MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 62 ఓఎస్డీ పోస్టులు
MSTC RECRUITMENT 2023: కోల్‌కతాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ (MSTC).. యంగ్ ప్రొఫెషనల్స్, ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్/ మార్కెటింగ్ /బిజినెస్ / డెవలప్ మెంట్ / ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ / సిస్టమ్స్ / పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఓఎస్డీ ఫ్రెషర్స్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఓఎస్డీ ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ / డిప్లొమా / సీఏ / ఐసీడబ్యూ / ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 5 ఏండ్ల అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 13వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇందులో పర్సనల్ ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 62
పోస్టులు : యంగ్ ప్రొఫెషనల్స్, ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)
విభాగాలు : మార్కెటింగ్ /బిజినెస్ / డెవలప్ మెంట్ / ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ / సిస్టమ్స్ / పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్
అర్హతలు :
- ఓఎస్డీ ఫ్రెషర్స్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- ఓఎస్డీ ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ / డిప్లొమా / సీఏ / ఐసీడబ్యూ / ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 5 ఏండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 13
వెబ్ సైట్ : https://www.mstcindia.co.in/MSTC_Careers/2022_2/Advt.aspx
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






