న్యాయస్థానాలపైనే న్యాయస్థానాలు జారీచేసే రిట్స్?
173. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌ను సంరక్షింపబడిన చట్టాలుగా (Saving of certain Laws) పేర్కొంటారు?
ఎ) ఆర్టికల్స్ 30(ఎ), 30(బి), 30(సి)
బి) ఆర్టికల్స్ 31(ఎ), 31(బి), 31(సి)
సి) ఆర్టికల్స్32(ఎ), 32(బి), 33(సి)
డి) ఆర్టికల్స్ 29(ఎ), 29(బి), 29(సి)
174. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రారంభ రాజ్యాంగంలో ఆర్టికల్ 31లో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించారు
బి) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మొరార్జీదేశాయ్ ప్రభుత్వం తొలగించింది
సి) 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్స్ 31(ఎ), 31(బి) చేర్చారు
డి) 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31(సి) చేర్చారు
ఎ) 1, 2, 3 సి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
175. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు
బి) రాజ్యాంగంలో 12వ భాగంలో ఆర్టికల్ 300(ఎ) లో ఆస్తిహక్కును సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు
సి) ఆర్టికల్ 31(ఎ)ను కేశవానందభారతి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది
డి) ఆర్టికల్ 31(సి)ను 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971ద్వారా రాజ్యాంగంలో చేర్చారు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 4
176. ఆర్టికల్ 31(సి) లోని మొదటి అంశాన్ని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా సమర్ధించింది?
ఎ) గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
బి) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
సి) జగ్జీత్సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) పీఏ ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
177. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి), 39(సి) లకు మాత్రమే ప్రాథమిక హక్కులపై ఆధిపత్యం ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ప్రకటించింది.
ఎ) మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) సజ్జన్‌సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
సి) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
డి) ఎస్ఆర్ బొమ్మై Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
178. ఆర్టికల్ 31(సి)లోని మొదటి అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విస్తృత పరిచారు?
ఎ) 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
బి) 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
సి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
డి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
179. చట్టబద్ధమైన హక్కుగా మారిన తర్వాత ఆస్తిహక్కును ఏ విధంగా పరిగణించవచ్చును?
1) పార్లమెంటు సాధారణ శాసనం ద్వారా మార్పులు చేర్పులకు గురిచేయవచ్చు
2) కార్యనిర్వాహక చర్యల నుంచి ప్రయివేట్ ఆస్తిని కాపాడవచ్చు
3) శాసనపరమైన చర్యల నుంచి ప్రయివేట్ ఆస్తిని కాపాడవచ్చు
4) ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలులేదు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
180. రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే హక్కుగా పేరొందింది
2) భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని డా.బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు
3) ఆర్టికల్ 32లో వివరణ గలదు
4) రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని పార్లమెంటు పూర్తిగా తొలగించదు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 3
181. రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 32(1) – హక్కులను కోల్పోయిన పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు
2) ఆర్టికల్ 32(2) – ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ను జారీ చేస్తుంది
3) ఆర్టికల్ 32(3) – సుప్రీంకోర్టుకు సంక్ర మించిన అధికారాలకు భంగం కలుగకుండా రిట్స్ జారీచేసే అధికారాన్ని ఇతర న్యాయస్థానాలకు కల్పిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది
4) ఆర్టికల్ 32(4) – రాజ్యాంగం సూచించిన పద్ధతిలో తప్ప మరే విధంగాను రాజ్యాంగ పరిహారపు హక్కును సస్పెండ్ చేయరాదు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 2, 3, 4
182. జాతీయ అత్యవసర పరిస్థితి(National Emergency) కాలంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆర్టికల్ 32ను సస్పెండ్ చేయగలడు?
ఎ) ఆర్టికల్ 353 బి) ఆర్టికల్ 355
సి) ఆర్టికల్ 357 డి) ఆర్టికల్ 359
183. రిట్స్(writs)కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) న్యాయస్థానం జారీచేసే తప్పనిసరిగా పాటించాల్సిన అత్యున్నత ఆదేశం
2) ఇంగ్లండ్‌లో రిట్స్‌ను ‘Preorogative’ అభివర్ణిస్తారు.
3) Preorogative అంటే అసాధారణ ప్రత్యామ్నాయాలు
4) ప్రస్తుతం ఇంగ్లండ్ రాజు/ రాణి హక్కుల రక్షణకు రిట్స్ జారీచేస్తున్నారు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 3, 4
184. మనదేశంలో రాజ్యాంగం అమల్లోకి రాకముందు రిట్స్‌ను ఏ హైకోర్టులు జారీ చేసేవి?
ఎ) కలకత్తా, మద్రాస్, అలహాబాద్ హైకోర్టులు
బి) కలకత్తా, మద్రాస్, బాంబే హైకోర్టులు
సి) ఢిల్లీ, బాంబే, కలకత్తా హైకోర్టులు
డి) బాంబే, అలహాబాద్, కలకత్తా హైకోర్టులు
185. హెబియస్ కార్పస్ (Habeas Corpus) రిట్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఉదారమైన రిట్‌గా పేరొందింది
2) అతిపురాతన రిట్‌గా పేరొందింది
3) వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనంగా పేరొందింది.
4) హెబియస్ కార్పస్ అనేది గ్రీకుభాష నుంచి ఆవిర్భవించింది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
186. ‘‘నీవు నిర్బంధించిన వ్యక్తిని మొత్తం శరీరంతోసహా నాముందు హాజరుపరచు’’ అని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్ ఏది?
ఎ) మాండమస్ (Mandamus)
బి) ప్రొహిబిషన్ (Prohibition)
సి) సెర్షియోరరి (Certiorari))
డి) హెబియస్ కార్పస్ (Habeas Corpus)
187. హెబియస్ కార్పస్(Habeas Corpus)కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా? కాదా? అని న్యాయస్థానాలు నిర్థారిస్తాయి
2) హెబియస్ కార్పస్ అనే పదం ‘లాటిన్భాష’ నుంచి ఆవిర్భవించింది
3) ఈ రిట్‌ను గవర్నర్స్‌కు వ్యతిరేకంగా జారీచేయవచ్చు
4) ఈ రిట్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులపై కూడా జారీ చేయవచ్చు
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
188. హెబియస్ కార్పస్ రిట్‌ను కింద పేర్కొన్న ఏ సందర్భంలో జారీ చేయడానికి అవకాశం లేదు?
1) చట్టబద్ధత గల నిర్బంధం విషయంలో
2) శాసన లేదా కోర్టు ధిక్కరణ విషయంలో
3) న్యాయస్థానం ఆజ ్ఞ మేరకు నిర్బంధించిన వ్యక్తి విషయంలో
4) న్యాయస్థానం అధికార పరిధిలో లేని నిర్బంధం విషయంలో
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి ) 1, 2, 3, 4
189. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ ఏది?
ఎ) హెబియస్ కార్పస్ (Habeas Corpus)
బి) మాండమస్ (Mandamus)
సి) కో వారెంటో (Quo warranto)
డి) సెర్షియోరారి (Certiorari))
190. మాండమస్ (Mandamus) రిట్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఈ రిట్‌ను అంతిమ ప్రత్నాయంగా మాత్రమే జారీ చేస్తారు
బి) ఈ రిట్‌ను జారీ చేయడం అనేది న్యాయస్థానాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది
సి) ఈ రిట్‌ను కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా జారీ చేయరాదు
డి) అధికారి విచక్షణాపూర్వకమైన విధులకు ఈ రిట్ వర్తించదు
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
191. మాండమస్ రిట్ (Mandamus)ను కింద పేర్కొన్న ఎవరిపై జారీచేసే అవకాశం ఉంది?
ఎ) ప్రైవేట్ వ్యక్తులు
బి) రాష్ట్రపతి, గవర్నర్లు
సి) డిపార్ట్మెంట్ సూచనలు
డి) ట్రిబ్యునల్స్
192. దిగువ స్థాయి న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపి వేయమని ఉన్నతస్థాయి న్యాయస్థానం జారీచేసే రిట్‌ను ఏమంటారు?
ఎ) ప్రొహిబిషన్ (Prohibition)
బి) సెర్షియోరరి (Certiorari)
సి) కో వారెంటో (Quo warranto)
డి) మాండమస్ (Mandamus)
193. న్యాయస్థానాలు న్యాయస్థానాలపైనే జారీచేసే రిట్స్‌ను గుర్తించండి?
ఎ) మాండమస్ (Mandamus),
సెర్షియోరరి (Certiorari)
బి) కోవారెంటో (Quo warranto), ప్రొహిబిషన్ (Prohibition)
సి) సెర్షియోరరి (Certiorari), హెబియస్ కార్పస్ (Habeas Corpus)
డి) ప్రొహిబిషన్ (Prohibition), సెర్షియోరరి (Certiorari)
194. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైన వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తుంటే ‘‘నీవు ఏ అధికారంతో ఆ పనిచేస్తున్నావు?’’ అంటూ ఉన్నత న్యాయస్థానం సంబంధిత వ్యక్తికి వ్యతిరేకంగా జారీ చేసే రిట్‌ను ఏమంటారు?
ఎ) సెర్షియోరరి (Certiorari)
బి) కో వారెంటో (Quo warranto)
సి) ప్రొహిబిషన్ (Prohibition)
డి) మాండమస్ (Mandamus)
195. కింది పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) సుప్రీంకోర్టు రిట్స్ అధికార పరిధి హైకోర్టు రిట్స్ అధికార పరిధి కంటే తక్కువ
2) మూడో వ్యక్తికి కూడా హెబియస్ కార్పస్ (Habeas Corpus), కోవారెంటో (Quo warranto) రిట్స్‌ను కోరవచ్చు
3) దిగువస్థాయి న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత/ పక్క న్యాయస్థానానికి బదిలి చేయాలని ఉన్నత న్యాయస్థానం సెర్షియోరరి రిట్‌ను జారీ చేస్తుంది
4) రిట్లకు సంబంధించిన పదాలన్నీ లాటిన్ భాషకు సంబంధించినవే
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
196. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్స్ 33(ఎ) కేంద్రబలగాల్లో పనిచేసేవారికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు
2) ఆర్టికల్ 33(సి) రహస్య గూఢచార సంస్థల్లో పనిచేసేవారికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు
3) ఆర్టికల్ 33(డి) – రక్షణకు సంబంధించిన కమ్యూనికేషన్ రంగంలో పనిచేసే వారికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3 డి) 2, 3
197. సైనిక శాసనం/ మార్షల్‌లా(Marshal Law) అమల్లో ఉన్న ప్రాంతంలో గల ప్రజలు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చునని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
ఎ) ఆర్టికల్ 352 బి) ఆర్టికల్ 353
సి) ఆర్టికల్ 33 డి) ఆర్టికల్ 34
198. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో హెబియస్ కార్పస్ రిట్‌ను రద్దు చేయవచ్చునని, సైనిక శాసనం అమల్లో ఉన్న కాలంలో హెబియస్ కార్పస్ రిట్‌ను చేసే వీలులేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) పీఏ ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
బి) ఏడీఎం జబల్పూర్ Vs శుక్లా కేసు
సి) మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్
199. సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా టెలిగ్రామ్‌ను రిట్ పిటిషన్‌గా స్వీకరించింది?
ఎ) అర్విందర్బగ్గా Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు
బి) లూయిస్-డి-రిటిట్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) డి.ఎస్. నకారా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) మోహన్‌లాల్ శర్మ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు
200. కింది పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఒక పనిని చేయాలని లేదా చేయవద్దని న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వుని ఇంజంక్షన్ అంటారు
బి) సరిచేయడానికి వీలుపడని నష్టాన్ని నిలిపివేయడమే ‘ఇంజంక్షన్’ ఉత్తర్వు ప్రధాన ఉద్దేశం
సి) ఆస్థికి సంబంధించిన సివిల్ వివాదాల్లో యధాతథస్థితిని కాపాడటం కోసం ‘ఇంజంక్షన్’ ఉత్తర్వుని జారీ చేస్తారు
డి) ‘ఇంజంక్షన్’ ఉత్తర్వును ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలపై కూడా జారీ చేస్తారు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
201. కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దానిని గుర్తించండి?
ఎ) 1950లో ‘The Airforce Act’, ‘The arned Force Acr’ రూపొందినవి
బి) 1958లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల చట్టం రూపొందింది
సి) 1961లో The Navy Force Act’ రూపొందింది
డి) 2008లో ‘National Investigation Act’ రూపొందింది
జవాబులు
173-బి 174-ఎ 175-డి 176-బి 177-ఎ 178-సి 179-బి 180-డి 181-బి 182-డి 183-ఎ 184-బి
185-డి 186-డి 187-ఎ 188-డి 189-బి 190-ఎ 191-డి 192-ఎ 193-డి 194-బి 195-డి 196-ఎ
197-డి 198-బి 199-డి 200-డి 201-సి
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






