Geography | రామ్‌ఘర్ సరస్సు ఏ నగరానికి సమీపంలో ఉంది?
ఏప్రిల్ 22 తరువాయి
66. ఏంజెల్ అనే పేరు గల సుప్రసిద్ధ జలపాతం ఏ దేశంలో ఉంది?
1) కెన్యా 2) వెనెజులా
3) ఇటలీ 4) రష్యా
67. వెనెజులా దేశంలో లభించే ముఖ్య ఖనిజం?
1) బంగారం 2) సీసం
3) పెట్రోలియం 4) అభ్రకం
68. ప్లేట్ నది మండలం గల దేశం?
1) అర్జెంటీనా 2) బ్రెజిల్
3) కెనడా 4) వెనెజులా
69. ప్రపంచంలో ఉండే బొగ్గు నిల్వల్లో సుమారు 50 శాతం వరకు గల ఖండం?
1) ఆసియా 2) ఉత్తర అమెరికా
3) దక్షిణ అమెరికా 4) యూరప్
70. ప్రపంచంలో అతిపొడవైన నది వంతెన ఏ దేశంలో ఉంది?
1) యూఎస్ఏ 2) భారతదేశం
3) స్విట్జర్లాండ్ 4) రష్యా
71. మాంగనీస్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1) జపాన్ 2) రష్యా
3) తూర్పు ఆఫ్రికా 4) జర్మనీ
72. ప్రపంచ భూభాగంలో ఆఫ్రికా ఖండం ఎంత విస్తీర్ణం ఆక్రమించింది?
1) 20 శాతం 2) 26 శాతం
3) 24 శాతం 4) 18 శాతం
73. సారా తయారు చేయడంలో ప్రసిద్ధిగాంచిన యూరోపియన్ దేశం?
1) చిలీ 2) ఫ్రాన్స్
3) ఇటలీ 4) చెకోస్లోవేకియా
74. యూరప్‌లో నారింజ తోటలకు పేరుగాంచిన దేశం?
1) ఇటలీ 2) స్పెయిన్
3) ఫ్రాన్స్ 4) చిలీ
75. ఇంగ్లండ్ దేశానికి చెందిన లాంక్షైర్ ఏ పరిశ్రమలకు ప్రసిద్ధి?
1) బట్టల పరిశ్రమ 2) ఇనుము
3) బొగ్గు 4) విద్యుచ్ఛక్తి
76. సిసిలీ ఏ తోటలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది?
1) నిమ్మతోటలు 2) ద్రాక్ష
3) అనాస 4) ఖర్జూరం
77. యూరప్‌లో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం?
1) రష్యా 2) ఇంగ్లండ్
3) ఇటలీ 4) జర్మనీ
78. కాక్‌పిట్ ఆఫ్ యూరప్ అని ఏ దేశానికి మారుపేరు?
1) డెన్మార్క్ 2) బెల్జియం
3) నార్వే 4) స్వీడన్
79. ఉత్తర, దక్షిణ అమెరికాలను వేరు చేసే ప్రాంతం?
1) సూయజ్ కాలువ
2) పనామా భూ సంధి
3) జిబ్రాల్టర్ జల సంధి
4) పాక్ జలసంధి
80. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
1) బేరింగ్ 2) పాక్
3) పనామా 4) సూయజ్ కాలువ
81. సూర్యుడికి భూమి అతిదగ్గరగా ఏరోజు వస్తుంది?
1) జనవరి 3 2) జూలై 4
3) మార్చి 21 4) సెప్టెంబర్ 23
82. అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశించే దేశం?
1) జపాన్ 2) నార్వే
3) ఉత్తర కొరియా 4) భారతదేశం
83. రాజమహల్ కొండలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) పశ్చిమ బెంగాల్ 2) రాజస్థాన్
3) బీహార్ 4) ఒడిశా
84. హిమాలయ నదులు, భారతదేశ నదుల మొత్తం నీటిలో ఎంతశాతం సముద్రంలోకి తీసుకుపోతున్నాయి?
1) 70 శాతం 2) 60 శాతం
3) 50 శాతం 4) 40 శాతం
85. ఆడమ్స్ బ్రిడ్జి ఎక్కడ ఉంది?
1) భారత్, శ్రీలంక మధ్య
2) భారత్, పాకిస్థాన్ మధ్య
3) భారత్, బంగ్లాదేశ్ మధ్య
4) భారత్, అఫ్గానిస్థాన్ మధ్య
86. భారతదేశంలోని మొదటి విద్యుత్ ప్రాజెక్టు?
1) కాక్రపార 2) శివసముద్రం
3) శ్రీశైలం 4) కొయినా
87. రామ్‌ఘర్ సరస్సు ఏ నగరానికి సమీపంలో ఉంది?
1) జైపూర్ 2) చండీఘర్
3) సిమ్లా 4) ఉదయ్‌పూర్
88. భారతదేశంలోకెల్లా అతిపెద్ద జిల్లా?
1) తూర్పుగోదావరి 2) లేహ్
3) లఢక్ 4) ఏదీకాదు
89. తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) గోవా
3) కేరళ 4) మధ్యప్రదేశ్
90. కర్కటరేఖ మనదేశంలోని ఎన్ని రాష్ర్టాల గుండా పోతుంది?
1) 3 2) 5 3) 7 4) 9
91. శ్రీలంక పూర్వపు రాజధాని?
1) కొలంబో 2) జాఫ్నా
3) అనిరుధ్పూర్ 4) కాండీ
92. భూమి తిరుగుతున్నప్పుడు ఏ రేఖాంశం సూర్యుడికి అభిముఖంగా ఉంటుందో ఆ రేఖాంశం మీద ఉన్న వారందరికి ఒకే కాలంలో ఏమి జరుగుతుంది?
1) ఉదయం 2) రాత్రి
3) మిట్ట మధ్యాహ్నం 4) సాయంత్రం
93. భూమికి ఎన్ని రకాల చలనాలు ఉన్నాయి?
1) 4 2) 2 3) 6 4) 5
94. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు?
1) భూభ్రమణం 2) భూపరిభ్రమణం
3) భూభ్రమణ, భూపరిభ్రమణ
4) ఏదీ కాదు
95. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు?
1) భూభ్రమణం
2) భూ పరిభ్రమణం
3) భూభ్రమణం, భూపరిభ్రమణం
4) ఏదీ కాదు
96. భూమి అక్షం భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య తలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది?
1) 23 1/20 2) 33 1/20
3) 66 1/20 4) ఏదీ కాదు
97. భూమధ్యరేఖ మీద ఏ తేదీన సూర్య కిరణాలు లంబంగా పడతాయి?
1) ఫిబ్రవరి 21 2) ఏప్రిల్ 21
3) మే 21 4) మార్చి 21
సమాధానాలు
66. 2 67. 3 68. 1 69. 2
70. 2 71. 2 72. 1 73. 2
74. 2 75. 1 76. 1 77. 2
78. 2 79. 2 80. 1 81. 1
82. 2 83. 3 84. 1 85. 1
86. 2 87. 1 88. 3 89. 4
90. 3 91. 4 92. 3 93. 2
94. 1 95. 2 96. 3 97. 4
98. ఆకాశంలో అత్యంత వేగవంతమైన నక్షత్రం?
1) మెటీరియోరైట్ 2) కామెంట్
3) ఆస్టరాయిడ్ 4) ప్లానెట్
99. విషవత్తులు అంటే?
1) రాత్రి దీర్ఘంగా ఉండే రోజులు
2) పగలు దీర్ఘంగా ఉండే రోజులు
3) రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు
4) ఏదీ కాదు
100. ప్రపంచమంతటా రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు ఏవి?
1) మార్చి 21, సెప్టెంబర్ 23
2) మార్చి 20, సెప్టెంబర్ 21
3) మార్చి 21, సెప్టెంబర్ 25
4) మార్చి 23. సెప్టెంబర్ 23
101. అంటార్కిటిక్ వలయం మీద పూర్తిగా సూర్యకిరణాలు పడి 24 గంటలు పట్టపగలుగానే ఉండే రోజు ఏది?
1) డిసెంబర్ 20 2) నవంబర్ 22
3) డిసెంబర్ 23 4) అక్టోబర్ 22
102. ప్రపంచమంతటికీ వర్తించే ప్రామాణిక కాలం?
1) గ్రీనిచ్ ప్రామాణిక కాలం
2) స్థానిక కాలం
3) 82 1/20 తూర్పు రేఖాంశం
4) ఏదీ కాదు
103. మనదేశపు ప్రామాణిక కాలపు రేఖాంశం?
1) 82 1/20 పశ్చిమ రేఖాంశం
2) 82 1/20 తూర్పు రేఖాంశం
3) 82 1/20 దక్షిణ రేఖాంశం
4) 82 1/20 ఉత్తర రేఖాంశం
104. 82 1/20 తూర్పు రేఖాంశం మన రాష్ట్రంలో ఏ పట్టణం గుండా పోతుంది?
1) గుంటూరు 2) ఏలూరు
3) కాకినాడ 4) నెల్లూరు
105. మన దేశపు ప్రామాణిక కాలం గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే ఎన్ని గంటలు ముందుంటుంది?
1) 3 1/2 గంటలు
2) 4 1/2 గంటలు
3) 6 1/2 గంటలు
4) 5 1/2 గంటలు
106. అంతర్జాతీయ దినరేఖ ఏది?
1) 1800 తూర్పు పశ్చిమ రేఖాంశం
2) 1800 1/20 తూర్పు రేఖాంశం
3) 1800 తూర్పు రేఖాంశం
4) 1800 పశ్చిమ రేఖాంశం
107. భూగోళం మొత్తం వైశాల్యంలో భూభాగం ఎంత శాతం?
1) 25 శాతం 2) 27 శాతం
3) 28 శాతం 4) 29 శాతం
108. భూభాగం హెచ్చుగా ఏ గోళంలో ఉంది?
1) ఉత్తరార్ధ గోళం 2) దక్షిణార్ధగోళం
3) పశ్చిమార్ధగోళం 4) పూర్వార్ధగోళం
109. భూ పటలంలో ఎన్ని రకాల శిలలు ఉంటాయి?
1) 6 2) 5 3) 3 4) 4
110. మాగ్మా అనే శిలాద్రవం ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలు?
1) రూపాంతర శిలలు 2) అగ్ని శిలలు
3) అవక్షేప శిలలు 4) ఏదీకాదు
111. భూమి ఉపరితలాన ఏర్పడ అగ్ని పర్వత శిలలను ఏమంటారు?
1) అంతర్గత శిలలు 2) పాతాళ శిలలు
3) ఉద్గత శిలలు 4) డైక్ శిలలు
112. క్వార్ట్, ఫెల్స్పార్, సిలికా మొదలైన ఖనిజాలు అధికంగా ఉండే శిలలు ఏవి?
1) అంతర్గత శిలలు 2) పాతాళ శిలలు
3) ఉద్గత శిలలు 4) డైక్ శిలలు
113. శిలాద్రవం భూమి అంతర్భాగం నుంచి బయటకు వచ్చే మార్గమధ్యంలో ఏర్పడే శిలలు?
1) అంతర్గత శిలలు 2) పాతాళ శిలలు
3) ఉద్గత శిలలు 4) డైక్ శిలలు
114. శిలాద్రవం భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు దాన్ని ఏమంటారు?
1) మాగ్మా 2) లానా
3) ద్రవం 4) ఏదీకాదు
115. గాలి, నీటి ప్రభావం వల్ల ఏర్పడే శిలలు ఏవి?
1) అగ్ని శిలలు
2) అగ్ని పర్వత శిలలు
3) రూపాంతర శిలలు
4) అవక్షేప శిలలు
116. కుండలు, ఇటుకలు మొదలైనవి తయారు చేయడానికి ఉపయోగపడే శిలలు?
1) షెల్ శిలలు 2) మృత్తిక శిలలు
3) రూపాంతర శిలలు
4) అవక్షేప శిలలు
117. పర్వతాలను వాటి పుట్టుకను బట్టి ఎన్ని రకాలుగా విభజించారు?
1) 3 2) 4 3) 5 4) 6
118. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం?
1) మెకెన్లీ
2) గాడ్విన్ ఆస్టిన్ (కె2)
3) ఎవరెస్ట్ 4) కాంచన గంగా
119 . ఖండ పర్వతాలకు ఉదాహరణ?
1) ఆండీస్ పర్వతాలు
2) హిమాలయాలు
3) బ్లాక్‌ఫారెస్ట్ పర్వతాలు
4) గ్రేట్ డివైడింగ్ రేంజ్
120. రెండు పర్వత శ్రేణుల మధ్య భాగం దిగజారి పెద్దలోయ ఏర్పడటాన్ని ఏమంటారు?
1) పగులు లోయ 2) పీఠభూమి
3) మైదానం 4) ఏదీకాదు
121. అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ?
1) హిమాలయాలు 2) ఆరావళి
3) బ్లాక్ ఫారెస్ట్ 4) రాఖీ పర్వతాలు
122. ఉత్తర-దక్షిణార్ధగోళాల్లో 250-300 అక్షాంశాల ప్రాంతంలో ఉన్న అధిక పీడన మండలాల నుంచి భూ మధ్యరేఖ అల్పపీడన మండలం వైపు వీచే పవనాలను ఏమంటారు?
1) ధ్రువ పవనాలు
2) వ్యాపార పవనాలు
3) రుతు పవనాలు 4) ఏదీ కాదు
123. 400 దక్షిణ అక్షాంశం దిగువ నుంచి వీచే పశ్చిమ పవనాలకు గల పేరు?
1) గర్జించే నలభైలు 2) రుతు పవనాలు
3) వ్యాపార పవనాలు
4) ప్రపంచ పవనాలు
124. మాన్సూన్ అనే పదం మాసిమ్ అనే పదం నుంచి పుట్టింది. ఇది ఏ భాష నుంచి వచ్చింది?
1) లాటిన్ 2) ఫ్రెంచి
3) అరబిక్ 4) గ్రీక్
125. మన దేశంలో వర్షపాతం ఎక్కువగా ఏ రుతుపవనాల వల్ల కలుగుతుంది?
1) నైరుతి రుతుపవనాలు
2) ఈశాన్య రుతుపవనాలు
3) పై రెండూ 4) ఏదీ కాదు
సమాధానాలు
98. 1 99.3 100.1 101.3
102. 1 103.2 104.3 105.4
106.1 107.4 108.1 109.3
110.2 111.3 112.2 113.4
114.2 115.4 116.1 117.2
118.3 119.3 120.1 121.2
122.2 123.1 124.3 125.1
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






