DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
1. భారతదేశంలో ఎడారి మృత్తికకు సంబంధించి సరైన వివరణ కానిది ఏది?
ఎ. భారతదేశంలో వాయవ్యంలో ఆరావళి పర్వతాలకు పశ్చిమాన ఎడారి నేలలు విస్తరించి ఉన్నాయి
బి. ఎడారి మృత్తికలు నైట్రేట్స్, ఫాస్ఫేట్స్కు ప్రసిద్ధి చెందినవి.
సి. రాజస్థాన్‌లోని ఎడారి నేలల ప్రాంతంలో ప్రముఖ టైగర్ రిజర్వు సరిస్కా ఉంది.
1) ఎ, బి 2) బి, సి
3) పైవన్నీ 4) పైవేవీ కావు
2. కింది వివరణలు గమనించండి.
ఎ. ఉత్తర భారతదేశంలో ప్రముఖ హ్యూమస్కు ప్రసిద్ధి చెందిన నేలలుగా పర్వతీయ నేలలను చెప్పవచ్చు
బి. హిమాలయాల్లో డూన్స్, దక్షిణ భారతదేశంలో గల నీలగిరి పర్వతాలు ప్రముఖ పండ్ల తోటలు సుగంధ ద్రవ్యాల పంటలకు ప్రసిద్ధి
పై అటవీ నేలలకు సంబంధించి సరైనది ఏది?
1) ఎ, బి 2) ఎ
3) బి 4) పైవేవీ కావు
3. కింది వివరణలు గమనించండి.
ఎ. ప్రధానంగా మృత్తిక క్రమక్షయం గాలి, నీరు వల్ల సంభవిస్తుంది
బి. పశ్చిమ కనుమల్లో మృత్తికా క్రమక్షయం వల్ల పై మృత్తిక కొట్టుకొనిపోయి గుళకరాళ్లు గల శిలా ఉపరితలం ఏర్పడుతుంది.
పై ప్రవచనాల్లో సరైన వివరణ ఏది?
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
4. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. అటవీకరణ చేపట్టం వల్ల నేల క్రమక్షయం నివారించవచ్చు
బి. గడ్డి పెంపకం అధికంగా చేపట్టడంతో నేల క్రమక్షయం నివారణపై అంతగా ప్రభావం చూపించదు కాని పశువుల మేత కొరత నివారించవచ్చు.
పై వాటిలో నేల క్రమక్షయం నివారణ చర్యలేవి?
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
5. కింది వాటిని జతపరచండి.
ఎ. ఊటి 1. నల్లరేగడి నేలల పరిశోధన కేంద్రం
బి. బళ్లారి 2. కేంద్ర అటవీ నేలల పరిశోధన కేంద్రం
సి. పస్సద్ 3. గుజరాత్ అవనాళిక పరిశోధన కేంద్రం
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
6. కింది వాటిని జతపరచండి.
ఎ. కలకత్తా 1. యమున అవనాళిక పరిశోధనా కేంద్రం
బి. ఆగ్రా 2. రాజస్థాన్ అవనాళిక పరిశోధనా కేంద్రం
సి. కోట 3. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-1, బి-3, సి-2
4) ఎ-3, బి-2, సి-1
7. కింది వాటిని జతపరచండి.
ఎ. 3వ దశ 1. నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధి
బి. 2వ దశ 2. ఎఫ్‌సీఐ సంస్థ ఏర్పాటు
సి. 1వ దశ 3. హైబ్రిడ్ విత్తనాల అభివృద్ధి వ్యవసాయ విధానంలో వచ్చిన మార్పుల్లో సరైన జత ఏది?
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
8. కింది వాటిని జతపరచండి.
ఎ. నల్ల విప్లవం 1. జనపనార ఉత్పత్తి
బి. గుండ్రని విప్లవం 2. కిరోసిన్ విప్లవం
సి, బంగారు 3. బంగాళాదుంప పీచు విప్లవం ఉత్పత్తి
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-2
9. కింది వాటిలో సరికాని జత గుర్తించండి.
1. నూనె గింజల ఉత్పత్తి- పసుపు విప్లవం
2. కోడిగుడ్లు, కోళ్ల ఉత్పత్తి- వెండి విప్లవం
3. యాపిల్ ఉత్పత్తి- బంగారు విప్లవం
4. ఫార్మాసుటికల్ ఉత్పత్తి -ఊదా విప్లవం
10. కింది వాటిలో సరికాని జతను పేర్కొనండి.
1) బంగారు విప్లవం-పండ్ల ఉత్పత్తి
2) వెండి పీచు విప్లవం-పీచు ఉత్పత్తి
3) బంగారు పీచు విప్లవం-
జనపనార ఉత్పత్తి
4) బ్రౌన్ విప్లవం- సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి
11. కింది వాటిని పరిశీలించండి.
ఎ. భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్
బి. భారతదేశంలో స్వాతంత్య్ర అనంతరం ఆహార కొరత ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం, అమెరికాతో పబ్లిక్ లా పథకం ద్వారా గోధుమలు, పాల పిండిని దిగుమతి చేసుకుంది
సి. హరిత విప్లవం అనే పదం మొదట ఉపయోగించిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్
పై సమాచారంలో సరైనది ఏది?
1) ఎ 2) ఎ, బి
3) పైవన్నీ 4) బి, సి
12. కింది వాటిని పరిశీలించండి.
ఎ. పత్తి, సజ్జ, జనుము, శనగలు,
మొక్కజొన్న
బి. గోధుమ, శనగలు, బార్లీ, ఆవాలు
సి. గోధుమ, ఆవాలు, జనుము, సజ్జ
పై సమాచారంలో రబీ కాల పంటలను
గుర్తించండి.
1) ఎ, బి 2) బి, సి
3) బి 4) సి
13. కింది శాస్త్రీయనామాలను జతపరచండి.
ఎ. జొన్న 1. కజానస్, కజాన్
బి. కందులు 2. పెన్నిసెటమ్ గ్లౌకుమ్
సి. సజ్జ 3. సోర్గమ్ వల్గేర్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-1, సి-2
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-1, సి-3
14. సరికాని జతను గుర్తించండి.
అంశం ప్రవేశ పెట్టిన వ్యక్తి
ఎ. ఇంద్రధనుస్సు నితిన్ కుమార్
విప్లవం
బి. హరిత విప్లవం ఎమ్.ఎస్
స్వామినాథన్
సి. బంగారు వరి ఇంగో ప్రాస్టికస్
డి. సూపర్ గోధుమ ఎస్.నాగరాజు
1) ఎ, బి 2) సి, డి
3) పైవన్నీ సరైనవే 4) ఏదీ సరైనది కాదు
15. కింది పరిశోధనా కేంద్రాల్లో సరికానిది ఏది?
ఎ. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్స్-రైన్
బి. అరటి పరిశోధన కేంద్రం- తిరుచునాపల్లి
సి. నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రాజమండ్రి
1. ఎ 2. ఎ, బి
3. ఎ, బి, సి 4. ఏదీ కాదు
16. భారత ప్రభుత్వం సీ బర్త్ హోర్న సాగును ప్రోత్సహిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?
ఎ. నేల క్రమక్షయం నియంత్రించడంలో సహాయపడుతుంది
బి. ఇది బయో డీజిల్‌కు మంచి వనరు
సి. దీనిలో పోషక విలువ ఉంది. ఎత్తైన ప్రాంతాల్లోనూ, శీతల ప్రాంతాల్లోనూ
జీవించడానికి అనుకూలంగా ఉంటుంది
డి. దీని కలప వాణిజ్య పరంగా విలువైనది
పై వివరణలో సరైనది ఏది ?
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
17. భారతదేశంలోని కింది పంటలను
పరిశీలించండి.
ఎ. వేరుశనగ బి. నువ్వులు
సి. పెసర డి. గోధుమ
పైన పేర్కొన్న వాటిలో ప్రధాన వర్షాధార పంటలేవి?
1) ఎ 2) సి 3) ఎ, బి 4) ఎ, బి, సి, డి
18. సూక్ష్మ సేద్యానికి (బిందు సేద్యం) సంబంధించి కింది స్టేట్మెంట్స్లో సరైనది ఏది?
ఎ. సేంద్రియ ఎరువులు లేదా పోషక
విలువలు కోల్పోవడాన్ని తగ్గించడం
బి. మెట్ట భూముల సాగుకు అనుకూలమైన వ్యవసాయ పద్ధతి
సి. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధమైన సాగు అనుకూలం
1) ఎ 2) బి
3) ఎ, సి 4) ఎ, బి, సి
19. కింది వాటిలో సరిగా జతచేసినవి ఏవి?
ఎ. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్-
నాగపూర్
బి. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-ఢిల్లీ
సి. మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా- చోటానాగపూర్ పీఠభూమి
1) ఎ, బి 2) ఎ
3) బి, సి 4) ఎ, బి, సి
20. కింది వాటిని పరిశీలించండి.
ఎ. శిలలో ఖనిజాలు సాంద్రీకరణ చెందితే దాన్ని ధాతువు అంటారు. ధాతువు మలినాలను లేదా వివిధ ఖనిజా కలయికగా ఉంటుంది
బి. భారతదేశంలో ఖనిజ విధానాన్ని పరిశీలించడానికి వేయని కమిటీ హూడా కమిటీ
సి. ఒకటి- ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు భూపటలంలో రసాయనికంగా సంయోగం చెంది ఏర్పడే ఘనస్థితిలో గల కర్బన, అకర్బన సమ్మేళనాలను ఖనిజాలు అంటారు
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
21. కింది వాటిని పరిశీలించండి.
ఎ. ఛత్తీస్‌గఢ్ బైలడిల్లా, బస్తర్దూర్
బి. జార్ఖండ్ సింగ్భం, నోవమండి
సి. ఒడిశా బీర్భం, గుడ్వ్రాన్
భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతాల్లో సరైన జత ఏది ?
1) ఎ 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, బి, సి
22. కింది ప్రవచనాలను పరిశీలించి సరైనది
గుర్తించండి.
ఎ. ప్రపంచంలో మొదటిసారిగా
ఉపయోగించిన ఖనిజం రాగి
బి. భారతదేశంలో ఖనిజ సంపద
అత్యల్పంగా గల ప్రాంతం గంగా
మైదాన ప్రాంతం
1) ఎ 2) ఎ, బి
3) బి 4) ఏదీకాదు
23. కింది వాటిని జతపరచండి.
ఎ. టంగ్స్టన్ 1. చాల్కో పైరెట్ క్యూప్రైట్
బి. రాగి 2. బల్వమెట్
సి. వెండి 3. అర్జెంటైట్
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-3, బి-2, సి-1
24. బైలాడిలాలోని ఇనుప ఖనిజం ప్రధానంగా ఏ ఓడరేవు ద్వారా జపాన్‌కు రవాణా చేస్తారు?
1) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్
2) విశాఖపట్నం పోర్ట్
3) మంగళూర్ పోర్ట్
4) హల్దియా పోర్ట్
25. కింది వాటిలో సరికానిది ఏది ?
1) కోయంబత్తూరును ‘ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా’ అని పిలుస్తారు
2) భారత్‌లో తొలి ఇనుము – ఉక్కు పరిశ్రమను ‘ పోర్టోనోవా’ వద్ద ఏర్పాటు చేశారు
3) 1907లో సక్చి వద్ద జంషెడ్జీ టాటా ‘టిస్కో’ను ఏర్పాటు చేశారు
4) 1937లో ‘అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ను దామన్ జోడి వద్ద ఏర్పాటు చేశారు
26. జతపరచండి.
అణు విద్యుత్ కేంద్రాలు
ఎ. కాక్రపార 1. ఉత్తరప్రదేశ్
బి. కైగా 2. రాజస్థాన్
సి. కోటా 3. కర్ణాటక
డి. సరోరా 4. గుజరాత్
1) ఎ-3, బి-2, సి-1, డి-1
2) ఎ-4, బి-1, సి-2 , డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
27. కింది వాటిలో సరైనవేవి?
ఎ. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండల పరిధి 200 నాటికల్ మైళ్లు
బి. కచ్ఛటప దీవులు భారత్, శ్రీలంక
మధ్య విస్తరించి ఉన్నాయి
సి. భారత్ 37.6 నుంచి 68.7 ఉత్తర
అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి, 4) ఎ, బి, సి
28. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా -2
ఎ. బిస్త్ దోబ్ 1. చీనాబ్-జీలం
బి. రేచన దోబ్ 2. రావి-చీనాబ్
సి. ఛాజ్ దోబ్ 3. బియాస్-రావి
డి. బారి దోబ్ 4. బియాస్-సట్లెజ్
1) ఎ-4, బి-3, సి-2, డి- 1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-2, డి- 4
29. కింది వాటిలో సరికానిదేది?
1) ఇలైమలై కొండలను కార్డమమ్ కొండలు అని పిలుస్తారు
2) ఫళని కొండలు కేరళ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి
3) ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయిన శిఖరం అనైముడి
4) గంగా-సింధూ మైదానం ప్లీస్టోసీన్ కాలం నుంచి నేటి వరకు ఏర్పడుతుంది
30. కింది వాటిలో సరైనదేది?
ఎ. నల్లరేగడి నేలలను ఉష్ణమండల చెర్నోజెమ్ నేలలు అని కూడా పిలస్తారు
బి. బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలను లాటరైట్ నేలలు అని
పిలుస్తారు
సి. గ్రానైట్, స్ఫటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఎర్ర మృత్తికలు
ఏర్పడుతాయి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
సమాధానాలు
1.4 2.1 3.1 4.2
5.3 6.2 7.1 8.1
9.4 10.2 11.2 12.3
13.2 14.4 15.4 16.3
17.3 18.3 19.4 20.3
21.2 22.2 23.3 24.2
25.4 26.3 27.1 28.3
29.2 30.2
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
TET, DSC 2023, DSC Social PReparation
RELATED ARTICLES
-
సంఘ జీవనానికి సాయపడేది.. మోక్షానికి ఉపయోగపడేది
-
మాదిరి ప్రశ్నలు
-
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
-
SGT Maths – DSC Special | ఒక చతురస్ర కర్ణం 18 సెం.మీ అయితే దాని భుజం (సెం.మీ.లలో) ?
-
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






