TET Social Special | ఇక్కత్ టై అండ్ డై చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1. ట్రాఫిక్ రూల్స్‌లో వెళ్లడానికి సిద్ధంగా ఉండటానికి వాడే గుర్తు?
ఎ) ఎరుపు బి) ఆకుపచ్చ
సి) పసుపు డి) తెలుపు
2. మేరీకోమ్ ఏ క్రీడతో గుర్తింపు పొందింది?
ఎ) టెన్నిస్ బి) బాక్సింగ్
సి) షూటింగ్ డి) రెజ్లింగ్
3. కరణం మల్లీశ్వరి ఏ క్రీడలో గుర్తింపు పొందారు?
ఎ) క్రికెట్ బి) చదరంగం
సి) వెయిట్ లిఫ్టింగ్ డి) అథ్లెటిక్స్
4. కింది వారిలో బాడ్మింటన్‌లో రాణించిన వారు?
ఎ) సానియా మీర్జా బి) సైనా నెహ్వాల్
సి) మిథాలీరాజ్ డి) కోనేరు హంపి
5. మన దేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్పు గెలుచుకున్న సంవత్సరం?
ఎ) 2012 బి) 2011
సి) 2018 డి) 2003
6. కింది వారిలో ఒలింపిక్ పతకం గెలుచుకున్న భారతీయుడు?
ఎ) మేరీకోమ్ బి) గగన్ నారంగ్
సి) విజేందర్ సింగ్ డి) పైవారందరూ
7. ఒలింపిక్ పోటీలు దేనికి సంబంధించినవి?
ఎ) సాహిత్యం బి) క్రీడలు
సి) విద్య డి) సినిమా
8. బాలకార్మికులు అంటే ఏ వయస్సున్నవారు?
ఎ) 12 సంవత్సరాల్లోపు పనిచేసే బాలబాలికలు
బి) 14 సంవత్సరాల్లోపు పనిచేసే బాలబాలికలు
సి) 16 సంవత్సరాల్లోపు పనిచేసేబాలబాలికలు
డి) 18 సంవత్సరాల్లోపు పనిచేసే బాలబాలికలు
9. ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
ఎ) 2008 ఏప్రిల్ 1 బి) 2010 ఏప్రిల్ 1
సి) 2009 ఏప్రిల్ 1 డి) 2012 ఏప్రిల్ 1
10. బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకొంటారు?
ఎ) సెప్టెంబర్ 5 బి) అక్టోబర్ 7
సి) నవంబర్ 14 డి) డిసెంబర్ 1
11. కింది వాటిలో జంతువులనుపయోగించి ఆడే ఆట?
ఎ) రగ్బీ బి) రెజ్లింగ్
సి) ఫార్మూలావన్ రేసింగ్
డి) పోలో
12. భారతదేశంలో క్రికెట్ ఆటను మొదట ఆడినవారు?
ఎ) ముస్లింలు బి) హిందువులు
సి) పార్శీలు డి) క్రైస్తవులు
13. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్?
ఎ) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, హైదరాబాద్
బి) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, ముంబై
సి) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, కోల్‌కతా
డి) ఓరియంటల్ క్రికెట్ క్లబ్, చెన్నై
14. 1971లో మొదటిసారి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఎవరి మధ్య జరిగింది?
ఎ) ఇంగ్లండ్, ఇండియా
బి) ఇంగ్లండ్, ఆస్ట్రేలియా
సి) ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా
డి) ఇంగ్లండ్, శ్రీలంక
15. మొదటి క్రికెట్ వరల్డ్‌కప్ నిర్వహించిన సంవత్సరం?
ఎ) 1971 బి) 1975
సి) 1977 డి) 1980
16. మొదటి టెస్ట్‌మ్యాచ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరం?
ఎ) 1971 బి) 1975
సి) 1977 డి) 1980
17. వరల్డ్ క్రికెట్ సిరీస్ పేరుతో అనధికార క్రికెట్ పోటీలు నిర్వహించినది?
ఎ) సుభాష్‌ఘాయ్ బి) కెర్రీ పాకర్
సి) డికోబర్డీన్ డి) సి.కె.నాయుడు
18. కింది వాటిలో గోండుల అతి ప్రధాన జాతర ఏది?
ఎ) సమ్మక్క, సారక్క బి) నాగోబా జాతర
సి) ఏడుపాయల జాతర
డి) పెద్దమ్మ గట్టు జాతర
19. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనికి గల పేరు?
ఎ) ఉద్యోగం బి) వృత్తి
సి) ఉపాధి డి) వారసత్వ పని
20. తెలంగాణలో బుట్టల అల్లకం దారులు నివశించే అందుగుల గ్రామం(మాడుగుల మండలం) ఏ జిల్లాలో ఉంది?
ఎ) కరీంనగర్ బి) వరంగల్
సి) మహబూబ్‌నగర్ డి) నల్లగొండ
21. కింది వాటిలో అడవులపై ఆధారపడిన చేతివృత్తి ఏది?
ఎ) బుట్టలు నేయడం బుట్టల తయారీ
సి) పట్టు పురుగుల పెంపకం
డి) చేపలు పట్టడం
22. కింది వారిలో బుట్టల తయారీలో నిమగ్నమైన తెగ?
ఎ) ఎరుకల బి) బెస్త
సి) లంబాడీ డి) గోండు
23. ఎరుకుల భాష ఏ భాష మాండలికాలను కలిగి ఉంటుంది?
1) తెలుగు 3) తమిళం
2) కన్నడం
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3 డి) 1, 3
24. ఇక్కత్ టై అండ్ డై చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) సిరిసిల్ల, కరీంనగర్
బి) పోచంపల్లి, నల్లగొండ
సి) జహీరాబాద్, మెదక్
డి) అందుగుల, మహబూబ్‌నగర్
25. భారతదేశంలో మొదటిసారి పేటెంట్ హక్కు పొందిన చీరలు?
ఎ) బందిని బి) సిరిసిల్ల
సి) కంచి డి) బెనారస్
26. బుట్టలో గల నిలువు దారాలను ఏ విధంగా పిలుస్తారు?
ఎ) వెస్ట్ బి) వార్ఫ్
సి) ఆసు డి) పేక
27. ఒక హెక్టార్ అంటే ?
ఎ) 1 1/2 ఎకరాలు బి) 2 ఎకరాలు
సి) 2 1/2 ఎకరాలు డి) 3 ఎకరాలు
28. చెరువులో చేపలు పట్టేవారు విసిరే వలను ఎక్కడ ఉపయోగిస్తారు?
ఎ) లోతు ఎక్కువుగా ఉన్నచోట
బి) లోతు తక్కువగా ఉన్న చోట
సి) నీరు ప్రవహించే చోట
డి) నీరు మురికిగా ఉన్నచోట
29. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ఇటీవల కాలంలో ఉపయోగిస్తున్న వల?
ఎ) కచ్చు వల బి) చిన్న పరిష
సి) పెద్ద పరిష డి) రింగ్ వల
30. మట్టితో రంజన్ల తయారీకి పేరుగాంచిన జిల్లా?
ఎ) ఆదిలాబాద్ బి) వరంగల్
సి) మహబూబ్‌నగర్ డి) మెదక్
31. కుండల తయారీకి సంబంధించి సరికానిది?
1) సారె ఎ) సరైన ఆకారం కోసం కుండలను కొట్టడానికి
2) అవం బి) కుండల రూపం తయారీకి
3) సలప సి) కుండలు కాల్చడానికి
ఎ) 1-బి, 2-ఎ, 3-సి
బి) 1-బి, 2-సి, 3-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి
32. కింది వాటిలో కొయ్య బొమ్మల తయారీకి పేరుగాంచిన ప్రాంతం?
ఎ) పోచంపల్లి బి) నిర్మల్
సి) బేతవోలు డి) జహీరాబాద్
సమాధానాలు
1-సి 2-బి 3-సి 4-బి
5-బి 6-డి 7-బి 8-బి
9-బి 10-సి 11-డి 12-సి
13-బి 14-బి 15-బి 16-సి
17-బి 18-బి 19-బి 20-సి
21-బి 22-ఎ 23-బి 24-బి
25-ఎ 26-బి 27-సి 28-బి
29-డి 30-ఎ 31-బి 32-బి
1. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) చీర నేసినపుడు పేకదారాన్ని రాట్నంమీద కండెలుగా చుడతారు.
బి) మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగుల మండలంలోని అందుగుల గ్రామం బుట్టల అల్లకందారులకు ప్రసిద్ధి.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
2. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దకం.
బి) పోచంపల్లి చీరలు రంగుల్లో డిజైన్ల్లో ప్రసిద్ధి గాంచినవి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
3. కింది వాటిలో సరైనది ఏది?
1) బట్టలో పైనుంచి కిందికి గల దారాలను వెప్ట్ అంటారు
2) బుట్టలో ఎడమ నుంచి కుడివైపునకు అడ్డంగా గల దారాలను వార్ఫ్ అంటారు
3) భారతదేశంలో పోచంపల్లి చీరకు మొట్టమొదటి పేటెంట్ హక్కు లభించింది
4) పట్టు దారానికి నీలం రంగు కోసం ఇనుపరజను వెనిగర్ కలుపుతారు
4. చేపలు పట్టే వలలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) చిన్న పరిషను దొడ్డువల అని పిలుస్తారు
బి) పెద్ద పరిషను సన్నపు వల్ల అని పిలుస్తారు
సి) దొడ్డువలకు 60 కన్నులుంటాయి
డి) సన్నపు వలకు 50 కన్నులుంటాయి
5. బేతవోలు మత్స్యకారుల సహకార పరపతి సంఘంలో సభ్యుల సంఖ్య?
1) 286 2) 342
3) 339 4) 154
6. వినాయక చవితి పండుగకు పూజకు ఉపయోగించే వినాయకుని ప్రతిమను తయారు చేయడానికి వాడే పదార్థం?
1) మెగ్నీషియం సల్ఫేట్
2) సిలికాన్ డై ఆక్సైడ్
3) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
4) పైవన్నీ
7. కింది వాటిలో వ్యవసాయ పనిముట్టు కానిది ఏది?
ఎ) నాగలి బి) గడ్డపార
సి) గొర్రు డి) కొడవలి
1) సి 2) బి, డి
3) సి, డి 4) ఏదీకాదు
8. కింది వాటిలో వరి వంగడం ఏది?
ఎ) బంగారు తీగ బి) స్వర్ణ
సి) సాంబ డి) ఐఆర్ 20
1) ఎ, డి 2) ఎ, సి
3) బి, సి 4) పైవన్నీ
9. 18 సంవత్సరాలలోపు వారందరూ బాలలే అని ప్రకటించిన చట్టం?
1) యూఎన్వో బి) సీపీవో
సి) సీఎన్‌వో డి) పీఎన్వో
10. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం 2012, మే 22 నుంచి అమల్లోకి వచ్చింది.
బి) యూఎన్వో 1969లో బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
11. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు తొలి చైర్మన్ కుషాల్ సింగ్
బి) జాతీయ బాలల హక్కుల కమిషన్ ప్రస్తుత చైర్మన్ శాంతాసిన్హా
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
12. కింది వాటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆడే ఆట?
ఎ) కబడ్డీ బి) చదరంగం
సి) క్యారమ్స్ డి) క్రికెట్
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) సి, డి
13. కింది వాటిలో భారత జాతీయ క్రీడ ఏది?
1) టెన్నిస్ 2) ఫుట్‌బాల్
3) క్రికెట్ 4) ఏదీకాదు
14. కింది వారిలో ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం తరఫున పతకం సాధించిన క్రీడాకారులు?
ఎ) సానియా మీర్జా బి) మేరీకోమ్
సి) కరణం మల్లీశ్వరీ డి) కపిల్‌దేవ్
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, డి
15. కింది వాటిలో ఆటలాడుట వల్ల కలిగే ప్రయోజనం కానిది ఏది?
1) శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది
2) రక్తప్రసరణ బాగా జరుగుతుంది
3) సమష్టితత్వం అలవడుతుంది
4) ఎదుగుదల తగ్గుతుంది
16. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి
బి) గొల్లగట్టు జాతరనే సమ్మక్క సారక్క జాతర అని పిలుస్తారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
17. కింది వాటిలో సరైనది?
ఎ)స్వాతంత్య్ర దినోత్సవం అనేది హిందువుల పండుగ
బి) మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు హెన్రీమెయిన్
1) ఎ 2) బి
3) ఏదీకాదు 4) ఎ, బి
18. కింది వాటిలో సరికానిది ఏది?
1) పితృస్వామిక కుటుంబంలో కుటుంబ పాలనాధిపతిగా తండ్రి వ్యవహరిస్తాడు
2) పితృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు జెంక్స్
3) దీపావళి అనేది హిందువుల పండుగ
4) గాంధీ జయంతిని అక్టోబర్ 2న జరుపు కుంటారు
19. 2007-2008లో భారతదేశంలో స్వల్పకాల వసలదారుల సామాజిక నేపదథ్యం ప్రకారం వెనుకబడిన తరగతుల శాతం?
1) 40 శాతం 2) 23 శాతం
3) 19 శాతం 4) 18 శాతం
20. కింది వాటిలో సరైనది?
ఎ) పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణానికి ప్రధానంగా వలస కార్మికులపై ఆధార పడతారు.
బి) కేరళ మొత ఆదాయంలో 1/5 వంతు ఆదాయం పశ్చిమాసియాలో పనిచేసే వారు పంపిస్తున్న ఆదాయం ద్వారా లభిస్తుంది.
1) ఎ 2) బి
3) ఏదీకాదు 4) ఎ, బి
21. జాతీయ జనాభా లెక్కల ప్రకారం?
1) ప్రతి 8వ వ్యక్తి వలస వచ్చినవారే
2) ప్రతి 6వ వ్యక్తి వలస వచ్చినవారే
3) ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చినవారే
4) ప్రతి 10వ వ్యక్తి వలస వచ్చినవారే
సమాధానాలు
1-3 2-4 3-3 4-2
5-3 6-3 7-4 8-4
9-2 10-1 11-4 12-2
13-4 14-3 15-4 16-1
17-3 18-2 19-1 20-4
21-3
ఏకేఆర్ స్టడీ సర్కిల్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?