్పియర్ ఏది?
1) కాంచనజంగ 2) నీలగిరి
3) గల్ఫ్ ఆఫ్ మన్నార్ 4) సుందర్బన్
10. బెట్వా నది పక్కన గల కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఛత్తీస్‌గఢ్ 2) జార్ఖండ్
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
11. క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప?
1) విల్లోస్ 2) దేవదారు 3) స్ప్రూస్ 4) సెమూల్
12. కింది వాటిలో జిడ్డుగా, వాసనగా ఉండే కలప ఏది? (3)
1) స్ప్రూస్ 2) సెమూల్ 3) దేవదారు 4) విల్లోస్
13. అడవులు, అటవీజంతువులను రక్షించాలనే ఆదేశసూత్రాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు?
1) 40 2) 42 3) 44 4) 46
14. దేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?
1) ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన సతతహరిత అడవులు 2) తేమతో కూడిన సమశీతోష్ణమండల పర్వతప్రాంత అడవులు
3) ఉప ఉష్ణమండల అనార్థ్ర సతతహరితాలు
4) ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన ఆకురాల్చే అడవులు
15. దేశంలో ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన సతతహరిత అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) తూర్పు హిమాలయాలు
2) పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం
3) పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం
4) పశ్చిమ హిమాలయాలు
16. దేశంలో యూఎన్డీపీ సహకారంతో మొసళ్ల పెంపకం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1974 2) 1984 3) 1994 4) 2004
17. ఏనుగులను రక్షించేందుకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1993 2) 1983 3) 1992 4) 1982
18. సాల్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) బీహార్ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) మధ్యప్రదేశ్
19. సుగంధద్రవ్యాల్లో వాడే ఆల్ఫైన్ జాతి బ్రహ్మకమలం దేశంలో ఎక్కడ పెరుగుతుంది?
1) పశ్చిమ హిమాలయాలు 2) కేరళ కొండలు
3) తూర్పు హిమాలయాలు 4) గంగామైదానం
20. అరిచే జింకలకు ప్రసిద్ధిచెందిన వన్యమృగ సంరక్షణ కేంద్రం?
1) రణతంబోర్ 2) బోరివిల్లా
3) సైలెంట్ వ్యాలీ 4) కన్హా
21. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. రాష్ట్రంలోని అత్యధిక అటవీ విస్తీర్ణంగల జిల్లాలు- జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం
బి. అతి తక్కువ అటవీ విస్తీర్ణంగల జిల్లాలు- కరీంనగర్, జోగుళాంబ
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
22.రాష్ట్రంలో అతి ప్రాచీన అభయారణ్యం ఏది?
1) శివారం వన్యప్రాణి అభయారణ్యం
2) ప్రాణహిత అభయారణ్యం
3) పాకాల అభయారణ్యం
4) ఏటూరు నాగారం
23. కిందివాటిని జతపర్చండి.
ఎ. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ 1. దూలపల్లి (మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా)
బి. ప్రాతీయ అటవీ పరిశోధన కేంద్రం 2. ములుగు (సిద్దిపేట జిల్లా)
సి. బయోడైవర్సిటీ పార్కు 3. గచ్చిబౌలి (హైదరాబాద్)
1) ఎ-1, బి-2, సి-3 2) ఎ-1, బి-3, సి-2
3) ఎ-2, బి-3, సి-1 4) ఎ-2, బి-1, సి-3
24. కింది వాటిలో సరైనవి.
ఎ. వనసంరక్షణ- మాసపత్రిక
బి. వన జ్ఞాపిక- త్రైమాసిక పత్రిక
సి. తెలంగాణ ఫారెస్ట్ డివిజన్లు- హైదరాబాద్, వరంగల్
1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు
25.ఏటూరు నాగారం అభయారణ్యానికి సంబంధించి సరైనవి.
ఎ. దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు
నాగారం వద్ద ఏర్పాటు చేశారు
బి. ఇక్కడ పెరిగే ప్రధాన వృక్షం టేకు
సి. ఈ వన్యమృగ సూచీ- అడవిదున్న, పులి, జింక
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవన్నీ సరైనవే
26. శివారం వన్యప్రాణి అభయారణ్యం ప్రస్తుతం ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది?
1) ఆదిలాబాద్-పెద్దపల్లి 2) మంచిర్యాల-పెద్దపల్లి 3) ఆదిలాబాద్-నిర్మల్ 4) ఆసిఫాబాద్-ఆదిలాబాద్
27. ప్రాణహిత అభయారణ్యానికి సంబంధించి సరైనవి.
ఎ. ఇది మంచిర్యాల జిల్లాలో ఉంది
బి. దీని ప్రత్యేకత- కృష్ణజింకలు
సి. ఇక్కడ నాయక్‌పోడ్ అనే గిరిజనులు నివసిస్తున్నారు
1) ఎ 2) బి 3) ఎ, సి 4) పైవన్నీ సరైనవే
28.రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి?
1) 29,242 చ.కి.మీ 2) 30,242 చ.కి.మీ
3) 31,242 చ.కి.మీ 4) 32,242 చ.కి.మీ
29.పాకాల అభయారణ్యానికి సంబంధించి సరైవని?
ఎ. ఇది వరంగల్ రూరల్ జిల్లాలో ఉంది
బి. దీన్ని హైదరాబాద్ ఫస్లీ చట్టం-1972 కింద 199లో ఏర్పాటు చేశారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
30.కిన్నెరసాని వన్యమృగ సంరక్షణాలయాన్ని ఎప్పుడు అభయారణ్యంగా ప్రకటించారు? (2)
1) 1966 2) 1977 3) 1988 4) 1999
31. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం విస్తరించి ఉన్న జిల్లా?
1) నల్లగొండ- సూర్యాపేట
2) నల్లగొండ- యాదాద్రి భువనగిరి
3) నల్లగొండ- ఖమ్మం
4) నల్లగొండ- నాగర్‌కర్నూలు
32. మృగవని జాతీయ పార్కుకు సంబంధించి సరైనవి.
ఎ. ఇది మొదట చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉండేది
బి. ఇది గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులకు కుడి, ఎడమ వైపు ఉంది
సి. దీన్ని కేంద్రప్రభుత్వం 1994లో వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా ప్రకటించింది
1) ఎ 2) బి 3) ఎ, సి 4) పైవన్నీ సరైనవే
33. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రానికి సంబంధించి సరైనవి?
ఎ. 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉండేది
బి. పులుల సంరక్షణ కేంద్రంగా 1983లో ప్రకటించారు
సి. దీని పరిధిలో నాగార్జునసాగర్ జలాశయం ఉంది
1) ఎ 2) బి 3) ఎ, సి 4) పైవన్నీ సరైనవే
34. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని దూలపల్లిలో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1971-72లో 2) 1961-62లో
3) 1981-82లో 4) 1991-92లో
35.దేశంలో విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు?
1) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
2) అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, అసోం
3) అసోం, మిజోరం, ఒడిశా
4) ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్
36.సుగంధ నూనె తయారీకి ఉపయోగించే రూసా గడ్డి ఏ జిల్లా అటవీప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది?
1) ఖమ్మం 2) నిజామాబాద్
3) ఆదిలాబాద్ 4)కరీంనగర్
37.బీడీ తయారీలో ఉపయోగించే తునికాకు ఏ జిల్లా అడవుల్లో లభిస్తుంది?
1) కరీంనగర్ 2) మహబూబ్‌నగర్
3) ఆదిలాబాద్ 4) ఖమ్మం
38. అటవీ విస్తీర్ణతపరంగా దేశంలో రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది?
1) 6 2) 12 3) 8 4) 14
39. సారా తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి?
1) తంగేడు 2) ఇప్ప పువ్వు
3) మోదుగు 4) రూసా గడ్డి
40. రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అడవులు?
1) ఆర్థ్ర ఆకురాల్చే అడవులు 2) చిట్టడవులు
3) సతతహరిత అడవులు
4) అనార్థ్ర ఆకురాల్చే అడవులు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






