జీవితకాలమంతా నీరు తాగకుండా నివసించే ఏడారి జీవి ఏది? (TET EVS Grand test))
ఈవీఎస్ గ్రాండ్ టెస్ట్
1. ఏ గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాస్ దారాలను తయారు చేస్తారు?
1) జనుము గుజ్జు 2) కర్ర గుజ్జు
3) కొబ్బరి గుజ్జు 4) పత్తి గుజ్జు
2. B.T అంటే
1) బ్యాక్టీరియం థురంజియెన్సిస్
2) బాసిల్లస్ థురంజియెన్సిస్
3) బాసిల్లస్ ట్యూబర్క్యులోసిస్
4) బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్
3. మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల అతి తక్కువ, ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా నివసించ గలిగేవి?
1) శిలీంధ్రాలు 2) వైరస్లు
3) బ్యాక్టీరియాలు 4) ప్రొటోజోన్లు
4. నీటిలో పోషకాలు పెరిగి, మెక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గటాన్ని ఏమంటారు?
1) నైట్రిఫికేషన్
2) నైట్రోజన్ ఫిక్సేషన్
3) యూట్రోఫికేషన్
4) కార్బోనిఫికేషన్
5. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరైనది?
ఎ. 2 డిసెంబర్ 1984న సంభవించింది
బి. 3000 మంది మరణించారు
సి. మిథైల్ ఐసో సయనైడ్ వాయువు దీనికి కారణం
డి. ఈ ఫ్యాక్టరీకి యాజమాన్యం యూనియన్ కార్బడ్, జర్మనీ
1) ఎ 2) బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
6. మూలకేశాలు నేల నుంచి నీటిని గ్రహించే విధానంలో ఇమిడి ఉన్న ప్రక్రియ?
1) ద్రవాభిసరణం
2) ప్రతిలోమ ద్రవాభిసరణం
3) నిర్జలీకరణం
4) వ్యాపనం
7. రెయిన్ గేజ్‌కు మరో పేరు?
1) యూడో మీటరు 2) పల్వనో మీటరు
3) ఆంత్రో మీటరు 4) పైవన్నీ
8. ప్రపంచ జల దినోత్సవం
1) మార్చి 11 2) మార్చి 22
3) ఏప్రిల్ 24 4) ఏప్రిల్ 11
9. కండరాలకు గుండ్రంగా, తెల్లగా ఉండే దారాల్లాంటి నిర్మాణాలను ఏమంటారు?
1) టెట్ జంక్షన్ 2) టెండాన్
3) ఫిలమెంట్ 4) లిగమెంట్
10. జత్రుక + రెక్క ఎముక =?
1) అంగుళ్యాస్థులు 2) పాదాస్థులు
3) భుజాస్థులు 4) తాలవాస్థులు
11. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేసిన ఏ సూక్ష్మజీవి పంటలపై వాలిన శత్రుపురుగుల గుడ్లను నాశనం చేస్తుంది?
1) టైకో గ్రామా
2) బబేసియా
3) బాసిల్లస్ ధురంజిమెన్సిస్
4) వానపాము
12. ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం?
1) కోలోస్ట్రం 2) థయమిన్
3) రిబోప్లావిన్ 4) కేసిన్
13. శరీర కదలిక కోసం, చలనం కోసం జల విసర్జన వ్యవస్థను కలిగి ఉండే జీవులు
1) అనెలిడ్‌లు 2) ఫొరిఫెరన్లు
3) ఇఖైనోడెర్మ్లు 4) సిలెంటిరేట్లు
14. ‘సంకరపు క్లోనింగ్ వాహకం’ అని దేన్ని అంటారు?
1) ప్లాస్మిడ్ 2) కాస్మిడ్
3) బ్యాక్టీరియా ఫాజ్ 4) BCA, YAC
15. చీజ్ పరిశ్రమలలో ‘రెనిన్’ను ఏ విధంగా వాడతారు?
1) జీవ ఉత్ప్రేరకంగా
2) ద్వితీయ జీవ ఉత్ప్రేరకంగా
3) రిస్ట్రిక్షన్ ఎంజైమ్‌గా
4) జీవనాశనం యాంటీబయాటిక్‌గా
16. గరుకు అంతర్జీవ ద్రవ్య జాలం విధి?
1) ప్రొటీన్ల సంశ్లేషణ
2) కొవ్వుల సంశ్లేషణ
3) పై రెండూ 4) ఏదీ కాదు
17. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యం?
1) ఆక్సీకరణ చర్య 2) విచ్ఛిన్న క్రియ
3) నియంత్రిక చర్య 4) శక్తి యోచిక చర్య
18. జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టకపోవడం ఏ వ్యాధి లక్షణం?
1) థలసేమియా 2) అల్బునిజం
3) వర్ణాంధత్వం 4) హీమోఫీలియా
19. కాలిలోని సిరలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త?
1) విలియం హార్వే
2) గైరోలామా ఫాబ్రిసి
3) మార్సెల్లో మాల్ఫీజీ
4) లూయీ పాశ్చర్
20. ఆస్యకుహరంలో జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు?
1) ఖైమ్ 2) విల్లే
3) ఖైల్ 4) బోలస్
21. ఎ. క్లోమము ట్రిప్పిన్ ఎంజైమ్‌ను స్రవిస్తుంది
బి. ట్రిప్సిన్ పిండి పదార్థాలపై చర్య జరుపుతుంది
1) ఎ నిజం, బి కాదు
2) ఎ నిజం కాదు, బి నిజం
3) ఎ నిజం, బి నిజం
4) ఎ, బి నిజం కాదు
22. మూత్రం ఏర్పడే భాగం?
1) భౌమన్ గుళిక
2) హెన్లీశిక్యం
3) సమీపస్త సంవళిత నాళం
4) దూరస్థ సంవళిత నాళం
23. ఆలోచనలు, తెలివితేటలకు కేంద్రం?
1) ద్వారగోర్థం 2) మజ్జాముఖం
3) మస్తిష్కం 4) అనుమస్తిష్కం
24. పిండానికి పోషక పదార్ధాలను, ఆక్సిజన్‌ను అందించేవి?
1) పరాయువు 2) జరాయువు
3) ఉల్బం 4) అలిందం
25. తారక (pupil) పరిమాణాన్ని సరిచేసే కండర నిర్మాణం?
1) కంటిలోని అన్ని కండరాలు
2) కంటిపాప
3) కంటిరెప్పలు
4) ఏదీకాదు
26. కుళ్లిన పదార్థాలపై పెరిగే మొక్కలు?
1) సహజీవులు
2) పరాన్న జీవులు
3) పూతికాహారులు
4) స్వయం పోషకాలు
27. పక్షుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాల లక్షణం?
1) విత్తనాలు జిగురుగా ఉండటం
2) లక్ష్యానికి చేరక ముందే మధ్య దారిలో పడటం
3) విత్తన కవచాలు మెత్తగా మారటం
4) పైవన్నీ
28. చికోరి ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది?
1) జీర్ణవ్యవస్థ 2) రక్త ప్రసరణ వ్యవస్థ
3) 1, 2 4) విసర్జక వ్యవస్థ
29. జీవిత కాలమంతా నీరు తాగకుండా నివసించే ఎడారి జీవి?
1) శాండ్ గ్రౌజ్ 2) క్యాంగ్రూ ఎలుక
3) గోల్డెన్ మోల్ 4) యాడర్ స్నేక్
30. ఆహారపు గొలుసులో స్థాయిల వరుస క్రమం?
1) వినియోగదారులు-ఉత్పత్తిదారులు-విచ్ఛిన్నకారులు
2) విచ్ఛిన్నకారులు-ఉత్పత్తిదారులు-వినియోగదారులు
3) ఉత్పత్తిదారులు-వినియోగదారులు-విచ్ఛిన్నకారులు
4) ఉత్పత్తిదారులు-వినయోగదారులు-విచ్ఛిన్నకారులు
31. రైల్వేస్టేషన్లలో ఉపయోగించే గడియారం?
1) పరమాణు గడియారం
2) అనలాగ్ గడియారం
3) ఎలక్ట్రానిక్ గడియారం
4) సన్ డయల్
32. అధునాత ఫ్యూజ్‌లు
1) రాగితీగ 2) జింక్ ముక్క
3) M.C.B 4) లోహపు రేక
33. తిన్నగా ప్రయాణిస్తున్న కారు చలనం
ఎ. వక్రకేఖీయ చలనం
బి. సరళరేఖీయ చలనం
సి. డోలన చలనం
డి. స్థానాంతర చలనం
1) సి, డి 2) బి, సి
3) బి, డి 4) బి
34. ఒక కుంభాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం దర్పణానికి వెనుకవైపు గల నాభివద్ద ఏర్పడిన, వస్తువు స్థానం?
1) దర్పణ కేంద్రం వద్ద
2) నాభి వద్ద
3) వక్రత కేంద్రం వద్ద
4) అనంతం
35. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేపుపైన పూసే పూత?
1) ఫెర్రస్ ఆక్సైడ్ 2) ఫెర్రిక్ ఆక్సైడ్
3) మెర్క్యూరిక్ ఆక్సైడ్
4) కాపర్ ఆక్సైడ్
36. కింది వాటిలో సరైనది ఏది?
1) చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది
2) స్థిరవేగంతో కదులుతున్న కారు క్రమచలనంలో ఉంటుంది
3) ఓడో మీటరు రీడింగ్ తిరోగమనం కాదు
4) పైవన్నీ
37. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం
1) కిలోగ్రామ్ 2) గ్రామ్
3) టన్ను 4) క్వింటాల్
38. అయస్కాంత భ్రామకం ప్రమాణం?
1) ఆంపియర్ – మీటరు
2) న్యూటన్-మీటరు/టెస్లా
3) వెబర్
4) ఆంపియర్-మీటరు^2
39. వక్ర ఉపరితలాలు కలిగిన దర్పణాలు?
1) గోళాకార దర్పణాలు
2) సమతల దర్పణాలు
3) సమతల-కుంభాకార దర్పణాలు
4) సమతల-పుటాకార దర్పణాలు
40. వాహన వేగాన్ని లెక్కించే పరికరం?
1) స్పీడోమీటరు 2) అల్ట్ మీటరు
3) ఓడో మీటరు 4) ఏదీకాదు
41. కింది వాటిలో అధృవ ద్రావణి?
ఎ. నీరు బి. కిరోసిన్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
42. సున్నపురాయిపైన క్లోరిన్ వాయువు పంపినప్పుడు ఏర్పడేది?
1) బేకింగ్ పౌడర్ 2) బ్లీచింగ్ పౌడర్
3) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 4) వాషింగ్ సోడా
43. మాధ్యమంలో గులాబి రంగునిచ్చే సూచిక?
1) మిథైల్ ఆరెంజ్ సూచిక
2) ఫినాప్తలీన్ సూచిక
3) లిట్మస్
4) బ్రోయోథైయోల్ నీలి సూచిక
44. కాంతి కిరణం ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం (లేక) కాంతి సంవత్సరం విలువ?
1) 1.5×1011 2) 1.9×1015
3) 9.3×1015 4) 8.1×1011
45. ఓజోన్ పొరను దెబ్బతీసేవి?
1) ఏరోసాల్స్
2) క్లోరో ఫ్లోరో కార్బన్లు
3) రిఫ్రిజిరేటర్ నుంచి వెలువడే వాయువులు
4) పైవన్నీ
46. కింది వాటిలో అజీర్తికి మందుగా వాడే పదార్థం
1) యాంటి బయాటిక్ 2) అనాల్జేసిక్
3) యాంటాసిడ్ 4) యాంటీసెప్టిక్
47. జిప్సం రసాయనిక ఫార్ములా
1) CaSO4
2) CaSO41/2H2O
3) CaSO4H2O
4) CaSO42H2O
48. కింది వాటిలో అత్యల్ప ph విలువ గల పదార్ధం
1) చక్కెర 2) టమాటా రసం
3) వెనిగర్ 4) వాషింగ్ సోడా
49. హైడ్రోజన్ రంగులేని వాయువు గాలి కన్నా
1) బరువైనది 2) తేలికైనది
3) సమానం 4) ఏదీకాదు
50. కింది వాటిలో సరైనది
ఎ. H2SO4 జలరహిత రూపం SO2
బి. H3PO4 జలరహిత రూపం P2O3
1) ఎ 2) బి 3) ఎ, బి ఏదీకాదు
51. కింది వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది?
1) వంకర టింకరగా ఉండవచ్చు
2) దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు
3) రెండు రేఖలు ఖండించుకొంటాయి
4) భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది
52. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రాంతంలోని పీఠభూమి ప్రాంతం ఎటువంటి లక్షణం కలిగి ఉంది?
1) వరదలకు గురయ్యే ప్రాంతం
2) కరువుకు గురయ్యే ప్రాంతం
3) తుఫాన్లకు గురయ్యే ప్రాంతం
4) భూకంపాలకు గురయ్యే ప్రాంతం
53. కూనవరం గ్రామం ఈ రెండు నదుల సంగమ ప్రదేశంలో ఉన్నాయి?
1) శబరి, గోదావరి
2) సీలేరు, గోదావరి
3) మంజీర, గోదావరి
4) ఇంద్రావతి, గోదావరి
54. కింది వాటిలో గరిష్టస్థాయిలో బాష్పీభవనం ఎక్కడ జరుగుతుంది?
1) మొక్కల ద్వారా
2) నదులు
3) మహాసముద్రాలు
4) మానవశరీరాలు
55. గోదావరి నదిపై నిర్మించిన ఏ ఆనకట్ట నాసిక్, త్రయంబక్ పట్టణాలకు నీటిని సరఫరా చేస్తుంది?
1) గంగాపూర్ డ్యాం
2) జయక్వాడీ ప్రాజెక్ట్
3) శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్
4) బాబ్లీ ప్రాజెక్ట్
56. భూమిలో రెండు రాతిపొరల మధ్యనున్న నీటి పొరను ఏమని పిలుస్తారు?
1) జలస్తరం 2) భూజలం
3) సహజ నీరు 4) వాటర్ లైన్
57. ఇటీవల కాలంలో మత్స్యకారులు అధికంగా ఏ వలను ఉపయోగించటం వల్ల వారిలో వలసలు తగ్గాయి?
1) పెద్ద పరీషా 2) రింగువల
3) విసిరే వల 4) విలావల
58. యూరప్‌లోని పశ్చిమతీర జలాలను చలికాలంలో గడ్డకట్టనీయకుండా చేసేవి?
1) ఈక్వేటర్ స్ట్రీం
2) ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్
3) బెంగ్యులా ప్రవాహం
4) లారెన్షియా డ్రిఫ్ట్
59. నైలు నది జన్మస్థలం?
1) అట్లాస్ పర్వతాలు
2) డ్రాకెన్బర్గ్ పర్వతాలు
3) కిలిమంజారో శిఖరం
4) విక్టోరియా సరస్సు
60. ఆఫ్రికాలో కర్కటరేఖకు ఉత్తరాన, మకరరేఖకు దక్షిణాన ఉన్న శీతోష్ణస్థితి?
1) శీతల 2) ఉష్ణ
3) సమశీతోష్ణ స్థితి 4) మధ్యధరా
సమాధానాలు
1.2 2.2 3.3 4.3 5.3 6.1 7.4 8.2 9.2 10.3 11.1 12.3 13.3 14.2 15.1 16.1 17.3 18.4 19.2 20.4 21.1 22.1 23.3 24.2
25.2 26.3 27.4 28.3 29.2 30.3 31.3 32.3 33.3 34.4 35.2 36.4 37.2 38.4 39.1 40.1 41.2 42.2 43.1 44.3 45.3 46.3 47.4 48.3 49.2 50.3 51.3 52.2 53.1 54.3 55.1 56.1 57.2 58.2 59.4 60.3
శ్రీకాంత్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






