Child Development – TET Special | ఎవరికి వారే ప్రత్యేకం.. రూపురేఖలు వ్యతిరేకం
వైయక్తిక భేదాలు
- నవీన మనో విజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు ఒక మలుపు
- వైయక్తిక భేదాలను గురించి 2000 సంవత్సరాల పూర్వమే ప్లేటో పరిశీలించారు.
- ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా జన్మించలేరు. ప్రతి ఒక్కరు వేరొకరితో సహజ శక్తులు, రూపు రేఖల్లో విభేదిస్తారు.
- తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే విధంగా ఉండరు. వీరిలో అనేక విషయాల్లో (శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ) వైవిధ్యాలుంటాయి. ఈ విభేదాలనే “వైయక్తిక భేదాలు”అంటారు.
- మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చినా, వారి మధ్య భేదాన్ని చూడవచ్చు – చార్లెస్ డార్విన్
- ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు వుంటాయి. ఆ ప్రకారంగా విద్యాబోధన జరగాలి – ప్లేటో
- వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణనలోకి తీసుకొని బోధనా ప్రక్రియ కొనసాగాలి – రూసో. (గ్రంథం – Emily)
- మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి -ఛార్లెస్ E. స్కిన్నర్
- వ్యక్తిగత విద్యావ్యవస్థ విద్యార్థుల్లో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుంది- జాన్‌డ్యూయి (అమెరికా) (Democracy and Education)
- పైవన్నీ అభిప్రాయాలైతే ఈ అభిప్రాయాలను శాస్త్రీయ దృష్టితో విశ్లేషణ చేసిన వ్యక్తి – సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించాడు).
- గాల్టన్ రచించిన గ్రంథం – (An inquiry into Human faculty and Its Development. ఈ గ్రంథం వైయక్తిక భేదాల్లో తొలి శాస్త్రీయ రచన.
- గాల్టన్ వల్లే ప్రభావితుడైన వ్యక్తి – J.M. కాటిల్ (అమెరికా)
- కాటిల్ రచించిన గ్రంథం – Mental Test & Measurement.
- కాటిల్ సాంఖ్యకశాస్త్ర పద్ధతులను ఉపయోగించి, సంవేదన, స్మృతి, ప్రతిచర్య కాలాలపై అనేక పరీక్షలు జరిపారు.
వైయక్తిక భేదాలు-రకాలు
- ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే భేదాలను ఆధారంగా చేసుకుని వైయక్తిక భేదాలను 2 రకాలుగా వర్గీకరించారు అవి :
1) వ్యక్తంతర భేదాలు/అంతర వ్యక్తిగత భేదాలు/వ్యక్తి అంతస్థు భేదాలు (Inter Individual Differences) :
1. వ్యక్తంతర భేదాలు
1. ఒకే అంశానికి సంబంధించి “వివిధ వ్యక్తుల” మధ్య ఉండే భేదాలు – వ్యక్తంతర భేదాలు - ఇచ్చిన Statementలో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాన్ని సూచించేదే వ్యక్తంతర భేదం.
ఉదా: 1. A కంటే B తెలివైన వాడు.
2. విశ్వనాథన్ ఆనంద్ భారతదేశ చదరంగ క్రీడాకారుల్లోకెల్లా అత్యంత ప్రతిభావంతుడు.
3. రమ్య వంటలు అద్భుతంగా చేయగలదు.
4. రవి ఆటల్లో చూపగలిగే ప్రతిభను తన తరగతి గదిలో ఎవ్వరూ చూపలేరు.
2. వ్యక్తంతర భేదాలు
1. వేర్వేరు అంశాలకు సంబంధించి ఒకే “వ్యక్తి”లో వుండే భేదాలు – వ్యక్తంతర్గత భేదాలు. - ఇచ్చి Statementలో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాన్ని సూచించేదే వ్యక్తంతర్గత భేదం.
ఉదా: 1. A లెక్కలు బాగా చేస్తాడు. కానీ ఆటలు బాగా ఆడలేడు.
2. విశ్వనాథన్ ఆనంద్ క్రీడల్లో చూపే ప్రతిభను చదువులో చూపలేకపోయాడు.
3. రమ్య వంటలు అద్భుతంగా చేయగలదు. కానీ లెక్కలలో ఎక్కువ మార్కులు రావు.
4. రవి ఆటల్లో అత్యధిక ఆసక్తిని చూపగలడు. కానీ చదువులో చూపలేడు.
వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే రంగాలు
- 1. అభిరుచి 2. వైఖరి 3. విలువలు
4. కాంక్షాస్థాయి 5. ఆత్మభావన 6. సాధన 7. ప్రజ్ఞ 8. సహజ సామర్థ్యం
9. సృజనాత్మకత 10. అలవాట్లు
1. అభిరుచి - ఒక విషయం లేదా ఒక కృత్యం, ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతే అభిరుచి – జె.పి. చాప్లిన్
- అభిరుచులు సహజసిద్ధంగా వ్యక్తి స్వభావం వల్ల ఏర్పడవచ్చు.
- వ్యక్తుల్లో కొందరు ఆటలాడటం, మరికొందరు పాటలు పాడటం వల్ల ఒక్కొక్కరు ఒక్కో అంశంపై అభిరుచిని కలిగి ంటారు.
- ఈ విధంగా అభిరుచి అనేది వ్యక్తులలో వైయక్తిక భేదాలకు కారణమవుతుంది.
2. వైఖరి - ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి లేదా వస్తువు పట్ల పొందికగా, ప్రతి స్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతే “వైఖరి” – ఫ్రీడ్మన్
- కులం, మతం, జాతి, ప్రాంతం, సమాజం, సంస్కృతి, వర్గం వైఖరిని ప్రభావితం చేస్తాయి.
- కాబట్టి వైఖరి అనేది మానసిక శక్తులు, ఉద్వేగాలతో కలిసి పనిచేస్తుంది.
- ఈ విధంగా వైఖరి, వైయక్తిక భేదాలకు కారణమవుతుంది.
3. విలువలు - విలువ అనేది లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ – జోన్స్, గెవార్డ్
- విలువ ఒక మానసిక అవసరం – మాస్లో
- లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి విలువలు వైయక్తిక భేదాన్ని సూచిస్తాయి.
4. కాంక్షాస్థాయి - విజయం సాధించాలనే మానసికమైన కోరికే – కాంక్షాస్థాయి
- ఒక వ్యక్తి తన పనిలో విజయవంతమైతే కాంక్షాస్థాయి పెరుగుతుంది. అపజయాన్ని ఎదుర్కొంటే కాంక్షాస్థాయి తగ్గుతుంది.
- ఎన్నో కారణాలు కాంక్షాస్థాయిని ప్రభావితం చేయడం వలన ఇది వ్యక్తుల వైవిధ్యతకు కారణమగును.
5. ఆత్మభావన - తన గురించి తనకు గల ఆలోచనే ఆత్మభావన.
- తనేమై ఉన్నాడో, తన బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకుని ఉండటమే ఆత్మభావన.
- ఆత్మభావన ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవం ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
- ఆత్మ విశ్వాసం వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది.
6. సాధన - తరగతిలో అందరికీ ఒకే విధంగా బోధించినప్పటికీ వారి సాధనలో తేడాలుంటాయి.
- దీనిలో పరిమాణాత్మక మార్పు వ్యక్తిగత భేదాలను సూచిస్తుంది.
- గుణాత్మక మార్పు వ్యక్తంతర భేదాలను సూచిస్తుంది.
నోట్ : ప్రజ్ఞాలబ్ధ్ది సూత్రంలాగే “విద్యాలబ్ధ్ది”కి కూడా సూత్రాన్ని కనుగొనవచ్చు. ఒక స్థాయి విద్యను పొందడం ఆ స్థాయి వయస్సును సూచిస్తుంది. దీని ఆధారంగా విద్యా లబ్ధ్దిని కనుక్కోవచ్చు.
మాదిరి ప్రశ్నలు
1. గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యం?
1) వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి
2) ఆయన వైయక్తిక భేదాలపై రచించిన గ్రంథం – హెరిడిటరీ
3) ఈయన మానవమితి ప్రయోగశాలను ఏర్పాటు చేశారు.
4) ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి – సహసంబంధ గుణకం.
2. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన సమరూప కవలలు అయిన సన్నీకి గణితం అంటే ఇష్టం. బన్నీకి విజ్ఞానశాస్త్రం అంటే ఇష్టం. ఈ వైయక్తిక భేదానికి కారణం?
1) అనువంశికత 2) పరిసరాలు
3) ఆర్థిక పరిస్థితి 4) కుటుంబస్థితి
3. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వెంకట్ పొడవుగా చామన ఛాయలో ఉంటే, వేణు ఎర్రగా పొట్టిగా ఉంటాడు. ఈ వైయక్తిక భేదానికి కారణం?
1) అనువంశికత 2) పరిసరాలు
3) ఆర్థిక పరిస్థితి 4) కుటుంబస్థితి
4. కింది వాటిలో వ్యక్తంతర భేదం
1) మౌక్తిక, ఐశ్వర్య బాగా ఎర్రగా, ఎత్తుగా ఉంటారు.
2) ఐశ్వర్య ఎర్రగా, ఎత్తుగా ఉంటుంది.
3) మౌక్తిక ఎర్రగా ఎత్తుగా ఉంటే, సుష్మ పొట్టిగా నల్లగా ఉంటుంది.
4) అమూల్య ఎర్రగా ఉంటుంది కానీ పొట్టిగా ఉంటుంది.
5. కింది వాటిలో వ్యక్తంతర్గత భేదం
1) నవీన్, ప్రవీణ్‌లకు సాంఘిక శాస్త్రం అంటే ఇష్టం
2) లక్ష్మణ్‌కు ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టం
3) శివసాయికి అర్థశాస్త్రం అంటే ఇష్టం కానీ శ్రీలతకు గణితం అంటే ఇష్టం.
4) నవీన్‌కు అర్థం శాస్త్రం అంటే ఇష్టం సాంఘికశాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం.
6. భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి?
1) రవి కంటే కిషోర్‌కు ఐక్యూ ఎక్కువ
2) ప్రవీణ్‌కు అందరికంటే సృజనాత్మకత ఎక్కువ
3) ప్రశాంత్‌కు ఐక్యూ ఎక్కువే కానీ, సృజనాత్మకత తక్కువ
4) తరగతిలో పొట్టివాడు తేజ
7. భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి?
1) రమేష్‌కు, వయస్సు పెరిగే కొద్దీ అభిరుచులు మారుతున్నాయి.
2) రాజ్‌కుమార్‌కు వేర్వేరు సబ్జెక్ట్స్‌లో వేర్వేరు మార్కులు వస్తాయి.
3) తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడం.
4) ఎ అనే సబ్జెక్టులో 70 మార్కులు, బి అనే సబ్జెక్టులో 20 మార్కులు రత్నాకర్ అనేక విద్యార్థికి రావడం.
8. కింది వాటిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు
1) రమేష్ అనే ఉపాధ్యాయుడు ఆరో తరగతి విద్యార్థులందరికీ “నేలలు – రకాలు” అనే ఒకే సబ్జెక్టును ఇచ్చాడు.
2) మధు అనే ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి విద్యార్థులందరికీ అత్యంత సులభమైన “మొక్కలలో వైవిధ్యం” అనే ప్రాజెక్టును ఇచ్చాడు.
3) ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తరగతిలో వేర్వేరు విద్యార్థులకు వేర్వేరు ప్రాజెక్టులను ఇచ్చాడు.
4) శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ను ఇచ్చాడు.
9. ప్లేటో : రిపబ్లిక్ :: రూసో :
1) డెమొక్రసీ అండ్ ఎడ్యుకేషన్
2) ఎమిలీ
3) యాన్ ఎంక్వయిరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్
4) మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్
11. శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఈ వాక్యంలో గల వైయక్తిక భేదం/భేదాలు?
1) వ్యక్తంతర భేదం
2) వ్యక్తంతర్గత భేదం
3) వ్యక్తంతర్గత, వ్యక్తంతర భేదం
4) వ్యక్తంతర, వ్యక్తంతర్గత భేదాలు
12. ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాడని భావిస్తున్నారు?
1) బోధనా పద్ధతులు
2) శిశు వికాస స్థాయి
3) వైయక్తిక భేదాలు
4) అభ్యసన వాతావరణం
13. ఒక సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్‌ను ఇస్తూ, వేగంగా అభ్యసించే విద్యార్థులకు అదనపు కృత్యాలను ఇస్తూ బోధన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు.
1) బోధనా పద్ధతులు
2) శిశువికాస స్థాయి
3) వైయక్తిక భేదాలు
4) అభ్యస వాతావరణం
10. జతపరచండి.
1. యాన్ ఎంక్వయిరీ ఇంటూ హ్యూమన్ ఎ.ప్లేటో ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవెలప్మెంట్
2. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ బి. రూసో
3. డెమొక్రసీ అండ్ ఎడ్యుకేషన్ సి. జాన్‌డ్యూయి
4.ఎమిలీ డి. గాల్టన్ ఇ. J.M. కేటిల్
1) 1-డి 2-ఇ 3-బి -4- ఎ 2) 1-డి 2-ఇ 3-సి -4- ఎ
3)1-డి 2-ఇ 3-సి -4- బి 4) 1-ఇ 2-డి 3-సి -4- బి
జవాబులు
1-4 2-2 3-1 4-3
5-4 6-3 7-3 8-4
9-2 10-3 11-4 12-3
13-2
శివపల్లి
సైకాలజీ ఫ్యాకల్టీ
టీఎస్, ఏపీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?