ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణి?
- రక్షణ రంగం
1. జతపరచండి.
ఎ. పేట్రియాట్ 1. జర్మనీ
బి. స్కై డ్రాగన్ 2. ఇజ్రాయెల్
సి. రోలాండ్ 3. చైనా
డి. స్పైడర్ 4. అమెరికా
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
2. భారత్ రూపొందించిన న్యూక్లియర్ ట్రయాడ్కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. దీనిలో భాగంగా ఉపరితలం, గగన-తలం, జలాంతర్గాముల నుంచి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల పరిజ్ఞానాన్ని భారత్ సముపార్జించుకుంది
బి. భారత వైమానిక దళం గగనతలం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించడానికి మిగ్-27 ఈటీసీ యుద్ధ విమానాలను వినియోగించనుంది
సి. జలాంతర్గాముల ద్వారా అణ్వస్త్ర క్షిపణులను మోహరించడం కోసం అరిహంత్ తరగతి జలాంతర్గాములను వినియోగిస్తారు
డి. ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాలకు మాత్రమే ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానం కలదు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
3. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరికానివి?
ఎ. భారత త్రివిధ దళాలకు నేతృత్వం వహించే అత్యున్నత పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
బి. ఈ పదవి ఏర్పాటుకు నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్, డీబీ శేట్కర్ కమిటీ సిఫారసు చేశాయి
సి. ఐదేళ్ల కాల పరిమితితో జనవరి 1, 2020న ఈ పదవి ఏర్పాటు చేయబడింది
డి. మొదటి సీడీఎస్‌గా General Bipin Rawat నియమితులయ్యారు
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, బి, డి 4) ఎ, డి
4. శౌర్య క్షిపణికి సంబంధించి సరికానిది?
1) ఉపరితలం నుంచి ఉపరితలానికి హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగల క్షిపణి
2) దీని పరిధి 700 కిలోమీటర్లు
3) క్యానిస్టర్ ద్వారా ప్రయోగించగలగడం దీని ప్రత్యేకత
4) 2 అంచెల్లో ద్రవ ఇంధనంతో ప్రయాణిస్తుంది
5. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత చైర్మన్‌గా వ్యవహరించేవారు?
1) రక్షణ మంత్రి
2) కేంద్ర ముఖ్య కార్యదర్శి
3) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్స్
4) మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్
6. ప్రహార్ క్షిపణిలోని ఇతర రకాలు?
ఎ. ప్రగతి బి. ప్రణతి
సి. ప్రణష్ డి. కే15
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, డి 4) ఎ, డి
7. ఇండియన్ నేవీ : రియర్ అడ్మిరల్ : : ఇండి-యన్ ఎయిర్ ఫోర్స్ : ___?
1) ఎయిర్ మార్షల్
2) ఎయిర్ వైస్ మార్షల్
3) ఎయిర్ కమోడర్
4) మేజర్ జనరల్
8. కింది సైనిక విభాగాలను పరిమాణం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి.
ఎ. బెటాలియన్ బి. కంపెనీ
సి. బ్రిగేడ్ డి. ఫ్లాటూన్
1) డి<సి<ఎ<బి 2) డి<బి<సి<ఎ
3) డి<బి<ఎ<సి 4) డి<సి<బి<ఎ
9. కింది వాటిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను కలిగిన భారతీయ క్షిపణులు?
ఎ. పృథ్వీ 1 బి. అగ్ని 3
సి. మినిట్ మ్యాన్ 3 డి. అగ్ని 5
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) బి, డి 4) ఎ, బి, డి
10. K శ్రేణి క్షిపణులకు సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. వీటిని డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో అభివృద్ధి చేస్తున్నారు
బి. ఈ శ్రేణిలో కె-4, కె-5, కె-6, కె-15 క్షిపణులను అభివృద్ధి పరుస్తున్నారు
సి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల శౌర్య క్షిపణిని రూపాంతరం చెందించి జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల కె-15 క్షిపణిగా అభివృద్ధి పరిచారు
డి. న్యూక్లియర్ ట్రయాడ్ ప్రాజెక్టులో భాగంగా భారత్ వీటిని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) బి, డి 4) ఎ, బి, సి, డి
11. బరాక్ క్షిపణికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి.
ఎ. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధిపరుస్తున్నాయి
బి. బరాక్ అనే హిబ్రూ భాషా పదానికి వెలుగునిచ్చేది అనే అర్థం కలదు
సి. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగల స్వల్ప శ్రేణి బరాక్ క్షిపణి పరిధి 12 కిలోమీటర్లు
డి. వీటిని ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విరాట్, శివాలిక్ తరగతి యుద్ధనౌకల్లో మోహరించనున్నారు
1) బి, సి, డి 2) సి, డి
3) ఎ, బి 4) బి, డి
12. కింది వాటిలో అగ్ని-4 క్షిపణికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. ఘన ఇంధనాన్ని వినియోగించుకుని 2 అంచెల్లో ప్రయాణిస్తుంది
బి. ఈ ప్రాజెక్టు డైరెక్టర్‌గా టెస్సీ థామస్ వ్యవహరించారు
సి. సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు
డి. ఒక టన్ను వార్ హెడ్‌ను 7500 కిలోమీటర్లు మోసుకుపోగలదు
1) బి, సి, డి 2) సి, డి
3) ఎ, బి 4) బి, డి
13. క్రూయిజ్ క్షిపణులకు సంబంధించి కింది వాటిల్లో సరికానిది?
1) వీటిని కదులుతూ ఉండే లక్ష్యాలపైకి ప్రయోగిస్తారు
2) పేలోడ్ సామర్థ్యం, క్షిపణుల పరిధి చాలా స్వల్పంగా ఉంటుంది
3) తక్కువ ఎత్తులో భూవాతావరణ పరిధిలోనే ప్రయాణిస్తాయి
4) ఈ క్షిపణుల పరిధిని బట్టి వీటిని వర్గీకరిస్తారు
14. K100 క్షిపణికి సంబంధించి కింది వాటిల్లో సరికానిది?
1) గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల దీర్ఘశ్రేణి క్షిపణి
2) ఈ క్షిపణి పరిధి 600 కిలోమీటర్లు
3) దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధిపరుస్తున్నాయి
4) ఈ సూపర్ సోనిక్ క్షిపణులను సుఖోయ్ యుద్ధ విమానాల్లో మోహరించనున్నారు
15. కింది వాటిలో క్యానిస్టర్ ద్వారా ప్రయోగించగల క్షిపణులను గుర్తించండి.
ఎ. బ్రహ్మోస్ బి. అగ్ని 5
సి. శౌర్య డి. QRSAM
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి 4) బి, సి, డి
16. కే శ్రేణిలో క్షిపణుల పరిధికి సంబంధించి కింది జతల్లో సరికానిది గుర్తించండి.
1) K4-4000 km
2) K5-5000 km
3) K6-6000 km
4) K15-750 km 1500 km
17. క్షిపణికి సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?
1) ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణి
2) దీని పరిధి 1000 నుంచి 1500 కిలోమీటర్లు
3) దీన్ని డీఆర్డీఓకి చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది
4) ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది
18. డీఆర్డీఓ రూపొందించిన SMARTకి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. SMART- Supersonic Missile Assisted Release of Torpedo
బి. దీన్ని డీఆర్డీఓకి చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్(హైదరాబాద్), NSTL(విశాఖపట్నం), ADRDE (ఆగ్రా), DRDLలు సంయుక్తంగా రూపొందించాయి
సి. యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేశారు
డి. SMART క్షిపణి తొలుత గాలిలో
సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ లక్ష్యంగా నిర్దేశించిన జలాంతర్గాములను సమీపించిన తరువాత దాన్ని నాశనం చేయడానికి తనలోని టార్పెడో సిస్టంను విడుదల చేస్తుంది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
19. డీఆర్డీఓ రూపొందించిన రుద్రం క్షిపణికి సంబంధించి కిందివాక్యాల్లో సరైనవి?
ఎ. రుద్రం అనేది భారత వైమానిక దళం కోసం స్వదేశీయంగా అభివృద్ధి పరచబడిన యాంటీ రేడియేషన్ మిస్సైల్
బి. వీటిని sukhoi 30mki యుద్ధ విమానాల నుంచి ప్రయోగిస్తారు
సి. దీర్ఘ శ్రేణి యాంటీ రేడియేషన్ క్షిపణులను గగనతలం నుంచి ప్రయోగించగల సాంకేతికతను భారత్ స్వదేశీయంగానే సముపార్జించుకుంది
1) ఎ 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
20. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన వీలర్ ఐలాండ్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్ నుంచి సెప్టెంబర్ 2020లో పరీక్షించిన HSDTV అనేది?
1) ఖండాంతర క్రూయిజ్ క్షిపణి
2) స్వదేశీయంగా రూపొందించిన అత్యాధునిక రాడార్
3) హైపర్ సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ SC Ramjet టెక్నాలజీ
4) రాఫెల్ యుద్ధ విమానాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన సాంకేతికత
21. భారత నావికా దళానికి సంబంధించిన అధికారుల ర్యాంకులను దిగువ నుంచి ఎగువకు వరుస క్రమంలో అమర్చండి.
ఎ. Comodor బి. Commander
సి. Rear Admiral డి. Captian
1) ఎ<డి<బి<సి 2) బి<డి<ఎ<సి
3) బి<సి<ఎ<డి 4) ఎ<సి<బి<డి
22. రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. ఇవి ధ్వని వేగానికి రెండు రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి
బి. వీటిని డస్సాల్డ్ ఏవియేషన్ అనే ఫ్రెంచ్ కంపెనీ తయారుచేసింది
సి. 100 కిలోమీటర్ల పరిధిలో BVRAAM క్షిపణులను, అదేవిధంగా 300 కిలోమీటర్ల పరిధిలో గగనతలం నుంచి ఉపరితలానికి క్షిపణులను ప్రయోగించగలవు
డి. డెల్టా వింగ్ ఆకారాన్ని కలిగి రెండు ఇంజిన్లతో ప్రయాణిస్తుంది
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
23. కింది వాటిలో భారత వైమానిక దళపు విభాగం కానిది?
1) వింగ్ 2) స్క్వాడ్రన్
3) సెక్షన్ 4) ఫ్లైట్
24. కేంద్ర బడ్జెట్ 2018-2019 ప్రకారం ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు తమిళనాడు రాష్ట్రంలో ఎంపికైన నగరాలకు సంబంధించి సరైన జాబితా?
ఎ. హోసూర్ బి. సేలం
సి. కుంభకోణం డి. తిరుచిరాపల్లి
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
25. బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ?
1) వీటిని స్థిరమైన లక్ష్యాలపైకి గురిపెట్టి ప్రయోగిస్తారు
2) వీటి పేలుడు సామర్థ్యం, పరిధి అధికంగా ఉంటుంది
3) వీటి వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి పలు రకాలుగా వర్గీకరిస్తారు
4) లక్ష్యాలను ఛేదించే క్రమంలో భూ వాతావరణ పరిధిని వాటి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో లక్ష్యాలపై పడి నాశనం చేస్తాయి
26. అపాచీ హెలికాప్టర్ల గురించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. వీటిని అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ రూపొందించింది
బి. లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, రాత్రివేళల్లో నిఘా కార్యకలాపాలను నిర్వర్తించడానికి దీని నాసిక భాగంలో ఒక సెన్సార్ సూట్‌ను అమర్చారు
సి. భారత్‌లో ప్రస్తుతం అపాచీ AH-64 హెలికాప్టర్లు 22 ఉన్నాయి
డి. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ, రాత్రి వేళల్లో సైతం ఇది తమ కార్యకలాపాలను నిర్వహించగలవు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
27. భారత ప్రభుత్వం ఇటీవల రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని ఏ విధంగా మార్చింది.
1) 74 శాతం నుంచి 49 శాతానికి తగ్గించింది
2) 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది
3) 95 శాతం నుంచి 74 శాతానికి తగ్గించింది
4) 74 శాతం నుంచి 95 శాతానికి పెంచింది
28. ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజియన్లకు సంబంధించి సరిగా జతపరచిన జత?
1) వెస్టర్న్ రీజియన్ – బొంబై
2) ఈస్టర్న్ రీజియన్ – విశాఖపట్నం
3) నార్త్ ఈస్ట్ రీజియన్ – కోల్‌కతా
4) నార్ట్ వెస్ట్ రీజియన్ – గాంధీనగర్
29. కింది వాటిలో ఆపరేషన్ మదద్ అనేది?
1) ఫిబ్రవరి 2021లో ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన సహాయక కార్యక్రమాలు
2) 2014లో కశ్మీర్ వరదల సమయంలో భారత సైనిక దళాలు చేపట్టిన సహాయక కార్యక్రమాలు
3) 2019లో ఒడిశాను ఫణి తుఫాను ముంచెత్తిన సమయంలో భారత వైమానికి దళం చేపట్టిన సహాయక కార్యక్రమాలు
4) 2018లో కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో భారత నావికా దళం చేపట్టిన సహాయక కార్యక్రమాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?