గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్టును ఎవరు ముద్రిస్తారు?
1. స్వజల్ యోజన పథకానికి సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఏవి సత్యం?
ఏ. స్వజల్ యోజన అనేది దేశంలోని నీటి వనరులు, నదుల అభివృద్ధి కోసం కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకం
బి. ఈ పథకం కింది మొదటి ప్రాజెక్టును రాజస్థాన్‌లో ప్రారంభించారు.
1. ఏ మాత్రమే సరైనది
2. బి మాత్రమే సరైనది
3. ఏ, బీ సరైనవి
4. ఏదీ సరికాదు
2. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి నిజమైనవాటిని గుర్తించండి?
ఏ. ఈ బ్యాంకులు నగదు నిర్వహణకు సంబంధించినవి
బి. ఇవి ఖాతాదారుల నుంచి డిపాజిట్లను సేకరించవు.
సి. ఈ బ్యాంకుల ప్రధాన లక్ష్యం సూక్ష్మతరహా కంపెనీలు, చిన్న వ్యాపారస్తులకు చేయూతనివ్వటం
1. ఏ, బి సరైనవి
2. బి, సి సరైనవి
3. ఏ, సి సరైనవి
4. ఏ, బి, సి సరైనవి
3. ఫైనాన్షియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ (ఎఫ్డీఎంసీ)కు సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఏది సత్యం?
ఏ. ఈ సంస్థ ఏర్పాటును ఆర్థికరంగ పరిపాలన సంస్కరణల సంఘం (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) సూచించింది.
బి. ఎలక్ట్రానిక్ విధానంలో ఎఫ్డీఎంసీ డాటాను సేకరిస్తుంది.
సి. ఇది చట్టబద్దమైన సంస్థ
1. ఏ, బి మాత్రమే సత్యం
2. బి, సి మాత్రమే సత్యం
3. ఏ, సి సత్యం
4. అన్నీ సరైనవే
4. సంపూర్ణ బీమా గ్రామ్ యోజన పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి
ఏ. ఈ పథకాన్ని కేంద్ర సమాచార, సాంకేతికశాఖ ప్రారంభించింది.
బి. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం లభిస్తుంది.
సి. సంసద్ ఆదర్శ గ్రామయోజన పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాలకు ఈ పథకం వర్తిస్తుంది.
1. ఏ, బి సరైనవి
2. బి, సి సరైనవి
3. ఏ, సి సరైనవి
4. అన్నీ సరైనవే
5. సంకల్ప్ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
1. వామపక్ష తీవ్రవాద ప్రభావిత గ్రామాలకు సహాయం అందించటం
2. స్కిల్ ఇండియా మిషన్‌కు మరింత ప్రోత్సాహం ఇవ్వడం
3. సర్వశిక్షా అభియాన్ పథకాన్ని మెరుగుపర్చటం
4. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పరిధిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు మద్దతునివ్వటం
6. వాణిజ్య విద్యపై కేంద్ర ప్రభుత్వ వ్యూహం (ఎన్ఎస్ఎఫ్ఈ) గురించి ఈ కింది వాక్యాల్లో సత్యమేమి?
ఏ. ఎన్ఎస్ఎఫ్ఈకి సహకారం అందించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఈ)ని ఏర్పాటు చేయటం
బి. పాఠశాలల్లో వాణిజ్య విద్యను ప్రోత్సహించటం ఈ సంస్థ లక్ష్యాల్లో ప్రధానమైనది.
1. ఏ మాత్రమే నిజం
2. బి మాత్రమే నిజం 3. ఏ, బి నిజం
4. ఏదీ కాదు
7. బయోటెక్-కిసాన్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. ఇది రైతు కేంద్రంగా పనిచేసే పథకం. వ్యవసాయ శాస్త్రవేత్తలు స్వయంగా రైతులతో కలిసి పనిచేస్తూ వ్యవసాయ సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపుతారు.
బి. ఈ పథకాన్ని కేంద్ర రైతు సంక్షేమ, వ్యవసాయ సహకార విభాగం ప్రారంభించింది.
సి. ఈ పథకంలో భాగంగా మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు మహిళా బయోటెక్-కిసాన్ ఫెలోషిప్‌లు ఇస్తారు.
1.ఏ, బి సత్యం
2. బి, సి సత్యం
3. ఏ, సి సత్యం
4. అన్నీ నిజమే
8. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్టును ఎవరు ముద్రిస్తారు?
1.వరల్డ్ ఎకనమిక్ ఫోరం
2. ప్రపంచ బ్యాంకు
3. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)
4. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
9. ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ)కు సంబంధించి కింది వాక్యాల్లో వాస్తవం ఏది?
ఏ. పీసీఏను భారతీయ రిజర్వు బ్యాంకు ప్రారంభించింది.
బి. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణకు ఇది వర్తిస్తుంది.
సి. ఒక బ్యాంకు సాధారణ నిర్వహణలో నియమాలను ఏర్పరుస్తుంది.
1.ఏ మాత్రమే నిజం 2. ఏ, బి నిజం
3. బి, సి నిజం 4. అన్నీ నిజమే
10. అష్గబత్ ఒప్పందం గురించి ఈ కింది వాక్యాల్లో ఏది నిజం?
ఏ. ఈ ఒప్పందం మధ్య ఆసియా, పర్షియన్ గల్ఫ్‌ల మధ్య సరుకుల పరస్పర మార్పిడి, రవాణాకు సంబంధించినది.
బి. ఈ ఒప్పందంలోని భాగస్వాములపై భారత ఆధిపత్యం ఉండటం వల్ల దీనిలో పాకిస్థాన్‌కు సభ్యత్వం ఇవ్వలేదు.
1. ఏ మాత్రమే నిజం
2. బి మాత్రమే నిజం
3. ఏ, బి నిజం
4. ఏదీ నిజం కాదు
11. ఇటీవల వార్తల్లోకి వచ్చిన శైలేష్ నాయక్ కమిటీ దేనికి సంబంధించినది?
1. నీటి నిర్వహణ
2.గంగా యాక్షన్ ప్లాన్
3. అంతర్ రాష్ట్ర జల వివాదాలు
4. తీరప్రాంతాల నిర్వహణ
12. నేషనల్ బయోఫార్మా మిషన్‌కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి
ఏ. దేశంలో బయో ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధికోసం పరిశ్రమలు- విద్యాసంస్థలతో సంయుక్తంగా ఏర్పాటుచేసిన మొట్టమొదటి మిషన్ ఇది.
బి. భారతీయ బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధికోసం ఈ మిషన్ కింది ఇన్నోవేట్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని చేపట్టారు.
1.ఏ మాత్రమే నిజం
2. బి మాత్రమే నిజం
3. ఏ, బి నిజం
4. ఏదీ నిజం కాదు
13. కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎంఏటీ)కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. ఆదాయం పన్ను చెల్లించే సామర్థ్యం ఉండికూడా ఎగవేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ పన్నును అమల్లోకి తెచ్చారు.
బి. ఈ పన్ను పరిధిలోకి కేవలం భారతీయ కంపెనీలు మాత్రమే వస్తాయి.
1.ఏ మాత్రమే నిజం 2. బి మాత్రమే నిజం
3. ఏ, బి రెండూ నిజం 4. ఏదీ నిజం కాదు.
14 . ఈశాన్యప్రాంతాల ప్రత్యేక మౌళికవసతుల అభివృద్ధి పథకానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఏ. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఇందులో కేంద్ర, రాష్ర్టాల మధ్య నిధుల కేటాయింపు 90:10 శాతంలో ఉంటుంది.
బి. విద్య, ఆరోగ్యం వంటి సామాజిక మౌళిక వసతుల కల్పనకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇస్తారు.
1. ఏ మాత్రమే నిజం
2. బి మాత్రమే నిజం
3. ఏ, బి నిజం
4. ఏదీ నిజం కాదు
15. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బనం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యేది ఏ తరగతి ప్రజలు?
1. రుణదాతలు
2. ప్రభుత్వ ఉద్యోగులు
3. రుణ గ్రహీతలు 4. పెట్టుబడిదారులు
16. కిందివాటిలో సరైన జత ఏది?
1.జపాన్ కోస్పి
2. యూకే నాస్డాక్
3.అమెరికా ఎఫ్టీఎస్ఈ
4. బ్రెజిల్ బోవెస్పా
17. పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది?
ఏ. పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ (ఐఐపీ)ని కేంద్ర గణాంక సంస్థ విడుదల చేస్తుంది.
బి. ఐఐపీలో విద్యుత్‌కు అత్యధిక వెయిటేజీ ఇస్తారు.
1. ఏ మాత్రమే నిజం
2. బి మాత్రమే నిజం
3. ఏ, బి నిజం
4. ఏదీ నిజం కాదు
18. దేనిని ఫుట్‌లూస్ ఇండస్ట్రీ అంటారు?
1. ఎక్కడైనా నెలకొల్పగలిగే పరిశ్రమ
2. బ్లాక్‌ఫుట్ వ్యాధికి కారణమయ్యే ఆర్సెనల్ పరిశ్రమ
3. ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేని స్టార్టప్ పరిశ్రమ
4. అత్యధిక ఆస్తులు కలిగిన పరిశ్రమ
19. నేషనల్ గ్రీన్ కార్ప్ (ఎన్జీసీ)కి సంబంధించి కిందివాటిలో ఏది సరైన వాక్యం?
ఏ. ఎన్జీసీని కేంద్ర పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
బి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి కోసం యువ తను సన్నద్ధులను చేయటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం
సి. ఎన్జీసీలో సభ్యత్వం ఉన్న పాఠశాలల్లో ఎకో-క్లబ్బుల ఏర్పాటు ద్వారా చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు.
1.ఏ, సి నిజం 2. బీ మాత్రమే నిజం
3. బి, సి నిజం 4. అన్నీ సరైనవే
20. కేంద్ర వీధి దీపాల కార్యక్రమం గురించి సరైన వాక్యాలను గుర్తించండి
ఏ. ఈ కార్యక్రమం ద్వారా మామూలు వీధి దీపాల స్థానంలో సీఎఫ్ఎల్ బల్బులను అమరుస్తారు.
బి. ఈ కార్యక్రమాన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్నది.
సి. ఈ కార్యక్రమం వల్ల కార్బన్ వాయువులు పెరుగుతాయి.
1.ఏ, సి సరైనవి
2. బి మాత్రమే సరైనది
3. బి, సి సరైనవి
4. సి మాత్రమే సరైనది
21. ఫిస్కల్ స్లిప్పేజ్ అనగా?
1. ఊహించినదానికన్నా వాస్తవిక ద్రవ్యలోటు అధికంగా ఉండటం
2. ఊహించినదానికన్నా వాస్తవిక ఆదాయలోటు అధికంగా ఉండటం
3. గత ఆర్థిక సంవత్సరంకన్నా ప్రస్తుత సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తక్కువగా ఉండటం
4. గత ఆర్థిక సంవత్సరంకన్నా ప్రస్తుత ఫారిన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తగ్గిపోవటం
22. ట్విన్ డెఫిసిట్‌లో ఏవి కలిసి ఉంటాయి.
1. ద్రవ్యలోటు, ఆదాయ లోటు
2. ద్రవ్యలోటు, కరంట్ అకౌంట్ లోటు
3. కరంట్ అకౌంట్ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్
4. కరంట్ అకౌంట్ లోటు, ఆదాయ లోటు
23. ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లియన్స్ యాక్ట్ (ఎఫ్ఏటీసీఏ)కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఏ. ఈ పన్ను బ్రిటన్‌లో అమలుచేశారు
బి. దీని ప్రధాన ఉద్దేశం అత్యుత్తమ పన్ను వర్తింపు విధానం
1. ఏ మాత్రమే నిజం
2. బి మాత్రమే నిజం
3. ఏ, బీ నిజం
4. ఏదీ నిజం కాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు