భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రధాన ఉద్దేశం?
1. పార్లమెంట్ సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా సవరించే అంశాలు ఏవి?
1. కొత్త రాష్ర్టాల ఏర్పాటు
2. పౌరసత్వంలో మార్పులు
3. పార్లమెంట్లో కోరం డి. రాష్ట్రపతి ఎన్నిక విధానం 4. ప్రాథమిక విధులు
5. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు
1. 1, 2, 3, 5 2) 2, 3, 4, 5
3) 1, 2, 3, 4 4) 1, 3, 4
2. ప్రతిపాదన (A) : సమన్యాయ పాలన చట్టం ఔన్నత్యాన్ని సూచిస్తుంది
కారణం (R) : విచక్షణాధికారాలు నిరంకుశత్వానికి దారితీస్తాయి
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం. కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం R తప్పు 4) A తప్పు R నిజం
3. లోక్‌సభ స్పీకర్‌కు సంబంధించి కిందివాటిని పరిశీలించి సరైన జవాబులను గుర్తించండి.
1. లోక్‌సభ రద్దయినా స్పీకర్ పదవి రద్దు కాదు
2. ప్రకరణ-92 స్పీకర్ ఎన్నిక గురించి తెలుపుతుంది
3. భారత అధికారిక హోదాలో 7వ స్థానం కలిగి ఉంటారు
4. స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి లోక్‌సభ సభ్యుడై ఉంటారు
5. భారత అధికారిక హోదాలో 6వ స్థానం కలిగి ఉంటారు
6. ప్రకరణ-93 స్పీకర్ ఎన్నిక గురించి తెలుపుతుంది
1) 1, 2, 3, 6 2) 1, 3, 4, 6
3) 1, 2, 3, 4 4) 1, 3, 4
4. లోక్‌సభ రద్దయినప్పుడు బిల్లుల విషయంలో కిందివాటిని పరిశీలించి సరైన జవాబులను గుర్తించండి.
1. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చిస్తున్నప్పుడు లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు రద్దుకాదు
2. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చిస్తున్నప్పుడు లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు కూడా రద్దవుతుంది
3. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయినప్పుడు ఆ బిల్లు రద్దవుతుంది
4. బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయినప్పటికీ బిల్లు రద్దుకాదు
5. బిల్లును ఉభయసభలు ఆమోదించి, రాష్ట్రపతి పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయితే బిల్లు రద్దుకాదు
1) 1, 2, 3 2) 1, 3
3) 2, 4, 5 4) 1, 3, 4
5. కిందివారిలో ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని?
1) చరణ్‌సింగ్ 2) చంద్రశేఖర్
3) మొరార్జీదేశాయ్ 4) లాల్‌బహదూర్ శాస్త్రి
6. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో చేర్చిన అంశాలు ఏవి?
1. ప్రజలకు ఉచితన్యాయసేవా సహాయాన్ని అందించాలి (ప్రకరణ 39 ఏ)
2. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, అంగవైకల్యంగలవారు ఎలాంటి పీడనకు గురికాకుండా వారికి తగిన సంరక్షణ చర్యల్ని చేపట్టాలి (ప్రకరణ 39ఎఫ్)
3. పరిశ్రమల నిర్వహణ, యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యాన్ని కల్పించాలి (ప్రకరణ 43ఏ)
4. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి (ప్రకరణ 48ఏ)
1) 1, 2, 3, 4 2) 1, 3
3) 2, 4 4) 1, 3, 4
7. కింది వాక్యాలను పరిశీలించి సరైన జవాబు ఎంచుకోండి.
1. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లు, లోక్‌సభ ప్రోరోగ్తో రద్దవుతాయి
2. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లు లోక్‌సభలో పాస్‌కాని బిల్లు, లోక్‌సభ రద్దయితే బిల్లు రద్దుకాదు
1) 1 2) 2 3) 1, 2 4) రెండూ తప్పు
8. కింది వాక్యాలను పరిశీలించి సరైన జవాబు ఎన్నుకోండి.
1. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ ద్వారా నియామకమవుతారు
2. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నిర్దిష్ట పదవీకాలం ఉంటుంది
1) 1 2) 2 3) 1, 2 4) రెండూ తప్పు
9. భారత ప్రభుత్వ చట్టం 1935ని బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినవారు ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ 2) సర్దార్ వల్లభాయ్ పటేల్ 3) మహాత్మాగాంధీ 4) కేటీ షా
10. రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడిగా బాబు రాజేంద్రప్రసాద్ పేరుని సూచించింది ఎవరు?
1) అంబేద్కర్ 2) జవహర్లాల్ నెహ్రూ
3) జేబీ కృపలానీ 4) టీటీ కృష్ణమాచారి
11. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సర్ స్టాపర్డ్ క్రిప్స్ ప్లాన్?
1) భారతదేశానికి పూర్తి స్వతంత్రం ఇవ్వబడుతుంది 2) భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికంటే ముందు రెండు దేశాలుగా విభజించబడుతుంది
3) భారతదేశం కామన్వెల్త్లో చేరే నిబంధనతో గణతంత్ర దేశంగా చేయడం
4) భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడం
12. భారత పార్లమెంట్, జాతీయ ప్రయోజన నిమిత్తం రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపై అయినా కింది ఏ సందర్భంలో శాసనం చేయవచ్చు?
1) లోక్‌సభ తన మొత్తం సభ్యుల్లో సాధారణ మెజారిటీ తీర్మానం ద్వారా
2) లోక్‌సభ తన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తక్కువకాకుండా మెజారిటీ తీర్మానం ద్వారా
3) రాజ్యసభ తన మొత్తం సభ్యుల్లో సాధారణ మెజారిటీ తీర్మానం ద్వారా
4) రాజ్యసభ తన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తక్కువకాకుండా మెజారిటీ తీర్మానం ద్వారా
13. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా విధులను నిర్వహించినప్పుడు పరిషత్ అధ్యక్షడిగా ఎవరు వ్యవహరించారు?
1) రాజేంద్రప్రసాద్ 2) అంబేద్కర్
3) బెనగల్ నర్సింగరావు 4) జీవీ మౌలాంకర్
14. భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రధాన ఉద్దేశం
1) పౌరులందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం 2) పౌరులందరికీ ప్రాథమిక విధులు కల్పించడం
3) వ్యక్తి గౌరవం, ఐక్యత, దేశసమగ్రత
4) ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించడం
15. కింది వ్యాఖ్యలను పరిశీలించి జవాబును గుర్తించండి.
1. పంచాయతీలో సభ్యుడు కావడానికి కనీస వయస్సు 25 ఏండ్లు
2. ఒకవేళ కొనసాగుతున్న పంచాయతీని రద్దుపర్చినట్లయితే నూతనంగా ఏర్పాటుచేసే పంచాయతీ రద్దయిన పంచాయతీ మిగిలిన కాలపరిమితి వరకు అమల్లో ఉంటుంది
1) 1 2) 2 3) 1, 2 4) రెండూ తప్పు
16. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరించినట్లయితే అప్పుడు?
1) రాష్ట్రపతి ఆర్థికమంత్రిని రాజీనామా చేయని కోరతాడు
2) ప్రధానమంత్రి ఆర్థికమంత్రిని రాజీనామా చేయమని కోరుతాడు
3) ఆర్థికమంత్రి బడ్జెట్‌కు సవరణలు చేసి తిరిగి లోక్‌సభలో ప్రవేశపెడతాడు
4) ప్రధానమంత్రి, మంత్రిమండలి రాజీనామా సమర్పిస్తారు
17. ప్రస్తుతం దేశంలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య?
1) 27 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు
2) 27 రాష్ర్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు
3) 29 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు
4) 28 రాష్ర్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు
18. ఏ కేసులో సుప్రీంకోర్టు సాధారణ చట్టాల వల్లనే రాజ్యాంగ సవరణను న్యాయసమీక్షకు గురిచేయరాదని తీర్పునిచ్చింది?
1) 1951 శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) 1967 గోలక్‌నాథ్ కేసు
3) 1994 ఎస్ఆర్ బొమ్మై కేసు
4) 1987 ఎల్ఐసీ కేసు
19. కింది వాక్యాలను పరిశీలించి జవాబును గుర్తించండి.
1. కేంద్రమంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు
2. కేంద్రమంత్రి మండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది
1) 1 2) 2 3) రెండు సరైనవి
4) రెండు సరైనవి కావు (తప్పు)
20. భారత సంఘటిత నిధి నుంచి చార్జ్ చేసే వ్యయాలను?
1) పార్లమెంట్లో చర్చించి ఓటింగ్‌కు పెడతారు
2) పార్లమెంట్లో చర్చిస్తారు. కానీ ఓటింగ్‌కు పెట్టరు
3) పార్లమెంట్లో చర్చించడం కానీ, ఓటింగ్‌కు పెట్టడం కాని ఉండదు
4) లోక్‌సభలో మాత్రమే చర్చించి, ఓటింగ్‌కు పెడతారు.
21. కిందివారిలో స్వతంత్ర భారత ప్రథమ గవర్నర్ జనరల్?
1) సి.రాజగోపాలచారి 2) రాజేంద్రప్రసాద్
3) లార్డ్మౌంట్బాటన్ 4) సర్వేపల్లి రాధాకృష్ణ
22. భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడేవి?
1) ఆదేశిక సూత్రాలు 2) ప్రాథమిక హక్కులు
3) ప్రాథమిక విధులు 4) పైవేమీ కావు
23. ఎవరి సూచనల ఆధారంగా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు?
1) అంబేద్కర్ 2) జరహర్లాల్ నెహ్రూ
3) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
4) సర్దార్ స్వరణ్ సింగ్
24. రెండో పరిపాలన సంస్కరణల సంఘం (2005) దేనికి సంబంధించింది?
1) సుపరిపాలనకు సంబంధించి సంస్థాగత సంస్కరణలకు
2) ప్రజా జీవితంలో అవినీతిని నిర్మూలించడానికి, అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఏర్పాటు కోసం
3) భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు
4) పట్టణ పాలనకు సంబంధించి నూతన పద్ధతుల కోసం
25. ప్రొహిబిషన్ రిట్‌కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1. న్యాయ, అర్ధ న్యాయ సంస్థలకు జారీ చేస్తారు.
2. కింది న్యాయస్థానాలను తన పరిధి అతిక్రమించకుండా జారీ చేస్తారు
3. అధికారం లేకున్నా ఒక వ్యక్తి పదవిలోకి చొరబడటాన్ని నిషేధిస్తుంది
1) 1, 2 2) 2, 3 3) 1 4) 1, 2, 3
26. 42, 44 సవరణల తర్వాత రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది అని వ్యాఖ్యానించిందెవరు?
1) ఎంవీ ఫైలీ 2) హిదాయతుల్లా
3) ఎంపీ జైన్ 4) కామత్
27. ప్రవేశికలోని పదాలు, రాజ్యాంగంలో ప్రకరణలు జతపర్చండి.
1. గణతంత్రం అ) 54వ ప్రకరణ-దేశాధినేతను ఎన్నుకోవడం.
2. ప్రజాస్వామ్యం ఆ) ప్రకరణ 326-సార్వత్రిక వయోజన ఓటుహక్కు
3. లౌకిక ఇ) 25 నుంచి 28 వరకు గల ప్రకరణలు
4. సామ్యవాదం ఈ) నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాలు
1) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
2) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
3) 1-ఈ, 2-ఇ, 3-ఆ, 4-అ
4) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
28. రాష్ట్రపతికి కేంద్రమంత్రి మండలి పంపిన సలహాను పునఃపరిశీలనకు తిరిగి పంపవచ్చని ఏ రాజ్యాంగ సవరణ పేర్కొంటుంది?
1) 41వ 2) 42వ
3) 43వ 4) 44వ
29. రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
1. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250
2. 238 మంది సభ్యులు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు.
3. అఖిల భారత సర్వీసుల ఏర్పాటులో లోక్‌సభతో పాటుగా రాజ్యసభకు సమానాధికారాలు ఉంటాయి.
1) 1, 2 2) 1, 2, 3 3) 2, 3 4) 1
30. భారత రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1. రాష్ట్రపతి క్రిమినల్ కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కలిగి ఉంటాడు
2. రాష్ట్రపతి, పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌లను జారీ చేస్తాడు
3. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు రాజ్యసభను రద్దు చేస్తాడు
4. రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు
1) 1, 2 2) 1, 4
3) 3, 4 4) 1, 3, 4
-ప్రైమినిస్టర్ ఇంటిగ్రేషన్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాం (పీఎంఐయూపీఈపీ- 1995)- పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
-స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన (ఎస్జేఎస్ఆర్వై- 1997)- పట్టణాభివృద్ధిని సాధించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం కేంద్ర, రాష్ర్టాలు 75:25 నిష్పత్తిలో నిధులను కేటాయిస్తాయి. ఇందులో ఎన్ఆర్‌వై, యూబీఎస్పీ, పీఎంఐయూపీఈపీలను విలీనం చేశారు.
-వాల్మీకి అంబేద్కర్ యోజన (వీఏఎంబీఏవై – 2001)- పట్టణాల్లో దారిద్రరేఖ దిగువన ఉన్న వారికి గృహవసతి కల్పించడం దీని ఉద్దేశం. తర్వాతి కాలంలో ఈ పథకాన్ని ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ అండ్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐహెచ్ఎస్డీపీ)లో విలీనం చేశారు.
సమాధానాలు
1-1, 2-2, 3-2, 4-3, 5-2, 6-1, 7-2, 8-1, 9-1, 10-3, 11-4, 12-4, 13-4, 14-3, 15-2, 16-4, 17-3, 18-1, 19-3, 20-2, 21-3, 22-1, 23-4, 24-1, 25-1, 26-3, 27-2, 28-4, 29-1, 30-2.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






