‘ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు’ ఎవరి ఆత్మకథ? (TET Special)
శేషం లక్ష్మీనారాయణాచార్య
జననం: 15/04/1947
మరణం: 17/05/1998
శేషం లక్ష్మీనారాయణాచార్య తల్లిపేరు కనకమ్మ, తండ్రి పేరు నరహరిస్వామి. వీరి సొంతూరు కరీంనగర్ జిల్లా నగునూర్.
ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి.
లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి.
డాక్టర్ పల్లా దుర్గయ్య
జననం: 25/05/1914
మరణం: 19/12/1983
ఈయన జన్మస్థలం హనుమకొండ జిల్లా మడికొండ.
తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి.
ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు.
ఈయన రచనలు పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి.
16వ శతాబ్దిలో ప్రబంధవాఙ్మయం – తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు.
ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది.
డాక్టర్ వానమామలై వరదాచార్యులు
జననం: 16/08/1912
మరణం: 30/10/1984
20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు.
ఈయన హనుమకొండ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పర్చుకున్నాడు.
బిరుదులు: అభినవపోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైనవి.
ఈయనకు సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం ఉంది.
గ్రంథాలు: పోతన చరిత్రము, మణిమాల, జయధ్వజం, సూక్తి వైజయంతి, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ (బుర్ర కథల సంపుటి) మొదలైనవి రచించాడు.
పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైనవి అందుకున్నాడు.
గోన బుద్ధారెడ్డి
13వ శతాబ్దానికి చెందిన కవి.
ఈయన కాకతీయులకు సామంతరాజు. వర్ధమానపురం (ప్రస్తుతం నందివడ్డెమాన్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉంది) రాజధానిగా పాలించాడు.
తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు రాయగా.. మిగిలిన భాగాన్ని ఆయన కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తిచేశారు.
ఇది తెలుగులో తొలి రామాయణం. దీనిలోని శైలి సరళంగా, మధురంగా ఉంటుంది.
పొట్లపల్లి రామారావు
జననం: 1917
మరణం: 2001
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు.
ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం (ఖండికలు), పగ మొదలైన రచనలు చేశాడు.
ఈయన రాసిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది.
ఈయన రచన వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది.
సుద్దాల హనుమంతు
జననం: 06/06/1910
మరణం: 10/10/1982
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించాడు.
రెండో ఫారం చదువుకున్నాడు.
తల్లి లక్ష్మీనరసమ్మ, తండ్రి బుచ్చిరాములు.
హనుమంతు హేతువాదిగా పేరుపొందాడు.
కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఈయన రచనలు ఉంటాయి.
దేవులపల్లి రామానుజరావు
జననం: 25/08/1917
మరణం: 08/06/1993
ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహోద్యమం కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత.
హనుమకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వేంకటచలపతిరావు, ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు.
ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూల్ విద్య హనుమకొండలో పూర్తిచేశాడు.
1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు.
రచనలు: పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితి, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి.
ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు ఆయన ఆత్మకథ.
ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు.
కొఱవి గోపరాజు
ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు.
తల్లిదండ్రులు-కామాంబిక, కసవరాజు.
గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతంవాడు.
నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు.
సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్ర్తాల్లో ప్రవీణుడు.
అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.
ఏపీజే అబ్దుల్ కలామ్
జననం: 15/10/1931
మరణం: 27/07/2015
పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్.
తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు.
సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజినీర్‌గా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించాడు.
ఒక విజేత ఆత్మకథ, ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్-యాన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు.
శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు పద్మభూషణ్, పద్మవిభూషణ్తోపాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో ప్రభుత్వం సత్కరించింది.
దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి.
రాయప్రోలు సుబ్బారావు
జననం: 13/03/1892
మరణం: 30/06/1984
ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం లో జన్మించాడు.
తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రాశాడు.
రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు.
అద్భుత వర్ణములు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి.
చెరబండ రాజు
జననం: 03/01/1944
మరణం: 02/07/1982
ఈయన అసలు పేరు బద్దం భాస్కర్‌రెడ్డి.
మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఈయన సొంతూరు.
ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
1965లో దిగంబర కవిగా మొదలై, 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు.
గమ్యం, ముట్టడి, పల్లవి ఈయన కవితా సంకలనాలు.
కత్తిపాట ఈయన పాటల సంకలనం.
తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు.
గుర్రం జాషువా
జననం: 28/09/1895
మరణం: 24/07/1971
మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భారతమాత గొప్పదనాన్ని చాటిన కవి.
ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామం లో జన్మించారు.
రచనల్లో అణువణువునా తెలుగుదనం ఉంటుంది.
గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్‌మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు.
ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్లకు కట్టినట్లుంటాయి.
కవికోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు.
సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు.
అచ్చి వేంకటాచార్యులు
జననం: 1914
మరణం: 1985
రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవిశిఖామణి.
నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం, ఆవునూరు గ్రామంలో జన్మించాడు.
ఆండాళ్ బుర్రకథ, రాగమాల, మా ఊరు (ఏకాశ్వాస ప్రబంధం) ఈయన రచనలు.
పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.
టీ కృష్ణమూర్తి యాదవ్
జననం: 1940
మరణం: 2004
ఈయన సామాన్యుని ఉచ్ఛాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి, సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన కవి. ఈయన హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు.
ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవుల్లో ఒకరు.
తొక్కుడు బండ అనే కవితా సంపుటితో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు.
శబ్నం వీరి రెండో కవితా సంపుటి.
గ్రామీణ జీవితానుభవాలు, మధ్య తరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు.
సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?