తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒక..______?
1. కింది వాటిలో సరైనది.
ఎ. 2013-14 నాటికి కేంద్ర ప్రభుత్వం వైపు మొత్తం పన్ను ఆదాయంలో ప్రత్యక్ష పన్నులు సగం కంటే ఎక్కువ
బి. కేంద్రం విధించే అన్ని పన్నుల్లో ఆదాయం దృష్ట్యా కార్పొరేట్ పన్ను అన్నింటికన్నా ప్రధానమైనది
సి. గ్రామీణ భారతంలో ఆదాయ పంపిణీలో ఆదాయ పన్ను కీలకమైన సకారాత్మక పాత్ర పోషించింది
డి. వస్తు సేవల పన్ను ఆదాయానికి సంబంధించినది కాదు
1) ఎ, సి 2) బి, డి 3) ఎ, డి 4) బి, సి
2. 2018 సెప్టెంబర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ, దేనా బ్యాంకుల విలీనం జరిగింది. తాజా విలీనంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య ఎంతకు తగ్తింది?
1) 18 2) 17 3) 19 4) 20
3. ప్రపంచంలో పెద్దమొత్తంలో బంగారం నిల్వలు ఉన్న దేశం?
1) భారత్ 2) జపాన్ 3) చైనా 4) అమెరికా
4. భారత వృద్ధిరేటు 2019లో 7.3 శాతంగా, 2020లో 7.5 శాతంగా నమోదవుతుందని వెల్లడించిన సంస్థ?
1) ఆర్బీఐ 2) ఐఎంఎఫ్
3) ప్రపంచ బ్యాంకు 4) ఎస్బీఐ
5. దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?
1) ఎస్బీఐ 2) బ్యాంక్ ఆఫ్ బరోడా
3) పంజాబ్ నేషనల్ బ్యాంకు 4) ఏదీకాదు
6. 2019-20లో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశం?
1) బ్రిటన్ 2) బ్రెజిల్ 3) దక్షిణాఫ్రికా 4) భారత్
7. ఎస్ఈజెడ్ (సెజ్)లకు సంబంధించి సరైనవాటిని గుర్తించండి.
ఎ. 2006, ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది
బి. సెజ్ డెవలప్మెంట్కు 15 ఏండ్లలో పదేండ్లు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది
సి. ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్నులు, కేంద్ర అమ్మకపు పన్ను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్ను మినహాయింపు ఇస్తారు
డి. సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి స్వేచ్ఛ ఉంటుంది
1) ఎ, డి 2) ఎ, సి 3) ఎ, సి, డి 4) పైవన్నీ
8. పారిశ్రామిక కార్మికుల సగటు తలసరి వార్షిక ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్
3) పశ్చిమబెంగాల్ 4) తమిళనాడు
9. వివిధ కాలాల్లో జాతీయాదాయాన్ని సరిపోల్చడానికి కింది దేనికి సంబంధించిన దత్తాంశాన్ని వాడాలి?
1) నామమాత్ర జాతీయాదాయం
2) వాస్తవ జాతీయాదాయం
3) ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం 4) ఏదీకాదు
10. వ్యయ మదింపు పద్ధతిలో తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి సరైనవి?
1) అంతిమ వస్తువులను అన్నింటినీ తీసుకోవాలి
2) మధ్యంతర వస్తువులపై వ్యయం లెక్కించకూడదు
3) షేర్లు, బాండ్లపై చేసే వ్యయం లెక్కించకూడదు
4) బదిలీ చెల్లింపులపై చేసే వ్యయం లెక్కించకూడదు
11. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఉత్పత్తి కంటే మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండటానికి కారణం?
1) పరోక్ష పన్నులు
2) పరోక్ష పన్నులు-సబ్సిడీలు
3) పరోక్ష పన్నులు + సబ్సిడీలు 4) సబ్సిడీలు
12. ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన జనాభా పరిణామ దశ?
1) మొదటి దశ 2) రెండోదశ
3) మూడోదశ 4) ఏదీకాదు
13. భారత పారిశ్రామికాభివృద్ధి మొదటి ప్రణాళిక ప్రారంభించే నాటికి దేనికి పరిమితమయ్యింది?
1) వినియోగ వస్తుత్పత్తి
2) ఎరువులు, భారీ రసాయనాలు
3) మధ్యంతర వస్తుత్పత్తి
4) మూలధన వస్తుత్పత్తి
14. కిందివాటిలో ఏ పథకాన్ని నీటిపారుదల సామర్థ్యానికి నీటి పారుదల వినియోగానికి మధ్య అంతరం తగ్గించే లక్ష్యంతో ప్రారంభించారు?
1) కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్
2) క్షామ పీడిత ప్రాంతాల పథకం
3) వాటర్‌షెడ్ డెవలప్మెంట్ పథకం
4) సమగ్ర పంటల బీమా పథకం
15. దేన్ని లక్ష్యంగా భావించి ఆరో ప్రణాళికను రూపొందించారు?
1) దేశీయ శక్తి వనరుల అభివృద్ధి
2) అధిక వృద్ధిరేటు సాధించడం
3) పేదరికం, నిరుద్యోగిత తగ్గించడం 4) పైవన్నీ
16. కులం, మతం, అనారోగ్యం కూడా బీపీఎల్ ప్రాతిపదికన నిర్ణయించేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలని సూచించిన కమిటీ?
1) సక్సేనా కమిటీ 2) హసీమ్ కమిటీ
3) లక్డావాలా కమిటీ 4) టెండూల్కర్ కమిటీ
17. ఎన్నేండ్ల దీర్ఘ దర్షిక ప్రణాళికను ఆరో పంచవర్ష ప్రణాళికలో రూపొందించారు?
1) 15 ఏండ్లు 2) 25 ఏండ్లు
3) 100 ఏండ్లు 4) 20 ఏండ్లు
18. దేశంలో ప్రణాళిక విరామాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
1) 1977 భారత ప్రభుత్వ పాలనలో
2) 1966 తీవ్ర కరువు తర్వాత
3) బంగ్లాదేశ్ ఆవిర్భావం
4) 1962 చైనా యుద్ధం తర్వాత
19. ప్రధానంగా దేన్ని సరిచేయడానికి మొదటి పంచవర్ష ప్రణాళికను రూపొందించారు?
1) యుద్ధం, దేశ విభజనవల్ల అస్తవ్యస్థమైన ఆర్థిక సమస్యను సరిచేయడం
2) వేగంగా పారిశ్రామిక వృద్ధి సాధించి ఉపాధి పెంచడం
3) సంతులిత అభివృద్ధిని సాధించడం
4) వేగంగా వృద్ధిని సాధించి ఆదాయ అసమానతలు తగ్గించాలి
20. మూల (ఆధార) వడ్డీరేటు అంటే ఏమిటి?
1) బ్యాంకులు వసూలు చేసే యదార్థ రుణవడ్డీ రేటు
2) యదార్థ వడ్డీ రేటుతోపాటు రుణ గ్రహీత చెల్లించే చార్జీలు
3) ఎలాంటి మినహాయింపు లేకుండా అన్ని రుణాలపై కనీస రేటు
4) ద్రవ్య మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చు తగ్గులకు అనుమతించిన రేటు
21. తెలంగాణ గ్రామీణ బ్యాంకు అనేది?
1) ఒక సహకార బ్యాంకు
2) ఒక ప్రభుత్వ షెడ్యూల్ బ్యాంకు
3) ఒక గృహ నిర్మాణ బ్యాంకు
4) ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు
22. తెలంగాణలో ప్రారంభించిన గ్రామ జ్యోతి పథకం ముఖ్యలక్ష్యం?
1) అన్ని గ్రామాల విద్యుదీకరణ
2) ఎస్సీ, ఎస్టీ ఇండ్లను విద్యుదీకరించడం
3) స్వయం సమృద్ధిని సాధించడం
4) స్వచ్ఛ తెలంగాణ సాధించడం
23. అభివృద్ధిచెందిన దేశాల్లో నిరుద్యోగానికి కారణం?
1) సార్ధక డిమాండ్ లోపం 2) మూలధన కొరత
3) డిమాండ్ లేకపోవడం 4) సప్లయ్ వైపు కొరత
24. ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం ఉద్యోగుల పనివేళలు?
1) 273 రోజులు, 8 గంటలు పనిచేయడం
2) 360 రోజులు, 5 గంటలు పనిచేయడం
3) 183 రోజులు, రోజుకు 8 గంటలు పనిచేయడం
4) 360 రోజులు, 8 గంటలు పనిచేయడం
25. పేదరిక విరామాన్ని తెలిపి, పేదరికాన్ని శ్రేణీకరించిన భారత ఆర్థికవేత్త?
1) అమర్త్యసేన్ 2) టెండూల్కర్
3) రంగరాజన్ 4) సక్సేనా
26. లక్ష్య నిర్దేశిత ప్రజాపంపిణీ పద్ధతి ద్వారా ఆహార భద్రత కల్పించడానికి, పేదరిక నిర్మూలనకు అమలు చేసిన పథకం?
1) చక్కెర సబ్సిడీ పథకం
2) బియ్యం సబ్సిడీ పథకం
3) వంట నూనె సబ్సిడీ పథకం 4) పైవన్నీ
27. కింది ఏ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ముందుగా రుణాన్ని మంజూరు చేసింది?
1) ఫరక్కా బ్యారేజీ 2) నాగార్జునసాగర్
3) హీరాకుడ్ ప్రాజెక్ట్ 4) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్
28. దేశంలో ప్రజావసరాల కోసం చేపట్టిన భూసేకరణ చట్టాన్ని మొదటిసారిగా ఎప్పుడు చేశారు?
1) 1894 2) 1957 3) 1887 4) 1885
29. ఆర్థిక సంస్కరణలకు కారణం కాని అంశం కింది వాటిలో ఏది?
1) కోశలోటు అధికంగా ఉండటం
2) ద్రవ్యలోటు పరిస్థితులు
3) వ్యాపార చెల్లింపులు శేషంలో మిగులు
4) విదేశీ వ్యాపారంపై అంక్షలు
30. ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా సుస్థిర వ్యవసాయం అనేది ఉంది?
1) పర్యావరణ పరిరక్షణ
2) నిరుద్యోగం రూపుమాపడం
3) పేదరికం రూపుమాపడం
4) ఆకలిని రూపు మాపడం
31. కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సరికానిది?
1) పేదరికాన్ని రూపుమాపడం
2) శిశుమరణాలను అరికట్టడం
3) ఆరోగ్య ప్రమాణాలను సాధించడం
4) లింగ సమానత్వాన్ని సాధించడం
32. భవిష్యత్ తరాల వారిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత తరానికి చెందిన ప్రజలు తమ అవసరాలను విచక్షణాయుతంగా తీర్చుకుంటూ చేపట్టే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి అనేది ఎవరి నిర్వచనం?
1) డబ్ల్యూడబ్ల్యూ రోస్టో
2) రెట్లండ్
3) బ్రట్‌లాండ్ కమిషన్ 4) మైఖేల్ థామస్
33. 1951లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఏ అనుపాతంలో ఉన్నారు?
1) ప్రతి ఆరుగురిలో ఒకరు
2) ప్రతి ముగ్గురిలో ఒకరు
3) ప్రతి నలుగురిలో ఒకరు
4) ప్రతి ఐదుగురిలో ఒకరు
34. మానవాభివృద్ధికి సంబంధించి కింది వాటిలో ప్రధానమైన అంశాలు?
ఎ. పెద్ద కుటుంబాలు, సామాజిక స్థితి
బి. సమానత్వం, సాధికారత
సి. వలస, వినోదం
డి. ఉత్పాదకత, సుస్థిరత
1) ఎ, సి 2) బి, సి 3) ఎ, డి 4) బి, డి
35. అసమతుల్య వలయం అనే భావనను ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వివరించింది?
1) లైబన్స్టీన్ 2) ఆ రోడన్ 3) హర్షమన్ 4) బాల్డ్యన్
36. మిర్దాల్ బ్యాక్‌వాష్ ఫలితం సహాయంతో దేన్ని వివరించారు?
1) వ్యవసాయాభివృద్ధి
2) ప్రాంతీయ అసమానతలు
3) సేవారంగ అభివృద్ధి 4) పారిశ్రామిక అభివృద్ధి
37. ఏ వైపు నుంచి పేదరిక విషయాలు నర్క్స్ ప్రకారం పనిచేస్తాయి?
1) వనరుల కొరత వల్ల 2) డిమాండ్, సప్లయ్ వైపు
3) డిమాండ్ వైపు మాత్రమే 4) సప్లయ్ వైపు మాత్రమే
38. కిందివాటిలో విస్తృతమైన పేదరికానికి కారణం కానిది?
1) నిరుద్యోగిత 2) పొదుపు
3) అల్ప ఉత్పాదకత 4) తక్కువ తలసరి ఆదాయం
39. పేదరికపు విషవలయాలు అంటే?
1) జనాభావృద్ధి, మరణాలరేటు, పునరుత్పత్తి మధ్య చక్రీయ ప్రవాహం
2) ఆదాయ సంపదల మధ్య చక్రీయ ప్రవాహం
3) చర్య ప్రతిచర్యల పరస్పర ప్రభావంవల్ల ఒకే పేద దేశాన్ని పేదరిక స్థితిలో ఉంచే ప్రవాహం
4) పేదలు, ధనికుల మధ్య నిరంతర ఆదాయ ప్రవాహాలు
40. కింది వాటిలో లూయిస్ ప్రతిపాదించినది?
1) రోపన్ బిగ్‌పుష్ సిద్ధాంతం
2) అధిక జనాభాగల దేశంలో శ్రామిక ఉపాంత
ఉత్పాదకత సున్నా
3) అసంతులిత వృద్ధి సిద్ధాంతం
4) సంతులిత వృద్ధి సిద్ధాంతం
41. ఏ దేశం 1920 దశకంలో మొదటిసారి అధిక సామూహిక వినియోగదశకు చేరుకుంది?
1) యూకే 2) యూఎస్ఏ
3) యూఎస్ఎస్ఆర్ 4) జపాన్
42. కిందివాటిలో ఆర్థికాభివృద్ధికి సరైన మాపకం?
1) పెట్టుబడి పెరుగుదల
2) జీవన ప్రమాణ పెరుగుదల
3) పొదుపు పెరుగుదల
4) మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరుగుదల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు