Chalukya rule చాళుక్యుల పరిపాలన
వేగరాజు (క్రీ.శ.955-960)
-ఈయన రెండో అరికేసరి కుమారుడు. రాష్ట్రకూట మూడో కృష్ణుని సామంతుడు.
-తన రాజధానిని వేములవాడ నుంచి గంగాధర పట్టణానికి మార్చాడు.
-సోమదేవసూరి తన యశస్తిలక చంపూ కావ్యాన్ని ఇతని కాలంలో పూర్తి చేసినట్లు తన గ్రంథంలో తెలియజేశాడు.
రెండో బద్దెగుడు (క్రీ.శ.960-965)
-వేగరాజుకు సంతానం లేనందున అతని తమ్ముడు రెండో బద్దెగుడు (భద్రదేవుడు) సింహాసనాన్ని అధిష్టించాడు.
-ఇతను వేములవాడలో ఒక శాసనం వేయించి, తన విద్యాగురువు అయిన సోమదేవ సూరి కోసం శుభదామ జినాలయమనే పేరుతో ఒకజైన మఠాన్ని నిర్మించాడు.
-ఈ శుభదామ జినాలయానికి బద్దెగ జినాలయం అనే పేరు కూడా ఉంది.
-ఇతని కాలంలో బొమ్మల గుట్ట (కుర్క్యాల) గొప్ప జైనమత కేంద్రంగా వర్థిల్లింది.
మూడో అరికేసరి (క్రీ.శ.965-973)
-ఇతను రెండో బద్దెగుని కుమారుడు. వేములవాడ వంశ చాళుక్యులలో చివరివాడు.
-ఇతడు రాజధానిని గంగాధర నుంచి తిరిగి వేములవాడకు మార్చాడు.
-ఇతను సోమదేవసూరికి వనికటుపలు గ్రామాన్ని, శుభదామ జినాలయాన్ని దానమిస్తూ క్రీ.శ. 966లో పర్బణి తామ్ర శాసనం వేయించాడు. ఈ శాసనంలో తాము సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు.
-ఇదే శుభదామ జినాలయానికి రేపాక గ్రామాన్ని దానం చేసి, రేపాకలో జైనాలయాన్ని నిర్మించి, భూదానం చేసినట్లు రేపాక శాసనం (క్రీ.శ. 968) ద్వారా తెలుస్తుంది.
-మూడో అరికేసరికి పాంబరాంకుశ, విద్యాధర, విక్రమార్జున, సామంత చూడామణి అనే బిరుదులున్నాయి.
-క్రీ.శ. 973లో రాష్ట్రకూట వంశాన్ని అంతంచేసి, రెండో తైలపుడు కళ్యాణి చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాష్ట్రకూటులతోపాటే వేములవాడ చాళుక్యపాలన క్రీ.శ. 973లో అంతమైంది.
-కానీ కాజీపేట దర్గా శాసనం ప్రకారం కాకతీయ మొదటి ప్రోలరాజు 3వ అరికేసరి కుమారుడైన 3వ బద్దెగుని పారదోలి ఉంటారని, దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం అంతరించిందని బీఎన్ శాస్త్రి పేర్కొన్నారు.
పరిపాలన
-రాజుకు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలిని ఏర్పాటు చేసుకునేవారు. మంత్రిమండలిలో ధర్మశాస్ర్తాలు తెలిసినవారు, సేనాధిపతులు, ముఖ్య రాజ బంధువులు సభ్యులుగా ఉండేవారు. రాజుకు మంత్రి, సేనాపతి, కోశాధికారి, పురోహితుడు, యువరాజు మొదలైనవారు పరిపాలనలో సలహాలిస్తుండేవారు. రెండో అరికేసరి కాలం నాటి వేములవాడ శాసనంలో మహాసంధి విగ్రహ, తంత్రపాల, సత్రాధిపాల అనే ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులు
-వేములవాడ చాళుక్యుల కాలంలో భూమి పన్ను ముఖ్య ఆదాయం. పన్నుల వసూలుకు సుంకాధికారులు ఉండేవారు. వీరి కాలంలో గ్రామం పన్నెండు మంది ఆధీనంలో ఉండేది. వీరు గ్రామాధికారి, న్యాయాధికారి, కరణం, గ్రన్ధి (నీరుడికాడు), తలారీ, జ్యోతిష్కుడు, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, గ్రామోపాధ్యాయుడు.. ఇంకా సాలె, చర్మకార, కంచరి అనే వృత్తికారులు, గౌండ, గౌడ, పటేలు, రెడ్డి అనే అధికారులు కూడా ఉండేవారు. వడ్డీ వ్యాపారం కూడా ఆ రోజుల్లో ఉండేది.

మతపరిస్థితులు
-వేములవాడ చాళుక్యులలో కొందరు రాజులు జైన మతాన్ని, మరికొందరు రాజులు శైవ మతాన్ని ఆదరించారు. అయితే జైన మతంలోకి వచ్చిన వైదిక మతస్థులు తమ పూర్వ వర్ణాన్ని విడిచిపెట్టేవారు కాదు. జిన వల్లభుడు లాంటి వారు జైన మందిరాలను నిర్మించి జైనమత అభివృద్ధికి తోడ్పడ్డారు. వేములవాడ చాళుక్యులు తమ పేర రాజరాజేశ్వర, బద్దెగేశ్వర ఆలయాలు నిర్మించారు. అంతేగాకుండా వీరికాలంలో శనిగరంలో యుద్ధమల్ల జినాలయం, వేములవాడలో బద్దెగ జినాలయం లేదా శుభదామ జినాలయం, రేపాకలో అరికేసరి జినాలయం నిర్మించబడ్డాయి. వీరికాలంలో బొమ్మలగుట్ట ప్రాంతం గొప్ప జైనమత కేంద్రంగా వర్థిల్లింది.
భాషా సాహిత్యాలు
-రెండో అరికేసరి కవి, పండితుడు. కన్నడ సాహిత్యంలో ఆదికవి అయిన పంపడు ఇతని ఆస్థాన కవి. పంప ఇతన్ని నాయకునిగా చేసి విక్రమార్జున విజయం రాశాడు. తెలంగాణలో క్రీ.శ. 940 నాటి కుర్క్యాల శాసనంలో మొదటిసారిగా పద్యాలు లభించాయి. దీన్ని రచించినవారు, వేయించినవారు పంపకవి సోదరుడైన జినవల్లభుడు. ఈ శాసనంలో మూడు కంద పద్యాలతోపాటు సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నాయి. జినవల్లభుని మిత్రుడు మల్లియ రేచన రాసిన కవి జనాశ్రయం తెలుగులో మొదటి లక్షణ గ్రంథం. ఈ కాలంలో మరో ప్రసిద్ధి చెందిన కవి సోమదేవ సూరి. ఇతను ప్రసిద్ధ జైన మతాచార్యుడు. ఇతని రచనలు యశస్తిలక చంపూకావ్యం, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి, యశోధర మహారాజు చరిత్ర. సోమదేవ సూరి బిరుదులు శాద్వాద చలసింహ, తార్కిక చక్రవర్తి, రెండో అరికేసరి కొడుకైన రెండో బద్దెగుడు నీతి శాస్త్ర ముక్తావళి, సుమతీ శతకంల గ్రంథకర్త అని కొందరి చరిత్రకారుల అభిప్రాయం.
మొదటి కుసుమాయుధుడు (క్రీ.శ. 870-895)
-రణమర్ధనుని తర్వాత కుసుమాయుధుడు అధికారంలోకి వచ్చినట్లు కురవి శాసనం వల్ల తెలుస్తుంది. ఇతడు గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భౌమునికి సమకాలికుడు. తూర్పు చాళుక్యులు, రాష్ట్ర కూటుల యుద్ధాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతని కాలంలోనే మొదటిసారిగా కురవిసీమను రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుడు ఆక్రమించాడు.
-ఇతని కాలంలో రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుడు వేంగి రాజ్యాన్ని ఆక్రమించడానికి తూర్పు చాళుక్యరాజ్యంపై దాడిచేసి, రాజైన చాళుక్య భీముడిని కొలనుకోటలో బందీగా ఉంచాడు.
-ఈ సందర్భంలోనే కుసుమాయుధుడు రెండో కృష్ణుడిని పారదోలి ఒకటో చాళుక్య భీముడితో వేంగి సింహాసనాన్ని అధిష్టింపజేసి తన గుర్తింపును పెంచుకున్నాడు. కుసుమాయుధుడి అభ్యర్థనపై చాళుక్య భీముడు కూకిపర్రు గ్రామాన్ని పోతనయ్య అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు.
గొణగయ్య (క్రీ.శ. 895-910)
-కుసుమాయుధునికి గొణగయ్య, నిరవద్య అనే ఇద్దరు కుమారులున్నారు. గుణగ విజయాధిత్యుని (తూర్పు చాళుక్యరాజు)పై అభిమానంతో కుసుమాయుధుడు అతని కుమారునికి గొణగయ్య అని పేరుపెట్టాడు. గొణగయ్య గుణగ విజయాధిత్యునికి హ్రస్వరూపం.
-గొణగయ్యనే కరిగొణగ (నల్లని గొణగ) అని కూడా పిలుస్తారు. చాళుక్య భీముని అనంతరం వేంగిలో జరిగిన అంతఃకలహాల వల్ల గొణగయ్య వేంగి చాళుక్యుల అభిమానాన్ని కోల్పోయాడు. ఈ పరిణామాలను అవకాశంగా తీసుకున్న అతని తమ్ముడు నిరవద్య (క్రీ.శ. 910-935) గొణగయ్యను తొలగించి తాను ముదిగొండ చాళుక్య సింహాసనం అధిష్టించాడు. ఈ విషయం కొరవి శాసనం వల్ల తెలుస్తుంది. అయితే రాజ్యాన్ని కోల్పోయిన గొణగయ్య వేములవాడ చాళుక్య రెండో అరికేసరి సహాయంతో నిరవద్యను కూలదోసి తిరిగి ముదిగొండ రాజ్యాన్ని సంపాదించాడు.
-అనంతర కాలంలో గొణగయ్య సంతతివారే ముదిగొండ రాజ్యాన్ని పరిపాలించారు.
ఆరో కుసుమాయుధుడు (క్రీ.శ. 1150-1175)
-ముదిగొండ చాళుక్యుల్లో చివరివాడు ఆరో కుసుమాయుధుడు. (క్రివ్వక శాసనం వల్ల తెలుస్తుంది) ఇతని తమ్ముడు నాగటిరాజు (1175-1200) కాలంలో కాకతీయ గణపతి దేవుడు ముదిగొండ చాళుక్య రాజ్యంపై దండెత్తి వారిని ఓడించి తరిమాడు. దీంతో ముదిగొండ చాళుక్య రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. చివరి ముదిగొండ చాళుక్యులు తమ రాజ్యాన్ని పోగొట్టుకుని వేంగికి వెళ్లి కొన్నాళ్లు అక్కడే జీవించి మరణించారని వారి మరణంతో ముదిగొండ చాళుక్యవంశం అంతరించినట్లుగా తెలుస్తుంది.
ముదిగొండ చాళుక్యులు (క్రీ.శ. 850-1200)
-తెలంగాణలోని కురవి సీమలో ముదిగొండ (ఖమ్మం జిల్లా) రాజధానిగా, మంచికొండనాడును పాలించిన వారు ముదిగొండ చాళుక్యులు. ఖమ్మం, వరంగల్లు ప్రాంతాలను కురవి సీమ అంటారు. కురవి సీమలో తూర్పు ప్రాంతాన్ని మంచికొండనాడని పిలిచేవారు. వీరి రాజ్యం కృష్ణా జిల్లాలోని కొండపల్లి నుంచి వరంగల్ జిల్లాలోని కొరవి అనే ప్రాంతంవరకు విస్తరించింది. వారు తూర్పు చాళుక్యులకు సామంతులుగా కొనసాగారు. వీరి సమకాలీన రాజ్యాలు వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, విరియాల పాలకులు.
-వీరి చరిత్రను తెలుసుకోవడానికి ప్రముఖ ఆధారాలు కురవి తామ్రశాసనం (క్రీ.శ. 935), మొఘల్-చెరువు శాసనాలు, విరియాల వారి గూడూరు శాసనం (క్రీ.శ. 1124), కుసుమాయుధుని క్రివ్వక (కుక్కునూరు) శాసనం మొదలైనవి. అయితే ఈ శాసనాల్లో తేదీలు లేకపోవడం, వాటిలో సమాచారం సరిగా లేనందున స్పష్టంగా వీరి చరిత్ర తెలపడానికి అవకాశం లేకుండా పోయింది.
పాలకులు
-ముదిగొండ చాళుక్య వంశానికి మూలపురుషుడు రణమర్ధుడు. ఇతడు పశ్చిమ చాళుక్య వంశానికి చెందినవాడై ఉంటాడు. ఇతడు తూర్పు చాళుక్యుల సహాయంతో కురవి మండలాన్ని సంపాదించి ముదిగొండ నుంచి పరిపాలించాడు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






