విదేశీ విద్య టాప్ కాలేజీలు
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మొదట ఆలోచించేది వారికి నచ్చిన, తగిన కోర్స్ గురించి. ప్రపంచీకరణతో కొత్త కోర్సులు ఎన్నో వస్తున్నాయి. ఆ తరువాత ఆలోచించేది ఏ దేశం వెళ్లాలని. ఆ పై యూనివర్సిటీ, ప్రాంతం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో విషయాల ప్రభావం కూడా ఉంటుంది. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రభావం కూడా విద్యార్థుల ఆలోచనలపై పడుతుంది. రాజకీయ పరిస్థితుల వల్ల విద్యార్థులు తమ గమ్య స్థానాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. 2020-21లో రాజకీయాలే కాదు ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఆ నిర్ణయం మీద ప్రభావం పడింది. కొవిడ్-19 వల్ల ఎంతో మంది విద్యార్థులు అంతర్జాతీయ విద్య అవకాశాలు వచ్చినా వెళ్లలేకపోయారు. కొందరి ఆశలకు ఆదిలోనే భంగం కలిగింది. దీనికి ఈ మహమ్మారి ఒక కారణమయితే, దానివల్ల వచ్చిన ఆర్థిక సమస్యలు, ప్రయాణాల పై గల ఆంక్షలు ఇతర కారణాలు. వ్యాక్సినేషన్ వల్ల ఇప్పుడు మళ్లీ వారు పై చదువుల గురించి ఆలోచించ గలుగుతున్నారు.
పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ప్రైవేట్ యూనివర్సిటీల కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది.
జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీలో ప్రవేశం దొరికితే ట్యూషన్ ఫీజు దాదాపు లేనట్టే. ట్యూషన్ ఫీజు కాకుండా అక్కడ జీవించడానికి అయ్యే ఖర్చులు ఉంటాయి. అవి మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటాయి. అమెరికాలో నివాసం, భోజనం ఇతర ఖర్చులకు సుమారు నెలకు 1000 నుంచి 1500 డాలర్ల వరకు ఖర్చవుతుంది. ఆర్థికంగా విద్యార్థులకు ఉపయోగపడటానికి స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటివి ఉపయోగపడుతాయి.
టెక్నికల్ రంగంలో చదవాలనుకునే వారు, ఆ రంగంలో భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండే కోర్సులను తీసుకుంటున్నారు. సాంకేతిక రంగం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. చాలా కొత్త కోర్సులు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. కళాశాలకు లేదా ప్రొఫెసర్లకు ఇండస్ట్రీతో ఉన్న సంబంధాలను కూడా కాలేజీ వెబ్సైట్లలో పొందుపరుస్తారు.
రిసెర్చ్‌పై ఆసక్తికలవారు అటువంటి అవకాశం గల కోర్సులను చూసుకుంటారు. కాలేజీ వెబ్సైట్లో ఈ సమాచారం దొరుకుతుంది.
విదేశాలు అంటే అన్నిచోట్ల మెట్రోపాలిటన్ సిటీస్ ఉండవు. అక్కడ కూడా చిన్న ఊర్లు, పట్టణాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు దృష్టిలో పెట్టుకొని, వాటికి దగ్గరగా ఉన్న విద్యాలయాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తారు. ఉదాహరణకు అమెరికాలో సాఫ్ట్వేర్ అవకాశాలు సిలికాన్ వ్యాలీ, పెద్ద సిటీస్‌లో ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్ కోర్సులైన మెకానికల్ వంటి రంగాల్లో అవకాశాలు ఆ ఇండస్ట్రీ ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో వీరికి అవకాశాలు ఎక్కువ.
మన దేశంలో కళాశాలలో చేరే ముందే ఆ కాలేజీలో పొలిటికల్ స్టూడెంట్ యూనియన్లు, ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచిస్తారు. మరి విదేశాల విషయంలో కూడా అంతే కదా. క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న సిటీస్‌ని ఎంచుకుంటారు. యూనివర్సిటీల్లో వారి సెక్యూరిటీ టీం ఉంటుంది.
టాప్ కాలేజీల్లో ప్రవేశం పొందడానికి కాంపిటీషన్ కూడా ఎక్కువే. కాబట్టి విద్యార్థులు దానికి అనుగుణంగా ఆలోచించాలి.
గుడ్ సిటీస్ ఏవి?
ఒకప్పుడు మంచి ఊరు అంటే ఎక్కువ విద్య, ఉద్యోగ అవకాశాలు, మంచి జీవనవిధానానికి సదుపాయాలు, జీవన వ్యయం సమంజసంగా ఉండటం. కానీ ఇప్పుడు గుడ్ సిటీ అంటే మంచి వైద్య సదుపాయాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు.
అంతర్జాతీయ విద్యలో భాగంగా విద్యార్థులు వారి బీమా రుసుమును కూడా ప్లాన్ చేసుకోవాలి. చాలా విశ్వవిద్యాలయాలు తమ ప్రవేశ ప్రక్రియలో భాగంగా దీన్ని తప్పనిసరి చేస్తాయి. గతంలో కూడా వారు చిన్నతనం నుంచి ఏ వ్యాక్సిన్ వేసుకున్నారన్న ఫారం అడిగేవారు. ఇప్పుడు చాలా కాలేజీలు కొవిడ్ వ్యాక్సిన్‌ని వేసుకోమని సూచిస్తున్నాయి.
ఏదేమైనా ఈ కరోనా నుంచి పూర్తిగా విముక్తి కలిగి సాధారణ స్థితికి వచ్చేవరకు విద్యార్థులు తక్కువ COVID కేసులు ఉన్న లేదా మంచి మెడికల్ ఫెసిలిటీస్ గల దేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు.
డీప్ నాలెడ్జ్ గ్రూప్ ప్రచురించిన ఒక సర్వే ప్రకారం, సెప్టెంబర్ 2020 లో COVID-19 సురక్షిత దేశాల ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.
కాబట్టి విద్యార్థులు జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. యూకే, కెనడా తదుపరి ఎంపిక. ప్రస్తుతం అమెరికాలో జీవన విధానం సాధారణ పరిస్థితికి దగ్గరలో ఉంది. వ్యాక్సినేషన్ ఎంత ఎక్కువ మందికి వేయగలిగితే అంత త్వరగా పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అండ్ యునైటెడ్ కింగ్డమ్ కాకుండా కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సింగపూర్, న్యూజిలాండ్ పట్ల ఆసక్తి చూపుతున్నారు.
క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోనిఅగ్ర కళాశాలలు
ర్యాంకింగ్స్ అనేవి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని ఉంటాయి. ఉదాహరణకు అంతర్జాతీయ విద్యార్థి నిష్పత్తి, అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి, విద్యా ఖ్యాతి, అధ్యాపకులకు అనులేఖనాలు వంటివి.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- అమెరికా
స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం- అమెరికా
హార్వర్డ్ విశ్వవిద్యాలయం- అమెరికా
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం- యూకే
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) – అమెరికా
ETH జూరిచ్- స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్విట్జర్లాండ్
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం- యూకే
యూసీఎల్- యూకే
ఇంపీరియల్ కాలేజ్ లండన్- యూకే
చికాగో విశ్వవిద్యాలయం- అమెరికా
నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, సింగపూర్ (NTU)
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS)
ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం- అమెరికా
కార్నెల్ విశ్వవిద్యాలయం- అమెరికా
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం- అమెరికా
ఆస్ట్రేలియాలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU)
సిడ్నీ విశ్వవిద్యాలయం
మెల్బోర్న్ విశ్వవిద్యాలయం
న్యూ సౌత్‌వేల్స్ విశ్వవిద్యాలయం (UNSW)
క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం (UQ)
మోనాష్ విశ్వవిద్యాలయం
వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం (UWA)
అడిలైడ్ విశ్వవిద్యాలయం
యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (UTS)
వోలోన్గాంగ్ విశ్వవిద్యాలయం
కెనడాలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు
టొరంటో విశ్వవిద్యాలయం
మెక్‌గిల్ విశ్వవిద్యాలయం
బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం
యూనివర్సిటీ డి మాంట్రియల్
అల్బెర్టా విశ్వవిద్యాలయం
మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం
వాటర్లూ విశ్వవిద్యాలయం
వెస్ట్రన్ విశ్వవిద్యాలయం
క్వీన్స్ విశ్వవిద్యాలయం
కాల్గరీ విశ్వవిద్యాలయం
యూకేలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
ఇంపీరియల్ కాలేజ్ లండన్
యూనివర్సిటీ కాలేజ్ లండన్
ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం
మాంచెస్టర్ విశ్వవిద్యాలయం
కింగ్స్ కాలేజ్ లండన్ (కేసీఎల్)
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE)
బ్రిస్టల్ విశ్వవిద్యాలయం
వార్విక్ విశ్వవిద్యాలయం
ర్యాంకింగ్ అనేవి కొన్ని సందర్భాల్లో కోర్స్‌ని బట్టి కూడా మారుతుంది. అంటే వైద్య రంగంలో మొదటి స్థానంలో ఉన్న కళాశాల సాంకేతిక రంగంలో మొదటిది అవకపోవచ్చు. కాబట్టి మీరు చదవాలనుకుంటున్న కోర్స్, అందులో అవకాశాలు, ఫీజు, అధ్యాపకుల ఖ్యాతి బట్టి నిర్ణయం తీసుకోండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు