హలో.. హాలో!

న్యూజెర్సీలోని నెవార్క్ నగరంలో నిర్మించబోయే ఈ భవనం పేరు ‘హాలో’. 565 అడుగుల ఎత్తుతో, మూడు టవర్లుగా నిర్మించనున్న ఈ భవన సముదాయానికి నెవార్క్ సెంట్రల్ ప్లానింగ్ బోర్డు ఇటీవలే అనుమతినిచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ‘మురాత్ ముట్లు’కు చెందిన ‘ఇనోవ స్టూడియో’.. ఈ భవనానికి రూపకల్పన చేసింది. 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 52 అంతస్థుల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ యేడాది సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించనుండగా, 2023 చివరి నాటికి తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని నిర్మాణ సంస్థ ‘ఏసియర్ హోల్డింగ్స్’ చెబుతున్నది. ఈ భారీ నిర్మాణం పూర్తయితే, న్యూజెర్సీ రాష్ట్రంలోనే ఎత్తయిన భవనంగా ‘హాలో’ రికార్డులకు ఎక్కనున్నది.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
Previous article
వేసవిలో ఎడారి మొక్కలు
Next article
చంద్రలోకమందు సౌధముల్..
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






