Gurukula Psychology Special | ఆలోచనలు..ఉద్వేగాలు..ఉపశమన తంత్రాలు
రక్షక తంత్రం
రక్షక తంత్రమంటే ఒక ప్రవర్తనా నమూనా. ఈ రక్షక తంత్రాల వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వీటి ముఖ్య ఉద్దేశం-
సర్దుబాటు ద్వారా బాధలను అణచివేయడం.
1) దమనం (Repression) :
- బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను అచేతనా మనస్సుకు పంపి, మరిచిపోయి ఉపశమనం పొంది తనను తాను
రక్షించుకోవడం దమనం. - ఇది ప్రాథమిక రక్షక తంత్రం. మిగిలిన తంత్రాలకు ఆధారం. దీన్ని ప్రేరేపిత విస్మృతి అంటారు.
ఉదాహరణ :
1) బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మరిచిపోవడం
2) ప్రమాదాల్లో మరణాలను, ఆప్తుల మరణాలను మరిచిపోవడం.
3) ఉపాధ్యాయుడి దండనకు గురైన విద్యార్థి ఆబాధను మరిచిపోవడం.
నోట్: మానసిక నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ప్రతిగమనం (Regression)
- పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు.
- పెద్దల వలే ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల వలే ప్రవర్తించడం ప్రతి గమనం కిందకు వస్తుంది.
ఉదాహరణ : 1) ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడ్వడం.
2) పదేపదే పుట్టింటికి వెళ్లే నూతన వధువు.
3) రాత్రిపూట పక్క తడిపే యువకుడు.
పరిహారం (Compensation): - ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించనప్పుడు మరో రంగంలో రాణించడం (ప్రత్యామ్నాయం ఎన్నుకోవడం)
ఉదాహరణ : 1) చదువు పట్ల ఆసక్తిలేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడిగా మారడం.
2) చదవులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపడం.
3) పిల్లలు లేని మహిళ కాన్వెంట్లో టీచర్‌గా చేరడం.
హేతుకీకరణ (Rationalization)
- లక్ష్యసాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం
ఉదాహరణ :
1) పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వల్ల లాభం లేదు అనడం
2) అందని ద్రాక్ష పుల్లన, తీయని నిమ్మపండు
3) పరీక్షలో కాపీ ఎందుకు కొట్టావంటే అందరూ అలాగే చేస్తారని చెప్పడం.
ప్రక్షేపణం (Projection) - వ్యక్తి తన లోపాలను, తీరని కోర్కెలను, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కాని, వస్తువులకు కాని ఆపాదించడం.
- తన తప్పులు, అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేయడం
- ఇది దమనం తర్వాత ఎక్కువగా
ఉపయోగించే రక్షక తంత్రం
ఉదాహరణ : 1) పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థి అధ్యాపకులే కారణం అని చెప్పడం.
2) అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనిపించడం.
3) పరీక్ష పత్రం తప్పుల తడకలుగా ఉంది అనడం
4) ఆకర్షణ లేని యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం.
తాదాత్మీకరణం (Identification)
- ఒక వ్యక్తి తను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి పొందడం.
- ఇతరులతో తమను తాము పోల్చుకోవడం
ఉదాహరణ :
1) తాను ఓడినా తన మిత్రుడు గెలిచాడన్న అనుభూతి పొందడం
2) ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థపేరు చెప్పి గౌరవాన్ని పొందడం
3) కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ అనుభూతి తాదాత్మీకరణం
విస్థాపనం (Displacement) - ఒక వ్యక్తి తన కోపాన్ని, కుంఠనాన్ని తక్కువ స్థాయి వ్యక్తులపై, వస్తువులపై చూపడం
ఉదాహరణ : 1) అత్తమీద కోపం దుత్తమీద చూపించడం
2) నాయకుడి మీద కోపాన్ని ప్రతినాయకుడు పక్కవారిపై చూపించడం.
3) పరీక్ష సరిగా రాయని విద్యార్థి పెన్నును పగులగొట్టడం.
స్వైర కల్పనం (Fantacy)
- వ్యక్తి తన నిజజీవితంలో సాధింలేనివి పగటి కలలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉపశమనం పొందడం.
ఉదాహరణ : 1) పరీక్షలో తప్పిన విద్యార్థి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించినట్లు పగటి కలలు కనడం.
2) నల్లని పిల్లగా పిలిచే అమ్మాయి మిస్ ఇండియా అయినట్లుగా కలగనడం
3) ఐఏఎస్ సాధించలేని వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లు ఊహించుకొని ఊహాలోకాల్లో విహరించడం.
ఉహసంహరణ ఏకాంతత్వం (Withdrawal)
- వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం.
ఉదాహరణ : 1) ఆటల్లో రాణించలేని వ్యక్తి ఆసక్తి లేదని ఆడకుండా తప్పించుకోవడం.
2) పరీక్షకు సరిగా సన్నద్ధం కాని వ్యక్తి పరీక్ష రాయకపోవడం.
3) పేరంటాలకు వెళ్లే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని వెళ్లకపోవడం
సానుభూతి (Sympathy) - ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది స్వాంతనం ఏర్పరుచుకొని ఉపశమనం పొందడం.
- ఇతరుల ఓదార్పును ఆశించడం.
ఉదాహరణ : 1) పరీక్షల్లో తప్పిన విద్యార్థి తన ఆరోగ్యం సరిగా లేక పరీక్షల్లో తప్పానని తల్లిదండ్రులకు చెప్పి సానుభూతి పొందడం.
2) హోంవర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేక చేయలేదని ఉపాధ్యాయుని సానుభూతి పొందడం.
ప్రతిచర్యా నిర్మితి (Reaction Formation)
- వ్యక్తి తన అసలైన వాంఛలకు కోరికలకు భిన్నంగా వుండే అంశాలను వ్యక్తం చేయడం.
1) ఒక వ్యక్తిని గురించి దురభిప్రాయం ఉన్నా, అతడు మంచి వాడని చెప్పడం.
2) దానం చేయడం ఇష్టం లేని వ్యక్తి తాను చేస్తే కోటి రూపాయల పైగానే దానం చేస్తానని చెప్పడం.
నిరాకరణం (Danial of reality)
- అంగీకరించడానికి ఇష్టంలేని అంశాలను తిరస్కరించడం
- సహించలేని వాస్తవాన్ని నిజం కాదని తోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం.
ఉదాహరణ : 1) భార్య మరణ వార్త విన్న భర్త నిజం కాదని తోసివేయడం.
2) ఇష్టంలేని దృశ్యాలను చూడకపోవడం.
3) అహంకారి అయిన వ్యక్తిని నీవు అహంకారి అన్నప్పుడు నేను కాదని వ్యక్తి నిరాకరించడం.
బౌద్ధీకరణం (Intellectualization)
- వ్యక్తి బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో ఉపశమనం పొందడం.
ఉదాహరణ : 1) పరీక్షలో తప్పిన విద్యార్థి నా తలరాత బాగాలేదనే బౌద్ధిక నిర్వచనంతో ఉపశమనం పొందడం.
2) కావల్సిన వ్యక్తి మరణిస్తే ఆయాసం లేకుం డా సుఖంగా మరణించాడని పేర్కొనడం.
ప్రాయశ్చిత్తం (Undoing)
- వ్యక్తి తన మనసు అంగీకరించని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం
ఉదాహరణ : 1) తప్పులు చేసిన వ్యక్తి ఉదారంగా దానాలు చేయుట. - వృత్తిమీద ఆసక్తిలేని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తి గురించి ఉపన్యాసాలివ్వడం.
వ్యక్తీకరణం (Acting out) - వ్యక్తి ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరిచి ఉపశమనం పొందడం.
ఉదాహరణ :
2) తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువ అయినప్పుడు ఎదురు తిరగడం.
2) పరీక్ష తప్పిన విద్యార్థి తన బాధను తల్లిదండ్రులకు వ్యక్తం చేసి తప్పక పాసవుతానని చెప్పి ఉపశమనం పొందడం.
అంతర్లీనం (Internalization)
- సంఘర్షణకు లోను అయిన విషయంలో గెలవలేక రాజీపడి దానిలోకి మారిపోయే ధోరణి వల్ల కలిగే సర్దుబాటు.
ఉదాహరణ : 1) అత్తగారింట్లో మాంసాహారాన్ని విధిలేక అలవాటు చేసుకునే శాకాహారి కోడలు
2) శత్రువును ఓడించలేనప్పుడు శత్రువుతో కలిసిపోవడం.
ఉదాత్తీకరణం (Sublimation)
- సంఘంలో సమ్మతం కాని తమ ఉత్సుకతలను, కోరికలను సమాజం ఆమోదించే రీతిలో తీర్చుకోవడం
- ఇందులో ఉద్వేగపూరిత ఆలోచనలని, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ప్రవేశ పెడతారు.
ఉదాహరణ :లైంగిక వాంఛల్ని తీర్చుకోలేని వ్యక్తి ప్రణయ గీతాలు రాయడం, నగ్న చిత్రాలు వేయడం, ప్రణయ కథలు రాయడం చేస్తారు. - చిన్నప్పుడు అందరితో పోట్లాడే పిల్లవాడు పెద్దయ్యాక బాక్సర్ కావడం.
రక్షక తంత్రాలు-సామెతలు
- అడలేక మద్దెలు ఓటిది – ప్రక్షేపణం
- అందని ద్రాక్షపండు పుల్లన – హేతుకీకరణం
- అత్తమీద కోపం దుత్తమీద చూపడం – విస్థాపనం
- పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది- ప్రక్షేపణం
- అతి వినయం ధూర్త లక్షణం – ప్రతిచర్యా నిర్మితి
- పుట్టిన వాడు గిట్టక తప్పదు – బౌద్ధీకరణం
- తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనడం – హేతుకీకరణం
నోట్: సాంఘికంగా ఆమోదయోగ్యంకాని
రక్షక తంత్రాలు – విస్థాపనం, ప్రక్షేపణం, హేతుకీకరణం - సాంఘీకంగా ఆమోద యోగ్యం కాని రక్షక తంత్రాలు – విస్థాపనం, ప్రక్షేపణం, హేతుకీకరణం
- సాంఘీకంగా ఆమోద యోగ్యమైన రక్షక తంత్రాలు – దమనం, పరిహారం, తాదాత్మీకరణం, ఉదాత్తీకరణం
1. మెడిసిన్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తన డాక్టర్ అయిపోయినట్లుగా, మంచి ప్రాక్టీస్ జరుగుతున్నట్లు, దండిగా సంపాదిస్తున్నట్లు ఊహించుకోవడం?
1) స్వైర కల్పన 2) తాదాత్మీకరణం
3) పరిహారం 4) హేతుకీకరణం
2. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవటంలోని రక్షక తంత్రం?
ఎ) ప్రక్షేపణం బి) ప్రతిగమనం
సి) పరిహారం 4) దమనం
3. వృక్తత్వ పోటీలో సరిగా మాట్లాడలేకపోయి స్నేహితుల ఎగతాళికి గురైన అమ్మాయి కొన్ని రోజులు బాధపడింది. తర్వాత ఈ సంఘటన జరిగిన విషయమే మరిచిపోయింది. ఇక్కడ రక్షక తంత్రం?
1) ప్రతిగమనం 2) దమనం
3) విస్తాపనం 4) ఉపసంహరణ
4. ఇంజినీరింగ్‌లో సీటు రాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం?
1) పరిహారం 2) ప్రక్షేపణం
3) హేతుకీకరణం 4) విస్తాపనం
5. భోజనం సమయానికి బంధువులు ఇంటికి వెళ్ళిన రవి తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చాడని చేప్పడంలోని రక్షక తంత్రం?
1) ప్రక్షేపణం
2) ఉపసంహరణ
3) ప్రేరకం తారుమారు
4) పరిహారం
6. క్రికెట్ మ్యాచ్‌లో మొదటి బంతికే అవుటైన సాకేత్ కోపంగా తన బ్యాట్‌ను గట్టిగా పిచ్‌కేసి కొట్టడంలోని రక్షక తంత్రం?
1) విస్తాపనం 2) ప్రక్షేపణం
3) ఉపసంహరణ 4) ప్రతిగమనం
7. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలు లగ్నంచేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం?
1) ప్రక్షేపణం 2) హేతుకీకరణం
3) ఉదాత్తీకరణ 4) దమనం
సమాధానాలు
1-1 2-2 3-2 4-3
5-3 6-1 7-3
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

