‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని రాసినవారు?
ప్రపంచీకరణ, ద్రవ్య సప్లయ్
-రుణం, ప్రభుత్వ బడ్జెట్-పన్నులు
1. ట్యునీషియా, ఈజిప్ట్ వంటి దేశాల్లో నియంతలను తొలగించడానికి చోటుచేసుకున్న విప్లవాలను ప్రసార మాధ్యమాల్లో ఏమని పిలిచారు?
1) నిశ్శబ్ద విప్లవం 2) నియంత విప్లవం
3) అరబ్ వసంతం
4) విప్లవ తిరుగుబాటు
2. వివిధ దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఏమంటారు?
1) సరళీకరణ 2) ప్రపంచీకరణ
3) ప్రైవేటీకరణ 4) విలీనీకరణ
3. ‘కార్గిల్ ఫుడ్స్’ అనే బళజాతి కంపెనీ ఏ దేశానికి చెందినది?
1) అమెరికా 2) ఇంగ్లండ్
3) జర్మనీ 4) చైనా
4. కింది వాటిలో ‘ఫోర్డ్ మోటార్స్’కు సంబంధించి సరికానిది?
1) ఇది ప్రపంచంలోని 26 దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలను కలిగి ఉంది
2) 1995లో రూ.1700 కోట్ల పెట్టుబడితో చెన్నై దగ్గర కర్మాగారాన్ని స్థాపించింది
3) 2004 నాటికి భారత్‌లో 27,000 కార్ల అమ్మకాలు చేసింది
4) ఇది ఇంగ్లండ్‌కు చెందిన బళజాతి కంపెనీ
5. ప్రభుత్వం దిగుమతి చేసుకునే సరుకుల మోతాదుపై పరిమితి విధిస్తే దాన్ని ఏమంటారు?
1) సుంకం 2) పన్ను
3) కోటా 4) టారిఫ్
6. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల కిందికి రాని అంశం?
1) గ్రంథాలయాలు
2) భవన విక్రయ కంపెనీలు
3) విద్య 4) దేశ రక్షణ
7. ఆర్థిక, బీమా, స్థిరాస్థి సేవలకు సంబంధించిన అంశం?
1) పురాతన దస్తావేజుల నిర్వహణ
2) మ్యూజియం 3) వైద్యం
4) దళారుల సేవలు
8. స్థూల దేశీయోత్పత్తిలో 2015-16 నాటికి సేవారంగం వాటా ఎంత?
1) 53 శాతం 2) 58 శాతం
3) 35 శాతం 4) 31 శాతం
9. వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగం?
1) వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత
2) అల్ప ఉద్యోగిత
3) కాలిక నిరుద్యోగిత
4) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
10. ఉద్యోగాల స్థాయిలో గాని, జీతాల స్థాయిలో గాని నియమిత పద్ధతి, నిబంధనలు లేకుండా ఉన్న రంగం?
1) వ్యవస్థీకృత రంగం
2) అవ్యవస్థీకృత రంగం
3) నియత రంగం 4) ఏదీకాదు
11. భారత్‌లో 2010 సర్వే ప్రకారం 3.4-17 లక్షల మధ్య వార్షికాదాయం కలిగినవారిని ఏమని పిలుస్తారు?
1) ధనిక వర్గం 2) మధ్యతరగతి
3) దిగువ మధ్యతరగతి 4) నిరుపేదలు
12. వివిధ రకాల కాలుష్యాలను పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని ఏమంటారు?
1) పర్యావరణ వనరుల సరఫరా విధి
2) శోషణ 3) శుద్ధిచేసే విధి
4) ఏదీకాదు
13. భారత్‌లోని ఎంత శాతం జిల్లాల్లో చేతిపంపుల నీరు తాగడానికి పనికిరాదు?
1) 59 శాతం 2) 53 శాతం
3) 55 శాతం 4) 58 శాతం
14. ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని రచించినవారు?
1) బావా మహలియా 2) దిగ్విజయ్ సింగ్
3) సుహాన్ వర్షన్ 4) రాచెల్ కార్సన్
15. కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. సర్దార్ సరోవర్ ఆనకట్టకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం-నర్మదా బచావో ఆందోళన్
బి. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ కొండల్లో నర్మదను కాపాడే ఉద్యమం జరిగింది
సి. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల ముంపునకు గురయ్యే మొదటి గ్రామం- కాసరగోడ్
డి. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించిన ప్రాజెక్ట్- నర్మదా లోయ అభివృద్ధి పథకం
1) ఎ, బి, డి 2) ఎ, బి
3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
16. 2015 నాటికి పూర్తి సేంద్రియంగా మారాలని నిర్ణయించుకున్న రాష్ట్రం?
1) అసోం 2) సిక్కిం
3) బెంగాల్ 4) ఉత్తరప్రదేశ్
17. భారత్‌లోని బ్యాంకులు తమ వద్ద జమ అయిన నగదులో ఎంత శాతం ఆర్బీఐ నిబంధనల మేరకు నిల్వ ఉంచుతున్నాయి?
1) 20 శాతం 2) 25 శాతం
3) 12 శాతం 4) 15 శాతం
18. కింది వాటిలో నియత రుణమార్గం కానిది?
1) సహకార సంస్థలు 2) భూస్వాములు
3) వాణిజ్య బ్యాంకులు 4) ప్రభుత్వం
19. 2003 నాటికి గ్రామీణ కుటుంబాలకు అధిక రుణసహాయం అందించేవారు?
1) వర్తకులు
2) వాణిజ్య బ్యాంకులు
3) సహకార సంస్థలు 4) వడ్డీవ్యాపారం
20. బిజినెస్ కరస్పాండెంట్లు లావాదేవీల కోసం దేన్ని ఉపయోగిస్తున్నారు?
1) మైక్రో ఏటీఎం టెర్మినల్
2) బయోమెట్రిక్ స్మార్ట్ కార్డ్
3) ఓటర్ కార్డ్ 4) పైవన్నీ
21. భారత్‌లో ఆర్థిక అవసరాలు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేది ఎవరు?
1) ఎస్బీఐ 2) ఆర్బీఐ
3) ప్రభుత్వం 4) వాణిజ్య బ్యాంకులు
22. ఎరువులు, ఆహారధాన్యాలకు అయ్యే వ్యయంలో కొంత మొత్తం ప్రభుత్వం చెల్లించేదాన్ని ఏమంటారు?
1) సబ్సిడీ 2) బదిలీ చెల్లింపు
3) రాయితీ 4) 1, 3
23. కింది వాటిలో ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ?
1) కార్పొరేషన్ పన్ను 2) అమ్మకపు పన్ను
3) కస్టమ్స్ పన్ను 4) 1, 3
24. ధనికులపై అధిక పన్ను, పేదవారిపై తక్కువ పన్నును సూచించేది?
1) ఎక్సైజ్ సుంకం 2) సేవా పన్ను
3) ఆదాయపు పన్ను 4) పైవన్నీ
25. పరోక్ష పన్నులన్నింటి స్థానంలో వచ్చిన నూతన పన్ను ఏది?
1) వ్యాట్ 2) జీఎస్టీ
3) 1, 2 4) ఏదీకాదు
26. వస్తుసేవా పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2016 2) 2017
3) 2018 4) 2019
27. నీటిని శుద్ధి చేసే యంత్రంపై ఎంత శాతం జీఎస్టీ ఉంది?
1) 28 2) 18 3) 5 4) 12
28. గృహాల్లో ఉపయోగించే ఎల్ఈడీ బల్బులపై జీఎస్టీ పన్ను శాతం ఎంత?
1) 5 2) 28 3) 18 4) 12
29. జీఎస్టీలో 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే అంశం ఏది?
1) పండ్లరసాలు తీసే యంత్రం
2) మిక్సర్
3) ఇస్త్రీపెట్టె
4) పైవన్నీ
30. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. జీఎస్టీ రావడంవల్ల దేశం మొత్తానికి ఒకే విధానం వర్తిస్తుంది
బి. జీఎస్టీ వల్ల పన్ను ఎగవేత తగ్గింది
సి. వస్తుసేవా పన్ను లెక్కింపులో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది
డి. వస్తుసేవల కొనుగోలుకు ఉపయోగించని డబ్బునే ‘నల్లద్రవ్యం’ అంటారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) బి, సి 4) ఎ, బి, సి
సమాధానాలు
1-3, 2-2, 3-1, 4-4, 5-3, 6-2, 7-4, 8-1, 9-4, 10-2, 11-2, 12-3, 13-1, 14-4, 15-3, 16-2, 17-4, 18-2, 19-4, 20-1, 21-2, 22-4, 23-1, 24-3, 25-2, 26-2, 27-2, 28-1, 29-4, 30-4.
– వెంకట్
విషయనిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు