Srikrishna Committee Report | శ్రీకృష్ణ కమిటీ నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చుచేసింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై 2011, జనవరి 6న కేంద్ర హోంమంత్రి చిదంబరం మరోసారి అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించారు.
-కేంద్రప్రభుత్వం స్వయంగా ద్వంద్వ విధానాన్ని ప్రోత్సహిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మరింత జాప్యం చేస్తున్నది అంటూ బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీలు అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజారాజ్యం, ఎంఐఎంలు మాత్రమే హాజరయ్యాయి. ఈ సమావేశంలో సీపీఐ, తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రమే తెలంగాణ వాదన వినిపించారు.
-అయితే తర్వాత సమావేశంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకాని, కేంద్ర హోంమంత్రి కాని తమ అభిప్రాయం తెల్పకుండా శ్రీకృష్ణ కమిటీకి సంబంధంచిన నివేదిక ప్రతిని, సీడీ ఇచ్చి సమావేశం ముగించారు. ఈ కమిటీ నివేదికలో 668 పేజీలతో కూడిన తొమ్మిది అధ్యాయాలు వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. పెద్ద మనుషుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలుచేయకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండు మళ్లీ తెరపైకి వచ్చింది.
2. రాష్ట్రంలో అన్నిటికంటే వెనుకబడింది రాయలసీమ. అది తెలంగాణ కంటే కూడా వెనుకబడింది. తెలంగాణలో కూడా హైదరాబాద్‌పై దృష్టిపెట్టారు తప్ప మిగతా ప్రాంతాలపై కాదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లతో పోలిస్తే తెలంగాణ జీడీపీ ఎక్కువ.
3. 1971 తర్వాత తెలంగాణలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ అక్షరాస్యత నమోదైంది. విద్యాసంస్థల విషయంలోనూ పరిస్థితి బాగానే మెరుగుపడింది.
4. సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురికాలేదు.
5. తెలంగాణ ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థంగా అమలు చేయాలి. కొత్త చర్యలేవీ అవసరం లేదు.
6. తెలంగాణ యాసను సినిమాల్లో గేలిచేస్తున్నారనే భావన వారిలో ఉంది. వారిలోనే కాదు ఉత్తరాంధ్రుల్లోనూ ఇదే భావన ఉంది. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై సాంసృ్కతికంగా పెత్తనం చెలాయిస్తూ ఉపాధిపరంగా, రాజకీయంగా వారిని అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.
7. హైదరాబాద్ ప్రాధాన్యాన్ని వివరించింది.
8. శాంతిభద్రతలు తదితరాంశాలపై కీలక సూచనలు చేసింది. (ఈ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో పెట్టి నేరుగా హోంమంత్రికి అందజేసింది)
9. పై ఎనిమిది అధ్యాయాలను పరిశీలించి భవిష్యత్ మార్గ నిర్దేశనం చేసే 6 సూచనలను శ్రీకృష్ణ కమిటీ చేసింది. అవి ఇలా ఉన్నాయి.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక – ఆరు మార్గాలు
1. యథాతథ స్థితి కొనసాగింపు: ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ఎప్పటిలా రాజకీయ, శాంతిభద్రతల సమస్యగానే పరిగణిస్తూ రాష్ర్టానికే వదిలివేయడం వల్ల ప్రయోజనం శూన్యం. కొంత కేంద్ర ప్రభుత్వం జోక్యం తప్పనిసరి. తక్షణం కచ్చితమైన చర్యలేవీ లేకపోతే తెలంగాణ ప్రజలు మానసికంగా సంతృప్తిచెందే అవకాశమే లేదు. అయితే యథాతథస్థితి ఒక ప్రతిపాదన మాత్రమే. మేం దానికి చిట్టచివరి ప్రాధాన్యం మాత్రమే ఇస్తున్నామని కమిటీ అభిప్రాయపడింది.
2. సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం: ఈ విధంగా చేయడం వల్ల కాలక్రమంలో రెండు రాష్ర్టాలు సొంతంగా తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టముండదు. కాబట్టి అది సీమాంధ్ర ప్రజలకు కొంత ఆయోదయోగ్యం కావచ్చు. కానీ తెలంగాణలో నిరసనలు లేస్తాయి. వారికి తెలంగాణ వచ్చిన తృప్తే ఉండదు. ఆందోళనలు, సమస్య కొనసాగుతాయి. కాబట్టి ఆచరణలో ఇది అసాధ్యం.
3. రాష్ర్టాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించడం: రాష్ర్టాన్ని ఈ విధంగా విడగొట్టి హైదరాబాద్‌ను రాయల-తెలంగాణ రాజధానిగా చేయాలని కమిటీ సూచించింది. కొన్ని రాయలసీమ వర్గాలు, ముస్లిం జనాభా ప్రాబల్య దృష్టితో ఎంఐఎం ఈ ప్రతిపాదన తెచ్చాయి. దీన్ని తెలంగాణవాదులు ఒప్పుకోరు. పైగా అది మతఛాందస శక్తులకు ఊతమివ్వచ్చు. అయితే ఈ ప్రతిపాదన ఆర్థికంగా సమర్థనీయంగా ఉన్నప్పటికీ మూడు ప్రాంతాలను సంతృప్తిపర్చే పరిష్కారం ఇవ్వలేదని కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసింది.
4. సీమాంధ్ర, తెలంగాణలుగా విభజన-హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం: రాష్ర్టాన్ని ఈ విధంగా విభజించి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి. అంతేకాకుండా నల్లగొండ-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లోని 20 మండలాలను యూటీలో భాగం చేయాలి. తద్వారా హైదరాబాద్ యూటీని సీమాంధ్రలోని గుంటూరు, కర్నూలు జిల్లాల సరిహద్దులతో భౌగోళిక అనుసంధానం చేయాలి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం. అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే తెలంగాణవాదులు అసలు ఒప్పుకోరు. అంతేకాకుండా రాష్ట్రంలో కొంతభాగాన్ని కేంద్రపాలన కిందకు తేవడంపై మూడు ప్రాంతాల నుంచి వ్యతిరేకత రావచ్చు.
5. సీమాంధ్ర, తెలంగాణగా విభజన: రాష్ర్టాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి తెలంగాణ హైదరాబాద్ రాజధాని, సీమాంధ్రకు మరో కొత్త రాజధాని ఏర్పాటు చేయడం. దీంతో తెలంగాణ ప్రజల పూర్తి ఆకాంక్ష నెరవేరుతుందిగాని, హైదరాబాద్, జలవనరుల విషయమై సీమాంధ్రలో అల్లర్లు జరుగవచ్చు. రాయలసీమలోనూ, దేశమంతా కూడా వేర్పాటు డిమాండ్లు రావచ్చు. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లో కొంత న్యాయం లేకపోలేదు. విభజిస్తే సీమాంధ్ర ప్రజల అవసరాలను పట్టించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ద్వితీయ ప్రాధాన్యం, అనివార్యమైతేనే అందరికీ ఆమోదయోగ్యమైతేనే విభజించాలని సిఫారసు చేస్తున్నాం.
6. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడం-తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు: తెలంగాణ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సాధికారతకూ, నిర్దిష్టమైన రాజ్యాంగబద్ద చర్యలు తీసుకుంటూ రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడం, రాష్ర్టాన్ని ముక్కలు చేయడం వల్ల ప్రస్తుత సమస్యలకు సుస్థిర పరిష్కారాలు రావు. సమైక్యంగా ఉండటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కీలకం. అందుకే రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజ్యాంగబద్దమైన ప్రాంతీయ మండలి ఏర్పాటును సిఫారసు చేస్తున్నాం. జాతీయ దృక్పథంతో చూసినా ఇదే మేలు. అందుకే దీనికే మా తొలి ఓటు.
-కమిటీ నివేదిక అనంతర పరిణామాలు: శ్రీకృష్ణ కమిటీ చేసిన 6 సూచనల్లో 4 ఆచరణ సాధ్యంకాదని కమిటీయే స్వయంగా స్పష్టంచేసింది. ఐదో సూచనను అమలుచేసిన పక్షంలో ఎదురయ్యే సాధకబాధకాలను ఏకరువు పెడుతూ ఈ సూచన రెండో ప్రాధాన్యం గలదని కమిటీ తేల్చింది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరో సూచన అమలు చేయడమే తమ దృష్టిలో అత్యుత్తమమైనదని కమిటీ స్పష్టం చేసింది. అసలే కేంద్రప్రభుత్వం ద్వంద్వ వైఖరితో, దీనికి తోడు కమిటీ చేసిన అస్పష్టమైన పరిష్కార మార్గాలతో తెలంగాణలో ఒక్కసారిగా ఉద్యమజ్వాలలు తారాస్థాయిలో ఎగిసిపడ్డాయి. టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ ఇందిరాపార్క్ వద్ద 2011, జనవరి 6న భారీస్థాయిలో ధర్నా నిర్వహించాయి. తెలంగాణ అంతటా కమిటీ నివేదికను దహనం చేస్తూ నిరసన ప్రదర్శనలతో అట్టుడికిపోయింది. మరోసారి ఓయూ క్యాంపస్ యుద్ధరంగాన్ని తలపించింది. కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, శ్రీకృష్ణ కమిటీ పక్షపాతాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ 2011, జనవరి 7న విజయవంతమైంది.
-ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ కుట్రలను తెలంగాణ ఉద్యోగ, ప్రజాసంఘాలు బట్టబయలు చేశాయి. కమిటీ సభ్యుల పనితీరు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందని తెలంగాణవాదులు ఆరోపించారు. స్వయంగా కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ అయితే ఏకంగా సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన ప్రైవేట్ విందుల్లో కూడా పాల్గొన్నాడు. శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందించింది. ఈ నివేదికను రహస్యంగా ఉంచాలని కమిటీయే స్వయంగా నిర్ణయించి, నివేదికలోని ప్రతి పేజీపై సీక్రెట్ అని ముద్రించింది. ఇలా కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం
-శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని నిజామాబాద్ మాజీ ఎంపీ పండిట్ నారాయణరెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు విని 2011, మార్చి 23న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఈ చీకటి అధ్యాయాన్ని కేంద్ర హోంశాఖ నుంచి తెప్పించుకొని చదివి రెండు వారాల్లోగా అందులోని అంశాలను బహిర్గతం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని అదేశిస్తూ 58 పేజీల తుది తీర్పు వెలువరించారు.
బహిర్గతమైన నివేదికలోని ప్రధానాంశాలు
-కమిటీ ప్రధాన నివేదికలో తెలంగాణ ఏర్పాటు చేయమని ఇచ్చిన 5వ సిఫారసులను కేంద్రప్రభుత్వం అమలు చేయకుండా నిర్వీర్యం చేసే మార్గాన్ని 8వ అధ్యాయం చూపింది. అందుకు మూడు మార్గాలను కమిటీ సూచించింది.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






