ఇసుక, చక్కెర మిశ్రమం దేనికి చెందినది?
క్రొమటోగ్రఫీ
రంగు ఆధారంగా వర్ణకాలను వేరుచేసే పద్ధతిని ‘క్రొమటోగ్రఫీ’ అంటారు. ఇది ఒక ప్రయోగశాల ప్రక్రియ.
సిరాలోని అనుఘటకాలు వేరుచేయడానికి మొక్కలు, పుష్పాల్లోని రంగు వర్ణకాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
ఒక ద్రవం మరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోతే వాటిని ‘మిశ్రమ ద్రవాలు’ అంటారు.
ఉదాహరణ: నీరు+ఆల్కహాల్ నీరు+ ఎసిటిన్
మిశ్రణీయ ద్రవాలను వేరుచేయడానికి స్వేదనం, అంశిక స్వేదనం అనే పద్ధతులు ఉపయోగిస్తారు.
రెండు ద్రవాల మరిగే స్థానాల మధ్య వ్యత్యాసం 25oC కంటే ఎక్కువగా ఉంటే ‘స్వేదన ప్రక్రియను’ 25oC కంటే తక్కువగా ఉంటే ‘అంశిక స్వేదనం’ ప్రక్రియను ఉపయోగిస్తారు.
నీరు (B.P 100oC) + ఇథైల్ ఆల్కహాల్- వేరుచేయడం అంశిక స్వేదనం (B.P 78oC)
నీరు (B.P 100oC) +ఎసిటోన్ – వేరుచేయడం స్వేదనం (B.P 56oC)
ఒక ద్రవం మరొక ద్రవంలో కరగకుండా ఉంటే వాటిని ‘అమిశ్రణీయ ద్రవాలు’ అంటారు.
ఉదాహరణ: నూనె+ నీరు డీజిల్+నీరు
అమిశ్రణీయ ద్రవాలను వేరుచేయడం కోసం ‘వేర్పాటు గరాటు’ ఉపయోగిస్తారు.
ఒక ద్రావణంలో పూర్తిగా కరిగిపోయిన ద్రావితం ఘన పదార్థం అయితే ద్రావితం, ద్రావణిలను వేరుచేయడానికి ‘బాష్పీభవనం’ స్ఫటికీకరణం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
ఉదాహరణ: చక్కెర ద్రావణం నుంచి చక్కెర ఉప్పు ద్రావణం నుంచి ఉప్పును వేరుచేయడం.
గాలిలోని అనుఘటకాలు
N2- 78% (B.M.P 196oC)
Q2-20.9% (B.M.P -183oC)
Ar- 0.9% ఉంటాయి
(M.P – 186oC)
గాలిలోని అనుఘటకాలను వేరుచేయడానికి గాలిని ద్రవీకరించి వాటిని‘అంశికస్వేదన ప్రక్రియ’కు గురిచేస్తారు.
ప్రాక్టీస్ బిట్స్
1. జతపర్చండి?
ఎ. బంగారం 1. కొల్లాయిడ్
బి. గ్లూకోజ్ 2. ద్రావణం
సి. శీతల పానీయం 3. సంయోగ పదార్థం
డి. పాలు 4. శుద్ధ (మూలకం)
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
2. శాస్త్రవేత్తలు పదార్థాలను ఎన్ని స్థితులుగా వర్గీకరించారు?
1) 1 2) 2 3) 3 4) 4
3. కింది వాటిలో అధిక సంపీడ్యతను ప్రదర్శించే పదార్థం?
1) ఘన పదార్థం 2) ద్రవ పదార్థం
3) వాయు పదార్థం 4) ప్లాస్మా స్థితి
4. ఉప్పు, కర్పూరం మిశ్రమాన్ని వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
1) అంశిక స్వేదనం 2) ఉత్పతనం
3) స్ఫటికీకరణం 4) బాష్పీభవనం
5. కింది విజాతీయ మిశ్రమాన్ని కదిలించకుండా స్థిరంగా ఉంచితే కణాలు అడుగు భాగానికి చేరుతాయి?
1) అసంతృప్త ద్రావణం
2) సంతృప్త ద్రావణం
3) కాంజికాభ ద్రావణం
4) అవలంబనాలు
6. ఒక ద్రావణంలో రెండు ద్రవాలు ఒకదానికొకటి కరగకపోతే వాటి ఏమని పిలుస్తారు?
1) ద్రావణి 2) ద్రావితం
3) అమిశ్రణీయ ద్రావణం
4) మిశ్రణీయ ద్రావణం
7. కింది వాటిని పూర్తిచేయండి? అమ్మోనియా: వాయువు అయిన కర్పూరం..
1) వాయువు 2) ద్రవం
3) ఘన పదార్థం 4) పాక్షిక ఘన పదార్థం
8. కింది పదార్థం ఏ స్థితిలో కణాల మధ్య ఆకర్షణ అధికంగా ఉంటుంది?
1) ద్రవస్థితి 2) వాయుస్థితి
3) ప్లాస్మాస్థితి 4) ఘనస్థితి
9. పుష్పాల్లోని వర్ణకాలు లేదా రంగులను వేరుచేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
1) స్ఫటికీకరణం 2) క్రొమటోగ్రఫీ
3) ఉత్పతనం 4) బాష్పీభవనం
10. ద్రవ గాలిలోని అనుఘటకాలను వేరుచేయడానికి ఉపయోగించే విధానం?
1) స్వేదనం 2) నీటి ఆవిరి స్వేదనం
3) ఉత్పతనం 4) అంశిక స్వేదనం
11. ఇసుక, చక్కెర మిశ్రమం దేనికి చెందినది?
1) విజాతీయ మిశ్రమం
2) కొల్లాయిడ్ ద్రావణం
3) సజాతీయ మిశ్రమం
4) అవలంబనం
12. కింది వాటిలో విజాతీయ మిశ్రమం ఏది?
1) ఇత్తడి 2) చక్కెర ద్రావణం
3) గాలి 4) పాలు
13. కింది వాటిని పరిశీలించండి?
ఎ. ప్లాస్మాస్థితిని మొదటిసారి
గుర్తించినది విలియం మ్యాక్స్
బి. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్థితి ఉష్ణోగ్రత పెంచడం వల్ల లభిస్తుంది
1) ఎ సరైనది
2) ఎ సరికాదు, బి సరైనది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ, బి రెండూ సరికావు
14. కింది వాటిలో ఏ పదార్థం నుంచి మొదటగా బోస్ఐన్స్టీన్ కండెన్సేట్ సృష్టించారు?
1) సోడియం 2) రుబీడియం
3) సీసియం 4) బెరిలియం
15. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్థితి రూపొందించిన వారిలో నోబెల్ బహుమతి పొందినది ఎవరు?
1) ఎరిక్ కార్నెల్ 2) కార్ల్ వైమెన్
3) హోల్ఫ్గాంగ్ కెటిర్లే 4) 1, 2, 3
16. కింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి?
1) గాలి 2) మిశ్రమ లోహం
3) పాలు 4) నీరు
17. కింది వాటిలో శుద్ధపదార్థం?
1) చక్కెర ద్రావణం 2) మీథేన్
3) పాలు 4) గాలి
18. వ్యాపనరేటు దేనిలో అధికంగా ఉంటుంది?
1) ఘన పదార్థాలు 2) ద్రవ పదార్థాలు
3) వాయువులు 4) ప్లాస్మా
19. ఒక వస్తువు మునగడం తేలడం అనేది వస్తువు దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) వస్తువు సాంద్రత
2) మాధ్యమం సాంద్రత
3) పై రెండూ 4) వస్తువు స్థితి
20. వస్తువుల రంగుకు గల కారణం?
1) అవి శోషించుకొనే కాంతి రంగు
2) అవి ఉద్గారించే కాంతి రంగు
3) పరిసరాల్లోని రంగు
4) సూర్యుని కాంతి
21. ఘన స్థితి నుంచి నేరుగా వాయుస్థితికి మారడాన్ని ఏమంటారు?
1) ఉత్పతనం 2) బాష్పీభవనం
3) ద్రవీభవనం 4) ఇగురుట
22. కింది వాటిలో ఉత్పతనం చెందనిది?
1) నాఫ్తలీన్ 2) చక్కెర
3) కర్పూరం 4) అయోడిన్
23. పదార్థం ఏ స్థితికి నిర్దిష్ట ఆకారం కాని,పరిమాణం కాని ఉండదు?
1) ఘనస్థితి 2) ద్రవస్థితి
3) వాయు స్థితి 4) ప్లాస్మాస్థితి
24. ఏ మిశ్రమంలోని అనుఘటకాలను వేర్వేరుగా గుర్తించలేం?
1) సజాతీయ 2) విజాతీయ
3) కొల్లాయిడ్లు 4) అవలంబనాలు
25. ఆక్సిజన్ వాయువు ద్రవీభవన స్థానం?
1) -183 డిగ్రీల సెంటీగ్రేడ్
2) -196 డిగ్రీల సెంటీగ్రేడ్
3) -168 డిగ్రీల సెంటీగ్రేడ్
4) -198 డిగ్రీల సెంటీగ్రేడ్
26. మూలకానికి ఉపయుక్తమైన నిర్వచనం ఇచ్చినది ఎవరు?
1) రాబర్ట్ బాయిల్ 2) లెవోయిజర్
3) అల్జబర్ 4) పై అందరూ
27. పెట్రోల్ను ఏ పద్ధతిలో వేరు చేస్తారు?
1) స్వేదనం 2) అంశిక స్వేదనం
3) క్రొమటోగ్రఫీ 4) స్ఫటికీకరణం
28. అంశికస్వేదన పద్ధతిలో పదార్థాలను వేరుచేయడానికి రెండు ద్రవాల బాష్పీభవన స్థానాల మధ్య ఉండే తేడా ఎంత ఉష్ణోగ్రతకు తక్కువగా ఉండాలి?
1) 10 డిగ్రీల సెంటీగ్రేడ్
2) 25 డిగ్రీల సెంటీగ్రేడ్
3) 30 డిగ్రీల సెంటీగ్రేడ్
4) 50 డిగ్రీల సెంటీగ్రేడ్
29. ఏ ద్రవంలో అణువుల పరిమాణం 1000 MM కంటే ఎక్కువగా ఉంటుంది?
1) కొల్లాయిడ్ 2) ద్రావణాలు
3) అవలంబనాలు 4) నీరు
30. విక్షేపణ యానకం, ప్రావస్థ రెండూ ద్రవాలుగా గల కొల్లాయిడ్ రకం?
1) ఏరోసోల్ 2) నురగ
3) ఎమల్షన్ 4) ఘనసోల్
31. తోకచుక్కల తోక భాగంలో పదార్థం ఏ స్థితిలో ఉంటుంది?
1) ఘనస్థితి 2) ద్రవస్థితి
3) ప్లాస్మాస్థితి 4) బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్
32. 250 గ్రాముల చక్కెర నీటిలో 50 గ్రాముల చక్కెర కరిగి ఉంది. ఆ ద్రావణం ద్రవ్యరాశి శాతం ఎంత?
1) 20% 2) 25% 3) 30% 4) 50%
33. 1. జతపర్చండి?
ఎ. మేఘం 1. ఏరోసోల్
బి. పాలు 2. ఎమల్షన్
సి. జున్ను 3. జెల్
డి. బురద 4. సోల్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-2, సి-4, డి-3
34. రక్తం నుంచి సీరమ్, ప్లాస్మాలను వేరుచేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు?
1) స్ఫటికీకరణం 2) క్రొమటోగ్రఫీ
3) అపకేంద్రిత విధానం 4) బాష్పీభవనం
35. గాలిలో అధిక పరిమాణంలో ఉండే అనుఘటకం?
1) ఆక్సిజన్ 2) నైట్రోజన్
3) ఆర్గాన్ 4) హీలియం
36. కింది వాటిలో పరమశూన్య ఉష్ణోగ్రతను గుర్తించండి?
1) O K 2) -273o C
3) -459.67o F 4) పైవన్నీ
37. వడపోత, తేర్చడం ప్రక్రియ ద్వారా వేరు చేయగలిగినవి?
1) కొల్లాయిడ్లు 2) ద్రావణాలు
3) శుద్ధ పదార్థాలు 4) అవలంబనాలు
38. సోడియం పరమాణువుల నుంచి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్థితిని సృష్టించినది?
1) ఎరిక్ కార్నెల్ 2) వోల్ఫ్గాంగ్ కెటెర్లే
3) కార్ల్ వైమన్ 4) రూథర్ఫర్డ్
39. కింది వాటిలో టిండాల్ ప్రభావం అనువర్తనం కానిది?
1) సూర్యకిరణాలు చెట్టు కొమ్మలు
ఆకుల మధ్య ప్రసరించినప్పుడు
2) వంటగదిలో పొయ్యి నుంచి
వచ్చే పొగపై కాంతి పడినప్పుడు
3) సినిమా ప్రొజెక్టర్ కాంతిలో
4) చెట్లపై కాంతి ప్రసరించినప్పుడు
40.శీతల పానీయాల్లో ద్రావితం?
1) నీరు 2) ఉప్పు
3) Co2 4) NH3
Answers
1-3, 2-4, 3-3, 4-2, 5-4,
6-3, 7-3, 8-4, 9-2 10-4
11-1, 12-4, 13-1, 14-2, 15-4,
16-4, 17-2, 18-3, 19-3, 20-2,
21-1, 22-2, 23-3, 24-1, 25-1,
26-2, 27-2, 28-2, 29-2, 30-3,
31-3, 32-1, 33-1, 34-3, 35-2,
36-4, 37-4, 38-2, 39-4, 40-2
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు