Geography | భూపటలంలో అధికంగా ఉండే మూలకాల వరుస క్రమం ఏది?
1. కింది వాటిలో సరికానిది ఏది?
1) అగ్నిశిలలు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండి స్పటికాలుగా ఏర్పడటానికి వీలుగా ఉంటుంది
2) అవక్షేప శిలలు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండి స్పటికాలుగా ఏర్పడటానికి వీలుగా ఉంటుంది
3) అవక్షేప శిలలు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండి స్పటికాలుగా ఏర్పరచవచ్చు
4) అవక్షేప శిలలు సచ్చిద్ర శిలలు, అగ్నిశిలలు అసచ్చిద్రశిలలు
2. ఎగువ ప్రావారపు పొరకు దిగువ ప్రావారపు పొరకు మధ్యగల ప్లాస్టిక్ ధర్మాలు కలిగి ఉండే భూభాగాన్ని ఏమంటారు?
1) ఎస్తనోస్పియర్ 3) లిథోస్పియర్
2) అస్మావరణం 4) ఏదీకాదు
3. జతపరచండి?
1) తేలికైన గ్రానైట్ శిలలతో ఏర్పడినవి (సియాల్) ఎ) ఖండ భూతలాలు
2) బరువైన బసాల్ట్ శిలలతో ఏర్పడినవి బి) సముద్ర భూతలాలు
3) భూ పటలం ఎగువ ప్రావారపు పొరను కలిపి ఏమంటారు సి) శిలావరణం
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి
4. జతపరచండి
1. భూపటలం, భూ ప్రావారం మధ్యగల సరిహద్దు ఎ. గుట్బెర్గ్ విచ్ఛిన్నతల
2. భూప్రావారం, భూ కేంద్రం మధ్యగల సరిహద్దు బి. మెహరోవిక్ విచ్ఛిన్నత
3. సియాల్, సిమా పొరలను వేరు చేస్తున్న సరిహద్దు సి. కాండ్రిడ్ విచ్ఛిన్నత
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి 4) 1-బి, 2-సి, 3-ఎ
5. కిందివాటిని జతపరచండి?
1. భూ ఉపరితలం నుంచి 40 కి.మీ. లోతు వరకు విస్తరించిన పొర ఎ. భూకేంద్ర మండలం
2. భూపటలం నుంచి సగటున 2900 కి.మీ.లోతు వరకు విస్తరించిన పొర బి. భూ ప్రావారం
3. భూ ప్రావారం నుంచి సగటున 3500 కి.మీ. సి. భూ పటలం
లోతు వరకు విస్తరించిన పొర
1) 1-సి, 2-ఎ, 3-బి 2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4) 1-ఎ, 2-బి, 3-సి
6. భూపటలంలో అధికంగా ఉండే మూలకాల వరుస క్రమం ఏది?
1) ఆక్సిజన్ అల్యూమినియం, ఐరన్, సిలికాన్
2) ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్
3) ఐరన్, ఆక్సిజన్, అల్యూమినియం, సిలికాన్
4) సిలికాన్, అల్యూమినియం, ఐరన్, ఆక్సిజన్
7. భూమి లోపల అధికంగా ఉండే మూలకం ఏది?
1) ఐరన్ 2) సిలికాన్
3) ఆక్సిజన్ 4) అల్యూమినియం
8. కింది వాటిలో సరికానిది ఏది?
1) భూ పటలం – అత్యంత తేలికైన ప్రాంతం
2) భూ ప్రావారం అత్యంత బరువైన ప్రాంతం
3) భూ పటలాన్ని బాహ్యపొర (వెలుపలి పొర) అని అంటారు
4) ఏదీకాదు
9. కిందివాటిని జతపరచండి.
1) భూ పటలం ఎ) సిమా (సిలికాన్, మెగ్నీషియం)
2) భూ ప్రావారం బి) సియాలు (సిలికాన్, అల్యూమినియం)
3) భూ కేంద్ర మండలం సి) నిఫె (నికెల్, ఫెర్రస్, ఐరన్)
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి
10. జత పరచండి.
1) బాహ్య భూ కేంద్ర మండల స్థితి ఎ) కొల్లాయిడ్ స్థితి
2) మధ్య భూ కేంద్ర మండల స్థితి బి) ద్రవ స్థితి
3) అంతర భూ కేంద్ర మండలం స్థితి సి) ఘన స్థితి
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ 4) 1-ఎ, 2-బి, 3-సి
11. భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్ది ప్రతి 32 మీటర్లకు 19 సెంటీగ్రేడ్ చొప్పున ఉష్టోగ్రత ఏమవుతుంది?
1) పెరుగును
2) తగ్గును
3) ఎలాంటి మార్పు ఉండదు
4) ఏదీకాదు
12. భూ అంతర్భాగం లోపలికి పోయే ఉష్ణోగ్రతకు ఎలాంటి మార్పు (ఏ విధంగా) ఉంటుంది?
1) అనులోమానుపాతంలో
2) విలోమానుపాతంలో
3) ఎలాంటిమార్పు ఉండదు
4) ఏదీకాదు
13. జతపరచండి?
1) భూ పటలం విశిష్ట సాంద్రత ఎ) 9.5 నుంచి 5.5 గ్రా/ సె.మీ.3
2) భూ ప్రావారం విశిష్ట సాంద్రత బి) 4.3 నుంచి 3.5 గ్రా/ సె.మీ.3
3) భూ కేంద్ర మండలం విశిష్ట సాంద్రత సి) 5.517 నుంచి 5.5 గ్రా/ సె.మీ.3
4. భూమి సరాసరి విశిష్ట సాంద్రత వరకు డి) 11 నుంచి 18 గ్రా / సె.మీ.
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
14. భూ కేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
1) 6000oC 2) 7000oC
3) 6500oC 4) 7500oC
15. భూమి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఏమిటి?
1) రేడియోధార్మిక పదార్థాలు విచ్ఛిన్నం కావటం
2) హాలోజన్ విచ్ఛిన్నం కావటం
3) లాంథనైయిడ్స్ విచ్ఛిన్నం కావటం
4) హాల్కోజన్ పదార్థాలు విచ్ఛిన్నం కావడం
16. జతపరచండి?
1) సముద్ర భూ స్వరూపాలు ఎ) సిస్టాక్స్. అఖాతాలు / బే, స్టాలక్ మైట్స్, కోన్
2) కార్డ్స్ (అంతర భూజల) భూ స్వరూపాలు బి) సైఫ్‌లు, బ్యాంక్స్/ ఇసుక దిబ్బలు, కందకాలు
3) నదుల భూస్వరూపాలు సి) లాగూన్, మియాండర్లు, సిచ్ఛిద్రములు
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-సి, 2-బి, 3-ఎ 4) 1-బి, 2-ఎ, 3-సి
17. జతపరచండి.
1. పక్షిపాద, డెల్టా కలిగిన నది ఎ. గంగానది (భారతదేశం)
2. డిజిటల్ డెల్టా కలిగిన నది బి. మిసిసిపి నది (ఉత్తరఅమెరికా)
3. లోబెల్ట్ డెల్టా కలిగిన నది సి. మహానది (భారతదేశం)
4. కస్పేట్ డెల్టా కలిగిన నది డి) విస్తులా నది (పోలాండ్),
ఎల్బ్నది (రష్యా), ఓడర్ నది (జర్మనీ)
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
18. జతపరచండి.
1. పవన భూస్వరూపాలు ఎ. యార్డాంగ్స్, ప్లయాలు బోడిగుట్టలు (ఇన్సెల్ బర్గ్)
2. నదుల భూస్వరూపాలు బి. కాస్కేడ్లు కెమ్స్, హగ్బాక్లు, స్పర్స్లు
3. హిమానీ నదాల ‘U’ సి. ఎరిటే, ఫియోర్డ్స్, హర్త్, భూస్వరూపాలు
ఆకారపు లోయలు
1) 1-బి, 2-ఎ, 3-సి 2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-ఎ, 2-బి, 3-సి 4) 1-సి, 2-బి, 3-ఎ
19. జతపరచండి?
1. దక్షిణ అమెరికాలోని పర్వతాంతర పీఠభూమి ఎ) మెక్సికో పీఠభూమి
2) మెక్సికోలోని పర్వతాంతర పీఠభూమి బి) బొలీవియా పీఠభూమి
3) మంగోలియాలోని పర్వతాంతర పీఠభూమి సి) మంగోలియా పీఠభూమి
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ 4) 1-ఎ, 2-బి, 3-సి
20. ప్రపంచపై కప్పు (ప్రపంచంలోనే అతి ఎత్తయిన) అని ఏ పీఠభూమిని పిలుస్తారు?
1) బొలీవియా పీఠభూమి
2) మంగోలియా పీఠభూమి
3) పామీర్ పీఠభూమి
4) మెక్సికో పీఠభూమి
21. జతపరచండి.
1) రెండు ఖండపలకలు ఎ) ముడత పర్వతాలు దగ్గరగా వస్తే ఏర్పడే భూ స్వరూపాలు
2) రెండు సముద్ర పలకలు బి) అగాథాలు దగ్గరగా వస్తే ఏర్పడే భూస్వరూపాలు
3) రెండు ఖండ పలకలు సి) మహా సముద్రాలు దూరంగా కదిలినప్పుడు ఏర్పడే భూ స్వరూపాలు
4) రెండు సముద్ర పలకలు డి) రిడ్లు అనే దూరంగా కదిలినప్పుడు ఏర్పడే భూస్వరూపాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
22. లారెన్షియా భూభాగంలో భాగం కాని ప్రాంతం/ ఖండం ఏది?
1) ఉత్తర అమెరికా 2) యూరప్
3) ఆసియా (దక్షిణ భారత ద్వీపకల్పం
మినహా) 4) ఏదీకాదు
23. కింది ముడత పర్వతాలను జతపరచండి.
1) రాజస్థాన్ ఎ) అపలేచియన్
2) ఉత్తర అమెరికా బి) ఆరావళీ పర్వతాలు
3) రష్యా సి) గ్రేట్ డివైండింగ్ రేంజ్
4) ఆస్ట్రేలియా డి) యూరల్ పర్వతాలు
5) ఆఫ్రికా(మొరాకో) ఇ) అట్లాస్ పర్వతాలు
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి, 5-ఇ
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఇ
24. గోండ్వానా భూభాగంలో భాగం కాని ప్రాంతం?
1) దక్షిణ అమెరికా, ఆఫ్రికా
2) ఆస్ట్రేలియా, అంటార్కిటికా
3) దక్షిణ భారత ద్వీపకల్పం 4) ఏదీకాదు
25. ఖండ చలన సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో ఉన్న మహా భూభాగం పేరు ఏమిటీ?
1) పాంథాలసా 2) పేంజియా
3) అంగారా 4) లారెన్షియా
26. కింది వాటిని జతపరచండి.
1) పేంజియా భూభాగాన్ని ఆవరించి ఉన్న సముద్రం ఎ) టెథిస్ సముద్రం
2. పేంజియాకు మధ్యలోని భూభాగం పేరు బి) పాంథాలసా
3) టెథిస్‌కు ఉత్తరంగా ఉన్న భూభాగం పేరు సి) గోండ్వానా
4) టెథిస్‌కు దక్షిణంగా ఉన్న భూభాగం పేరు డి) అంగారా(లారెన్షియా)
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
27. కింది అవశిష్ట పర్వతాలను జతపరంచండి.
1) రాజస్థాన్ ఎ) నీలగిరి కొండలు
2) జార్ఖండ్ బి) ఆరావళి పర్వతాలు
3) తమిళనాడు సి) రాజ్‌మహల్ కొండలు
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-సి, 3-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి
28. కిందివాటిలో సరైనది ఏది?
1) అఫ్గానిస్థాన్ పర్వత శ్రేణి – జస్కార్, కారకోరం శ్రేణి
2) ఇండియాలోని పర్వత శ్రేణి – హిందూకుష్ శ్రేణి
3) పై రెండూ 4) ఏదీకాదు
29. జతపరచండి (నవీన ముడుత పర్వతాలు)
1) భారత ఉపఖండం ఎ) ఆల్ఫ్స్ పర్వతాలు
2) ఐరోపా బి) హిమాలయాలు
3) ఉత్తర అమెరికా సి) రాకీ పర్వతాలు
4) దక్షిణ అమెరికా డి) అండీస్ పర్వతాలు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
30. జతపరచండి (ఖండపర్వతాలు)
1) భారత్ ఎ) వింధ్యా సాత్పురా పర్వతాలు
2) దక్షిణాఫ్రికా బి) డ్రాకెన్బర్గ్ పర్వతాలు
3) ఫ్రాన్స్ సి) వాజస్ పర్వతాలు
4) జర్మనీ డి) బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
సమాధానాలు
1-2 2-1 3-4 4-3
5-3 6-2 7-1 8-4
9-2 10-2 11-1 12-1
13-4 14-1 15-1 16-1
17-3 18-3 19-2 20-3
21-1 22-4 23-2 24-4
25-2 26-2 27-3 28-3
29-3 30-1
Toppers Institute
Medipally, Hyd.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






