కొత్త జిల్లాలతో కొంగొత్తగా తెలంగాణ
అభివృద్ధిపథంలో శరవేగంగా ముందుకెళుతున్న తెలంగాణ రాష్ట్రం పరిపాలన వికేంద్రీకరణలో అత్యంత కీలక ముందగడుగు వేసింది. రాష్ట్రంలోని పది జిల్లాలను ప్రభుత్వం 31 జిల్లాలుగా విభజించింది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత చేరువయ్యేందుకు, తద్వారా పాలనలో మరింత పారదర్శకతకు ఈ పరిణామం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగ పడుతుంది. నిపుణ పాఠకుల కోసం 31 జిల్లాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం అందిస్తున్నాం..
ప్రజలకు చేరువగా పాలన, సమర్థంగా పథకాల అమలు, పేదరిక నిర్మూలన, పటిష్ఠ పర్యవేక్షణ లక్ష్యాలతో ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూనుకుంది. తెలంగాణలో చివరిసారిగా 38 ఏండ్ల క్రితం అంటే 1978 ఆగస్టు 15న రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. ఆ తర్వాత అనేక కొత్త జిల్లాల కోసం డిమాండ్లు వచ్చినా సాధ్యపడలేదు. ప్రస్తుతం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి. రాజ్యసభ సభ్యుడు కే కేశరావు నేతృత్వంలో ఏర్పాటైన హై పవర్ కమిటీ ముసాయిదా నోటిఫికేషన్లో ఇచ్చినవి కాకుండా అదనంగా సిరిసిల్ల, జనగామ, గద్వాల్, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఈ కమిటీలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, పోచారాం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉన్నారు.
జిల్లాల విశేషాలు
రాష్ట్రంలో సగటున జిల్లాల విస్తీర్ణం 3,704 చ.కి.మీ.
-జనాభాపరంగా దేశంలో తెలంగాణ రాష్ర్టానికి 12వ స్థానం, వైశాల్యంలో కూడా 12వ స్థానం. జిల్లాల సంఖ్యపరంగా 9వ స్థానంలో ఉంది.
-రాష్ట్రంలో 5 నుంచి 10 లక్షల జనాభాగల జిల్లాలు 19 ఉన్నాయి. పది నుంచి పదిహేను లక్షల జనాభాగల జిల్లాలు 6, పదిహేను నుంచి ఇరవై లక్షల జనాభాగల జిల్లాలు 3, ఇరవై లక్షల జనాభా పైబడిన జిల్లాలు 3 ఉన్నాయి.
-రాష్ట్రంలో 6 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. అవి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్.
-రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 20 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక సరిహద్దులతో ఉన్నాయి.
-కర్ణాటక సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి.
-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, కొత్తగూడెం.
-మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు 5. అవి.. భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి.
-ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దుగల జిల్లాలు 3. అవి.. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల.
-అత్యధిక జిల్లాలు వరంగల్ నుంచి ఏర్పడ్డాయి.
-విభజనకు గురికాని జిల్లా హైదరాబాద్.
కొత్తవి
-జిల్లాలు – 21
-రెవెన్యూ డివిజన్లు – 25
-మండలాలు – 125
-పోలీస్ కమిషనరేట్లు – 4
-పోలీస్ డివిజన్లు – 23
-పోలీస్ స్టేషన్లు – 91
-సర్కిళ్లు – 28
మొత్తం జిల్లాలు: 31
విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ.
జనాభా: 3,50,03,674
అక్షరాస్యత: 66.46
మండలాల సంఖ్య: 584
రెవెన్యూ డివిజన్లు: 68
రెవెన్యూ గ్రామాలు: 10,966
జిల్లాలు-ప్రాముఖ్యత
అతిపెద్ద జిల్లా: భద్రాద్రి-కొత్తగూడెం (8,062 చ.కి.మీ.)
అతిచిన్న జిల్లా: హైదరాబాద్ (217 చ.కి.మీ.)
ఎక్కువ మండలాలు ఉన్న జిల్లా: నల్లగొండ (31)
తక్కువ మండలాలున్న జిల్లా: వరంగల్ అర్బన్ (11)
రెవెన్యూ డివిజన్లు ఎక్కువ ఉన్న జిల్లా: రంగారెడ్డి (11)
తక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్
అత్యధిక గ్రామాలున్న జిల్లా: సంగారెడ్డి (600)
అతితక్కువ గ్రామాలున్న జిల్లా: హైదరాబాద్ (100)
అత్యధిక జనాభాగల జిల్లా: హైదరాబాద్ (39,43,323)
తక్కువ జనాభా ఉన్న జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా (5,43,694)
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పుర (4,68,158)
– హైదరాబాద్
అత్యధిక జనాభాగల రెండో మండలం: ఖమ్మం అర్బన్
తక్కువ జనాభా ఉన్న మండలం: గంగారం (10,780)
– మహబూబాబాద్ జిల్లా
ఎక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా: హైదరాబాద్ (83 శాతం)
తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లా: కామారెడ్డి (48.49 శాతం)
ఆదిలాబాదు
విస్తీర్ణం: 4,153 చ.కి.మీ.
జనాభా: 7,21,433
అక్షరాస్యత: 63.01 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: ఆదిలాబాదు అర్బన్ మండలం
అత్యల్ప జనాభాగల మండలం: గడిగూడ
రెవెన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు
రెవెన్యూ గ్రామాలు: 504
నల్లగొండ
విస్తీర్ణం: 6,863 చ.కి.మీ.
జనాభా: 16,31,399
అక్షరాస్యత: 65 శాతం
మండలాలు: 31
అత్యధిక జనాభాగల మండలం: నల్లగొండ
అత్యల్ప జనాభాగల మండలం: నేరేడుగొమ్ము
రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ
రెవెన్యూ గ్రామాలు: 565
నిర్మల్
విస్తీర్ణం: 3,845 చ.కి.మీ.
జనాభా: 7,30,286
అక్షరాస్యత: 57.73 శాతం
మండలాలు: 19
అత్యధిక జనాభాగల మండలం: భైంసా
అత్యల్ప జనాభాగల మండలం: నర్సాపురం జి
రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా
రెవెన్యూ గ్రామాలు: 428
సూర్యాపేట
విస్తీర్ణం: 3,374 చ.కి.మీ.
జనాభా: 10,99,560
అక్షరాస్యత: 63 శాతం
మండలాలు: 23
అత్యధిక జనాభాగల మండలం: సూర్యాపేట
అత్యల్ప జనాభాగల మండలం: నాగారం
రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ
రెవెన్యూ గ్రామాలు: 279
మంచిర్యాల
విస్తీర్ణం: 3,943 చ.కి.మీ.
జనాభా: 7,07,050
అక్షరాస్యత: 61.81 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: మందమర్రి
అత్యల్ప జనాభాగల మండలం: భీమారం
రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి
రెవెన్యూ గ్రామాలు: 389
యాదాద్రి
విస్తీర్ణం: 3,092 చ.కి.మీ.
జనాభా: 7,26,465
అక్షరాస్యత: 68 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: భువనగిరి
అత్యల్ప జనాభాగల మండలం: అడ్డగూడూరు
రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్
రెవెన్యూ గ్రామాలు: 296
కుమ్రంభీం ఆసిఫాబాదు
విస్తీర్ణం: 4,878 చ.కి.మీ.
జనాభా: 5,92,831
అక్షరాస్యత: 52.62 శాతం
మండలాలు: 15
అత్యధిక జనాభాగల మండలం: కాగజ్‌నగర్
అత్యల్ప జనాభాగల మండలం: లింగాపురం
రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్
రెవెన్యూ గ్రామాలు: 435
జయశంకర్ భూపాలపల్లి
విస్తీర్ణం: 6,175 చ.కి.మీ.
జనాభా: 7,05,054
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: భూపాలపల్లి
అత్యల్ప జనాభాగల మండలం: కన్నాయి గూడెం
రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు
రెవెన్యూ గ్రామాలు: 574
భద్రాద్రి కొత్తగూడెం
విస్తీర్ణం: 8,062 చ.కి.మీ.
జనాభా: 11,02,094
అక్షరాస్యత: 62.63 శాతం
మండలాలు: 23
అత్యధిక జనాభాగల మండలం: పాల్వంచ
అత్యల్ప జనాభాగల మండలం: ఆళపల్లి
రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం
రెవెన్యూ గ్రామాలు: 449
మహబూబాబాదు
విస్తీర్ణం: 2,877 చ.కి.మీ.
జనాభా: 7,70,170
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: మహబూబాబాదు
అత్యల్ప జనాభాగల మండలం: గంగారం
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు
రెవెన్యూ గ్రామాలు: 297
వరంగల్లు(రూరల్)
విస్తీర్ణం: 2,175 చ.కి.మీ.
జనాభా: 7,16,457
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 15
అత్యధిక జనాభాగల మండలం: పరకాల
అత్యల్ప జనాభాగల మండలం: ఖానాపూరు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట
రెవెన్యూ గ్రామాలు: 233
వరంగల్లు(అర్బన్)
విస్తీర్ణం: 1,305 చ.కి.మీ.
జనాభా: 11,35,707
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 11
అత్యధిక జనాభాగల మండలం: హన్మకొండ
అత్యల్ప జనాభాగల మండలం: ఐనవోలు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు
రెవెన్యూ గ్రామాలు: 133
సంగారెడ్డి
విస్తీర్ణం: 4,441 చ.కి.మీ.
జనాభా: 15,23,758
అక్షరాస్యత: 64.26 శాతం
మండలాలు: 26
అత్యధిక జనాభాగల మండలం: జహీరాబాద్
అత్యల్ప జనాభాగల మండలం: సిర్గాపూర్…..
రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్
రెవెన్యూ గ్రామాలు: 600
రంగారెడ్డి
విస్తీర్ణం: 5,006 చ.కి.మీ.
జనాభా: 25,51,731
అక్షరాస్యత: 75.87 శాతం
మండలాలు: 27
అత్యధిక జనాభాగల మండలం: సరూర్‌నగర్
అత్యల్ప జనాభాగల మండలం: చౌదరిగూడెం
రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్
రెవెన్యూ గ్రామాలు: 594
మేడ్చల్
విస్తీర్ణం: 1,039 చ.కి.మీ.
జనాభా: 25,42,203
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: కుత్బుల్లాపూర్
అత్యల్ప జనాభాగల మండలం: ఘట్కేసర్
రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్గిరి
రెవెన్యూ గ్రామాలు: 161
హైదరాబాద్
విస్తీర్ణం: 217 చ.కి.మీ.
జనాభా: 39,43,323
అక్షరాస్యత: 83.25 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పూర్
అత్యల్ప జనాభాగల మండలం: అమీర్‌పేట
రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ గ్రామాలు: 100
కరీంనగర్
విస్తీర్ణం: 2,379 చ.కి.మీ.
జనాభా: 10,18,119
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: కరీంనగర్
అత్యల్ప జనాభాగల మండలం: కొత్తపల్లి
రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్
రెవెన్యూ గ్రామాలు: 215
సిరిసిల్ల రాజన్న
విస్తీర్ణం: 2,019 చ.కి.మీ.
జనాభా: 5,43,694
అక్షరాస్యత: 66.1 శాతం
మండలాలు: 13
అత్యధిక జనాభాగల మండలం: సిరిసిల్ల
అత్యల్ప జనాభాగల మండలం: వీర్నపల్లి
రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల
రెవెన్యూ గ్రామాలు: 170
పెద్దపల్లి
విస్తీర్ణం: 2,236 చ.కి.మీ.
జనాభా: 7,95,332
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: రామగుండం
అత్యల్ప జనాభాగల మండలం: అంతర్గాం
రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని
రెవెన్యూ గ్రామాలు: 215
నిజామాబాదు
విస్తీర్ణం: 4,261 చ.కి.మీ.
జనాభా: 15,77,108
అక్షరాస్యత: 54.42 శాతం
మండలాలు: 27
అత్యధిక జనాభాగల మండలం: నిజామాబాదు (ఉత్తరం)
అత్యల్ప జనాభాగల మండలం: నిజామాబాదు (దక్షిణం)
రెవెన్యూ డివిజన్లు: నిజామాబాదు, ఆర్మూరు, బోధన్
రెవెన్యూ గ్రామాలు: 438
సిద్దిపేట
విస్తీర్ణం: 3,432 చ.కి.మీ.
జనాభా: 10,02,671
అక్షరాస్యత: 61.45 శాతం, మండలాలు: 22
అత్యధిక జనాభాగల మండలం: సిద్దిపేట అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: కొమురవెల్లి
రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు
రెవెన్యూ గ్రామాలు: 376
వికారాబాదు
విస్తీర్ణం: 3,386 చ.కి.మీ.
జనాభా: 8,81,250
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: తాండూరు
అత్యల్ప జనాభాగల మండలం: బంట్వారం
రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు
రెవెన్యూ గ్రామాలు: 476
కామారెడ్డి
విస్తీర్ణం: 3,667 చ.కి.మీ.
జనాభా: 9,74,227
అక్షరాస్యత: 48.49 శాతం
మండలాలు: 22
అత్యధిక జనాభాగల మండలం: కామారెడ్డి
అత్యల్ప జనాభాగల మండలం: బీబీపేట
రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి రెవెన్యూ గ్రామాలు: 474
నాగర్‌కర్నూలు
విస్తీర్ణం: 2,966 చ.కి.మీ.
జనాభా: 8,60,613
అక్షరాస్యత: 54.04 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: నాగర్‌కర్నూలు
అత్యల్ప జనాభాగల మండలం: పదర
రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి రెవెన్యూ గ్రామాలు: 362
మహబూబ్‌నగరు
విస్తీర్ణం: 4,037 చ.కి.మీ.
జనాభా: 12,90,467
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 26
అత్యధిక జనాభాగల మండలం: మహబూబ్‌నగరు అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: రాజాపూరు
రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట రెవెన్యూ గ్రామాలు: 454
జోగులాంబ గద్వాల
విస్తీర్ణం: 2,928 చ.కి.మీ.
జనాభా: 6,64,971
అక్షరాస్యత: 51 శాతం
మండలాలు: 12
అత్యధిక జనాభాగల మండలం: గద్వాల
అత్యల్ప జనాభాగల మండలం: కృష్ణా
రెవెన్యూ డివిజన్లు: గద్వాల
రెవెన్యూ గ్రామాలు: 226
జనగాం
విస్తీర్ణం: 2,187 చ.కి.మీ.
జనాభా: 5,82,457
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 13
అత్యధిక జనాభాగల మండలం: జనగాం
అత్యల్ప జనాభాగల మండలం: నర్మెట
రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం
రెవెన్యూ గ్రామాలు: 200
మెదక్
విస్తీర్ణం: 2,723 చ.కి.మీ.
జనాభా: 7,67,428
అక్షరాస్యత: 55.52 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: మెదక్
అత్యల్ప జనాభాగల మండలం: రేగోడ్
రెవెన్యూ డివిజన్లు: మెదక్, తూప్రాన్, నర్సాపూరు
రెవెన్యూ గ్రామాలు: 381
ఖమ్మం
విస్తీర్ణం: 4,360 చ.కి.మీ.
జనాభా: 13,89,566
అక్షరాస్యత: 62.26 శాతం, మండలాలు: 21
అత్యధిక జనాభాగల మండలం: ఖమ్మం అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: ఏన్కూరు
రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు
రెవెన్యూ గ్రామాలు: 380
జగిత్యాల
విస్తీర్ణం: 3,043 చ.కి.మీ.
జనాభా: 9,83,414
అక్షరాస్యత: 54.53 శాతం, మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: జగిత్యాల
అత్యల్ప జనాభాగల మండలం: బుగ్గారం
రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్పల్లి
రెవెన్యూ గ్రామాలు: 284
వనపర్తి
విస్తీర్ణం: 3,055 చ.కి.మీ.
జనాభా: 7,70,334
అక్షరాస్యత: 54 శాతం, మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: వనపర్తి
అత్యల్ప జనాభాగల మండలం: ఏదుల
రెవెన్యూ డివిజన్లు: వనపర్తి
రెవెన్యూ గ్రామాలు: 279
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






