TET – Methodology | చెబుతూ చేయడం ద్వారా గుర్తుంచుకునేశాతం?
1. జతపరచండి?
ఎ) బేసిక్ విద్యావిధానం ముఖ్య ఉద్దేశం 1) విద్యాలయాల్లో మాతృభాషతోపాటు భాషేతర అంశాలు బోధించాలి
బి) మాధ్యమిక విద్యా సంఘం 2) బాల్యం నుంచే విద్యార్థుల్లో పనిపట్ల గౌరవ భావం కలిగించడం
సి) సాంఘిక శాస్త్రం అనే భావన 3) కొఠారి కమిషన్ రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగిన కాలం
డి) ఉన్నత మాధ్యమిక స్థాయిలో 4) క్రీ.శ. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో సామాజిక శాస్ర్తాన్ని పరిచయం చేయాలి
5) క్రీ.పూ.18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో
6) మాధ్యమిక విద్యాకమిషన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-5, డి-6 4) ఎ-2, బి-1, సి-5, డి-3
2. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల సంబంధం, అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం?
1) ఇ.వి. వెస్లీ 2) జాన్ మైకేల్స్
3) జేమ్స్ హమ్మింగ్స్ 4) ఐన్‌స్టీన్
3. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలని తెలియజేసిన వ్యక్తి?
1) ఆర్.హెచ్. హీరో 2) హెచ్.ఆర్. దవే
3) ఆర్.హెచ్.దవే 4) ఈశ్వరీబాయి
4. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్ది. బాల్యం నుంచే పరిసరాలను పరిరక్షించాలనే దృక్పథాన్ని దృఢపరచాల్సిన ఆవశ్యకత ఉంది?
1) కొఠారీ 2) ఈశ్వరీబాయి
3) గాంధీ 4) ఠాగూర్
5. సామాజిక శాస్ర్తాల ఆధారంగా విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవన నైపుణ్యాలు, విలువలు నేర్చుకోవడానికి ప్రతిపాదించిన అంశాల సమూహంగా ఏ శాస్ర్తాన్ని తెలియజేస్తుంది?
1) సాంఘిక శాస్త్రం 2) సామాజిక శాస్ర్తాలు
3) గణిత శాస్త్రం 4) మనోవిజ్ఞాన శాస్త్రం
6. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్ర్తాలే -సాంఘిక శాస్త్రం?
1) ఇ.వి. వెస్లీ
2) జె.ఎఫ్. రాబర్ట్
3) వెస్లీ అండ్ రాన్స్కీ 4) ఐన్‌స్టీన్
7. చరిత్ర , భూగోళం, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రం మొదలైన అంశాలను సంప్రదాయ రీతిలో తెలియజేసే శాస్త్రం?
1) సామాజిక శాస్త్రం
2) సాంఘిక శాస్త్రం
3) మనోవిజ్ఞాన శాస్త్రం 4) తత్వశాస్త్రం
8. సాంఘిక శాస్త్రం ఏ రకమైన ఉపగమంలో ఆవిర్భవించింది?
1) హార్డ్‌వేర్ ఉపగమం
2) సాఫ్ట్వేర్ ఉపగమం
3) సమైక్య ఉపగమం
4) నిర్మాణాత్మక
సమాధానాలు
1-2 2-3 3-3 4-2
5-1 6-3 7-2 8-3
1. సాంఘిక శాస్ర్తాన్ని అధ్యయనం చేయడం వల్ల విద్యార్థికి ప్రజాస్వామ్య విధానం మన చుట్టూ ఉండే పరిసరాలను అర్థం చేసుకొని వాటికి వ్యక్తికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవడం వల్ల విద్యార్థుల్లో ఏ విలువ అభివృద్ధి చెందుతుంది?
1) ఉపయోగిత విలువ 2) వృత్తి విలువ
3) నైతిక విలువ 4) బౌద్ధిక విలువ
4. సృజనాత్మక విలువను గుర్తించండి?
1) ప్రత్యామ్నాయ పరికరాలు సమకూర్చుకోలేకపోవడం
2) విభిన్నంగా ఆలోచించడం
3) నిష్పాక్షికంగా ఉండటం
4) కచ్చితంగా, స్పష్టంగా ఉండటం
5. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వల్ల పరిశీలనాంశాల గురించి సరైన నివేదికలను తయారు చేయడం, పరికల్పనలను ఏర్పరచడం, రీడింగ్‌లను తీసుకొనేటప్పుడు ఏ రకమైన విలువ అలవడుతుంది?
1) డిసిప్లినరీ విలువ 2) నైతిక విలువ
3) వొకేషనల్ విలువ
4) ఇంటలెక్చువల్ విలువ
6. కింది వాటిని జతపరచండి.
ఎ) జ్ఞానాత్మక రంగం 1) 7 లక్ష్యాలు
బి) భావావేశ రంగం 2) 5 లక్ష్యాలు
సి) మానసిక చలనాత్మక రంగం 3) 6 లక్ష్యాలు
డి) లక్ష్యాల వర్గీకరణలో భారతీయ శాస్త్రవేత్త 4) 5 లక్ష్యాలు
5) ఆర్.హెచ్. దవే 6) హీరో
1) ఎ-3, బి-2, సి-4, డి-5
2) ఎ-1, బి-2, సి-3, డి-6
3) ఎ-3, బి-2, సి-4, డి-6
4) ఎ-1, బి-2, సి-3, డి-4
7. అవగాహన అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణను గుర్తించండి?
1) అనువాదం 2) ఎక్స్ట్రా పొలేషన్
3) ఇంటర్ ప్రిటేషన్
4) ప్రకల్పనలు తెలపడం
8. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం 6న లక్ష్యాన్ని గుర్తించండి?
1) జ్ఞానం-జ్ఞాపకంలో ఉంచటం
2) మూల్యాంకనం – మూల్యాంకనం చేయడం
3) సంశ్లేషణ సృష్టించుట / ఉత్పత్తి చేయటం
4) సంశ్లేషణ మూల్యాంకనం చేయటం
2. కింది వాటిని జతపరచండి?
ఎ) సమాజానికి జాతికి సేవ చేయాలనే భౌతిక 1) నైతిక విలువ విలువ కోరిక పరిసరాలతో సహజీవనం
బి) నైపుణ్య పనివారలుగా స్వయంగా తమ భవిష్యత్తును 2) సాంస్కృతిక విలువ నిర్మించుకోవడానికి ఉపయోగపడే విలువ
సి) ఆచార వ్యవహారాల్లో ఆరోగ్యంలో కట్టుబాట్లలో 3) బౌద్ధిక విలువ ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులకు కారణం
డి) వ్యక్తులు తమ అంతర్గతాన్ని చూడగలగడం, 4) వృత్తి విలువ మంచి చెడుల విచక్షణాజ్ఞానం అలవడటం
1) ఎ-3, బి-4, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-2, బి-4, సి-3, డి-1
3. జతపరచండి?
ఎ) చట్టాలపై నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండటం, 1) సౌందర్యాత్మక విలువ నిష్కపట మనస్తత్వం
బి) సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం 2) నైతిక విలువ
సి) చారిత్రక కట్టడాలు సందర్శించడం, ఫొటోలు తీయడం 3) వి.సి. సద్వినియోగ విలువ
డి. పంచవర్ష ప్రణాళికల ఆధారంగా అభివృద్ధిని 4) ఉపయోగ విలువ
ఏ విధంగా సాధించగలమో తెలుసుకోవడం
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-3, బి-4, సి-1, డి-2
సమాధానాలు
1-4 2-1 3-3 4-2
5-1 6-1 7-4 8-3
1. సామ్రాజ్యం ఆవిర్భావం విస్తరణ అభివృద్ధి వంటి వాటిని బోధించడానికి ఏ చార్టులు ఉపయుక్తంగా ఉంటాయి?
1) వంశావళి చార్టు 2) వ్యవస్థాక్రమ చార్టు
3) ఫ్లిప్ చార్టు 4) స్ట్రీమ్చార్టు
2. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులతో గ్రామంలో ‘పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఏ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది?
1) సమాజాన్ని పాఠశాలకు తీసుకొని రావడం
2) పాఠశాలను, సమాజం వద్దకు తీసుకొని వెళ్లడం
3) పై అధికారుల ఉత్తర్వులను అమలు చేయడం
4) ఇది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుని సాధారణ లక్షణం
3. 7వ తరగతి పూర్తిచేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో కింది వాటిలో వేటికి చెందిన భావనలను అవగాహన చేసుకోవడం రిలీఫ్ మ్యాపులను తయారు చేయగలడు?
1) ఖనిజాలు, పరిశ్రమలు, ప్రజలు
2) నాగరికత, వ్యవసాయం, పట్టణీకరణ
3) వినియోగం, సరఫరా, డిమాండ్
4) లోయలు, పర్వతాలు, పీఠభూములు
4. తరగతి గదిలో పవర్‌పాయింట్(ప్రజెంటేషన్) ద్వారా బోధించుటకు ఉపయోగపడని ప్రొజెక్టర్?
1) ఎల్.సి.డి ప్రొజెక్టర్
2) ఓవర్ హెడ్ ప్రొజెక్టర్
3) ఫిల్మ్ ప్రొజెక్టర్ 4) ైస్లెడ్ ప్రొజెక్టర్
5. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఏ విధంగా పేర్కొనవచ్చు?
1) సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావడం
2) పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవటం
3) పై అధికారుల ఉత్తర్వులను అమలు చేయటం
4) ఇది ఉపాధ్యాయుని విధుల్లో ఒక భాగం
6. ఒక ఉపాధ్యాయుడు ‘భూ భ్రమణం’ అనే పాఠాన్ని, నమూనాలు, నిజవస్తువులు, తోలు బొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధనోపకరణాల రకానికి చెందుతాయి?
1) దృశ్య- శ్రవణ ఉపకరణాలు
2) త్రిమితీయ ఉపకరణాలు
3) ప్రక్షేపక ఉపకరణాలు
4) గ్రాఫిక్ ఉపకరణాలు
7. ‘తెలంగాణ రాష్ట్రంలో నదులు’ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైన పటం?
1) రాజకీయ పటం 2) వాతావరణ పటం
3) భౌతిక పటం 4) స్కెచ్ పటం
8. రాజకీయ పటం, బేటీ బచావో- బేటీ పఢావో అనే నినాదాలు వరుసగా…?
1) దృశ్యసంకేతం, శబ్ద సంకేతం
2) శబ్ద సంకేతం, దృశ్య సంకేతం
3) రెండూ దృశ్య సంకేతాలు
4) రెండూ శబ్ద సంకేతాలు
9. ‘నీటిని పొదపు చేయండి- ధరిత్రిని రక్షించండి’ అనే నినాదం, ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు అనేవి వరుసగా?
1) రెండూ దృశ్య సంకేతాలు
2) రెండూ శబ్ద సంకేతాలు
3) శబ్ద సంకేతం, దృశ్య సంకేతం
4) దృశ్య సంకేతం, శబ్ద సంకేతం
10. బహుళ ప్రచార సాధనాల్లో ఉండే విషయాలు/ అంశాలు?
1) నల్లబల్ల, పాఠ్యపుస్తకాలు, చార్టులు
2) మ్యాపులు, స్క్రిప్ట్ చార్టులు, రంగు క్రేయాన్లు
3) శ్రవణ దృశ్య, దృశ్య శ్రవణ చిత్రాలు అండ్ యానిమేషన్స్
4) గోడ బోర్డులు, పెగ్ బోర్డులు, జియో బోర్డులు, బుటిటెన్ బోర్డులు
11. అడవులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపించడానికి తోడ్పడే పటాలు?
1) ఆర్థిక పటాలు
2) నిర్దిష్ట ఇతివృత్త పటాలు
3) రాజకీయ పటాలు
4) భౌతిక పటాలు
12. ఏ బోధనోపకరణం, బోధనాభ్యసనంలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు తాము కోరుకున్న విధంగా, వారి అవసరాలకు అనుగుణంగా దేనినైనా రాయడానికి, గీయడానికి తోడ్పడుతుంది?
1) మాగ్నెటిక్ బోర్డు 2) బ్లాక్ బోర్డు
3) ప్యానెల్ బోర్డు 4) బుటిటెన్ బోర్డు
13. వాయు సూచిక, మ్యాజిక్ లాంగర్లు వరుసగా…..
1) రెండు వాతావరణ పరికరాలు
2) రెండూ దృశ్య శ్రవణ ఉపకరణాలు
3) దృశ్య- శ్రవణ ఉపకరణం, వాతావరణ పరికరం
4) వాతావరణ పరికరం,దృశ్య శ్రవణ ఉపకరణం
14. రుచి ద్వారా నేర్చుకునే శాతం?
1) 10 శాతం 2) 20 శాతం
3) 2 శాతం 4) 1 శాతం
15. వినడం ద్వారా నేర్చుకునే శాతం?
1) 1 శాతం 2) 1.5 శాతం
3)3.5 శాతం 4) 11 శాతం
16. చూడటం ద్వారా నేర్చుకునే శాతం?
1) 93 శాతం 2) 83 శాతం
3) 11 శాతం 4) 39 శాతం
17. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) రుచి ద్వారా అతి తక్కువ శాతం నేర్చుకుంటాం
2) వాసన ద్వారా కంటే రుచి ద్వారా ఎక్కువ శాతం నేర్చుకుంటాం
3) వినడం ద్వారా 11 శాతం నేర్చుకుంటాం
4) చూడటం ద్వారా 83 శాతం నేర్చుకుంటాం
18. చెబుతూ చేయడం ద్వారా గుర్తుంచుకునే శాతం?
1) 60 శాతం 2) 70 శాతం
3) 80 శాతం 4) 90 శాతం
19. అమూర్త అంశాలను అసలే బోధించకూడని దశ ?
1) పూర్వ ప్రాథమిక పాఠశాల దశ
2) ప్రాథమిక పాఠశాల దశ
3) మాధ్యమిక పాఠశాల దశ
4) ఉన్నత పాఠశాల దశ
సమాధానాలు
1-1 2-2 3-4 4-1
5-2 6-2 7-3 8-1
9-3 10-3 11-4 12-2
13-4 14-4 15-4 16-2
17-2 18-4 19-1
రవి కుమార్
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?